దత్తపది లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
దత్తపది లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, మార్చి 2021, మంగళవారం

దత్తపది -86, శివము - భవము - లవము - రవము, 12.03.2021

 


12.03.2021 శుక్రవారం దత్తపది -86

శివము - భవము - లవము - రవము

మనోహరమైన పద్య/ వచన కవితలను అందించగలరు.

 

 

తుంటరి తిమిరమ్ము ధరణి జంటగోరి

దిక్కులావహించె నిశీధి పక్కబరచి

జగతి నిద్రను జోగగ జవము ద్రుంచ,

రక్షకుని గాంచి పర్విడె రశ్మిసోక

 

భావం: తుంటరి చీకటి భూమి జతను కోరి దిక్కులన్నిటిని ఆవహిహించి చీకటి అనే పక్కను పరచి, జగతి నిద్రలో జోగుతూ ఉంటే శక్తిని తగ్గించాలి అనుకున్న చీకటి సూర్యరశ్మి సోక గానే పారిపోయింది

వాణిశ్రీ నైనాల

 

 

ఉద్భవించె నున్నతముగ నుత్తరుండు

హాలహల మారగించి తా నాద్యుడయ్యె

గంగను శిఖన దాల్చి గంగాధరుడయె

జాగరణ మొనర్చుతు నేను సమ్ముదముగ

సాయి లక్ష్మి

 

 

మంచి మాట

నాన్నగారు వివరించి

విశదీకరిచేవారు

స్థాయికి తగ్గ

భవముతో తృప్తిపడుచూ

సంపాదనలో లవము

దాన ధర్మాలకు వాడుచూ

రవమును అదుపుచేయుచు

సౌమ్యముగా సంభాషించుమ

అటుల కలుగు నీకు

తృప్తిగా శివములు అని .

జి మురళీ మోహన్ రావు

 

 

వచనం,

మనిషి శివము ఎత్తినట్టు ప్రకృతిని ఛిద్రం చేస్తే,

కిలకిల రవములు ఇక వినిపించవు,

ప్రకృతి సమతుల్యత దెబ్బతిన్న అనుభవము...

మరి కలనైనా తలవము కరోనా గాయము వలన....

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

 

 

కం"

లవమౌ నాదిప్రణవపు

రవము స్తుతించ పరమాత్మ రాగము జూపున్

శివమౌ నమ్మిన సకలము

భవము నరయ సాధ్యమౌను  భ్రాతిని విడువన్

వాణిశ్రీ నైనాల

 

 

శివమునకు శవమునకు భేదము లవమే నదియే ప్రాణము

భవమునకు భవ్యమునకు వేరిమి యొకటే నదియే వివేకము

విశ్వమెల్ల విస్తరించిన రవము యొకటే నదియే ప్రణవము

చిత్తమందు పల్లవమగు అహము యొకటే నదియే దైవము..

CA కె మల్లికార్జునరావు

 

 

స్వేచ్చా సమర్పణ:

మాయ

ఈ జగమంతా ప్రియులే నీకు ప్రియులందరూ దాసులే నీకు

ఆడ మగ బేధము లేదు నీకు అందరూ సహవాసులే నీకు

ఎల్లరను మురిపించి మరిపించి వలపువలతో నీ ముగ్గులో దించి

ఒక పరి పూర్తిగా ముంచుతూ మరొక పరి కొద్దిగా  తేల్చుతూ

మార్చి మార్చి  బతుకిస్తు చంపేస్తు నీ మోహ పాశములతో బంధిస్తు

ఊపిరాడనీయక తునుమాడతావు ఉక్కిరిబిక్కిరి చేసి సలుపు తావు

నీవు మాత్రం కపట హాసములతో కులుకుతూ సతము ఆనందిస్తావు.

ఆది దేవుడినీ వశపరచు కొంటివి మోహిని పై మోహము పెంచగా

విష్ణువునూ లొంగదీసు కొంటివి వరాహుడై పంకమున పొర్లాడగ

విశ్వామిత్రుని భంగము చేసితివి మేనక పై మరులు పర్వు తీయగ

సురాసురులైన మహామునులైన నీ వీక్షణములకు బానిసలైరి గదా

ఇంతటి ఘనమైన మాయా దేవీ తప్పు కోవె తల్లీ మా దారి నుండి

CA కె మల్లికార్జునరావు


దత్తపది -84, తెలుపు, మలుపు, వలపు, గెలుపు, శుక్రవారం, 05.03.2021

 


5.03.2021 శుక్రవారము 

దత్తపది -84

తెలుపు, మలుపు, వలపు, గెలుపు

మనోహరమైన పద్య/ వచన కవితలను అందించగలరు.

