13, మార్చి 2021, శనివారం

పుస్తక సమీక్ష, 06. 02. 2021, శనివారము

 


06. 02. 2021 శనివారము

 పుస్తక సమీక్ష

బాగా నచ్చిన సాహిత్యం మీద మీ అభిప్రాయలు, ఔత్సాహికులు సమీక్షలు పంచుకోగలరు.

*****************

కాలములతో  కబుర్లు

భూతకాలము :

 రాము గతంలో నువ్వు  పడిన కష్టాలు , నీకు కలిగిన సంతోషాల గురించి , పొందిన లాభముల గురించి వూరికే ప్రస్తావించకు. 

 

 వర్తమాన కాలము :

 దినచర్య సరిగ్గా చేయగలుగు చున్నామా , అనుకున్నవన్నీ

సమయానికి సవ్యంగా అవుతున్నాయా ,ఇంకా ఏమైనా పనులు

మిగులుతున్నాయా అని ఆలోచించుచూ ఆ రోజు పనులు ఆ రోజే చేసుకోవాలి నాయనా. గడువుంది కదా అని కాలాన్ని వృధా  చేయకురా !

 

భవిష్యత్తు కాలము :

 నేను మీకు కారు కొనిపెడతాను ,పెద్ద ఇల్లు కట్టిస్తాను ,

విమానాల్లో ఊళ్ళు తిప్పుతాను అనే కబుర్లు చెప్పకురా .అవన్నీ ఇప్పుడెందుకురా అని బుజ్జగిస్తున్నారు

వాడి అమ్మానాన్నలు .

 

తద్ధర్మ కాలం :

ఇందులో ఆశ్చర్యం ఏముంది శర్మ .పక్షులు ఎగరడం , మావాడు ప్రతిరోజూ

శ్రద్ధగా చదువుకోవడం , మనిద్దరం పొద్దున్నే నడుచుకుంటూ కాసేపు యోగా కూడా  చేయడము సహజమేరా శర్మా !

 జి మురళీ మోహన్ రావు

 

 

అంశం....బిడ్డడు రాత్రి పడుకునే ముందు,తల్లి లాలన..

ఆటవెలది..

అమ్మ చేతి ముద్ద నారగించగ బిడ్డ

యొదిగి, మురిసి, తల్లి యొడిని జేరు

జోల పాట పాడి జోకొట్ట ప్రేమతో

కన్న ప్రేగు కనుల కాంతులీను..

పి.ఎల్.నాగేశ్వరరావు

 

 

ఈ రోజూ దీపావళి కాకపోయినా ఎందుకో బుడుగు మరీ అల్లరిపెట్టేశాడు నేనూ దీపావళి గురించి ప్రైవేటు మాష్టార్ల గురించి చెబుతాను అని . సరే వాడి సరదా ఎందుకు కాదూ అనాలి తీసుకొచ్చేశాను.

 

బుడుగు సంగతి మీకు తెలియంది ఏముంది ? వాడు అందరినీ వాడు వీడు అదీ ఇదీ అనేస్తాడు .

కొంచెం ని కుంచెం అంటాడు

చంటి వెధవకదా కాస్త సర్దుకుపోయి వాడి ముచ్చట్లు వినండి 

 మేష్టార్లతో వేగడం.  అబ్బాబ్బ !  ఈ మేష్టార్లని ఉంటాయే ,

వాటితో వేగలేక పోతున్నానురా . చాలా కుంచెం కష్టమన్నమాట.

వేగలేకపోవడం అంటే ఓసారేమో అమ్మ సినిమాకేల్లిందని, బామ్మ గుళ్ళోకెళ్లింది కదా అప్పుడు

మా గోపాళం వంట చేశాడు గదా . అప్పుడేమో కంద ముక్కలూ , వంకాయలూ 

కలిపి వేయించాడా , పాపం వంకాయేమో చప్పున వేగి పోయింది

కంద వేగలేదుట. అందుకనేమో వంకాయేమో – అబ్బా కందా ,

నీతో వేగలేక చస్తున్నాను అందిట . అప్పుడేమో కంద మా నాన్నకేసి చూసి కాదులే , వీడు చూడు నన్నూరికే వేపుకు తినేస్తున్నాడు అందిట . ఇలా అని  మా నాన్న చెప్పాడు .

