సమస్యా పూరణం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సమస్యా పూరణం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, మార్చి 2021, మంగళవారం

పూజ్యనీయుల దూషణ పుణ్యమొసగు 10.03.2021, బుధవారం

 


10.03.2021 బుధవారం

సమస్యా పూరణం

తేటగీతి పాదం.... పూజ్యనీయుల దూషణ పుణ్యమొసగు

 

కంద పాదము .. .. .. పూజ్యుల దూషణ మెపుడును పుణ్యం బొసఁగున్

 

సభ్యులు మీ మనోహరమైన పూరణలు అందించవలసినదిగా మనవి..

 

 

జుంటితేనె కొరకు ఝుమ్మను దుమ్మెద

స్వనము వీనులజేర స్వాగతముగ

లేగల కొరకు తల్లి పొదుగు చేపుల

తానమాడగ నీవు తరలి రాగ

బువ్వకై వెదకెడి గువ్వల కువకువ

ల్మేల్కొల్పుగా తల్చి మిడుకుపడుచు

మత్తు వదలినట్టి మానుష హళహళి

నంశుమాలికి మొక్కు నార్తి యనుచు

 

నల్పసంతోషివి కద నీవంబరమణి!

యమ్మ యొడిని వీడగ మేటి యంగలిడుచు

నాతురత నురుకుపరుగు నరుగుదెంచ    

మేలుగూర్చునీకు సతము కేలుమొడ్పు

 

భావం: జంటి తేనె కోసం తుమ్మెద ఝమ్మంటే స్వాగతంగా తలుస్తావు. లేగదూడ కోసం తల్లి పొదుగు పాలు చేపితే నువ్వు స్నానం చేయడానికి వస్తావు. గువ్వలు ఆహారం కోసం కువకువలాడితే నిన్ను పిలుస్తున్నాయి అని తుళ్లి పడతావ్. మనుషులు హడావుడి అంతా నీకోసం పడే ఆర్తి అనుకునే అల్పాసంతోషివి నీవు. మాకు మేలు చేయడానికి అమ్మఒడిని విడిచిపెట్టి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ఉరుకుపరుగులతో వచ్చే నీకు వందనాలు సూర్యభగవానుడా!

వాణిశ్రీ నైనాల

 

 

యాజ్యమునందగ్రాసన

భాజ్యము‌ లేదని హవిస్సు ఫాలాక్షునకున్

ఆజ్యమునగ్నికి‌ నటులన్

పూజ్యుల దూషణ మెపుడును పుణ్యంబొసగున్

ఆత్రేయ

 

 

ఈ రోజు సమస్యా పూరణ,

వచనం,  

నిజము తెలియక జానకీ, అది అ,

గ్రజు ఆర్తనాదముగ భావించి, లక్ష్మణుని దూషింప,

ఆ జానకి మాటలుమదిని వేధించ, అతడుతలపోసే

పూజ్యుల దూషణమెప్పుడు పుణ్యంబొసఁగున్.

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

 

 

" పూజ్యనీయుల దూషణ పుణ్యమొసగు

 తేటగీతి..

విద్య బోధించు కటువుగ విదులు సతము

విద్య వికసించె నాశ్రమ విలువలందు

తప్పిదములెల్ల సరిజేసి దారి జూపు

పూజ్యనీయుల దూషణ పుణ్యమొసగు...

 

విదులు ..పండితులు

పి.ఎల్.నాగేశ్వరరావు

 

 

భయమొదులురా

సుభాషితంబులు, హితవులు,సూక్తులు

జాతీయములు ,శతకములలోని

ఆణి ముత్యములను వాడుదురు మన

పెద్దలు మన మేలు కొరకు

సమయానుకూలముగా  వినిపించుకోక

విస్మరింతురవి  మనలో ఎందరో

 

వినయ విధేయతలతో విని విజేతలయిన

వారుందురందరిలో  తెలుసుకొని తెలుపవలె మన వారికి

' పూజ్యుల ధూషణ పుణ్యమొసగునని ' !

