స్వేచ్చా సమర్పణలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
స్వేచ్చా సమర్పణలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, సెప్టెంబర్ 2020, సోమవారం

ఆదివారం అందరిదీ . . . .

 


ఆదివారం కవిత

ఈవ్ టీజింగ్..!


మెల్లగా రోడ్ పక్కగా

నడిచి పోతోంది.. మేక

భౌ భౌ మంటూ వెంటాడుతూ

బలిసిన కుక్క..!


పెరటిలో కో కో కో మంటూ

తిరుగుతూ కోడి..

ఒక్క ఉదుటున దూకి

మెడ పట్టిన మరో కుక్క..!


గోడవారగా భయంతో పరుగెడుతూ ఎలుక

అమాంతం పైబడి నోట కరిచిన పిల్లి..!


రాత్రి పగలు తేడా తెలీక  

వెలుగుతున్న దీపాన్ని లెక్క చేయక

స్వేచ్ఛగా ఇంట్లో తిరిగే సీతాకోక చిలుక

గోడమీద ఆనీ ఆనగానే

దానిమీదకు దూకి పీక కొరికిన బల్లి!


దగ్గరనుంచి ఈ దృశ్యాలు చూస్తున్న నాలో

ఏదో సంశయం!

ఈ రావణ, కీచక, దుశ్శాసన సంస్కృతి..


మృగం నుంచి మనిషిలోకి ప్రవేశించిందా..!?

మనిషి నుంచి మృగానికి దాపురించిందా అని


కాలాలు మారుతున్నా..మారని ఈ దుస్థితికి

ఏ కాలంలోనైనా ఈ ఘాతుకాలకు 

తెరపడుతుందా అని.!


 వసుధ

*************** 


ఎస్పీయం

 ఏంటయ్యా నీకూ నాకూ ఉన్న సంబంధం?

ఏ అనుబంధం ఉంది గనక!
ఏ రక్త సంబంధం ఉంది గనక!
అసలు నువ్వు నాకు ఏమవుతావు గనక... 
నన్నింతగా లొంగదీసుకుంటున్నావ్!?!
అసలు ఎవరివయ్యా నువ్వు??? 
అమ్మ చేతి కమ్మని  గోరు ముద్దవా... కాదే!
పసిపాపల్లో కనిపించే దైవానివా...కాదే !
నెచ్చెలి వెచ్చని కౌగిలింతవా.... కాదే !
తొలకరి పలకరింపులోని పులకరింతవా ... కాదే!
వెన్నెల గుత్తివా 
మల్లెల మత్తువా 
చిక్కని చుక్కవా 
చక్కని చుక్కవా 
ఎవరివయ్యా నీవసలు? 
ఏంటయ్యా నీ వేషాలు?
నువ్వదా నువ్విదా 
నువ్వందులో ఉన్నావా 
ఇందులో ఉన్నావా అని 
నిన్ను నిలదీయలేనుకానీ...
అన్నింటా నువ్వే ఉన్నావయ్యా!
అవును... అమ్మ తోడు.  
ఈ వయసులో అమ్మే గనక నాకు జోల పాడితే 
"ఆపవే నీ గోల'' అంటానేమో!!
మరి నువ్వు పాడితే....  
నా ఉనికినే మరచిపోతున్నానయ్యా! 
ఈ వయసులోనూ నన్ను పసిపాపను చేసి 
అమ్మనే మరిపిస్తున్నావయ్యా  ఎస్పీ!
అమ్మనే మరపిస్తున్నావ్. 
ఇంక నువ్వలా నీలో నువ్వు పాడుకోకు 
బైటికొచ్చి కాస్త గట్టిగా పాడు... 
నూరేళ్లపాటూ... నిండు నూరేళ్లపాటూ
ప్లీజ్...

 

----అ.అ----
అత్తిలి అనంతు,  ముంబాయి

********************************************

 

సేకరణ మాత్రమే సరదాకి

ఇంట్లో ఎవరూ ప్రయత్నించ వద్దు..


అన్యోన్య దాంపత్యాలు - చతురోక్తులు 
ఓ మారు మునిమాణిక్యం నరసింహారావు గారు  తల్లావజ్జుల శివశంకరస్వామిగారిని ఇలా కదిపారు.

 

   "అన్నగారూ! నాకు మా ఆవిడతో ఒక నిమిషం పడదు. నిత్యం దెబ్బలాడుకుంటూంటాం. ఒక్క నేనేనా? ఇతరులు కూడా అలాగేవుంటారా?" 
తల్లావజ్జులవారు నవ్వుతూ "మనవాళ్ల అన్యోన్య దాంపత్యా ల గురించి చెబుతాను విను"  అని ఇలా కొనసాగించారు.

 

"★ ముందుగా చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి గురించి చూద్దాం. ఆయన ఎప్పుడూ ఇంట్లో వుండరు. నానా రాజసందర్శనం అంటూ ఎప్పుడూ దేశాలమ్మట తిరగడమే! ఇక ఇంట్లో వుండేదెప్పుడు? దెబ్బలాడుకొనేదెప్పుడు ? కాబట్టి వీరిది అన్యోన్య దాంపత్యం.

 

  ★అలాగే గిడుగు రామమూర్తి. ఆయనకు బ్రహ్మచెవుడు. ఆవిడ తిట్టే తిట్లు ఆయనకు వినిపించవు. అందువల్ల ఇరువురి మధ్యా కజ్జాల్లేవు. కాబట్టి వీరిరువురిదీ అన్యోన్య దాంపత్యమే!

 

 ★ఇక జమ్ములమడక మాధవరామశర్మ సంగతి. ఈయన దీ ఆదర్శ జీవితమే. ఏమంటారా? ఆయన సంస్క్రతంలో తప్ప మాట్లాడరు. మరి ఆమెకేమో సంస్కృతం రాదు. భాషాభేదం కారణంగా ఇద్దరిలోనూ పొరపొచ్చాలు లేవు.

 

 ★ఇంకా విను. మన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారేమో, ఎప్పుడూ ఊహాలోకంలో వుంటాడు. భార్యతో దెబ్బలాడ డానికి ఆయన ఎప్పుడైనా వాస్తవ జీవితంలోకి వస్తే కదా ?