నాన్నేమి చెప్పినా మళ్ళీ అవి మనం చెబితే ఆయాసం వస్తుంది.

నవ్వుకుడా రాదు.  కానీ నాన్నేమి చెప్పిన అమ్మకి నవ్వొస్తుంది  మనం చూడనప్పుడు ఉత్తినే నాన్నని చూసినా అమ్మకి నవ్వొస్తుంది.

అమ్మ పాపం మంచిది అనుకో యేం .... యిప్పుడీ మేష్టారు అలాగన్నమాట  

ఈ మేష్టర్లు రొండురకాలు గదా !

 

ఒకటి మామూలు  మేష్టర్లు( బుడుగు లెక్కలో ఒకటి తరువాత అయిదే వస్తుంది ) ఐదు ప్రైవేటు మేష్టర్లు.  ప్రైవేటు మేష్టర్లే  కుంచెం మంచివి ( బుడుకుకి నామవాచకాలు వాటితో కూడా పెద్దగా పరిచయం లేదన్నమాట ) 

మనకి అప్పుడప్పుడు నెత్తిమీద వీపుమీద ప్రైవేట్ చెప్పినా మనం గాఠిగా ఏడిస్తే బామ్మోచ్చి తిడుతుంది గదా !


అందుకని మనం అంటే కుంచెం చాలా బయ బత్తులుట .....  బయ బత్తులంటే నాకు తెలీదు ఆలాని బామ్మంటుంది భావుశా ఆగరొత్తులో , బాబాయి కాల్చే సిగరొత్తులో అయుండొచ్చని నాక్కుంచెం అవమానం (బుడుగు భాష లో అనుమానం )సాధార్నంగా ఈ  మేష్టర్లకి ఏం తెలీదు పాపం. పెద్దాళ్ళనడిగితే కోప్పడతారని బయం . అందుకే బడి అని ఓటి పెట్టి మన్ని అడుగుతారన్న

మాట . మనం అక్కడ పాపం చెప్తామా

 

వాళ్ళకి పాఠాలు రావుగదా . అప్పుడేమో ప్రైవేటు మేష్టారి వేషం వేసుకుని మానింటికొచ్చి వురేయ్ బుడుగూ రెండూ రెండూ ఎంత ? అని అడుగుతారు .

ఇంకనేమో సీరాముని  దైచేతను పజ్జెమ్ చెప్పమ్మా ! అని యిలా ఏడుస్తూ అడుగుతారు . ఇక్కడ నేర్చుకున్నా మర్చిపోయి మళ్ళీ బళ్ళో అడుగుతారు పాపం మనం చెప్తామా . వినరు రెండు రోళ్ళు పద్నాలుగు కాదు నువ్వు అబద్ధం చెప్పుతున్నావు నిజం చెప్పమ్మా అంటారు పోనీ అని మనం ఏడు అంటామా అదీ నిజం కాదు అంటారు.

 

మొన్నో రేపో దీపావళి అంటే ఏంట్రా అని ఒక ప్రైవేట్ మేష్టారు అడిగాడా ...

వీడు పాతవాడు లే  చిన్నప్పుడు

నా దగ్గర     పనిచేశాడు .

చాలా ఐదు

రోజులయుంటుంది. నిన్న కొత్తవాడొచ్చాడా వీడూ అడిగాడు . పాతవాడికి చెప్పనురా వెళ్ళి వాడినడుగు లేకపోతే మీ నన్ననో బాబాయినో అడుగు .

మా బాబాయిని మాత్రం అడగొద్దు .

ఎవరెనా రెండు జళ్ళ సీతలు అడిగితేనే చెబుతాడు .