జి మురళీ మోహన రావు

 

తే.గీ.

తెలిపె, విష్ణు నామ స్మరణ ద్వేష భావ

మున హిరణ్యకశిపుడు సల్ప, నది గూడ

పుణ్యమనుచు మోక్షమొసగె పురుషవరుడు,

పూజ్యనీయుల దూషణ పుణ్యమొసగు

వారణాశి శ్రీలేఖ

 

 

జగము నందుమనుజులకు జన్మనిచ్చు

తల్లిదండ్రులు తెలివిచ్చి దారి చూపు

గురువు లాదిగ కలరు పె క్కుండ్రు నట్టి

పూజ్యనీయుల దూషణ పుణ్యమొసగు

CA కె మల్లికార్జునరావు

 

 

సమస్య

పూజ్యనీయుల దూషణ పుణ్యమొసగు

వెరసి దైత్యులు బలముతో విఱ్ఱవీగి

లోక కంటకు లైరిగా శోక మిడుచు

దైవతముచేత రణమందు తనువు విడువ

పూజ్యనీయుల దూషణ పుణ్య మొసగు

ఆదిభట్ల సత్యనారాయణ

 

 

తే"

మంత్ర జపముపవాసము ల్మ్రగ్గు నొకడు,

దేవుడే లేడనుచు దిట్టు దేభ్యమొకడు

యీసడించ యునికిచాటు నీశ్వరుండు

పూజ్యనీయుల దూషణ పుణ్యమొసగు

వాణిశ్రీ నైనాల

 

 

నేటి సమస్యా పూరణ

తేటగీతిలో....

సత్య సంధత నెపుడును చాటువాడై

మంచిమార్గము జూపెడి మనసు గలిగి

పరుల హితమును గోరెడి పల్కులైన

పూజ్యనీయుల దూషణ పుణ్య మొసగు.

హేమలత

 

 

ముత్యాల సరము

తకిట తకధిమి  తకిట తకధిమి...లయ

తలపు లందున జ్ఞాపకాలై

 తరలి పోయెను సఖియ స్నేహము

 కటిక చీకటి దారు లందున

 కలగ తానై కరిగి పోయేను

 మెలకువందున వెతికి జూడగ

 కంటి నీరుగ కారి పోయెను 

 

 గుండె లవిసిన నిండు సంద్రము

 కంటి నీరుగ కడకు మిగిలెను

డా .నాగులపల్లి

 

 

అంశం ..పువ్వు

 తేటగీతి...

 

మగడు దెచ్చిన మమతల మల్లెలెల్ల

ముడుచు నతివయు కురులను మురిసిపోయి

కలికి ప్రియముగ నందించ కప్పుకాఫి

ప్రణయ తిన్నెల విహరించె పతియు , సతియు...

పి.ఎల్.నాగేశ్వరరావు

 

 

 

తేట గీతి

పూలగంధమాఘ్రాణింప  పొంగు నెడద

పూలతో ప్రణయ జలధి  పొంగి పొరలు !

పూల జేయుసఫలములు పూజ లెల్ల

పూవు తోడనే సృష్టి సంపూర్ణ మాయె!!

 

ఆట వెలది 1

 సిగను  చేరినట్టి  బొగడ పూవందమౌ

 నాటవెలది కైన  యాలి కైన!

 ప్రణయ లీల వేళల పరిమళించెడి

 పూలు జేర ప్రేమ  పొటమరించు !!

 

తేట గీతి 2

పుణ్య పాపము లెరుగదు పూవు తాను,

తనువు చాలించి  తానలగును నడిమను  ,

ప్రణయ దాసుల పాన్పుల పరిమళించు

పూవు కేల కలిగెనిట్టి పూర్ణ దృష్టి!

 

కం"

పన్నులెగవేయు సంపద

వన్నెలు జూపగ ధరించె వరుసల గొలుసుల్

మిన్నును తాకగ మెరుపులు

కన్ను చెదరె దొంగకతివ కనకంబుగనన్

వాణిశ్రీ నైనాల

 

తే.గీ.

