22, ఆగస్టు 2020, శనివారం

వెన్నెల్లో ఆడపిల్ల - సమీక్ష

 

తెలుగు తేనియలు సమూహ మిత్రులకు నమస్సులు🙏

ఈ రోజు మీకు పరిచయం చేయబోయే నవల పేరు మీ అందరికీ సుపరిచితమైన యండమూరి వీరేంద్రనాధ్ గారి వెన్నెల్లో ఆడపిల్ల

ఈ నవల నేను దాదాపు 25 ఏళ్ల క్రితం చదివాను. అప్పుడు ఎలాంటి అనుభూతి కలిగిందో ఈరోజు సమీక్ష కోసం చదివినా అదే అనుభూతి  

ఎన్ని సార్లు చదివినా ఏమాత్రం భావుకత సాంద్రత తగ్గదు.


 ఒకో పేజీ తిప్పుతుంటే 

ఓ చిరుగాలి తెమ్మెర అలా మన మనసుని సుత్తిమెతగా తాకివెళ్లిన అనుభూతి. 

తిలక్ గారి వెన్నెల్లో ఆడుకునే 

ఆడపిల్ల ని నవల పేరుగా ఎంచుకున్నప్పుడే యండమూరి గారి భావుకత సగం అర్ధం అవుతుంది .


 ముగింపు చదివాక చాలాసేపు ఒక లాంటి ట్రాన్స్ లోకి వెళ్లిపోతాము.


 


కధాపరం గా చూస్తే సదా సీదా  కధాలానే అనిపిస్తుంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లో ఫిలాసఫీ చదువుకున్న 

తెలివి  అందం భావుకత  

అన్నీ కలగలిపి 

వాటికి తోడు

చక్కని వ్యక్తిత్వం కూడా కలిగిన

ఒక అమ్మాయి


చెస్ లో   ప్రపంచ ఛాంపియన్  అయిన రేవంత్ తో  ఫోన్ ద్వారా పరిచయం చేసుకుని అతన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని,  తన పేరు ఫోన్ నంబర్ ఇంటి అడ్రస్ లాంటివి కనిక్కోమని నెల రోజులు గడువు పెఉతుంది. ఆ నెలరోజుల్లో వారానికి ఒక లేఖ రాస్తాను అంటుంది. ఇక ఆ నెల రోజుల్లో వాళ్ళు ఫోన్ లో మాట్లాడుకునే మాటల్లో కానీ రాసుకునే లేఖల్లో తొంగిచూసే ఉపమానాలు వర్ణనలు మనల్ని మరో లోకం లోకి తీసుకెళ్తాయి అనడం లో సందేహం లేదు.


ఇద్దరు తెలివైన భావుకుల నడుమ సాగే సున్నిత ప్రేమ ప్రయాణం ఆద్యంతం

అపురుపమే

 వాటిలో కొన్ని మచ్చు తునకలు మీ కోసం.



కధానాయకుడు రేవంత్ చెస్ ప్లేయరు అని చెప్పాను కదా అతను  ఆటలో గెలుపు ఓటములను  ఎదుర్కున్న సందర్భం లో రచయిత ఇలా అంటారు


క్రీడా కారుడూ కళాకారుడూ చిన్న పిల్లల్లాంటివారు. రవ్వంత ఉత్సాహం వారిపట్ల చూపిస్తే పొంగిపోతారు 


మీ విజయాన్ని మేం గమనిస్తున్నాం అని ఎవరైనా అభిమానం కురిపిస్తే రెట్టించిన ఉత్సాహం తో మరింత కృషి చేస్తారు.


విజయమా విజయమా వస్తూ శిఖరానెక్కిస్తావు.


వెళ్తూ పాతాళానికి తోస్తావు నీకిది న్యాయమా?



ఈ కధలో కధా నాయకురాలు తనగురించి   నాయకుడు రేవంత్ కి పరిచయం చేసుకునే  క్రమం లో ఇలా చెబుతుంది


ప్రత్యుషం రాకముందే పాల వెన్నెల్లో పరికిణీ కుచ్చిళ్ళు పైకి కట్టి గొబ్బెళ్ళోయమ్మ గొబ్బిళ్ళో అని పాడుకుంటూ ముగ్గు వేసే ఆడపిల్లని అని.


ఆమె రాసే లేఖలలోని కొన్ని వరుసలు మీకోసం


  


డియర్ మీ

బావున్నారా?


కొన్ని వద్దనుకున్నా వెంటాడుతూనే ఉంటాయి. అలాంటివి 

మీ జ్ఞాపకాలు. 

వాటి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించి  లాభం లేక ఊరుకున్నాను. ఆనందం అనే త్రాసు అనుభూతి అనే తులసీ దళాలకి తప్ప మరి వేటికీ తూగదు అనుకుంటా!