సీతలు అడిగితే పదమూడో ఎక్కం కూడా చెబుతాడు అని చెప్పాను . కాదమ్మా బుడుగూ నువ్వే చెప్పమ్మా అని ఏడ్చాడు  మేష్టారు . మా బామ్మ నడిగి బెల్లమ్ముక్క పెడతాను ఏడవకమ్మ అన్నాను కాదమ్మా చెప్పాలి నిన్న చెప్పనుగా బళ్ళో అదే చెప్పు అన్నాడు . చూశావా పచ్చి నిజం కాదది బళ్ళోకూడా వాడే నన్నడిగాడు. నేను పోయి గదా అని చెప్తే రౌడీ వెధవా అని తిట్టి నెత్తిమీద ప్రైవేటు చెప్పాడు అప్పుడేమో నేను గాఠిగా ఎడిచేశా .

 

బామ్మోచ్చి ప్రైవేటు వాడికి   గాఠిగా ప్రైవేటు చెప్పేసింది . అప్పుడేమో పాపం బాబయోచ్చి అన్న బామ్మా అని బామ్మకి ప్రైవేటు చెప్పేసాడు .

 

నాన్నోచ్చి వెధవకానా అమ్మని ( దీన్నే కొందరు బామ్మంటారు) కొడతావా అని బాబాయికి  ప్రైవేటు చెప్పేసాడు.

 అప్పుడు బామ్మెమో అన్నా కుర్రవెదవ వాడినేందుకు తిడతావురా అని నాన్నకి ప్రైవేటు చెప్పేసింది .


అప్పుడేమో అమ్మొచ్చి ఉరేయ్ గోపాళం నూవ్విలా రండి అని గదిలోకి వచ్చి నాన్నకి ప్రైవేటు చెప్పేసింది .

పాపం ప్రైవేటు మాష్టారు హడలిపోయి పారిపోయాడు .


అపుడేమో పక్కింటి పిన్నిగారి మొగుడు యిలా నవ్వుతూ వాచీ ఏరా బుడుగూ మీ యింట్లో ఇవాళే దీపావళా అన్నాడు . అదన్నమాట దీపావళి అంటే పేలవడం .

అందరూ గాఠిగాప్రైవేట్లు చెప్పేసుకుంటే దీపావళి అంటారుట. ఇలాని బాబాయి కూడా చెప్పాడనుకో కానీ ఇలా అయితే మా యింట్లో నూ పక్కింటి లావుపాటి పిన్నిగారింట్లోనూ మీ యింట్లోను సినిమాల్లోనూ పేపరులోనూ (ఇవన్నీ బాబాయి చెప్పాడు ) రోజూ దీపావళి పండుగే అవుతుంది గదా  అందుకని శ్రీకృష్ణుడు ఇంకో దీపావళి పెట్టాలి . పాపం అయంకి వెయ్యి డబ్భై పది  యిళ్ళున్నాయట కదా .ఎక్కడికెళ్లినా రోజూ ప్రైవేటే అంధరికన్నా సత్యభామ గాఠిగా  ప్రైవేటు చెప్పేది కదా . అందుకని ఏడాది కోసారేనా యింట్లో దీపావళి పండుగ ఆపేసి

ఆ చప్పుళ్ళు వినబడకుండా యింకా గా ఆ ఆ ఠి గా చప్పుడు చేసే టపాకాయలు పేల్చాలని అదే అసలు దీపావళి అని కృష్ణుడు చెప్పడన్నమాట.బాబాయి యింకేదో పిచ్చికధ చెప్తాడనుకో  ఆ రోజూ రెండుజెళ్ళ సీతలంతా గుమ్మంలోకొచ్చి టపాకాయలు కాలుస్తాయి యించక్కా నవ్వుతాయి . మనం వాళ్ళని చూస్తూ రోడ్డు మీద వెళ్లొచ్చు అప్పుడేమో రెండుజెళ్ళ సీతలంతాదీపాలులా వెలుగుతాయి అందుకని దీపావళి  హమ్మయ్య అని చెప్పాడు బాబాయి.  బాబాయి మొహం వాడు ఏ పండగ అడిగినా ఇలాగే చెప్తాడు . అట్లతద్ధికీ సీతలే – దసరాకీ సీతలే- సంకురాత్తి రికి సీతలే- భోగిమంటకీ సీతలే అన్నింటికీ సీతలే వాడికి . అంతెందుకూ , మొన్న దేవుడి గుళ్ళో కెళ్తున్నానా నేనూ వస్తారా అని ఎడిస్తే బాబాయిని తీసికెళ్లనా ఎవరో వచ్చి నువ్వేందుకురోయ్ అంటే రెండుజెళ్ళ సీత ఉంటుంది గదా అన్నాడు .

