15, మార్చి 2021, సోమవారం

పుస్తక సమీక్ష, శనివారము, 13-02-2021

 


శనివారము 13-02-2021

పుస్తక సమీక్ష

 

పుస్తకం : "లోయ నుంచి శిఖరానికి"

రచయిత : యండమూరి వీరేంద్రనాధ్  

సమీక్ష : కస్తూరి శివశంకర్

 

యండమూరి వీరేంద్రనాధ్ గారి కథలు, నవలలు, కథానికలు మరీ ముఖ్యంగా వ్యక్తిత్వ వికాసం అంశం మీద అందించే అపురూపమైన పుస్తకాలని చదవని వారు చాలా అరుదు అని నా నమ్మకం     

 

ఒక వెన్నెల్లో ఆడపిల్ల నుండి ఆనందోబ్రహ్మ వరకు,

థ్రిల్లర్ నుండి చెంగల్వపూదండ వరకు,

ప్రార్ధన నుండి చీకట్లో సూర్యుడు వరకు, ఎన్నో వేల  అంశాలని స్పృశిస్తూ, ఆలోచనా తరంగాల అలజడితో మనపై దాడి చేస్తారు యండమూరి       


నేడు మీకు పరిచయం చేయాలనేకునే పుస్తకం  "లోయ నుండి శిఖరానికి"  


"ధర్మో రక్షిత రక్షితః" అనే సూక్తి  విన్నారు కదా. అలగే "జ్ఞానో రక్షిత రక్షితః" అని నమ్మినవారు యండమూరి.

జ్ఞానాన్ని మనం కాపాడులుంటే అది మనల్ని కాపాడుతుంది అని బలంగా నమ్మినవారు

మానవజాతి విజ్ఞాన సోపానాలు కోసం అనుక్షణం ఏంతో విజ్ఞానాన్ని సమకూర్చిన మేధావులందరికీ ఈ పుస్తకం అంకితం చేస్తారు 🙇🏻🙇🏻🌟


ముందుమాట లోనే ఆయన ఏమి చెప్పాలనుకున్నదేదో స్పష్టంగా చెబుతారు.

మనిషికి జీవితం ఒక పుస్తకం. అయితే దాని ముఖ్యాశం కేవలం ఆనందం మాత్రమే అని చెబుతారు. అయితే ఈ ఆనందం  సంపాదించే ప్రస్థానంలో అప్పుడప్పుడూ Twists ఉంటాయి కదా అంటారు.. వాటి వెనకే విషాదాలు, ఆ ఏడుపు, భయం దగ్గర పుస్తకం చదవడం ఆపేస్తే ఎలా


మన పుస్తకం తాలూకు PROLOGUE భావుకత;

పుస్తకం INDEX : Being Romantic / Romanticism

Epilogue : ఆధ్యాత్మికత

 

ఉపసంహారం మాత్రం భవబంధవిముక్తి అని చెబుతారు

 

పుస్తకం చదూతుంటే ఎప్పుడో చదివిన  భర్తృహరి సుభాషితాలు గుర్తొచ్చాయి.

గొప్పవారు ఇతరుల అనుభవాల నుండి నేర్చుకుంటారు, సామాన్యులు తమ అనుభవాల నుండి గ్రహిస్తారు. మూర్ఖులు మాత్రం వేటినుంచి కూడా నేర్చుకోరు


జీవిత పుస్తకాన్ని నిర్లిప్తత అనే సాలె పురుగుల పాల్చేయ్యకు.

నీ పుస్తకాన్ని నీవే ప్రేమించ(లే)కపోతే ఇతరులు దాని వైపు కన్నీటీ కూడా చూడరు. ప్రతి రోజూ నీ పుస్తకాన్ని చదువుకో. ఎన్నో అచ్చుతప్పులు కనిపిస్తాయి. గత అనుభవాల సాయంతో వాటిని సరిదిద్దే వరకు నీ జీవిత పుస్తకం మరింత అందంగా తయారవుతుంది. ఈ ప్రక్రియ నే ఆత్మ పరిశీలన అంటారు.  