 

  ★ఇక నా గురించి అంటావా, తీరా దెబ్బలాడడానికి సిద్ధం అయ్యేటప్పటికి మా ఆవిడేమో చనిపోయింది మరి. కాబట్టి ఏతావాతా చెప్పేదేమంటే మనందరివీ అన్యోన్య దాంపత్యాలే!" ఏమంటావ్! అంటూ బోసినోటితో పకపకా నవ్వారు మన శివశంకరులు. 


*************************


పదమాయాపథం


మూడు పదాలను , వాటి అక్షరక్రమంలో  నిలువుగాను, అడ్డంగాను చదివి చూడండి. రెండు రకాలుగా  చదివినా అవే పదాలు అబ్బురంగా! 


స మ త

మ జ్జి గ

త గ ము


కం చ ము

చ క్కె ర

ము ర ళి


క్షీ ర ము

ర వ్వ లు

ము లు కు


కా ను పు

ను వ్వు లు

పు లు లు


కా ర ము

ర గ డ

ము డ త


స మ త

మ ర ల

త ల పు


త మ కం

మ ర్యా ద

కం ద కం


పొ ల ము

ల లి త

ము త క


ధ న ము

న వ్య త

ము త క


వ ర స

ర వి క

స క లం


హి మ జ

మ న ము

జ ము న


క వి త

వి న ల

త ల క


కో వె ల

వె న్నె ల

ల ల న


మ న సు

న య నం

సు నం ద


ది న ము

న గ రి

ము రి కి


టో క రా

క వ్వ ము

రా ము డు


ప్ర వే శం

వే ది  క

శం క రం 


********************************


అమేయమైన పదసంపద గల్గిన భాషాభిమానులకూ, విశిష్ట రంగాల్లో సేవ చేస్తున్న వారికీ, ఉపాధ్యాయులకూ, వైద్యులకూ, ఆర్ధిక నిపుణులకూ, శాస్త్రవేత్తలకూ స్వాగతం.


చంపకమాల

సురుచిర జ్ఞానసంపదల సూరవరేణ్యులు, సత్కవీశ్వరుల్; 

నిరుపమ సారసంపదలు నిండిన సత్కవితామృతంబులన్

పరిచయమీయు మేటి పదవల్లరులెన్నియొ పంచుకోవలెన్ 

వరములు తోడు తేనియల పల్లవులై సరదాల సందడై  ! 


శివశంకర్ కస్తూరి  

 ***********************

 

సేకరణ . . . . . . 

ఆదివారం నా ఆలోచన


ఒంటరివాడయ్యాడు.....
అవును....
ఉపాధ్యాయుడు ఒంటరై పోయాడు.
నిరాశ, నిస్పృహలు
అధికారుల బెదిరింపులు,
అనధికారుల ఒత్తిళ్లు,
ప్రజా ప్రతినిధుల పెత్తనాలు,
బడి బాధ్యతలు,
కుటుంబ బరువులు,
ఆరోగ్యం పై భయాలు,
పై పెచ్చు ప్రభుత్వ సాచివేత ధోరణి తో..
ఉపాధ్యాయుడు ఒంటరి వాడయ్యాడు.
సమాజం ఇచ్చే గౌరవం ఉపాధ్యాయ దినోత్సవ ఉపన్యాసాల్లో మాత్రమే కనపడుతోంది. ఎవరైనా కూడా, ఉపాధ్యాయుల జీతాల గురించి మాట్లాడే మొనగాడే......... పోలీసుల, రెవెన్యూ, మునిసిపాలిటీ, వైద్య, పంచాయతీ రాజ్, రిజిస్ట్రేషన్, అబ్కారీ, ఎక్సైజ్, ఇరిగేషన్, విద్యుత్తు మొదలగు ఎన్నో డిపార్ట్మెంట్ లు ఉన్నా, వాళ్ళ జీతాలగురించి, భత్యాల గురించి మాట్లాడరు.  ఎందుకంటే, వాళ్ళఅందరితో అవసరం. వారిపై కామెంట్స్ చేస్తే పనులు సాగవు ఆగిపోతాయి. అదే, ఉపాధ్యాయులతో అవసరం లేదు. వీళ్ళతో ఒరిగేదేమీ లేదనే నీచపు భావనతో చాలా మంది ఉండడం శోచనీయం. కాబట్టే నోటికొచ్చిన మాటలు రాయడం, పోస్ట్ చేయడం. ఇవి చూసి నోట మాట రాక ఉపాధ్యాయుడు ఒంటరై పోయాడు.
ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఇరువురు ప్రభుత్వ సేవకులే అనే భావన లేదు. జీతం పెరిగితే ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ పెరుగుతుంది. ఒక్క ఉపాధ్యాయులకు మాత్రమే కాదు అనే కామన్ సెన్స్ కూడా లేకుండా కొందరు కామెంట్స్ చేయడం నన్ను చాలా బాధిస్తోంది. కరువు భత్యాలు లేవు, వేతనాల పెంపుదల లేదు. కనీసం మధ్యంతర భృతి లేదు. సగం జీతాలతో సగటు ఉపాధ్యాయుడు పడే బాధలు ఎవరికి తెలుసు. పంతులు కాబట్టి, సమాజం నాకు ఇంకా విలువను ఇస్తుంది అని గుడ్డిగా నమ్మే అమాయకుడు కాబట్టి, లోపల చినిగిన బనీను వేసుకున్నా, పైకి తన వృత్తికి హుందాతనం ఇవ్వడానికి తెల్లబట్టలు వేసుకుని దుఃఖాన్ని దిగమింగే బతుకలేని బడిపంతుళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. పాపం ఇక ప్రయివేట్ ఉపాధ్యాయుల వెతలు సీతమ్మ వారికష్టాలకంటే ఎక్కువే. ఇవి దిగమింగలేక, పిచ్చిగా దిక్కులు చూస్తూ ఉపాధ్యాయుడు ఒంటరి వాడయ్యాడు.
తన తో పాటే ఇతర డిపార్ట్మెంట్ లలో చేరినవారు పదోన్నతులు పొంది ఉన్నత స్థానాలను అలంకరిస్తున్నా, బిక్కమొకం వేసుకొని, గొంతు చించుకొని అరుస్తూ, విద్యార్థుల కోసం జీవితాన్ని అంకితం చేసిన ఉపాధ్యాయుడు ఒంటరి వాడయ్యాడు.
ప్రభుత్వం, సమాజం ఉపాధ్యాయులను చిన్న చూపు చూస్తున్నది. పోనీ విద్యాశాఖ అధికారులైనా..... మన డిపార్ట్మెంట్ వారేకదా అని  సానుకూల వైఖరిని ప్రదర్శిస్తారా... అదీ లేదు. MEO మెసేజ్ పెట్టి, అర్జెంట్ ఒక్క గంటలో రిపోర్టు ఇవ్వాలంటారు. ఏదైనా వెసులుబాటు అడుగుదామంటే, DEO గారి ఆర్డర్ అంటారు. కరోనా లోకమంతా ఉంది, భయంతో వణుకిపోతున్నామని అరచినా, మా ఆరోగ్యాలకు రక్షణేది అని బతిమాలినా, మొర వినే నాధుడే లేడు. పై పెచ్చు, ఇల్లిల్లు తిరిగి క్లాసులు చూస్తున్నారా, నోటు పుస్తకం లో రాసుకుంటున్నారా, TV లేని విద్యార్థులు ఉన్న వాళ్ళింట్లో కూర్చుని చూస్తున్నారా, ఇవన్నీ రిజిస్టర్ లో నమోదు, పైకి రోజురోజు నివేదిక అందించడం. మూలిగే నక్క మీద తాటిపండన్నట్టు గౌరవ అధికారుల మెమోలు, షోకాజ్ నోటీసులు. ఇవి చాలు మహాప్రభో... అనుకున్న సమయంలో విజిటింగ్ టీములు. వారికి సంతృప్తి కై చకోర పక్షి వాననీటికై చూసినట్టు చూడడం. మెచ్చుకోలుగా ఒక చూపు చూస్తే చాలు అంతే, పొంగిపోవడం. ఇంతే తెలుసు. పాపం ఉపాధ్యాయులు అల్పసంతోషులు. కాదు.... కాదు....... అత్యల్ప సంతోషులు. CRP ల నుండి CM దాకా అందరికీ ఉపాధ్యాయుడు లోకువే. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు ఆన్లైన్ క్లాసులు ప్రభుత్వ ఉపాధ్యాయుల చావుకొచ్చింది. ఏం చెయ్యాలో పాలుపోక ఉపాధ్యాయుడు ఒంటరి వాడయ్యాడు.
రాస్తే రామాయణం, చెబితే భారతం. మనసు రాయి చేసుకుని, హృదయాంతరాళాల నుండి వస్తున్న ఆవేదన, ఆందోళన, అభద్రతా భావం అనుభవిస్తూ, చుట్టూ అందరూ ఉన్నా ఎవరికీ మనసు విప్పి చెప్పుకోలేక, కనీసం సానుభూతి చూపే వారు కూడా కరువై............. సమూహంలో, సమాజంలో ఉన్నా, ఉపాధ్యాయుడు ఒంటరి వాడయ్యాడు.
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నా తోటి ఉపాధ్యాయులు అందరికీ అన్యమనస్కంగా, భారంగా శుభాకాంక్షలు చెబుతున్నాను.