 

 

తెలుపు  హనుమయు జాడను తెరపి లేక

మలుపు లన్నియు గూరిచి మనసు నున్న

వలపు రాణిని మరువక వ్యధ చెందు

రామ భద్రుకు గెలుపును రమ్య ముగను

ఆర్. సాయిలక్ష్మి

 

 

వచనం,

తన మదిలోని వలపు,

తెలుపు చిన్నదాని నగుమోము గాంచి,

తన జీవితం ఓ మలుపు తిరిగి,

అన్నిటా తాను గెలుపు సాధించినట్టాయె కుర్రవానికి.

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

 

 

 

సాధించవచ్చు

వలపులపై ఆలోచనలను మలుపు తిప్పుచూ

చదువుమా శ్రద్దగా చేయుమ నిష్టగ జ్ఞాన  సముపార్జనను

 

అటుల పొందు గెలుపులను తెలుపుచు

ఇతరులకు రగిలించుమా వారిలో  గెలుపుగాళ్ళ తలపులు !

జి మురళీ మోహన రావు

 

 

తెలుపు, మలుపు, వలపు, గెలుపు

తెలుపు మా సఖీ

నీ వలపును పొందు టెటుల?

మల్లెల దారి లోనైన

మంచు ఎడారి లోనైన

నా ప్రస్థాన మందు

మలుపు  మలుపు లో

నీ ప్రేమే నాకు మార్గదర్శి

అంతము లేని నా గమ్యానికి

నీ ప్రేమే నా గెలుపు ధ్వజము.

CA కె మల్లికార్జునరావు

 

 

కం"

మలుపులు దిరిగెన్ జనకుని

వలపు నిలుప శాంతనవుడు ప్రతినన్ బూనన్

తెలుపున్ ఘనచరితమ్మిది

గెలుపులతని జీవిక యిల గీర్తినిబొందన్

వాణిశ్రీ నైనాల

 

మనసు తెలుపు వేళ మరిమరీ యోచించు

 మలుపుయగునొ నీదు గెలుపుయగునొ?

వలపుదెండకాల వర్షమ్మె చూడంగ

కురియవచ్చు బ్రతుకు కూల్చవచ్చు!

 రాంమోహన్ నిజామాబాద్

 

 

 

ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు.

కృత్రిమ మేధస్సు (లేదా యంత్ర మేధస్సు) యంత్రాలుచే ప్రదర్శించబడిన మేధస్సు, ఇది మానవులు, ఇతర జంతువుల యొక్క సహజ మేధస్సు వలె ప్రదర్శించబడుతుంది. కంప్యూటర్ శస్త్రంలో కృత్రిమ మేధస్సును మేధో యొక్క పరిశోధన అధ్యయనంగా నిర్వచిస్తారు: ఏ పరికరం దాని పర్యావరణాన్ని గ్రహించి లక్ష్యాన్ని సాధించేందుకు తొడ్పడుతుందో దానిని కృత్రిమ మేధస్సు అంటారు. "కృత్రిమ మేధస్సు" పదం సహజంగా ఒక యంత్ర "జ్ఞాపకశక్తి" ప్రదర్శించినప్పుడు వర్తించబడుతుంది. ఇది మానవ మనస్సు వలె, "శిక్షణ", "సమస్య పరిష్కార" ప్రదర్శిస్తుంది.

 

కృత్రిమ మేధస్సును విద్యా విభాగంలో క్రమసిక్షన కొరకు 1956 లో స్థాపించబడింది. చాలా సంవత్సరాలు, కృత్రిమ మేధస్సు పరిశోధన విభజించబడి జరిగింది. ఈ సమయములో ఒకరికి ఒకరు సమాచారం అందించుకొవడంలో విఫలించారు.. ఈ విభాగలు సాంకేతిక పరిగణనలు ఉదా. "రోబోటిక్స్" లేదా "యంత్ర మేధస్సు") మీద పరిశోధనలు జరిపాయి.