పుస్తకంలో అధ్యాయాలు ఉంటాయి కదా, అలగే నీ జీవితంలో అధ్యాయాలు ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి అధ్యాయానికి చదువు, సంపాదన, ప్రేమ, పెళ్లి, కుటుంబం లాంటి పేరు పెట్టండి. ఈ చాఫ్టర్లు విడగొట్టడం లో confuse అయ్యామో, అయోమయంలో పాడేటాము (ఉదాహరణకి చదువు అనే అధ్యాయం లో ప్రేమ , పెళ్లి లాంటివి ఎప్పుడూ కలపకూడదు)


బుద్ధుడు చెప్పినా, కృష్ణుడు చెప్పినా చెప్పడం వరకే కదా వారు చెప్పేది. వినడం ధర్మం. ఆచరించకపోవడం ఖర్మం


మనిషికి జ్ఞానం రావడమంటే అన్నిటి మీద, అందరి మీద ప్రేమ వదులుకోవడం కాదు, అన్నిటినీ, అందరినీ ప్రేమించడం (ప్రేమించగలగడం) . ఇంకా చెప్పాలంటే మునుపటి కంటే ఇంకా ఎప్పువగా ప్రేమించగలగటం.

 

ఈ దృక్పధంతో చూడడం మొదలు పెడితే రోజూ ప్రపంచమూ, మనుషులు ఎంత ఇష్టంగా కనిపిస్తారో.

ఇలా ప్రతి చోట మనిషి మేధకి, కళ కి అబ్బురపడడం మొదలుపెడితే, మనకు పక్కవాడిని చూసి అసూయ చెందాల్సిన అవసరం లేదు.

 

పుస్తకమే లో ఒక చోట ఆనందం - సౌకర్యం అనే మన రెండు విషయాలకు చక్కగా క్లారిటీ ఇస్తారు. సినిమా టిక్కెట్లు దొరక్కపోవడం, ఏకాంత లేకపోవడం, ప్రణాళిక ప్రకారం మీ విహార యాత్ర జరక్కపోవడం, కరెంటు పోయినప్పుడు దోమలు కుట్టడం,  బంధువులు వచ్చినప్పుడు విశ్రాంతి లేకపోవడం, పనిమనిష్ రాలేకపోవడం.. ఈ అన్ని విషయాలు మన ఆనందం పాడుచేయడం లేదు. మీకు నిజానికి చిన్న అసౌకర్యం కలిగిస్తున్నాయి                  

ఆనందం అనేది మన ఆలోచనా విధానంలో ఉంది తప్ప, ఏ ఒక్క వస్తువు, వ్యక్తి సంఘటనలో కాదు.. చిన్న సౌకర్యం దూరం అవడం వలన మనం ఆనందం ఎలా కోల్పోతాము. అకారణంగా ఆనందం కోల్పోవడం అనే విష్యం మన చేతుల్లోనే ఉంది  

 విదుర నీతి ఒక్కటి చాలు మనిషిని కుదురుగా ఉంచడానికి. ఆమూలాగ్రము చదివి వంటపట్టించుకొని సాధన చేస్తే ప్రతి మనిషి ఒక ఋషి అవుతాడు. సగం పాటిస్తే ప్రపంచ నాయకుడవుతాడు!

 కనీసం ఒక్క నీతి వాక్యాన్ని తన జీవిత ధ్యేయంగా మనుగడ సాగిస్తే మహామనిషి అవుతాడు!

 Modern Management book దీనికి సరితూగుతుంది.?

Moral values ,customs,systems అన్నీ కూలంకషంగా చర్చించాడా మహానుభావుడు.

విదురుడు ప్రాతఃస్మరణీయుడు .

 

నీతి పథంబునన్‌ బ్రదుక నేర్చుట యుత్తమ భంగి; శౌర్య సం

జాతములై కరం బలరు సంపద లొందుట మధ్యవృత్తి;

స్ఫీతములైన భారవహజీవనముల్‌ దలఁపం గనిష్ఠముల్‌;

నీతికి బాహ్యులైన, ధరణీవర! మెత్తురె వారి నుత్తముల్‌?


