05.02.2021, శుక్రవారం..
తెలుగు తేనియలు - దత్తపది 75
"అల - కల - వల - నెల"
పై పదాలను అన్యార్థంలో/స్వార్థంలో గానీ ప్రయోగిస్తూ రామాయణార్థం/భారతార్థంలో గాని మీకు నచ్చిన ఛందంలో పద్యం/వచన కవిత వ్రాయండి.
దత్తపది : అల, కల, నెల, వల
నేను వ్రాసిందియతులు, గణాలు లేని చిన్న కవిత...
నెలవంకను సిగయందు నిలిపి
ఫణులే భూషణములుగా అల రారుచు
పులిచర్మాంబరము కలవాడైన
శివుని వలచెను గిరిజ.
హేమలత
దత్తపది : అల, కల, నెల, వల
అయ్యయ్యో
కలల అలలతో కనుగొంటి వలపన్ని
వలసిన వన్నీ సమకూర్చితి
ఇక నెలకొల్పెద అధికారము
చూపెద నా అమలు శక్తి
వారు అల నుండి హడలి పారిపోవు వరకు .
×××××××××××××××××
అకటా, మెలకువతో చెదరి పారిపోయే నా మధుర కల !
జి మురళీ మోహన్ రావు
దత్తపది : అల, కల, నెల, వల
రామాయణ పరంగా తేటగీతి.
" అల" వరములకై కైకేయి ఆగ్రహింప
" వల" వల దశ రథుం డేడ్చి" కల" ను గూడ
రాము " నెల" రాజు వీడగ బ్రతుక లేను
పట్టు వీడు మనుచు మ్రొక్కి పలికె నపుడు.
డి.రామ నాగేశ్వరరావు
దత్తపది : అల, కల, నెల, వల
కందం లో నా చిరు ప్రయత్నం
అల లై ఎగసెడి స్మృతిలో
కల లో చూసిన కలువల కాంతుని దీప్తుల్
వల చిన వారెదురవగా
నెల తల కన్నుల మెరియును నిర్మల కాంతుల్
దత్తపది : అల, కల, నెల, వల
తేటగీతి
అల క దీరిన నవ్వులే హరువు లవగ !!
కల త మరిపించు ప్రేమతో కనులు కలిపి !!
వల పు బాసలు నేర్పేటి ప్రణయ రాశి !!
నెల త తా నవ్వ నాహృది నిండి పోయె !!
రమ
దత్తపది : అల, కల, నెల, వల
కం"
అలకన్బూనిన బ్రేయసి
వలచిన సఖుని విదిలించ వంకలు వెదకన్
కల చెదరగ నాగడములు
నెలరాజుకు విన్నవించె నెచ్చెలి విరుపుల్
వాణిశ్రీ నైనాల
దత్తపది : అల, కల, నెల, వల
కలల రాకుమారుని గాంచి కలవరమున
హరువు నొందిన హృదయమ్ము యలజడులను
రేపి, వలపు సుమములు విరియగజేసి
మొలక నవ్వుల వెన్నెల తొలకరించె
అవళూరు సీత
దత్తపది : అల, కల, నెల, వల
కలనైనా కలవరమందైనా
నా ప్రేయసి అలకల చిలకే
వలపు బాణముల సంధించి
వన్నెల చిన్నెల కులుకుల్జూపి
సతము మృగతృష్ణగా దోచు
అందని ద్రాక్ష వలె కనిపించు
అయినను పట్టును వదలక
తననే కోరవలయు నన్పించు.
CA కె మల్లికార్జునరావు
దత్తపది : అల, కల, నెల, వల
తొలి ప్రణయ భావముగా ప్రయత్నం
సీ.
తొలి వలపు జడిలో కలవరపు మదితో కలికిచిలక చెంత పులకరింత
కలుగంగ, యలజడి తలపుగ చెలికాడు నెయ్యము తెలుపంగ, నెలత మదిన
సిగ్గు తెరలమరి చెక్కిలి కెంపులై తులకరించి రహిగ చెలి సరాగ
మాలపింప, సఖుడు హ్లాదకుడై వెన్నెల తునకగ మెరిసి రమణ మొందు
తే.
పరవశ మొనరించెడు తొలి ప్రాయ మందు
చిగురులు తొడిగెడు వలపు చిలకరించు
చెలువ మంత లావణ్యమై వెలుగు లిడగ,
ప్రణయ భావము మనసున పరిఢవిల్లు
వెంకట్.సి హెచ్
దత్తపది : అల, కల, నెల, వల
తేటగీతి లో...