 

A.V.R.చార్యులు, 

 

సేకరణ

జి. రామ్మోహన్  

*********************************** 

 

గోదారమ్మ దగ్గర నుండి ఒడిలోకి.. ఒరవడిలోకి  వచ్చేసారు.


తేటగీతి  

కృష్ణవేణి  పొంగించుగా హృద్యమౌను   

విజయవాడలో వెలయు మీ విభవమందు      

ఘనఘనాఘన రవముచే గంధమలది       

సుంద రమయమై సంభ్రమ స్ఫురణ దనర     

సైకతంబుల సీమలో సంచరించి


 

 శివశంకర్ కస్తూరి  

***********************


అంశం. జాలరి జీవనం, 
గేయ కవిత. 
               బతుకు నావ... 

 


బతుకు నావ బయలుసాగెనే, 
సంద్రంలోకి...నడి సంద్రంలోకి,     " బతుకు నావ "
చద్దిమూట గట్టి, తెడ్డు చేత బట్టి, 
వలను చంకన పెట్టి, బుట్ట నెత్తి నెట్టి, 
బీడీలు జేబునకుక్కి, వెళ్తూనే "సాయి "కిమొక్కి, 
ఇల్లాలు సాగనంప, పెద్ద పిల్లాడు తోడు రాగా.... 
ఇసురు గాను నీ చేయి.. వలను విసిరేయి, 
దొరికిందా సేపా, దొరక్కుంటే శాపం, 
కమ్మేను కారుమబ్బు, పొంచుంది పెను తుపాను, 
దాపు లోనే సుడిగుండం, అదే నీకు ప్రాణ గండం.. 
గండాలు గట్టెక్కి, తీరం చేరుకుంటే, 
షావుకారు మనుషులొచ్చి సరుకు లాక్కు పోయె, 
వడ్డీలు తీరకుండే, అసలు  ఊసు లేదాయె, 
బతుకంతా అప్పులపాలు, కష్టమంతా గంగపాలు... 
ఉన్నాడు చూడవోయి, ఆపదలు గాచు "సాయి "
ఆ సాయి కి మొక్కవోయి, ఇక్కట్లు తీరునోయి 
అద్దరికి చేరవోయి.. నిను దరికి చేర్చునొయి, 
నీ కష్టాలు తీరునోయి, ఇక బతుకంతా హాయి,హాయి. 
ఇది నా స్వంత రచన. దేనికి అనుకరణ అనుసరణ కాదు. 

 

చెరుకుపల్లి గాంగేయ శాస్త్రి, రాజమండ్రి, 

*****************************************************


 

 


 
 

4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

స్వేచ్చా సమర్పణలు , 03, సెప్టెంబర్ 2020, గురువారము

 ప్రభాత కవిత :

అమ్మే !

