అవీ - ఇవీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అవీ - ఇవీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, ఫిబ్రవరి 2021, బుధవారం

తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధిపొందిన కోట్స్

 



తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధిపొందిన కోట్స్:

 

1. ‘‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు నా ఇచ్ఛయేగాక నాకేటి వెఱపు’’

-దేవులపల్లి కృష్ణ శాస్త్రి

 

2. ‘‘కప్పివుంచితే కవిత్వం విప్పి చెబితే విమర్శ’’

డా.సి.నారాయణరెడ్డి

 

3. ‘‘ఉదయం కానేకాదు అనుకోవడం నిరాశ ఉదయించి అట్లానే వుండాలనుకోవడం దురాశ’’

- కాళోజి

 

4. ‘‘గత కాలము మేలు వచ్చుకాలముకంటెన్‌’’

- నన్నయ

 

5. ‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతినాపలేరు’’

-సుబ్బారావు పాణిగ్రాహి

6. ‘‘రాజే కింకరుడగు కింకరుడే రాజగు’’

-బలిజేపల్లి లక్ష్మీకాంతం

 

7. ‘‘వలపెరుంగక బ్రతికి కులికి మురిసేకన్న వలచి విఫలమ్మొంది విలపింపమేలురా’’

-బసవరాజు అప్పారావు

 

8. ‘‘నిఖిలలోకమెట్లు నిర్ణయించినగాని తిరుగులేదు విశ్వనరుడ నేను’’

-గుర్రం జాషువా

9. ‘‘అత్తవారిచ్చిన

 నీవు కోరగ వ్రాసి ఇచ్చినాను’’

- కాళ్ళకూరి నారాయణరావు

 

10. ‘‘గాయపడిన కవి గుండెల్లో వ్రాయబడని కావ్యాలెన్నో’’

- దాశరధి

 

11. ‘‘ప్రజకు రక్షలేదు పత్రికలేనిచో’’

-నార్ల వెంకటేశ్వర రావు

 

12. ‘‘బావా, ఎప్పుడు వచ్చితీవు’’

- తిరుపతి వెంకట కవులు

13. ‘‘తాంబూలాలిచ్చేశాను, తన్నుకు చావండి’’

- గురజాడ

 

14. ‘‘మాకొద్దీ తెల్ల దొరతనము’’

- గరిమెళ్ళ సత్యనారాయణ

 

15. ‘‘పరమేశా గంగ విడుము పార్వతి చాలున్‌’’

- శ్రీనాథుడు

 

16. ‘‘ఇందు గలడందు లేడని సందేహము వలదు... ఎందెందు వెదకిచూచిన అందందే గలడు’’

- పోతన

17. ‘‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా’’

- గద్దర్

 

18. ‘‘తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు’’

- శ్రీ శ్రీ

 

19. ‘‘చిరునవ్వుల వరమిస్తావా చితినుంచి లేచొస్తాను మరుజన్మకు మాటిస్తావా ఈ క్షణమే మరణిస్తాను’’

 - వెన్నలకంటి

 

20. ‘‘రావోయి బంగారి మావా నీతోటి రాహస్యమొకటున్నదోయీ’’

- కొనకళ్ల వెంకటరత్నం

21. ‘‘వనిత తనంత తా వలచివచ్చిన చుల్కన కాదె యేరికిన్‌’’

- అల్లసాని పెద్దన

 22. ‘‘ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరేగదా?’’

- చేమకూరి వేంకటకవి

 

23. ‘‘ఎందరో మహానుభావులు అందరికీ వందనములు’’

- త్యాగయ్య

 

24. ‘‘రాజుల్‌ మత్తులు, వారిసేవ నరకప్రాయంబు......’’

- ధూర్జటి

 

25. ‘‘ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురు......’’