15, మార్చి 2021, సోమవారం

దత్తపది -78, పాదము -వాదము - మోదము - నాదము 15.02.2021,

 


15.02.2021 సోమవారం దత్తపది -78

పాదము -వాదము - మోదము - నాదము

 

సూచించిన దత్తపది తో పురాణ, ఇతిహాసాలు, ఏదేని ఇతివృత్తం తో పద్య/ వచన కవితలను అందించగలరు.

 

కవులు/కవయిత్రులు తమ మనోఫలకము మీద తారాడెడు రమణీయ భావనలను వెలికి తీసి, సుమనోహర వన్నెయల నద్ది తేనియల దిటవు తెలిపెడి కవితలల్లి, సమూహము తేజరిల్లు నట్లు ఘనత చేకూర్చగలరని విన్నపము.


 

దత్తపది_77, శుక్రవారం, 12.02.2021

 


12.02.2021 శుక్రవారం,

దత్తపది_77

కుడి, గడి, జడి, పొడి

 

భారత దేశపు గొప్పదనాన్ని వివరిస్తూ స్వేచ్ఛా ఛందములో

మనోహరమైన పద్య/ వచన కవితలను అందించగలరు.

కవులు/కవయిత్రులు తమ మనోఫలకము మీద తారాడెడు రమణీయ భావనలను వెలికి తీసి, సుమనోహర వన్నెయల నద్ది తేనియల దిటవు తెలిపెడి కవితలల్లి, సమూహాము తేజరిల్లు నట్లు ఘనత చేకూర్చగలరని విన్నపము.

 ************************

 

కుడి,గడి, జడి,పొడి లతో భారతావనిని వర్ణిస్తూ... నా ప్రయత్నం సీసము లో.....

కుడివైపు బెంగాలు కులుకులన్ గంభీరముగ గల్గు నిండైన ముత్తయిదువ;

గడచిన కోటల గాధ లుత్తరమున రాజుల స్థానమై మోజు తీర్చ;

జడివాన, వడగాడ్పు సమముగా నుండెడు మహరాష్ట్రమే నీకు మరులు గొల్ప;

పొడికావ్యములనే వడివడిగ రచించి లక్షణమైయుండె దక్షిణాది

 

తే.గీ. II

కలదు తిలకమై నుదుటను కాశ్మి రమ్ము

గళములోన కదులు నిండు గంగ హొయలు

జిలుగు లొలికెడి సుందర జీవ నదులు

వెరసి బంగరు గిన్నె నా భరత భూమి

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

ఈ  నాటి  దత్త పది

కుడి,గడి,పొడి,జడి

ఈ  పదములు  ఉపయోగించి  భారతావని వర్ణన

సీసములో  వర్ణన    (బ్రాకెట్ల లో  దత్త పది పదములు)

 

జమ్ముకాశ్మీరమ్ము జడ యాయెఅస్సోము,   హర్యాన .బీహారు లంద మైన

జడకుప్పె లాయె, పంజాబు,ఒడిసదిద్దులై చెవులకు ముద్దుగాను

మెరయ, జార్ఖండు త్రిపుర నాశికా భరణంబులై జిగినిడె  ,నాగలాండు

పశ్చిమ బెంగాలు పాణి దోయికి గాజులై చేర అరుణాచలప్రదేశు

గుజరాతు, సిక్కిము గోవ, మేఘాలయ లుంగరంబులుగా వెలింగె పంచ

హస్తాగ్రముల మధ్య, ఆంధ్ర ప్రదేశము కటిని వడ్డాణంబై కాంతులొప్పె ,

ఉత్తరా ఖండము నొదుగంగ చీరయై,రాణించె ఱవికయై రాజ పుత్ర

స్ఢానము,నా హిమాచలపు ప్రదేశము తిలకమై తళుకు లొందె లపనమున,

చత్తీసుఘడ్ చేర చంద్ర హారముగ  గళమున, మిజోరాము తమిళనాడు

కర్ణాటకము, తెలంగాణము కేరళ  ళంగులీయకములై రంగులొసగె

నొక్క హస్తమునందు ,యెక్కి పదముల పై మధ్యప్రదేశము, మణిపురములు

ఘనమైన రజతపు   గజ్జెలై వెల్గ, మహారాష్ట్రమున్, ఢిల్లి  నమరె కాలి

వేళ్లకు మెట్టెలై, వెలుగు చుండె భరత మాత విశ్వములోన   మహిమ తోడ,

సతతము కాల్పులు జరుపు  పాకిస్తాను సరిహద్దు వెంబడి, చైన దేశ

సైనికుల్ (నల్కుడి) జరుపుచు నుండగ కాశ్మీరము (నెగడి) కాలుచుండె,

(చొక్కుపొడి)ని తేలి  జోగాడు నాయకుల్ (మంజడి) దాల్చిన మాతృ భూమి

 