అన్నది విదుర నీతి.. చూసారా నేను ఎప్పుడూ చెప్పినట్లే, యండమూరి వారి పుస్తకాలలో అత్యద్భుతమైన నీటిని సాహిత్యాన్ని గోరు ముద్దలుగా అందిస్తారు    

మనిషి జీవితంలో ఇప్పుడున్న క్లిష్టత ఒకప్పుడు లేదు. తెలివితేటలూ పెరిగాయి. గెలుపుకి కొలమానం కేవలం డబ్బు, కీర్తి మాత్రమే అయ్యాయి. చిన్న కుటుంబాల్లో నిశబ్దం తాండవమాడుతోంది. పిల్లల బాల్యం ఛిద్రం చేయటానికి కర్కశ హస్తాలతో, కరాళ పాదాలతో, కార్పొరేట్ కాలేజీలు కదం తొక్కుతున్నాయి. ఇటువంటి పారిస్తుతులలో జీవితం గెలుపు నిర్వచనం తెలుసుకోవడం, పిల్లలకు తెలియచేయడం ఈ పుస్తకము ఉద్దేశం

 

గెలుపు కి భర్తృహరి నుండి నన్నయ్య వరకు, చానాకుడి నుండి వివేకానందుని వరకు ఎందరో మేధావులు చెప్పిన చిన్న చిన్న విషయాలని తెలుపుతూ మనకి పరిచయం చేసే పుస్తకమే యండమూరి "లోయ నుంచి శిఖరానికి" ..


***************************



హృది తానై, ఒడి తానై

బడి తానై, అన్నీ తానై, మలిచేది మగువ!


నింగి తానై, నేల తానై

అన్నిటా తానై, నిలిచేది మగువ!

 

తాపం తానే, త్యాగం తానే

తపస్సు తానే, తనంటూ గుర్తింపు మగువ!

 

ఓర్పు తానే, సహనం తానే

కాళికా తానే, తనే ఒక సైన్యం ఓ మగువ!

 

(జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా)

 

కోవూరి

 

 

ఉప్పెన

 

నిదానించిన సంద్రం

ప్రకాశిస్తున్న చంద్రుని వెన్నెలలో

వెలుగులు చిమ్మే నక్షత్రాల వెలుగులో

గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది

తనలో ఇమిడే తనలో కదిలే తరంగాలు హోరు

జారే ఇసుక కదిలే నడక

పలుకరించే నురగ నిదానించే సంద్రం

అనూహ్యంగా ఉగ్రమైంది రూపం కాకావికలం

నేస్తం నిస్తేజం ఊసులకు నెలవైంది

ఇప్పుడు ఊపిరి తీస్తుంది

"ఉప్పెనై" ఉగ్రరూపం దాలుస్తుంది

కలలు కనే కన్నె మనసులకు

తీరం దారై కన్ను కాయక ఎగిసే రాకాసి

అలలే కబలిస్తున్నాయి పెద్ద చేతులై

ఎదుర్కొలేని చిన్నప్రాణాలు

ఉసురుతీసుకున్నాయి

సంద్రానికి ఎల్లలు లేవు

మనసుకు ఊపిర్లు లేవు

 

కోవూరి

(ఉప్పెన సినిమా ట్రైలర్ కు నా స్పందన)

మగువ

పేగు పంచి జన్మనిచ్చి తల్లి కాగలదు మగువ

దురితుల పేగులు పెకలించే శాంభవి కావలెనతివ

బిడ్డ నల్లారుముద్దుగా పెంచు అమ్మ కాగలదు మగువ

అసురుల అధఃపాతాళానికి తొక్కు కాళిక కావ లెనతివ

భర్తను మురిపాల తేలించు రంభ కాగలదు మగువ

కామాంధుల కాలరాయు జగదంబ కావలెనతివ

యముని మెప్పించి పతి ప్రాణములు తిరిగి తెచ్చినది మగువ

జాతి గర్వించదగ్గ పిల్లలను తీర్చిదిద్దవలెనతివ

వ్యోమగామియై అంతరిక్షమున విహరించ గలిగింది మగువ

స్వేచ్ఛా జీవియై ఆశల సౌధముల నందుకోవలెనతివ

కష్టాల కడగండ్ల కోర్చి భూమాత కాగలదు మగువ

పురుషాహంకార జాడ్యాన్ని  చెండాడు త్రిశూలం కావలెనతివ.

 

వాణిశ్రీ నైనాల

 

  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...