- బద్దెన

26. ‘‘భూమినాదియనిన భూమి ఫక్కున నవ్వు దానహీను జూచి ధనము నవ్వు’’

- వేమన

 

27. ‘‘నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ’’

- కంచర్ల గోపన్న

 

28. ‘‘పల్లెటూరి పిల్లగాడా పసులగాసే మొనగాడా’’

- సుద్దాల హనుమంతు

 

29. ‘‘నువ్వు ఎక్కదలచుకున్న రైలు ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు’’

- ఆరుద్ర

 

30. ‘‘తల్లి ఒక్కతె మనకు తెలుగోడా సవతిబిడ్డల పోరు మనకేలా’’

- వేముల శ్రీ కృష్ణ

 

31. ‘‘వీరగంధము తెచ్చినారము, వీరుడెవ్వడొ తెల్పుడీ’’

- త్రిపురనేని రామస్వామి

 

32. ‘‘మాదీ స్వతంత్రదేశం మాదీ స్వతంత్ర జాతి’’

- బాలాంత్రపు రజనీకాంతరావు

33. ‘‘ఉప్పొంగిపోయింది గోదావరీ తాను తెప్పున్న ఎగిసింది గోదావరీ’’

- అడవి బాపిరాజు

 

34. ‘‘కూర్చుండ మా యింట కురిచీలు లేవు’’

- కరుణశ్రీ

 

 35. ‘‘ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనమురా నడుమ దొర ఏందిరో వాని దూకుడేందిరో’’

- గుడ అంజయ్య

 

36. ‘‘తను శవమై - ఒకరికి వశమై తనువు పుండై - ఒకరికి పండై ఎప్పుడూ ఎడారై - ఎందరికో ఒయాసిస్సై’’

- అలిసెట్టి ప్రభాకర్

 

37. ‘‘మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తోంది’’

- సావిత్రి

38. ‘‘నేను పుట్టకముందే దేశద్రోహుల జాబితాలో నమోదై వుంది నా పేరు’’

- ఖాదర్ మొహియుద్దీన్

 

39. ‘‘నా దేశాన్ని గూర్చి పాడలేను నీ ఆదేశాన్ని మన్నించలేను

- బాలగంగాధర తిలక్

 

40. ‘‘ఎక్కువ కులజుడైన హీనకులజుడైన నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు’’

- అన్నమయ్య

 

41. ‘‘ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాససంత్రస్తులై’’

- ఏనుగు లక్ష్మణ కవి

 

42. ‘‘అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ’’

- పాలగుమ్మి విశ్వనాథం

43. ‘‘క్రిష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ

- చలం

 

44. ‘‘వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి అయినా, గిన్నెలన్నిటిపైనా మా నాన్న పేరే’’

- విమల

 

 45. ‘‘గుండె గొంతుకలోన కొట్లాడుతాది కూకుండనీదురా కూసింతసేపు’’

-డూరి సుబ్బారావు

 

46. ‘‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు’’

- అందెశ్రీ

 

47. ‘‘చెరువులో దూకనా చెరువయ్యిపోదునా ఉరిపోసుకొందునా ఉరితాడు అవుదునా’’

- చెరబండరాజు

 

48. ‘ఎంత చక్కనిదోయి ఈ తెలుగుతోట! ఎంత పరిమళమోయి ఈ తోటపూలు!’

- కందుకూరి రామభద్రరావు

 

49. నాగేటి చాల్లల్ల నా తెలంగాణ నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ

- నందిని సిధారెడ్డి

 

50. ‘‘రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీవు ఎరుగవురా’’

- మిట్టపల్లి సురేందర్

 

51. తండ్రి వంకవారు దాయాది పగవారు...

- వేమన

 

52. పెరుగుట విరుగుట కొఱకే..

- బద్దెన

 

53. యేండ్లు గడిచిన ముందు ముందేమొ గాని,

     యిప్పటికి మాత్రమేపాపమెరుగడితడు.(శిశువు)

- గుఱ్ఱం జాషువా

 

54. ప్రసవాబ్ధి తరియించి వచ్చిన పరదేశి;

     తనయింటి క్రొత్త పెత్తనపుదారి! (శిశువు)..