సూర్య  నమస్కారాలు

చేద్దామని  పెరట్లోకెళా!

సూరీడు కనపళ్ళా !

అమ్మ కనిపించింది !

అమ్మ కే  నమస్కరించా ..

అవును  అమ్మే  నాకు

సూర్యుడూ  చంద్రుడూ !

వసుధ

****

 

శుకపిక రాగమాలికల

శోభల పల్లటి కూతలన్వలే

చకచక వెన్నెలై కురిసె 

ఝాన్విల పల్కులవోలె కెంపులై

 వికసిత భావబందురపు

వెల్గుల కైవడి వెన్నెలల్ వలే   

 

టకటక పద్యరుచ్యములు 

ఠక్కున మానసమందు జిల్కగన్ 

పకపక హాసచంద్రికల

వల్లరులే సరదా సరాగమై

మకరికమేదొ జల్లెనిట

మానస వీధులు సంభ్రమంబులై  

 కస్తూరి కవనం

****

 

చిలుకలు మేమే

రాగం మాదే

వెన్నెల మేము

వెలుగుతుంటాము

పలుకుల కులుకులు

పక పక నవ్వుల్

మా సరదా మాటల అల్లరి

మీ మనసున హాసం కురిపిస్తే

అదే కదా మాకానందం

ఆనందం జగదానందం

 ఝాన్వి

****

 

మాష్టారు ..కలంలో సిరా నింపుకుని త్వరగా వచ్చేయండి 

తేటగీతి

వెళ్లిపోకు మిత్రమ ! పద పల్లవములు 

పంచుమిచ్చోట కవనంబు వల్లరులని         

పద్యమన్న హృద్యమగును పరవశమది 

తెలుగుతేనియలు సుధలు వెలయునపుడు 

 తేటగీతి

మక్కళించు మధ్యాక్కర మధుర సుధలు 

పద్య రుచిరంబు హరువులీ పరవశములు !

చందనంబులు పంచేటి జయకరుండు

తెలుగుతేనియలు సుధలు వెలయునపుడు

************

తేటగీతి

గంధ ధూళియిదియె! మకరంద రుచ్య

మగు పదముల పొంకములివే!యబ్బురపర

చెడి కవన మాధురి యిదియే! చిత్ర పదము

లల్లికలివియే! కస్తూరి జల్లు లివియె!

*************

 

మోహనపు చందన పొడి సమ్మోహనముగ

జల్లితిరి సమూహ కవులన్ సంతసముగ

నుంచుటకు పద్య రుచులన్ని యుచితముగను

పంచ వేచి యుండిరి నభివందనములు

సలుపుతు మనసు నిండుగ వెలుగు తోడ.

**************

 

తెలుగు తేనియ తోటలో నలరు విరులు,

కోయిల కలరవమ్ములు కురిసె శ్రావ్య

పదముల నడకలుమనసు ముదము నొంద,

స్వస్తి పలికెనక్క మనసు సంబరముగ

******************

 

తేటగీతి

మీ కవిత్వంబు గాంచినన్ మీపద సుమ

ములవిపొంకముల్భాసురముల్సుమధుర             

సుందర పదమరందముల్ సొబగు జూపు        

తెలుగు తేనెల మకరంద కలికి సుధలు ! 

చెలగు "కస్తూరి" ని కురిపించి ఝరుల వలె  !  

 

వై శ్రీదేవి

*****************

 

ఈ సృష్టి లో అతివ అంటేనే ఒక అద్భుతం. 

చిరునవ్వులు చిందే ముఖారవిందం మీద చిందర వందర గా తుమ్మెదల వంటి ముంగురులు తోనూ .

 వెండి వెన్నెల కాంతులలో తళుక్కు మనే నదీ కెరటాల్లాంటి కడగంటి చూపులతోనూ.

 మన్మధునిధనస్సు  వంటికనుబొమ్మలతోను.విరజాజి మొగ్గల వంటి పలు వరసల తోనూ సౌందర్యా నికి సహజ సిద్ద మైన చిహ్నం గా ఉండే ఉంటుంది ఈ ఆరని పారాణి పాదాల నవ వధువు.

 

 మాదిరెడ్డి సురేశ్

****






29, ఆగస్టు 2020, శనివారం

28.08.2020 స్వేచ్చా సమర్పణలు

 

సత్య నారాయణ సుశీల స్వజుడనుగ,

వారి ఘనపాదములకు నే ప్రణుతి చేసి

నిడుచునుంటి నంకితమును కడుముదముగ

నీ శతకమును వారికిన్  ,నెమ్మి కలిగి



దత్తపది - పెన్,బుక్,ఇంకు,పేపరు

ఈ పదములతో  భారతార్ధము

సీసములో  నా పూరణ

 

ప్రేయసీ నీవల(పేపరు)గు‌లను తీయించుగా పురుషుని, యెంచి కొంటి

వే మంచి (యింకు)వ,వేగిరము గనిట్టి నర్తన శాలలో నాదు కోరి

కను తీర్చ  నుంటివి గా నొకపరి తీయ వలయు నీ ముసుగు,దీపపు వెలుగు

లోనిను చూచెద నేనని దరిచేర వలలుడు తనపిడికిలి బిగించి

 

మార్కొన డు(బుక్కు)న పడెను  మత్తు వదలి

కీచకుడు విస్మయము నొంది కాచు కొనుచు

(పెన్గొ)నుచు ముష్టి యుద్ధము భీకరముగ

చేసి నసువులు రయముగ  బాసె నపుడ

ఇంకువ.   చోటు

పెన్గొని   త్రోపులాడు

 పూసపాటి

 ****

 

పేపర్ - బుక్ - పెన్ - ఇంక్

పై పదాలను ప్రయోగిస్తూ భారతార్థంలో నచ్చిన ఛందంలో పద్యం

 నా పూరణ

 కందము

 చూపే పరాయి నన నే

నోపక మనసిక నుబుకుచు  నొంటరి యగునే

చూపెన్ ప్రేమను నీపై

ద్రౌపది తగు లీలలింక దాస్యమ్మిడుమా!!