సప్తదినములాభరణముల్ సర్వము, నతి

సుందరమగు రీతి నలర, చూచువార

ల కనులు జెదర, నవవధూ రమణి వేచె,

శుభవివాహ ఘడియకై ప్రజు దరి జేర

 

ప్రజుడు - వరుడు

వారణాశి శ్రీలేఖ


"పురిటి నొప్పులు బడవలె పురుషుడైన" 03.03.2021 - సమస్యాపూరణ

 


03.03.2021, బుధవారము

సమస్యా పూరణ : "పురిటి నొప్పులు బడవలె పురుషుడైన"

 

వచనం,

కోట్లు వెచ్చించి ఓట్లు కొన్నప్పటికీ,

ఓట్లు లెక్కించునాడు తప్పదు,

కౌంటింగ్ హాల్లో క్షణ క్షణము

పురిటి నొప్పులు పడవలె పురుషుడైన..

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి,

 

 

తే.గీ.

బ్రతుకుతెరువుకై పండించు పంట నతడు,

చీడపీడలైన, వరద యేరులైన

పసిడిపంటయై చేతికి వచ్చు వరకు

పురిటినొప్పులు బడవలె పురుషుడైన

వారణాశి శ్రీలేఖ

 

 

కపిత్వము వ్రాయు కపివర్యుని కష్టాలు గా

తే.

కలము జేబూని వ్రాయు నక్షరము జతప

డక యతి, గణముల్ గతి కుదరక బిగించు

పద్య రచనా విధము జూడ, విద్య లందు

పురుటి నొప్పులు బడవలె పురుషుడైన

 

మరొక పూరణ

ఉత్సాహము

కవిగ తెలుగు తేనియ లకు కౌముది నిడు సుకవితల్

సవినయముగ బంచి నెగడు సద్గుణుండు విభుని బో

లు, వికటించి పురుటి నొప్పులుం బడవలె పురుషుడై

న విధి నిర్వహణపు ప్రతిదినంబు చర్య లందునన్

వెంకట్.సి హెచ్

 

 

"పురిటి నొప్పులు బడవలె పురుషుడైన"

వైద్య విద్యాభ్యసన చేయు ప్రతిభ కొఱకు

పంట పండించి యింటికి పంపు కొఱకు

యిలను సంసార సాగర మీదు కొఱకు

వరులు మెచ్చగ పద్యము వ్రాయు కొఱకు

సుతకు యోగ్యుని వరునిగఁ జూచు వరకు

పురిటి నొప్పులు బడవలె పురుషుడైన

ఆదిభట్ల సత్యనారాయణ

 

 

తేటగీతి

తాళి కట్టిన ఇల్లాలు , తనను కన్న

తల్లి నడుమ వచ్చు గొడవ లిల్లు దాటు

వేళలో తీర్పు చెప్పగ బెదరు నపుడు

పురిటి నొప్పులు బడవలె పురుషు డైన

రమ

 

 

తప్పదురా తమ్ముడు

సతీమణి బిడ్డను మోయుచుండ గర్భమున,

పతికి తప్పవు గృహ భాధ్యతలన్నియున్

 

తకధిమి ధిమితకలతో గంతులు వేయక

ధూం  ధామ్ లనుచు  అరవక  

 

చిరునవ్వులతో ఆవిడ చేసుకొను

పనులన్నియు చేయుచు భార్యను

ప్రశాంతముగా వుంచవలె,

సంతస పరచవలె కూడా

 

అటుల పురిటి నొప్పులు బడవలె పురుషులైనను

గర్వము గా

జి మురళీ మోహన రావు

 

 

తే.గీ

శ్రీపతికి మొదలాయె పరీక్షలికను

ఉరుకుపరుగుల జీవిక నిరువురికని

ఇంటిపని తోడ ప్రియసతి మెడను వంచె

పురిటి నొప్పులు బడవలె పురుషుడైన

పద్మజ చెంగల్వల

 


15, మార్చి 2021, సోమవారం

రాముని మనస్సు దోచెను రంభ గనుమ, సమస్యా పూరణం, 10.02.2021 బుధ వారం

 


10.02.2021 బుధ వారం..