- గుఱ్ఱం జాషువా

 

55. ఊయేల దిగని భాగ్యోన్నతుండు;

     ఊఉలు నేర్చిన యొక వింత చదువరి;

     అమ్మ కౌగిటి పంజరంపు చిలుక. (శిశువు)...

- గుఱ్ఱం జాషువా

 

56. కంజాక్షు నర్చించు కరములు కరములు;

     శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ!

- పోతన

 

57. ఇందుగలడందు లేడను సందేహము  వలదు;

     చక్రి సర్వోపగతుండెందెందు వెదకి జూసిన, నందందే గలడు..

- పోతన



సమాప్తం 

****** 

4, నవంబర్ 2020, బుధవారం

తెలుగులో వంద ఉత్తమ పుస్తకాలు

 



తెలుగులో వంద ఉత్తమ పుస్తకాలు

 

●కన్యాశుల్కం - గురజాడ అప్పారావు

●మహాప్రస్థానం - శ్రీశ్రీ

●ఆంధ్ర మహాభారతం - కవిత్రయం

●మాలపిల్ల - ఉన్నవ లక్ష్మినారాయణ

●చివరకు మిగిలేది - బుచ్చిబాబు

●అసమర్థుని జీవయాత్ర - గోపీచంద్

●అమృతం కురిసిన రాత్రి - దేవరకొండ బాలగంగాధర తిలక్

●కాలాతీత వ్యక్తులు - డాక్టర్ శ్రీదేవి

●వేయి పడగలు - విశ్వనాథ సత్యనారాయణ

●కళాపూర్ణోదయం - పింగళి సూరన

●సాక్షి - పానుగంటి లక్ష్మీనారాయణ

●గబ్బిలం - గుఱ్ఱం జాషువా

●వసు చరిత్ర - భట్టుమూర్తి

●అతడు ఆమె - ఉప్పల లక్ష్మణరావు

●అనుభవాలూ..జ్ఞాపకాలు - శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి

●అముక్త మాల్యద – శ్రీకృష్ణదేవరాయులు

●చదువు - కొడవగంటి కుటుంబరావు

●ఎంకి పాటలు - నండూరి సుబ్బారావు

●కవిత్వ తత్వ విచారము - డాక్టర్ సిఆర్ రెడ్డి

●వేమన పద్యాలు – వేమన

●కృష్ణపక్షం – కృష్ణశాస్త్రి

●మట్టిమనిషి - వాసిరెడ్డి సీతాదేవి

●అల్పజీవి – రావిశాస్త్రి

●ఆంధ్రుల సాంఘిక చరిత్ర - సురవరం ప్రతాపరెడ్డి

●ఆంధ్ర మహాభాగవతం – పోతన

●బారిస్టరు పార్వతీశం - మెక్కుపాటి నరసింహశాస్త్రి

●మొల్ల రామాయణం – మొల్ల

●అన్నమాచార్య కీర్తనలు - అన్నమాచార్య

●హంపీ నుంచి హరప్పా దాకా - తిరుమల రామచంద్ర

●కాశీయాత్రా చరిత్ర - ఏనుగుల వీరాస్వామయ్య

●మైదానం – చలం

●వైతాళికులు – ముద్దుకృష్ణ

●ఫిడేలు రాగాల డజన్ – పఠాభి

●సౌందర నందము - పింగళికాటూరి

●విజయవిలాసం - చేమకూర వేంకటకవి

●కీలుబొమ్మలు - జివి కృష్ణారావు

●కొల్లాయి గడితేనేమి - మహీధర రామమోహనరావు

●మ్యూజింగ్స్ – చలం

●మనుచరిత్ర- అల్లసాని పెద్దన

●పాండురంగ మహత్యం - తెనాలి రామకృష్ణ

●ప్రజల మనిషి - వట్టికోట ఆళ్వార్ స్వామి

●పాండవోద్యోగ విజయములు - తిరుపతి వేంకటకవులు

