16, మార్చి 2021, మంగళవారం

13 03 2021 శనివారము, పుస్తక సమీక్ష , స్వేచ్ఛా సమర్పణలు

 


13 03 2021 శనివారము, పుస్తక సమీక్ష , స్వేచ్ఛా  సమర్పణలు


 

ఒంటిచక్ర రథము ద్రోయ నుర్వికదల

నలుపు మరువ నహోం!యంచు పులుగుపాడ

సప్తసప్తిని ప్రేమార స్వాగతించ,

మత్తువిడి నీవు తెరువుమా మనసు తలుపు

భావం: సూర్యుని రథం తోయడానికి భూమి కదిలితే, అలుపు తెలియకుండా అహోం అహోమ్ అంటూ పక్షులు పాడుతున్నాయట. ఏడు గుర్రాల రథాన్ని ఎక్కి వచ్చే సూర్య భగవానుడిని మత్తు వదిలి మనసుతో  స్వాగతించుము.

వాణిశ్రీ నైనాల


 

హాయిగా.. తృప్తిగా,,

కావలసినంత, , మితంగా,.. తిందాం,. తరవాత 60,.65..70. 80...90 కి ఎప్పుడు అయినా పోదాం...

ఈకాస్త దానికి,. ఎందుకు ఇంత తపన, తాపత్రయం , అంతులేని ఆరాటం ???

 

రండి..ఇది చదవండి....

కొర్రలు, అరికలు అంటూ గడ్డి గాదం తిని .. 100 ఏళ్లు బతికితే ,.

మనల్ని గుర్తుపట్టే మనిషి ఉండొద్దా...

మనవాళ్లంతా  50...60 కే పోతే.. మనం మాత్రం  ఉండి ఏం చేస్తాం ?

ఎప్పటికప్పుడు.. update అయిపోయిన లోకంలో పక్క వాడిని పలకరించే సమయం లేక....

... బిజీ అయిపోయిన మనుషుల మధ్య ...

 మన మొహం కూడా తెలియని ముని మనవలు మనవరాళ్ల మధ్య ఉండి  ఏం చేయాలి ?

 బతికి ఉన్నా..... డబ్బు  ఖర్చు... మనం సంపాదించలేని స్థితిలో ... మనమీద అంత ఖర్చు  పెట్టేది ఎవరంట

 

మనమే మన్నా టాటా...అంబానీలమా వేల కోట్లు ఉండి బతికినంత కాలం  ఖర్చు పెట్టుకోడానికి ?? 

 

అయినా ఆ మాటకు వస్తే ... ఈ కొర్రలు అరికలు ...  వీటికంటే ముందు ... అసలు మొదటి మానవుడు ...

పచ్చి మాంసం తిని... అప్పుడే చంపిన జంతువు వేడి రక్తం తాగి బలంగా ఆరోగ్యంగా బతికాడు ..

అని చెబితే ఎలా ఉంటుంది .

 

కాబట్టి అతిగా ఆరోగ్యంగా ఉండాలని ఆలోచించొద్దు... అలాగని పూర్తిగా అశ్రద్ధ  చేయొద్దు.

ఉన్నంతలో కాస్త తక్కువ తినడం .. ఎక్కువ పని చేయడం..

ఏదైనా  వ్యాయామం క్రమం తప్పకుండా చేయడం సరిపోతుంది.

ఆనందంగా ఉండటం, ..  స్ట్రెస్ ని దగ్గరికి రానీయక పోవడం.. నచ్చిన కళ..హాబిని సాధన చేయడం  మరవకూడదు.

ఆనందమే ఆరోగ్యానికి మూలం.

30 రూ. 40 రూ ల బియ్యం కొనుక్కునే స్థోమత కలిగిన ఇండియాలో... 200 రు. కిలో వున్న ధాన్యాలని కొనిపించి , తినిపించగల తెలివి డైట్ రూపం లో ఎలా స్కాం చేస్తోందో చూడండి.

ఒకప్పుడు నీరసం గా రసాలు తాగమనే మంతెన...  మొన్న నూనె ని తాగమన్న వీరమాచినేని...

ఇప్పుడు అన్నాన్నే మానేయమంటున్న షేక్....

 

ఎవరి టైం వారిది. ఎవరి సంపాదన వారిది. కాని మన ఆరోగ్యం మనదే.

ఎప్పటికీ అన్నం , పప్పు... కూరలు.. మాత్రం మానకండి. హాయిగా పచ్చళ్ళు, చార్లు, పులుసులు తినండి.

మన దగ్గర పారుతున్న నది మనకి జీవనది.

అలానే మన దగ్గర పండే ఆహారమే మనకి జీవశక్తి.  మంచిగా వుండండి. హాయిగా తిని ప్రశాంతంగా నిద్రపోండి...

సర్వే జనా సుఖినోభవంతు...   లోకా సమస్తా సుఖినోభవంతు

 

 

స్వేచ్ఛ సమర్పణ-

ఆకలి

వేదాంతము కల్గించు ఆత్మానందం

సంగీత నాట్యము లిచ్చు  విషయానందం

ప్రియ సఖి చెంత నించు నిత్యానందం

ఆ నందములెల్ల ఆకలి ముందు అల్పం

CA కె మల్లికార్జునరావు

 

 

నీరెండ

కనులకి నువ్వు కాటుక అద్దితే

నల్లని మేఘం కురవదా!

నల్లని మేఘం కురిస్తే

వెండి ఆకాశం మెరవదా!

 

నీ నవ్వుకి బుగ్గకి చొట్ట పడితే

అలక తీరిన నా అధరం నవ్వదా!

ఆ అధరమే నవ్వితే

నిండు జాబిలి వెన్నెల కురవదా!

 

ముక్కుకు ముక్కెర కుడితే

చిన్న పిల్లలా నువ్వు గుక్కపెట్టలేదా!

గుక్కపెట్టిన నిను చూసి

అరచేతిలో నున్నటి లడ్డు పెట్టలేదా!

 

అట్లతద్ధికి నువ్వు ఊయల ఎక్కితే

నువ్వు ఊగే ఊయల నా గుండెను ఊపలేదా!

వేగంగా ఊగే నిను చూసి

సంధ్య వెలుగులో దీపం నవ్వలేదా!

 

నా ప్రతి అడుగు మరి మరి నిన్నడుగు

నే చూసే ప్రతి చూపు మరి మరి నిన్నే చూడు

అర్ధమయ్యేలా చెప్పనా మరి మరి మరలా చెప్పనా

తోడులా నీడలా నీరెండలా నిన్నంటి వుండనా!

కోవూరి

 

 

  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...