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

 ****

 

సేకరణ:

ఒక తెలుగు అభిమాని కవిత

 

పూతరేకులరిసె పూర్ణాలు బొబ్బట్లు

కాకినాడ కాజ కజ్జికాయ

బాదుషాలు జాంగ్రి పాయసమ్ముల కన్న

తీయనైన భాష తెలుగు భాష!

 

మిసిమి బంగినపల్లి మామిడుల రుచులు

తాటిముంజలు మేటి సీతాఫలాలు

మెరయు చక్కెరకేళి మాధురులకన్న

తీయనైనది నా భాష తెలుగు భాష!

 

పెసర పిండి  పైన  ప్రియమగు నల్లంబు

దాని పైన మిర్చి దద్దరిల్ల

జీల కర్ర తోడచేర్చిన ఉప్మాకు  

సాటి తెలుగు  భాష మేటి భాష

 

స్వర్గ మందు దొఱకు చప్పని అమృతంబు

తాగ లెక సురులు ధరణి లొన

ఆంధ్ర దెశమందు ఆవిర్భవింతురు    

ఆవ కాయ కొఱకు నంగలార్చి.

 

కూర్మి తోడ తెచ్చి గోంగూర యాకులు

రుబ్బి నూనె మిర్చి ఇంపు తోడ

కారమింగువలను  తగిలించి తిను వాడు

ఘనుడు తెలుగు వాడు కాదె భువిని

 

ఆట వెలది యనిన అభిమానమెక్కువ

తేట గీతి యనిన తియ్య దనము

సీస పద్యమనిన చిత్తమ్ము రంజిల్లు

కంద పద్యమెంత సుందరమ్ము !!

 ****


చిత్రానికి పద్యం

 కంము

 

గారెలు చూపిరి చక్కగ

నోరూరించెడి విధముగ నోపగ తగునా

వారించెడి వారెవరిట

నీరీతిగ కడుపునింప నిలువదె మనసా!!

 

ఆటవెలది

ప్లేటు నందు టిఫిను ప్రేమగ జూచెను

నీరు నోటియందు నిలువకుండు

చిల్లు గారె లనిన థ్రిల్లది వేరయా

చక్రవర్తి పలుకు సత్యమిలను

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

 

*****



27.08.2020 స్వేచ్చా సమర్పణలు

 

 

తొల్లి గురువు జగతి లోన తల్లి గాదె,

తొల్లి వేల్పుకున్ పార్వతి తల్లి గాదె,

తల్లి కన్నదైవము లేదు నెల్లరకును

భూతినిడుశుభొదయ మెనె పూసపాటి

 


తెలుగు సుధల నైవేద్యము   

సలలితమాయే సతతము శారదకృపతో    

తొలకరి భావమనోహర 

కలికి పదమ్ములవి జిల్కు కమనీయంబై !! 

 కస్తూరి శివశంకర్

********************* 

 

శక్తి దాయిని వేనీవు శరణు మాత

కరము లోనశుకము మాకు కలుగు శుభము

మధుర మీనాక్షిగా మాకు మాట నేర్పి

కవన పటిమను వాగ్ధాటి కలుగ జేసి

తెలుగు తేనియల్ ఛాత్రుల వెలుగునిమ్ము..

 జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి, మహారాష్ట్ర

 **************************************************************

 

సేకరణ వెంకట్. సిహెచ్

 భళారే... తెలుగు!

 ఒకప్పుడు ప్రముఖ పాత్రికేయులు శ్రీ భండారు శ్రీనివాసరావుగారు ఫేస్‌బుక్‌లో ఆసక్తికరమైన క్రింది ఆంగ్ల వాక్యాన్ని పోస్ట్ చేశారు:

 An Amazing Sentence in English

Remarkable indeed! The person who made this sentence must be a GENIUS in English vocabulary.

 "I do not know where family doctors acquired illegibly perplexing handwriting; nevertheless, extraordinary pharmaceutical intellectuality, counterbalancing indecipherability transcendentalizes intercommunication's incomprehensibleness.''

  వాక్యంలో ఇరవై పదాలున్నాయి. ఒకటవ పదంలో ఒక అక్షరం, రెండవ పదంలో రెండు అక్షరాలు, మూడవ పదంలో మూడు అక్షరాలు, విధంగా అక్షరవృద్ధిక్రమంలో ఇరవయ్యవ పదంలో ఇరవై అక్షరాలు ఉన్నాయి.

 ఇదొక అపురూపమైన చిత్ర రచన. దీనికి ప్రతిగా తెలుగు భాషకు గల శక్తిని వెల్లడిస్తూ ఏల్చూరి మురళీధరరావు గారు క్రింది వాక్యాన్ని ప్రకటించారు:  

  మంచి కవైనా విశ్వనాథ గ్రంథావళిని చదవకపోతే కవిత్వరచనలో పద్యనిర్మాణశక్తికి, సద్గుణాలంకారవ్యక్తికి,

రసోచితశబ్దార్థయుక్తికి, సుమకోమలభావభావనకు, నవ్యసంప్రదాయపదగుంఫనకు, భవ్యరసాస్వాదరసాయనవాణికి, పురుషార్థోచితచిత్తవృత్తిచిత్రణకు, భారతీయతామరందాస్వాదలోలుపతకు, అతిలోకచమత్కృతిమత్కృతిమత్ప్రతీతికి, విషయచింతానిరోధనిశ్చలసమాధ్యవస్థకు, విపంచీస్వరసౌభాగ్యబంధురశయ్యావైయాత్యానికి, ఉత్కృష్టలోకసిద్ధార్థమహాపురుషగుణకీర్తనకు, రమణీయార్థనిర్మితశ్రవణమనోహరకావ్యలక్ష్మికి, నానార్థస్ఫోటవాచకత్వసంయోగాదినియమితవ్యంజనకు, అభిధావివక్షితాన్యపరవాచ్యసంలక్ష్యక్రమభావధ్వనికి, శృంగారవీరకరుణహాస్యరౌద్రాద్భుతశాంతాదిరసప్రతీతికి, గిరిశిఖరపతన్నిరర్గళస్రవంతీనిరుపమానధారాశుద్ధికి, ధర్మజ్ఞానభక్తిప్రేమసత్యాద్యుత్తమాదర్శప్రతిపాద్యవస్తుస్వీకృతికి, సహృదయహృదయవాసనాపరీపాకభావనాప్రపంచశోభాదూరవర్తే!