●సమగ్ర ఆంధ్ర సాహిత్యం – ఆరుద్ర

●దిగంబర కవిత - దిగంబర కవులు

●ఇల్లాలి ముచ్చట్లు - పురాణం సుబ్రమణ్యశర్మ

●పానశాల - దువ్వూరి రామిరెడ్డి

●శివతాండవం - పుట్టపర్తి నారాయణాచార్యులు

●అంపశయ్య – నవీన్

●చిల్లర దేవుళ్లు - దాశరథి రంగాచార్య

●గణపతి - చిలకమర్తి లక్ష్మీనరసింహం

●జానకి విముక్తి – రంగనాయకమ్మ

●స్వీయ చరిత్ర – కందుకూరి

● మహోదయం - కెవి రమణారెడ్డి

●నారాయణరావు - అడవి బాపిరాజు

●విశ్వంభర – సినారె

●దాశరథి కవిత – దాశరథి

●కథాశిల్పం - వల్లంపాటి వెంకటసుబ్బయ్య

●నేను.. నా దేశం - దర్శి చెంచయ్య

●పెన్నేటి పాట - విద్వాన్ విశ్వం

●ప్రతాపరుద్రీయం - వేదం వెంకటరాయశాస్త్రి

●పారిజాతాపహరణం - నంది తిమ్మన

●పల్నాటి వీర చరిత్ర – శ్రీనాథుడు

●రాజశేఖర చరిత్ర – కందుకూరి

●రాధికా సాంత్వనము - ముద్దు పళని

● స్వప్న లిపి – అజంతా

●సారస్వత వివేచన - రాచమల్లు రామచంద్రారెడ్డి

●శృంగార నైషధం – శ్రీనాథుడు

●ఉత్తర రామాయణము - కంకంటి పాపరాజు

●విశ్వ దర్శనం - నండూరి రామమోహనరావు

●అను క్షణికం - వడ్డెర చండీదాస్

●ఆధునిక మహాభారతం - గుంటూరు శేషేంద్రశర్మ

●చంఘీజ్ ఖాన్ - తెన్నేటి సూరి

●చాటు పద్య మంజరి - వేటూరి ప్రభాకరశాస్త్రి

●చితి.. చింత - వేగుంట మోహనప్రసాద్

●గద్దర్ పాటలు – గద్దర్

●హాంగ్ మీ క్విక్ - బీనాదేవి

●ఇస్మాయిల్ కవిత – ఇస్మాయిల్

●కుమార సంభవం - నన్నే చోడుడు

●మైనా - శీలా వీర్రాజు

●మాభూమి - సుంకరవాసిరెడ్డి

●మోహన వంశీ – లత

●రాముడుండాడు రాజ్యముండాది – కేశవరెడ్డి

●రంగనాథ రామాయణం - గోన బుద్దారెడ్డి

●సౌభద్రుని ప్రణయయాత్ర - నాయని సుబ్బారావు

●సూత పురాణం - త్రిపురనేని రామస్వామిచౌదరి

●సాహిత్యంలో దృక్పథాలు - ఆర్ఎస్ సుదర్శనం

●స్వేచ్ఛ – ఓల్గా

●కరుణశ్రీ - జంధ్యాల పాపయ్యశాస్త్రి

●వేమన - రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ

●తృణకంకణం – రాయప్రోలు

●హృదయనేత్రి - మాలతీ చందూర్

●బ్రౌను నిఘంటువు - చార్లెస్ బ్రౌన్

●నీతి చంద్రిక - చిన్నయ సూరి

●తెలుగులో కవితా విప్లవాల స్వరూపం - వేల్చేరు నారాయణరావు

●నీలిమేఘాలు – ఓల్గా

●అడవి ఉప్పొంగిన రాత్రి – విమల

●చిక్కనవుతున్న పాట - జి లక్ష్మినరసయ్యత్రిపురనేని శ్రీనివాస్

●కొయ్య గుర్రం – నగ్నముని

●నగరంలో వాన – కుందుర్తి

●శివారెడ్డి కవిత – శివారెడ్డి

 