ప్రపంచం నిద్రపోతోంది.

నల్లటి రాత్రిని తెల్లటి వెన్నెలలో ముంచి ఆకాశం మీద ఆరేసినట్టున్నాడు సృష్టికర్త.


తెల్లవారే సరికి ఈ వూరి పొలిమేరలు దాటాలని పందెం వేసుకుని పరుగెడుతున్నాయి మబ్బులు.

వెన్నెల్లో పూసిన సన్నజాజుల్ని చూడటం కోసం కనురెప్పలల్లార్చే సమయం కూడా వృధా పరచ కూడదన్న అత్యాశ నాది. 

అన్నట్టు సన్నజాజులంటే గుర్తొచ్చింది 


ఫోన్లో మీ కంఠం విన్నప్పుడల్ల

గుప్పెడు సన్నజాజులు గుండెల మీద జారిన ధ్వని.


తెల్లారే లేచి తిరుప్పావై వింటూ ఇంటిముందు ముగ్గులేస్తుంటే లేత చలి వణికించే ఆనందం చాలా బాగుంటుంది కదూ!


నాన్న డబ్బులో ములిగి తేలుతుంటాడు


అమ్మ భక్తిలో

స్నానం చేస్తూ ఉంటుంది.


మరి నాది భక్తో కాదో తెలీదు. ఏదీ ఏమైనా గుడికి వెళ్లడం మాత్రం గొప్ప అనుభూతి.

మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను అప్పటివరకూ

ఊహల నక్షత్రాలని పొగులు పెడితే అవి ఎగిరి మీ ఇంటి ముంగిట్లో చిరుదివ్వెలుగా వెలుగుతాయి.

ఆ వెన్నెల వెలుగులో ఓణీ పరికిణీలతో 

ఓ పిల్ల.....

వెన్నెల్లో ఆడపిల్ల


తన భావాలను వ్యక్త పరచడం రాక ఇబ్బంది పడే రేవంత్ ఇలా రాస్తాడు , భావాలని చెప్పడానికి పేజీలకు పేజీలు అక్కరలేదు అని మనకి అర్ధం అవుతుంది ఇది చదివాక  


 ఓ వెన్నెలమ్మాయీ!

ఎన్నో భావాలు ఎన్నెన్నో ముచ్చట్లు

చెప్పాలనుకున్న

వన్నీ చెలియలికట్ట దాటి కలగా పులగ మైతే మదిలో మిగిలింది శూన్యమే!


నవల చివరలో గడువు సమయం లోపే ఆమె చిరునామా కనుక్కునే సమయానికి కేన్సర్ తో ఆమె చనిపోతుంది. ఆమె చనిపోయే ముందు రాసిన లేఖ గత వారం తమ్ముడు శివ సాహితీ ప్రహేళికలో ఇచ్చారు కాబట్టి అది నేను రాయడం లేదు.


ఆమె ఎడబాటుని రేవంత్ ఆలోచనల్లో ఇలా పలికిస్తారు యండమూరి గారు   


 

ప్రేమలో వ్యధే వ్యక్తా వ్యక్త బిందువై హిమవన్నగాల్లో ఘనీభవించి మేఘాల్లో కరిగి,  నదీ జలాల్లో ప్రవహించి అర్ణవమై విశ్వవ్యాప్త మవుతుంది. అది వెన్నెల అవుతుంది

ఆ వెన్నెల్లో ఒక ఆడపిల్ల ప్రత్యుషానికి

ముందే 

కొలని దేవరకు గొబ్బియళ్ళో అని పడుతూ మనసు ముంగిట్లో రంగవల్లులు తీర్చుతుంది. తన వెంటే ఉంటుంది. తన విజయం లో ఆనందం పొందుతుంది.

తన ఓటమితో వెనుక వుండి ఉత్సాహాన్ని ధైర్యాన్ని ఇస్తుంది. తనకి ఆమె స్పూర్తి.


ఒక కన్నీటి చుక్క అతని కంటి నుండి వస్తూ వస్తూ అతనితో అన్నది.

ప్రియ మిత్రమా! ఇన్నాళ్లూ నీ గుండెలోతుల్లో నిక్షిప్తమై వున్నాను. నీ బాధలో పాలు పంచుకున్నాను.

ఈ క్షణం నువ్వు పడే ఈ వ్యధను భరించలేక బైటకు వెళ్తుంన్నాను. 

నా ఈ వీడ్కోలు నీకేమాత్రమైనా సంతోషాన్నిస్తే మిత్రమా నాకు అంత కన్నా కావాల్సింది ఏముంది?

శలవు.


సమీక్షని చదివి నందుకు అందరకీ హృదయపూర్వక ధన్యవాదములు


✍️రమ, కంకిపాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...