అలతి పదముల కొలిచిన ఆదరించి
కలత బాపెడు రాముడే కనుల ముందు
వలచి నిలచిన తరుణమున్ పదిలముగను
నెలకొలుప జూడదా మరి నేల పట్టి!
జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి
దత్తపది : అల, కల, నెల, వల
1) కందము
అలతిగ ధనువును విరువగ
కలవరపడి జనకపుత్రి కాంచెన్ రామున్
వలచిన పతి తనకౌనని
నెలతకు సంభ్రమముగాగ నిజముగ మదిలో
2) సీసము
అలనాడు శ్రీ రాము నాజ్ఞాను సారంబు నంబుధి లంఘించి యనిల సుతుడు
అలవోకగాఁ జేరి యాలంకిణిం గూల్చి కలవర మొందుచు కపి వరుండు
అంతిపురములోన నంతటఁ వెదకుచు కలతనొందె నెచట గానరాక
పురముకా వలనున్న పొంతన కాంచెను చింతించు నెలతను సీతనచట
రాముడు త్వరలోనె రాగల డనియును రావణు పరిమార్చు రణమునందు
యనినుడివిభూమిజ నిజ యార్తిఁదీర్చి
అంగుళీయక మిచ్చె తాననిల సుతుడు
సంత సమ్మున జానకి స్వాంత మందు
దీవనలిడెను హనుమకు భావమందు
ఆదిభట్ల సత్యనారాయణ
దత్తపది : అల, కల, నెల, వల
వచనం,
సకల సద్గుణ రాసి, దేవ దేవుని వలపుల రాణి, రుక్మిణి
ఆలరించగ వచ్చె,తన పతిని
నెలరాజు సందిట...
గాంగేయ శాస్త్రి, రాజమండ్రి
దత్తపది : అల, కల, నెల, వల
ఉప్పెన
నిర్మల ఆకాశం
ఒక్క ఉదుటున మారింది
కరి మబ్బులు కాటు వేసే నాగులా మారాయి
దూరానా తీతువు పిట్ట కూత వేయటం మానింది
ఆగాధం పెంచి ఆయుష్సు తీయటాని వచ్చింది ఉప్పెన
ఇద్దరి మనసుల మధ్య తీరమై సుదీర్ఘమైంది
మాటల కందని భావమై విస్తృతమైంది
కోవూరి
దత్తపది : అల, కల, నెల, వల
తేటగీతి...
అలక పాన్పున భామయె యలరుచుండ
కృష్ణ పరమాత్మ , వలపుల తృష్ణదీర
కలల రాణిని బంధించె కౌగిలింత
నెలత మురియగ ముదముతో కలతదీరి....
పి.ఎల్.నాగేశ్వరరావు
దత్తపది : అల, కల, నెల, వల
అలకల వలయందొగ్గిన నెలత నెగులు
చెరుప వచ్చిన సూరిని చెంత జేర
నీయక కినుకులాడుచు నీలవేణి
మాధవుని శిరముకడ పాదమొగ్గె
గౌరీనందన్, బెంగుళూరు
దత్తపది : అల, కల, నెల, వల
కలనలలు చెదరి లలన కనులు మెరయ
దనదు మనమున మెదలెడి దయిత వలపు
వలలు కనులన నిలువగ వలచిన ప్రియ
నెలత నెలకువన నిలచి నిజుడలరెను.
సూరే వెంకటప్పయ్య.
13, మార్చి 2021, శనివారం
దత్తపది 75, "అల - కల - వల - నెల" 05.02.2021
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము
15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు దత్తపది : హిమము , సుమము , సమము , భ్రమ...

-
" ఆముక్తమాల్యద" ఈ పేరే ఎంతో అందంగా , హుందాగా ఆసక్తిగా వినిపించేది ఎప్పుడూ " ఆ .. ముక్త ... మాల్యద " అంట...
-
అమ్మ చేతి గోరుముద్దు శుభోదయం తమ్ముడడుగంగ తమ్ముని ధ్వజము పైన జేరి సాయమున్ ఘనముగా జేసె నాంజ నేయుడు రణరంగమునందు నెమ్మి తోడ భూతినిడు శుభోదయ...
-
03 - 12 - 2020; గురువారము చిత్రానికి పద్యం - 70 శీర్షిక : ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలు రాయల వారి కీర్తిని , వైభవాన్ని వర్ణి...
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి