22, ఆగస్టు 2020, శనివారం

కర్పూర వసంతరాయలు - కావ్య పరిచయం

 కర్పూర వసంతరాయలు - కావ్య పరిచయం  

కస్తూరి శివశంకర్ : 18-07-2020

కావ్య రచన : డా శ్రీ నారాయణరెడ్డి

ఈ కథ పద్నాల్గవ శతాబ్దం చరమాంకంలో జరిగిన కధ. రెడ్డి రాజుల ప్రభువైన కుమారగిరి రెడ్డి కి ఆయన ఆస్థాన నర్తకి  లకుమ మధ్య జరిగిన ప్రణయ గాథ. ఈ కథ ని ఒక చిన్న గేయ కావ్యంగా తెలుగు వారికి అందించిన ఘనత డా శ్రీ నారాయణరెడ్డి గారిది     

కావ్యం అభివ్యక్తి పరంగా గమనిస్తే కర్పూర వసంతరాయలులో ఎన్నో విశిష్టతలను తో పరిమళింపచేశారు సినారె. ఉత్కళికలు, ముత్యాల సరాలు , చతురస్ర గతులలో సాగే అందమైన గేయ ఛందస్సులతో ఈ కావ్యం నిండా ఎన్నో ప్రయోగాలు చేశారు. ఒకటి, రెండు మాత్రలను పెంచి తగ్గించి నడకకు నవ్యతను చేకూర్చారు. 

సాంప్రదాయిక కవులు సీస పద్యాలలో అన్ని అందమైన చమత్కారాలను చూపించారో, గేయ ఛందస్సులో డాక్టర్ సినారె అన్ని చమక్కులు చూపించారు. పరిమళించే పదబంధాలకు, పంక్తులలో పాద పరాగాలతో గంధాన్ని జల్లినట్లుగా ఉంటుంది ఈ కావ్యం మొత్తం 


కధ ఏమిటి  (కానీ కథ కన్నా కధనం ముఖ్యం ఈ కావ్యాలలో )😊

ఎప్పటిలాగానే ప్రతి సంవత్సరం 9 రోజులు వసంతోత్సవాలు నిర్వహిస్తుండేవాడు కుమారగిరి ప్రభువు  పంజాబు దేశం నుండి కర్పూరాన్ని..  గోవా సముద్ర తీరం నుండి నుండి కుంకుమ ద్రవ్యాలను తెప్పించి ఆ 9 రోజులు జనంపై వెదజల్లుతుండేవాడట. అందుకే ఆ ప్రభువుని ప్రజలు కర్పూరవసంతరాయలు గా పిలిచేవారట. 


కుమారగిరి రెడ్డి స్వయంగా పండితుడు, కవి. ఇతడు వసంతరాజీయ్యము అనే నాట్యశాస్త్ర గ్రంథాన్ని వ్రాసినట్లు చరిత్ర. రాజ్య భారాన్ని తన మంత్రి, బావ అయిన కాటయ వేమారెడ్డి పై మోపి, సంగీత, నాట్య, వినోదాలతో కాలాన్ని కర్పూరం వలె వెలిగించాడు. 

కుమారగిరి, లకుమ నాట్యానికి, ఆమె తనూ లావణ్యానికి దాసుడు అవుతాడు. రాజ్యాన్ని, రాణిని విస్మరిస్తాడు. రాజ్య పరిరక్షణ కోసం రాణి లకుమను అర్థిస్తుంది. 

రాణి అభ్యర్ధన తో, దేశ సంరక్షణ భారం తన చేతుల్లోనే ఉన్నదని గ్రహించిన లకుమ ప్రాణత్యాగం తో ఈ కావ్యం ముగుస్తుంది. స్థూలంగా ఇది కథా పరిచయం. కానీ ఇలా కథ మాత్రమే కాదు. 

చాలా క్లుప్తంగా ఇదీ కధ. కానీ ముందు వివరాయించినట్లు కావ్యాల కధలు కోసం మాత్రమే చదవకూడదు కదా  

మరీ ముఖ్యంగా డా సినారె గారు ఈ సాహిత్యాన్ని తెలుగు ప్రజలకు ఎందుకు పరిచయం చేయాలనుకున్నారో కూడా తెలుసుకోవాలి 🙏

[1:21 PM, 7/18/2020] Siva Kasturi: ఇక ఈ కావ్యం లొని కొన్ని ఘట్టాలు చైత్ర పూర్ణిమనాటి వసంతోత్సవ వర్ణనతో మొదలవుతుంది 


అది చైత్ర శుద్ధ త్రయోదశీ దినమంచు 

అది మదనదేవ పూజారంభ దినమంచు  

అది కొమరగిరిటంగణమ్మున మల్లెలే 

మొల్లలై విరియు లేత ఆమని యంచు 

నేను వేరుగా చెప్పనేల ?