 పై వాక్యంలో 26  అక్షరవృద్ధి దళాలున్నాయి. మొదటి దళం ఒక అక్షరం, రెండవ దళం రెండక్షరాలు, మూడవ దళం మూడక్షరాలు....

ఇలా ఇరవై ఆరవ దళం ఇరవై ఆరు అక్షరాలతో అక్షరవృద్ధిక్రమంలో కూర్పబడి ఉన్నాయి.


 1.

2. మంచి

3. కవైనా

4. విశ్వనాథ

5. గ్రంథావళిని

6. చదవకపోతే

7. కవిత్వరచనలో

8. పద్యనిర్మాణశక్తికి,

9. సద్గుణాలంకారవ్యక్తికి,

10. రసోచితశబ్దార్థయుక్తికి,

11. సుమకోమలభావభావనకు,

12. నవ్యసంప్రదాయపదగుంఫనకు,

13. భవ్యరసాస్వాదరసాయనవాణికి,

14. పురుషార్థోచితచిత్తవృత్తిచిత్రణకు,

15. భారతీయతామరందాస్వాదలోలుపతకు,

16. అతిలోకచమత్కృతిమత్కృతిమత్ప్రతీతికి,

17. విషయచింతానిరోధనిశ్చలసమాధ్యవస్థకు,

18. విపంచీస్వరసౌభాగ్యబంధురశయ్యావైయాత్యానికి,

19. ఉత్కృష్టలోకసిద్ధార్థమహాపురుషగుణకీర్తనకు,

20. రమణీయార్థనిర్మితశ్రవణమనోహరకావ్యలక్ష్మికి,

21. నానార్థస్ఫోటవాచకత్వసంయోగాదినియమితవ్యంజనకు,

22. అభిధావివక్షితాన్యపరవాచ్యసంలక్ష్యక్రమభావధ్వనికి,

23. శృంగారవీరకరుణహాస్యరౌద్రాద్భుతశాంతాదిరసప్రతీతికి,

24. గిరిశిఖరపతన్నిరర్గళస్రవంతీనిరుపమానధారాశుద్ధికి,

25. ధర్మజ్ఞానభక్తిప్రేమసత్యాద్యుత్తమాదర్శప్రతిపాద్యవస్తుస్వీకృతికి,

26. సహృదయహృదయవాసనాపరీపాకభావనాప్రపంచశోభాదూరవర్తే

 

తెలుగు భాషాభిమానుల ఆసక్తి కారణంగా వాక్యం అచిరకాలంలోనే ఫేస్ బుక్ లోనూ, అంతర్జాలంలోనూ, వాట్సాప్ మాధ్యమం ద్వారానూ, వివిధ పత్రికలలోనూ పాతికవేలకు పైగా పర్యాయాలు సంచరిస్తుండటం విశేషం!

 భళారే ... తెలుగు!

 ***********************


గురువుల ప్రాశస్త్యం

చంపకమాల

 

గురువులె విశ్వమందునను గోడులు దీర్చెడి జ్ఞానసంపదల్

వరముగ నిచ్చిబ్రోవగను వారధియై వెలుగొందు జీవకోటికిన్

హరిహర సృష్టికర్తగను ఆశయసిద్దినొసంగు మోదమున్

స్థిరమును గూర్చు డెందమున తీరము జేర్చును నమ్మి గొల్వుమా!

 

మహేశ్ ముత్యాల

********************* 


షిర్డీ సాయి ఇష్ట పది

 

అతడొక  సాధువు

మహిమ లెన్నో తనవద్ద కలవు

 

వృత్తి యాచక వృత్తి

ప్రవుత్తి జనులకు జ్ఞానబోధ

 

కులము దేవుని కులము,

మతమ్మది మానవత్వము

 

తల్లి పుడమి తల్లి

తండ్రి అనంతాకాశము

 

చెరుకుపల్లి గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

 ***********************************************


నివాసము షిరిడీ గ్రామము

విలాసము పురాతన మసీదు ప్రాంగణం.

సంతానము సకల

భక్త జన సందోహము.

రూపము చిద్రూపము,

తేజము ప్రచండ భాను తేజము.

నేత్రములగ్నిహోత్రమ్ము

గాత్రము సుస్వర సమ్మిళితము.

 

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి,

 *********************************

 

శార్ధూలము

 సద్యోజాతము మీ స్వరూప హరువుల్ స్వామిన్ ! సదా సేవలో  

వైద్యావైభవమందు మేటి గరిమల్ వైశిష్ట్యముల్ నేర్పుతో       

హృద్యంబౌ భవదీయమానసములో వేవేల కైమోడ్పులే

విద్యావేణిని వాణినిన్ గొలుచుచూ "వేదాంత వేద్యుండవై"

 

మానవ సేవలో స్వ, పర బేధాలు లేకుండా సేవానిరతిలో నిత్యం తరియించె వారందరికీ పద్యం సమర్పణ

 

శార్ధూలము

 

రక్షింపన్ స్వ-పరంబులేని తలపారాధించగా మానవుల్ 

పక్షంబెన్నక బంధమెన్నక సదా పాలించుచూ ధర్మముల్;     

సాక్షీభూతములెన్ని సంఘమున విశ్వాసంబుగా నిల్చినన్       

మొక్షామార్గములాయె సేవనిరతుల్ మోదంబుగా ధారుణిన్


కస్తూరి శివశంకర్

 ********************

 

కంప్యూటర్ ప్రేమలేఖ

 డియర్ సాఫ్ట్ వేర్ రాణి

 