చీర నూడ దీయుచు నుండ భోరుమనుచు

నేడ్చు చుండె కాచమనుచునెత్త వలెను

హరి యొక యవతార మిచట తిరిగి యవని

పైన , కాపాడ దలచ నీ భరత భువిని

 

లపనము =  ముఖము

నల్కుడి  =    శబ్దము,నెగడి   =  అగ్ని గుండము

చొక్కుపొడి  =  మత్తు ,మంజడి =  చిత్ర వర్ణ వస్త్రము

భారత  భూమి భిన్న సంస్కృతిల నిలయము కాబట్టి  చిత్ర వర్ణము అని  ఎన్నుకున్నాను.

పూసపాటి

 

 

వచనం లో నా భావన

భిన్న జాతులు , సంస్కృతుల మణిహారం మన భారత దేశం !!

మేని రంగు ఏదైనా  దేశభక్తి నిండిన మనసులు

హరివిల్లులై వెలుగు నిచట !!

సైని కుడి ధైర్యము, కర్షకుడి స్వేదము

కార్మికుడి స్థైర్యము, కలసిన త్రివర్ణపతాకమే మన భారత దేశం !!

రే గడి మట్టి కూడా నేర్పునిచట సామ్యవాదం !!

శత్రువు ఎవరైనా వెరుపన్నది లేక పోరాడి

అల జడి అణిచే నేర్పుని నేర్పును మన భారతావని !!

మంచితనం మానవత్వంపరిమళించే పూల పు ప్పొడి

సుగంధం మన భారత దేశం !!

రమ

 

 

మూల స్తంభాలు

మన యావద్భారత దేశంలో కలరెందరో

మంచి ఆలోచనలు , సహాయములు అందించు కుడిభుజములు

 ప్రజలను ఉత్తేజ పరచగల గడికరణములు

ప్రజలకు ఉపయోగపడు కార్యక్రమములు ,

కార్యములను ఆలస్యములతో పొడిగించి, పీడించని వారు

ప్రజలలో జడిమను తొలగించి ఉత్సాహపరచు వారును

 వీరే కదా మన దేశ యశస్సును కాపాడుచు కీర్తిని

దశదిశలా పెంచగలవారును !

జి మురళీ మోహన్ రావు

 

 

కుడి, గడి, జడి, పొడి

భారత దేశపు గొప్పదనాన్ని వివరిస్తూ స్వేచ్ఛా ఛందములో

నెహ్రూ పటేలు కుడి ఎడమ భుజములై

తోడుండగ  మహాత్మా గాంధీ చేపట్టెను

భారత స్వారాజ్య మహోద్యమ ప్రస్థానం

అంగడుల నడుపు వాండ్ర నధికారమున్

పొడి పొడి జేసీ స్వాతంత్ర్యమున్ సాధించి

భరత మాత మనమున నలజడి మాన్పి

స్వేచ్చా జడి వాన యందు భారతీయుల

ముంచెత్తి జాతిపితగా నావిర్భభవించే.

CA కె మల్లికార్జునరావు

 

 

కుడి,గడి,జడి,పొడి..తో తేటగీతి

జన" కుడి" ఆజ్ఞలన్ నెరవేర్చు సత్య భూమి

అం" గడి" ని రత్న రాశుల నమ్ము భూమి

కన్ను" పొడి" చిన క్షమియించు గణ్య భూమి

వైరుల నెదిరింప " జడి" యని వీర భూమి

పరమ పావన మైన నా భరత భూమి.