2, సెప్టెంబర్ 2020, బుధవారం

తెలుగువాడు - డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారు

 



డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారు
****************************
తెలుగువాడు
*****************


శాతవాహనుల వంశాన పుట్టిన వాడు

కాకతీయుల పోతుగడ్డ మేట్టినవాడు

పల్లెలోనే కాదు డిల్లీలో సైతమ్ము

పెద్దగద్దేలనేలి పెరుకేక్కినవాడు

ఎవడయ్య ఎవడు వాడు 

"ఇంకెవడయ్య తెలుగువాడు"


పంచె కట్టుటలో మొనగాడు

కండువాలేనిధే గడపదాటని వాడు

పంచబక్ష్యాలు తన కంచాన వడ్డించ 

గోంగూర కోసమై గుటకలేసువాడు

ఎవడయ్య ఎవడు వాడు 

"ఇంకెవడయ్య తెలుగువాడు"


నేల నల్దేసల డేరాలు నాటినవాడు

అన్ని మూసలలోన అట్టే ఒదిగినవాడు

"ఎ దేసమేగిన ఎందుకాలిడినా"

ఆవకాయ వియోగామసలె సైపని వాడు

ఎవడయ్య ఎవడు వాడు 

"ఇంకెవడయ్య తెలుగువాడు"


మంచి మనసెదురైన మాలలిచ్చేవాడు

భాయీ  భాయీ అన్న చేయి కలిపేవాడు 

తిక్కరేగిందంటే డొక్కా చీల్చేవాడు

చిక్కులెరుగని వాడు చిత్తాన పసివాడు

ఎవడయ్య ఎవడు వాడు 

"ఇంకెవడయ్య తెలుగువాడు"


29, ఆగస్టు 2020, శనివారం

-మహాకవి శ్రీ పాల్కురికి సోమనాథుడు "అక్షరాంకపద్యములు " నుండి సేకరణ.

మీరు తెలుగు వారేనా అయితే ఈ పద్యం చదవగలరేమో ట్రై చెయ్యండి.

 

 టటకిట టట్టకిట్టటట కిట్టటటట్ట టకిట్టటట్టకి

ట్టటకిట టట్టకిట్టట కిటట్టట టోన్ముఖటంకృతి స్ఫుటో

త్కటపటహాదినిస్వన  వియత్తలదిక్తటతాటితార్భటో

ద్భట పటుతాండవాటన, "ట"కారనుత బసవేశ పాహిమాం!


డమరుగజాత డండడమృడండ

మృడండ మృడండ మృండమృం

డమృణ మృడండడండ మృణడండడ

డండ మృడం డమృం డమృం

డమృణ మృడండడంకృతి

విడంబిత ఘూర్ణిత విస్ఫురజ్జగ

త్ర్పమథన తాండవాటన

"డ"కారనుత బసవేశ పాహిమాం!



ఢణ ఢణ ఢం మృఢం మృఢణఢం

మృణఢంమృణ ఢంఢణోద్ధణం

ధణనటన త్వదీయడమరూత్థ

మదార్భట ఢంకృతి ప్రజృం

భణ త్రుటితాభ్రతార గణరాజ

దినేశముఖగ్రహప్రఘర్

క్షణగుణతాండవాటన

"ఢ"కారనుత బసవేశ పాహిమాం!



ణణ్మృణ ణణ్మృణ ణ్మృ ణణ ణణ్మృణ

ణ ణ్మృణ ణణ్మృణ ణ్మృణ

ణ్ణ ణ్మృణ నృత్త్వదీయసుఖ

విక్రమ జృంభణ సంచలన్నభో

ణ్ణ ణ్మృణ ది క్క్వణ ణ్మృణణ

ణణ్మృణ ణణ్మృణ ణణ్మృణ స్వన

ణ్ణ ణ్మృణ తాండవాటన

"ణ"కారనుత బసవేశ పాహిమాం!