తెలుగు తేనియలు- సమస్యా పూరణం

తేటగీతి పాదం..

రాముని మనస్సు దోచెను రంభ గనుమ

లేదా

కంద పాదం..

రాముడు తా వలచెననుచు రంభను దెచ్చెన్

సభ్యులు మీ మనోహరమైన పూరణలు అందించవలసినదిగా మనవి..

 

 

 

" రాముడు తా  వలచెననుచు రంభను దెచ్చెన్ ".   సందర్భం....

రాముడు, భీముడు ప్రాణ స్నేహితులు..భీముని పెళ్ళికి రాముడు వెళ్లగా, అచట రంభయను అమ్మాయిని ప్రేమించి, పెళ్ళి చేసుకోవాలనే శుభ సంకల్పముతో..తన తండ్రి వద్దకు రంభను తీసుకు వచ్చాడు...

అంతే..ఆ తర్వాత పెళ్ళి అయిందా , లేదా అనేది మనకు తెలియదు.

 

 కందం..

భీముని పెళ్ళికి వెళ్లగ

రాముడు ముదముగ వలచిన రంభను గాంచెన్

భామను తండ్రికి జూపగ

రాముడు, తా  వలచెననుచు రంభను దెచ్చెన్...

పి.ఎల్.నాగేశ్వరరావు

 

 

నేటి సమస్యా పూరణానికి నా ప్రయత్నం...

కోదండ రాముడు అనే సినిమాలో JD చక్రవర్తి హీరో, రంభ హీరోయిన్... ఈ చిత్రాన్ని ఉదహరిస్తూ...

 

చలన చిత్ర నాయకుడగు చక్రవర్తి

చిలిపి కోదండ రాముడు చిత్రమందు

ప్రేమ తోడ రంజింపగ ప్రేక్షకులను

రాముని మనస్సు దోచెను రంభ గనుమ

 

 

నేటి సమస్యకు నా సరదా పూరణ కందంలో...

సోముడు సోమరి కుంకడు

గ్రామరు బండగ చదివెను గార్ధబ సుతుడే

ఏమరుపాటుగ జెప్పెను

రాముడు తా వలచెననుచు రంభను దెచ్చెన్

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

 

 

గురువాజ్ఞ ప్రకారం రాముడు శివధనుర్భoగమైతే చేశాడు కానీ సీతను వివాహమాడమంటే మాత్రం తన తల్లిదండ్రుల ఇష్టమని జవాబు చెప్పాడట ( వాల్మీకి రామాణం ప్రకారం ). కానీ వివాహానంతరం సీతారాముల దాంపత్యం ఎంత అన్యోన్యంగా సాగిందో జగద్విదితమే కదా.....

 

"నాడు శివధను ర్భంగమొ నర్పగ గురు

వాజ్ఞ గని నేడు కళ్యాణవధువు సీత

రాముని మనస్సు దోచెను", రంభ గనుమ

యంచు చూపెతా ద్యుపతికి నచ్చెరువున

వారణాశి శ్రీలేఖ

 

 

 

తే

పెండ్లి చూపుల రేడుగ పేరువడసి

వనితలందరు వద్దని వంకబెట్టి

తలపుల మునిగితేలెడి కలల యాత్మ

రాముని మనసు దోచెను రంభ గనుమ

వాణిశ్రీ నైనాల

 

 

కం"

గోముగ వలవేసె నొకతె

నీమముగ నటులకు తోడు నిటునటు దిరగన్

ప్రేమని నమ్మిన డ్రైవరు

రాముడు తావలచె ననుచు రంభను దెచ్చెన్

వాణిశ్రీ నైనాల

 

 

 

మతి చెలించే

గురువు గారు చెబుచుండె సీతాయాశ్చరితం మహత్

అను పాఠమును రమ్యముగా యధావిధిగా పరిభ్రమించు

కొందరి విద్యార్థుల మనసులు చలన చిత్రముల చుట్టూ

గురువు గారడగగా ఓ ప్రశ్నకు  ఆ విద్యార్థి లేచి ..