ఎంతకాలమైంది నిన్ను చూసి, విండోస్ ఓపెన్ చేస్తే చూద్దామని మెసేజి ఇస్తే  విండోస్ 98 ఓపెన్ చేశానని  రిప్లైLAWN లొ కొస్తే  చూద్దామంటే LAN లో ఉన్నానంటావు.    386 లాంటి నిన్ను 486కు   ఎలాగోలా      మార్చగలిగాలేటెస్ట్ VERSION కు  UPGRADE చేద్దామంటే   మీ డాడీ BUG చేశాడు.    MS DOS 98 VERSION లో   ఉంటే ఎలా?  WINDOWS  10 లోకి  UPDATE కావాలి   కానినీ నుంచి  KB లొ రెస్పాన్స్ వస్తోందిMB     స్పీడులో ఉండాలినీ VGA లాంటి చూపులు SVGA  కావాలి డియర్నీ నవ్వు EXE ఫైల్  లా ఉండాలినీ   లేత  పెదవుల నుంచి వచ్చే మాటలు నాకు తప్ప ఎవరికి అర్ధం కాకుండా ENCRIPTION కావాలి. నీవు పంపే    కిస్సులు HIDDEN FILE లో దాస్తానీ  పిలుపు కోసం  నా స్వీట్ హార్ట్ INSERT MODE  లోనే ఉంచానీ నాజూకు  చేయితో      వ్రాసిన లవ్ లెటర్స్ BACKUP చేశా. నీ అభిప్రాయాలు LASER PRINTER లా ఉండాలి గాని DOT MATRIX లా వలదు సుమీమరీ NIBBLE లా మాట్లాడకుండా BYTE లా మాట్లాడవా బేబి.   నీ హార్ట్ DISC ను మీ డాడీ PARTITION చేసినా ACTIVE PARTITION నాకే కేటాయించవా ప్లీజ్మీ డాడీ మన ప్రోగ్రామ్ ను HAWKING చేయకుండా గంటకో సారి నీ PASSWORD మార్చడం మరచి పోవద్దు. ASSEMBLED SYSTEM కన్నా BRANDED SYSTEM లాంటి వాడు కావాలంటాడు నాకు కాబోయే మామగారు. నాలో CATCHE MEMORY ఎక్కువ. మీ డాడీ మైండ్ PROCESSOR కు కావాలిసిన DATA ఇస్తానని చెప్పుప్రియా మన మాటలు , నీ పాటలు EPROM CHIP లొ భద్రపరిచా. నా మామ ఎన్ని సార్లు FORMAT చేసినా అవి ERASE కావని చెప్పునీ లవ్ CURSOR నా హార్ట్ పైనే కలకాలం ఉంచుతావని అనుకొంటున్నాను..  అందుకే GIGO లా సరిపడిన FEED BACK ఇస్తావని ఆశిస్తూ  . . .

 

నీ HARD DISC

 

పూసపాటి

**************


అల్పజీవులెల్ల ఉపకారము జేయ

ధరణిజను కనుగొనె దశరధ పుత్రుడు

భక్తి పారవశ్యము తోడ ఉడుత లెల్ల జేరి

సేతు నిర్మాణ క్రతువు లో తోడ్పడె భువిన

సాయమొసగు మనంబు పొదిగిన జీవి ఏదైనా

ధన్యజీవి కదా ధర్మ ధరణి లొ

వక్రబుద్ధిని మర్మముగ మనంబున పొదిగి

తోడ్పడుచుందురు త్వరితముగ దుష్ట జనులు

జర జాగురూకత లేనియెడల ఇట్టి జనుల పట్ల

ఉపకారముతో అపకారము మెండు అవనిలో


వి.వి.శ్రీనివాస్

*****************


తరువోజ                           

స్వార్థ చింతన తోడ సాయపడకనె

    సాగించెడి బ్రతుకు చపలత్వము గద!

వ్యర్థ జీవితమందు వ్యామోహితుడిగ

    వాంఛలు నెరపగ యాతన కలుగు.

వర్థిల్లు తుండెనె ప్రాణులు సాయ

    పడుతు తమకు తాము వైభవమ్ముగను;

స్పర్థనొదలి నీవు సాయపడంగ

     సంఘటిల్లునె సర్వ సంబరాలన్ని!

 

మధురాక్కర

 నలుగురికి సాయపడి నీవు

       నందన మివ్వవోయి!

వెలుగు పంచవోయి! సతము

       వేదన దీర్చునోయి!

కలుగునోయి! ఘనము నీకు

       కౌటిల్య మాపి సాగ

మెలుగవోయి! హితముతోడ

       మేలు చేకూరునోయి!

 

వెంకట్. సిహెచ్

******************* 

 "తరువోజ" సొగసు కైతలసోంపు తెలిపి

       తారాడు పద్యసుధలభంగి నెఱిఁగి                 

వరముల పదములు వాంఛలు కలిగి

           వర్షించు తేనెల పరవశములిక   

సురుచిర మంజులంబులు నేడు చెలగు

        సుమసుందరంబగు శోభలు జిల్కు

 నిరుపమ రీతిగా నీహారికముల

     నెలవంకలును; నిగ్గునీలవేణులని       

 

కస్తూరి శివశంకర్

*********************


సేకరణ-   మోక్షం

 

ఒకప్పుడు మహాస్వామి వారి దగ్గరికి విదేశాలనుంచి ఒక వనిత వచ్చింది. గడపకి అవతల ఆవిడ కూర్చుంది. లోపల మహాస్వామి అభిషేకం చేసి వున్నారు. ఆవిడ బయటినుంచి ఒక ప్రశ్న వేసింది. పునర్జన్మ వున్నది, దానికి కారణము చేసిన పాపపుణ్యములు కారణము అంటారు కదా సనాతనధర్మంలో! నిరూపించడానికి ఏదైనా ఆధారం వున్నదా? అని అడిగింది. ఆయనేమీ మాట్లాడలేదు. ఒక అరగంట అయిపోయింది. ఆవిడ అలాగే నుంచుంది ఏమైనా చెప్తారేమో నని. ఆయన ప్రక్కన వున్న అంతేవాసిని పిలిచి అన్నారు ఈసందు చివరలో ఒక ప్రసూతి వైద్యశాల వుంది. ఈవిడని ఇవాళ మధ్యాహ్నం వెళ్ళమనండి. వైద్యశాలలో ఎన్ని గదులున్నాయి? గదిలో ఎవరు ప్రసవం కోసం వున్నారు? గదిలో వున్నవాళ్ళు ఏంచేసున్న వాళ్ళు? మరునాటి వుదయంలోపల వాళ్ళకి మగపిల్లవాడు పుట్టాడా? ఆడపిల్ల పుట్టిందా? పిల్ల/పిల్లవాడు పుట్టినప్పుడు వాళ్ళెలా భావిస్తున్నారు. ఇవి వ్రాసుకొని నాదగ్గరికి రమ్మనండి జవాబు చెప్తాను అన్నారు. ఆవిడ మరునాడు వచ్చి ఏమీ అడగలేదు.