 -మహాకవి శ్రీ పాల్కురికి సోమనాథుడు "అక్షరాంకపద్యముల" నుండి సేకరణ. 

25, ఆగస్టు 2020, మంగళవారం

అవధానంలో అప్రస్తుత ప్రసంగాలు

 

అవధానంలో అప్రస్తుత ప్రసంగాలు

చదివి ఆనందించండి - పద ప్రయోగ వినోదాన్ని పదిమందికీ పంచండి

ప్రశ్నికుడు:- రైలు పట్టాలకూ,  కాలి పట్టాలకూ అనుబంధం ఏమిటి?

అవధాని:- రైలు పట్టాల మీద వుంటుంది, కాలి మీద పట్టాలుంటాయి.

ప్రాశ్నికుడు:- కనలేని స్త్రీమూర్తి ఎవరు?

అవధాని:- న్యాయస్థానములో వున్న న్యాయదేవత. కళ్ళకు గంతలు కట్టి వుంటారు కదా!

ప్రాశ్నికుడు:- సోమవారాన్ని 'మండే'       అనెందుకంటారు?

అవధాని:- ఆదివారం హాయిగా భోంచేసి పడుకుంటాము కదా సోమవారం పొద్దున్నే

పనికెళ్లాలంటే ఒళ్ళు మండుతుంది కదా!  అందుకని 'మండే' అంటారు.

ప్రాశ్నికుడు:- ఒక పిల్లవాడు ఇంటినుండి పారిపోతే కనిపించుటలేదు అని ప్రకటిస్తారు కదా! దానికి పిల్లాడి స్పందన ఏమిటి?

అవధాని:- కని-పెంచుట లేదు .

ప్రాశ్నికుడు:- ఈ రోజుల్లో పిల్లలు   తల్లిని Head Cook గా  చూస్తున్నారు .

     మరి తండ్రిని  ఎలాచూస్తున్నారు?

అవధాని:- ATM లాగా చూస్తున్నారు.

ప్రాశ్నికుడు:- సభలో ఎవరైనా   ఆవులిస్తే మీరేమి చేస్తారు?

అవధాని:- పాలిచ్చేవైతే అవధానం అయ్యాక యింటికి తోలుకెళ్తా .

ప్రాశ్నికుడు:- మనిషికి ఆనందాన్నిచ్చే సిటీ ఏది?

అవధాని:- 'పబ్లిసిటీ '

ప్రాశ్నికుడు:- తుద+ తుద = తుట్టతుద,   కడ  + కడ = కట్టకడ  అవుతుంది కదా!

      అరటి + అరటి  ఏమవుతువుంది?

అవధాని:- అర టీ + అర టీ ఫుల్ టీ అవుతుంది.

ప్రాశ్నికుడు:- క్రికెట్ ప్లేయరుకీ,   అవధానికీ  సామ్యం ఉందా?

అవధాని:- వాళ్ళు  world play కి వెళ్తారు ,  మేము  words play కి వెళ్తాము.

ప్రాశ్నికుడు:- 10 . 'పురుషులందు పుణ్యపురుషులు వేరయా' అన్నాడు వేమన, ఇప్పుడు మీరేమంటారు?

అవధాని:- "పురుషులందు  పుణ్యపురుషులు  ఏరయా? అంటాను.

ప్రాశ్నికుడు:- 11 . దేవుని గుడికి  తాళం వెయ్యాలా?         

అవధాని:- భజన జరిగే చోట తాళం తప్పనిసరి.

ప్రాశ్నికుడు:- 12 . అద్దం ముందున్న ఆడువారికీ,  మైకు ముందున్న   అమాత్యులకీ తేడా ఏమిటి?

అవధాని:- ఇద్దరికీ సమయం తెలియదు!


****** 

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...