 

రాముడు తావలచెననుచు రంభను దెచ్చెన్ అని గంభీరంగా చెప్ప , తోటి విద్యార్థులు  తప్పు తప్పు , సీతను దెచ్చెన్ సీతను దెచ్చెన్ అనుచుండ

 

అటుల కాదని  గురువుగారు నిందించి ,

వాడిని దండించుటకు నిలబెట్టే, ముందు బల్లమీద

 

 

పూల వర్షం కురిసే….

సీతను చూపి

తెలిపే అందరికీ

రాముడు తా

వలచెననుచు,

రంభన్ దెచ్చెన్

ఇంద్రుడు ఊర్వశి,మేనకలతో

కూడి,వారి నభినందించి

వీరి నృత్యములతో

అందరినీ సంతోష

పరచుటకు !

జి మురళీ మోహన్ రావు

 

 

 

వేయి కన్నులు గలవాడు! వేల్పు రేడు!

నమర పురమున కధిపతి; నద్రి బిధుడు!

,మఘవుడైన సుత్రాముని మనసు‌ దోచె

రంభ కనుమ‌ యనుచు బల్కె రమణి‌ యొకతె

సుత్రాముడు   =  ఇంద్రుడు

 

 

 

కం :

సోముని తోడన్ బుట్టెను

కాముని జనయిత్రి గాచు కల్ప తరువుగా

నామములు గలిగె సీతను

రాముడు తా వలచెననుచు రంభను తెచ్చెన్

పద్మలత

 

 

భూమిజకు తాళి గట్టెను

రాముడు తా వలచె ననుచు, రంభన్  తెచ్చెన్

గా మూర్ఖుడగు దశముఖుడు

కామము పెరుగంగ గుచ్ఛ కమ్ముల నీడన్

 

రావణాసురుడు  రంభను ఆమె భర్త (నల కూవరుడు)లేని సమయంలో మోహించి పొదల మాటుకు తీసుకు వెళ్ళి బలాత్కారం చేసెను

గుచ్ఛకము  = పొద

*******

 

 

గురువాజ్ఞ ప్రకారం రాముడు శివధనుర్భoగమైతే చేశాడు కానీ సీతను వివాహమాడమంటే మాత్రం తన తల్లిదండ్రుల ఇష్టమని జవాబు చెప్పాడట ( వాల్మీకి రామాణం ప్రకారం ). కానీ వివాహానంతరం సీతారాముల దాంపత్యం ఎంత అన్యోన్యంగా సాగిందో జగద్విదితమే కదా.....

 

"నాడు శివధను ర్భంగమొ నర్పగ గురు

వాజ్ఞ గని నేడు కళ్యాణవధువు సీత

రాముని మనస్సు దోచెను", రంభ గనుమ

యంచు చూపెతా ద్యుపతికి నచ్చెరువున

వారణాశి శ్రీలేఖ

 

 

కం.

రాముడు సోమరి;తిండికి

రా, మునుపే నిల్చు;'పనికి-రాడే' వేళన్ !

గ్రామమున నొలిచి, సాపా

ట్రాముడు, తా వలచెననుచు 'రంభను' దెచ్చెన్ !

 

ఒలుచు... దొంగిలించు

వలచు... ఈ సందర్బంలో, తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు, ఈ రాముడు ...... నోట్లో నీళ్లూరగా,అమితంగా ఆశపడు అని

సాపాట్రాముడు. సాపాటురాముడు..తిండిపోతు.. తిండికి దప్ప,ఇతరమునకు పనికిరాని బద్దకుడు, సోమరి

 

రంభ.. అరటి చెట్టు... అరటికాయలు,పండ్లు,

అరటి దూట/ఊచ,అరటి పువ్వు ఇత్యాది ఖాద్య పదార్థములతో నిండి ఉన్న, ఆల్ ఇన్ ఆల్ అరటి చెట్టొకటి (తేరగా తెచ్చాడు)అని..

రమణ


15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...