నేనూ హాచెర పడి పిచ్చి బాబాయి గుళ్ళో దేవుడుంటాడురా రెండుజెళ్ళ సీతలు కావురా పిచ్చాడా అని చేప్పనా వాడు మళ్ళీ గా ఠి గా నవ్వేసి పిచ్చి వెధవా నా కళ్ళు పెట్టుకు చూడరా నీకు గుళ్ళోనూ , రాయిలోనూ , రప్పాలోనూ రెండుజెళ్ళ సీతలే కనిపిస్తారు అన్నాడు .

నేనూ వాడి కళ్ళజోడు పెట్టుకుని చూశాను సీతా లేదు పితా లేదు. అస్సలేమీ కనిపించలేదు. మేష్టారు మనికి గుండుమీద గాఠి గా ప్రయివేటు

చెప్పినప్పుడు ఏం కనిపిస్తుందీ అలా వుందన్నమాట .

ఏం చేస్తాం బాబాయి కర్మ అసలు వాడెప్పుడూ ఇంతే .


దీపావళి గురించి  కదూ మీకు చెబుతానన్నాను. ఏమిటో నాకు వయసైన కొద్దీ మతిమరుపు ఎక్కువైపోతోందమ్మ (ఇలా అని మా బామ్మ అంటుందిలే )

 

దీపావళి కేమిటంటే

 (బుడుగు అంకెలు ఇలాంటి వరుస క్రమంలోనే ఉంటాయి మరి )

  డైబ్బై :టపాకాయలు బాగా కాల్చాలి

 పది : అవి బాగా వినబడాలి అంటే ముందస్తుగా రేడియో మూసేయ్యాలన్న

మాట

 వెయ్యి : నీకు నాన్న మీద బాబాయి మీద కోపం వుండి కదా అలాంటప్పుడు సీమ టపాకాయల గుత్తి అంటించి గాఠి గా తిట్టెయ్యి నిన్నెం చెయ్యరు  లావుపాటి పక్కింటి పిన్నిగారి మొగుడికిది చెప్పాను. వాడు ఏడాదేడాదీ ఇలాగే చేస్తాడు .

 నాలుగు : బాబాయిగాళ్ళకి చెప్పాలి మతాబాలు కాలుస్తూ

రెండు జెళ్ళ సీతల్ని చూడకూడదు ( ఇది మరీ మహత్తరమైన సూచన )


బామ్మలు తాటాకు టపాకాయలు ఎక్కువ కొనమంటారు . వీటిని పేలకపోతే రేపు కడిగి  నాలిక గీసుకోడానికి వాడవచ్చును .

రమ

 

 

పొట్టి చొక్కా తోడుక్కొని

నా పాటికి నేను కర్రా బిళ్ళా

ఆడుకుంటుంటే సగం కోత కోసి

దీక్ష చేయటానికి వెళ్లిన అయ్యని

ఏకరువు పెడుతున్నా.......

ఏవో చట్టాలు

చుట్టపు చూపు కాస్తయంటూ

అలుపెరుగక కొనసాగే ఉద్యమాలు

ఎర్రకోటను తాకితే

ఎర్రబడ్డ రైతన్న ముఖం

నిజానికి అబద్దానికి తూకం వేస్తే........

నేను నిలుచున్న నేల సాక్షిగా

ఆయుధమై పంటను రెండింతలు పండిస్తా

నా కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి.......

నిజాన్ని నిగ్గు తెలుస్తా

నా ఉసురు నిలుపుకుంటా.......

కోవూరి

 

 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...