వ్యంజనకు వ్యాఖ్యానమేల ?

ఈ వాక్యాలు చదివితే డా సినారె గారి మీద రామరాజభూషణుడి వసుచరిత్ర లో వసంతోత్సవంలో వర్ణించిన అందమైన ప్రబంధ పద్యాలు, వర్ణన గుర్తుకు వస్తుంది 👌👍   


ఏ మొగమ్మున చూపు నిల్పిన 

ఇగురువోసెడు కాంతి వల్లులు 

ఏ సిగను పరికించి జూచిన 

ఏటవాలుగ నవ్వు మల్లెలు  

యువతు లెల్లరు రతీరామల 

యువకులో మన్మధ స్వాములు 

నాడు నిజముగా పండు ముసలులు 

కూడ నవయువతాభిరాములు 

గుప్పెడంత కుంకుమ పొడి గుప్పున 

అచ్చరలపైనదోసెడన్ని పూవులెత్తి 

పోసెను మధుమూర్తిపైన కప్పురటారతులు 

త్రిప్పి గందవొడిని పైన గుప్పి 

కస్తూరిని కలయ హత్తి 

కాలాగురు ధూపమెత్తి

ఇంత  అందమైన ద్విపదలు చుదువుతుంటే మనసులో మధురోహలు వర్షిచడం తధ్యం కదా అనిపిస్తుంది 

కన్నులరమూసి ఆ కలువకన్నుల 

పడుచు ముకుళ ముద్రని జూపెనపుడు 

రాణి అధరోష్ఠమ్ము పైన 

ఒక వెన్నెల తున్క జారిపోయినది సుమీ ! 

ఒఢ్యాణస్థ రత్నకురముల చంద్రిక 

తన ముఖము జూచినది

చివరకు లకుమ రాణి కోరిక మన్నించి, ప్రాణ త్యాగం చేసినప్పుడు ఐదవ ఆశ్వాసంలో వచ్చే పద్యాలు చదివితే.. వేదనతో కళ్ళు చెమరుస్తాయి 


ఆమె దేహమ్ము ఝంఝా నిలమ్మటు తూగె 

ఆమె అంగములు ప్రళయాబ్ధి వీచికలు రెగె 

లకుమ గజ్జెలు ఖణిల్లని విరిగి చెదిరిపడె  

ఆమె మేఖల పుటుక్కనుచు తెగి క్రిందపడె 

ఆ మాహాసాధ్వి రాయుని 

కరాంభోరుహమ్ములలోన శాశ్వతముగా 

కనులు మూసుకునె 😔 

రాయనుకి తన శరీరము, మనసు సర్వమ్ము 

పాతాళ కుహరాన పడిపోయినటు తోచె   

తన జీవనిధిని నేలను గూల్చినట్టి ఛురి 

కను కనుల నిప్పు లొల్క జూచె రాయుడు


ఆయమ వసంతరాయని మానస 

సరొవరాంతరాళ విహారయైన 

రాజమరాళి ఇలా లకుమతోనె  

కాలాన్ని వెల్లబుచ్చుతూ రాజ్యాన్ని;

రాణి ని విస్మరిస్తాడు కుమారగిరి  


లకుమ ధరణీ పైగూలె ప్రభుడప్పుడు

గగ్గొలుపడి ఏమియునుతొచక ఎదలొదిగిన

బాకునూడంబెరికె దాని పిడిచుట్టు పత్రమ్ము

కనిపించె రక్తసిక్తాక్షరములను రేడుపటియించె 

ఓ లకుమా ! యెటనుంటివొ నివు;

ఇంకెచట పరమసాధ్వి జగత్ స్వర్ణాసనముపైన 

కొమరగిరి చరితమ్ము 

కొండవీటను శీశీరమును సైతము వసంతముగ 

రూపుగట్టించు కొండవీటను పాదుకొన్నట్టి 

మట్టిలొసైతము కర్పూరసౌరభములు వీచు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...