డి.రామ నాగేశ్వరరావు

 

 

పొడి పొడి మాటల జెప్పక

జడియని ఘననాయ కుడి గ  జనులు పొగడగా

గడి పెను బ్రతుకు  స్వతంత్రము

గడియింపగ దేశమునకు గాంధీ వరుడే

ద్వారకానాథ్

 

 

వచన కవిత్వం

గడి, జడి, పొడి, కుడి

*******

గడిచిన కాలమునందున సమరపు అలజడినణచి

శాంతియుతమార్గమున పొద్దు పొడిచేలోపున

స్వరాజ్యమును సాధించిన నాయకుడిని కన్నభూమి

మనభరత భూమి.

హేమలత

 

 

కం"

గడియ గడియకొకపరి యల

జడి రేపెడి తలపులు విరజాజుల పూపు

ప్పొడి జడులు సఖి పిలుపుల

ల్కుడి మోహన రాగము హృది లోతుల దాకన్

వాణిశ్రీ నైనాల

 

 

సీ.

పొడిచేటి పొద్దులో పూర్వ దిక్కు జ్వలించు నటుల భారతదేశ మంకురించె

వేదభూమిగ నిల్చి విశ్వ మానవ జాతి కొలిచెడు యిలవేల్పు మలయుభూమి

పరులయల్కుడి విని పాటవంబువెలయిం చెడు ధీరులంగన్న శ్రేష్ఠ భూమి

ఉపఖండమను పేరు నుగ్గడించి పుడమి నందు వైశిష్ట్యం బొంది వెలుగు

గీ.

భరత భూమియిదె! కవుల పద్య రత్న

జడుల యందు పునీతమై, సమధికముగ

పుణ్య పురుషులం బ్రసవించి పుణ్యభూమి

నామధేయంబు గడియించిన సిరి సీమ

వెంకట్.సి హెచ్

 

 

కుడి, జడి , పొడి , గడి..... (  భారత వర్ణన... )

 ఉత్పలమాల....

 

భారత మాతయున్ మిగుల భద్రత నొందగ శాంతి మార్గమున్

చోరులు, శాత్రవుల్  జడిసి, శుక్రుడి జందము మాటువేయగన్

వీరులు, సైనికుల్  పగర పిట్టల భంగిమ గడ్డిబెట్టగన్

పోరున లొంగకన్, బలిమి పుప్పొడి కైవడి ద్రుంచునిట్టులన్ ....

 

శుక్రుడు.....రాక్షసుల గురువు...అంటే...శత్రు సైన్యానికి గురువు అనే అర్థములో వాడాను.

కుడి, జడి, పొడి, గడి....

 

 కందం...

జడియక , పొరుగున జిన్నా

గడియారం బొదలకుండ గాంధీతాతన్

కుడి యడమల సంధితలపు

పొడిమాటలు  జెప్పి దొరలు పోయిరి భీతిన్..

పి.ఎల్.నాగేశ్వరరావు

 

 

వచనం

కుడి వైపు బంగాళా ఖాతం,

జడివానల అస్సాం చిరపుంజి,

పొడి బారిన ఇసుక నేల రాజస్థాన్,

రత్నాల అంగడి గ పేర్గాంచిన సౌరాష్ట్రం,

భరతమాత విరాజిల్లు ధవళకాంతుల అను నిత్యం..

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి,

 

 

తేటగీతి

పాలకుడి ప్రాపు కోసము పరితపించి

గడియ గడియకు పలుమారు ఘనత పొగడి

అలజడేమాత్రమునులేక యాదరించి

సమత పొడిగించె డుద్యోగి సౌఖ్యమందు

ఆదిభట్ల సత్యనారాయణ

 

 

సీస పద్యములో

నలుదిక్కులైక్యత నెలుగెత్తి చాటగన్ భూరియై బుట్టిన పుణ్య భూమి

వేదవేదాంగముల్విరియగ వేదాంత సారముల్ వెలిగిన సత్య భూమి

యితిహాసములవి జీవితసత్యములబోధ చేయగన్ వెలసిన శ్రేష్ఠభూమి

జీవులన్నిటియందుదేవుడు గలడను భావముల్ విరిసిన దేవభూమి

 

గడియయైనను మరువక గతవిభవము,

జడియకనెపుడు నెదిరించి శత్రువులను

కుడి యెడమలెరుగక జనుల్ కూడియున్న

పొడియె నిత్యమై భారత భూమి వెలుగు

పొడి = న్యాయము

అవళూరు సీత

  

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...