 

మహాస్వామి వారికి కొంత దూరంలో నేలమీద పడి నమస్కారం చేసి నాకర్థమైంది, పునర్జన్మ సిద్ధాంతం ఎంత సత్యమైనదో నాకు తెలిసిపోయింది. ఇక మీరు జవాబు చెప్పక్కరలేదు. అన్నది. ఎలా? ఆవిడ అక్కడికి వెళ్ళి చూసింది. పది గదులున్నాయి. 8 గదులు మామూలువి. 2 గదులు ఏసి. మళ్ళీ ఎనిమిది గదులలో నాలుగు స్పెషల్ రూమ్స్. నాలుగు మామూలువి. ఆవిడ మరునాటి ఉదయం వరకు పుట్టినటువంటి పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రుల స్థితి సేకరించింది. ఒకరు జిల్లాకి అధికారి. ఏసి రూములో ఆయన భార్యకి మొట్టమొదటి సంతానం కొడుకు పుట్టాడు. కొన్ని వందలమంది వచ్చి జిల్లా అధికారికి చేతిలో పుష్పగుచ్ఛాలు పెట్టి పళ్ళు పెట్టి అయ్యా మీకు కంగ్రాచ్యులేషన్స్ అండీ మీకు కొడుకు పుట్టాడు అంటున్నారు.

 

ఇంకొకరికి సామాన్యమైన గదిలో ప్రసవమైనది, శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది. వెయ్యి రూపాయలనుకున్నది పదివేలయింది. భర్త చూడడానికి రాలేదు ఎందుకంటే బిల్లు కట్టడానికి కావలసిన డబ్బు అప్పు చేసుకోవడానికి తిరుగుతున్నాడు. ఆయనకీ కొడుకే పుట్టాడు. ఇంకొక ఆవిడకి ప్రసవానికి వేళయిపోయింది. ఆవిడ గది కూడా తీసుకోలేదు. వరండాలో బల్లమీద పడుకోబెట్టి పురుడు పోశారు. నాలుగిళ్ళల్లో పనిచేసుకొనేటటువంటి వ్యక్తి. పుట్టడానికి ముందే ఎక్కడ పుట్టడానికి అనువుగా వుంటుందో ఎంత భోగకరమైన ప్రదేశంలో పుట్టవచ్చో ముందే నిర్ణయమైపోయిందా? అంటే వాడు ఎంత భోగమనుభవించాలి అని నిర్ణయింపబడితే కదూ వాడికి తెలియకపోయినా వాడికి పిల్లవాడిగా వచ్చాడు.

 

గతజన్మలో చేసుకున్నది లేకుండా ఇలా ఎలా పుట్టారు? అక్కడే పుట్టేటట్లు చేసినవాడు ఒకడున్నాడు. అలా చేసేటప్పుడు వాడి పుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ పుట్టించాడు. వాడి పాపాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొక ఫలితాన్ని కూడా ఇస్తాడు. అందుకే ఆవిడ ఇక మాట్లాడలేదు. నాకు అర్థమైపోయింది ప్రసూతి కేంద్రానికి వెళితే పునర్జన్మ సిద్ధాంతం ఎంత గొప్పదో అని. కాబట్టి పునర్జన్మ సిద్ధాంతం ప్రాణం.

 

మోక్షం కలడానికి భక్తితో అంటే ధార్మికమైనటువంటి జీవనాన్ని గడపగా గడపగా అనువైన సమయం చూసి పరమేశ్వరుడు యే కోరికా లేకుండా భక్తితో బ్రతుకుతున్నాడు గనుక చిత్తశుద్ధినిస్తాడు. చిత్తశుద్ధికి పాత్రత అంటారు. నా దగ్గర ఆవుపాలు గోరువెచ్చటివి వున్నాయి. పాలు త్రాగడానికి మీరు ఒక గిన్నె పట్టారు. అది అపరిశుభ్రంగా వుంది. అటువంటి పాత్రలో నేను పాలు పోస్తానా? పాలు విరిగిపోతాయి. వేరేది తెచ్చుకోండి అందులో పోస్తాను అంటారు. పాత్రత లేకుండా జ్ఞానమివ్వరు. పాత్రత కలగాలంటే చేసిన పుణ్యానికి ఫలితాన్ని అడగకూడదు. నేనొక పుణ్యం చేసి ఫలితం కావాలంటే సుఖం క్రింద ఇచ్చేస్తాడు.

 

అయిపోయిందిఆ పుణ్యం అక్కడితో పోయింది. ఒక పుణ్యం చేసి నాకేఫలితం అక్కరలేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు ఈశ్వరుడికే ధారపోశాను. పాపం అనుభవించేశాను. అనుభవించడానికి ఇప్పుడు పుణ్యం వుందా? లేదు. అనుభవించడానికి పాపం వుందా? లేదు. ఒకవేళ పాపం వున్నా చిత్తశుద్ధిని ఇస్తాడు. అది పాత్రత అంటారు. అందులో జ్ఞానధార కటాక్షిస్తాడు. జ్ఞానధార పోయగానే సంచితం తగలపడిపోతుంది. ఇక అనుభవించడానికి పాపంలేదు, పుణ్యం లేదు. పాపమూ, పుణ్యమూ లేని వాడికి ఇక శరీరమెందుకు? వాడు ఈశ్వరుడి యందు ఐక్యమైపోతాడు. అదే మోక్షం. 


**************************************************** 

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...