అవధానంలో అప్రస్తుత ప్రసంగాలు
చదివి ఆనందించండి - పద ప్రయోగ వినోదాన్ని పదిమందికీ పంచండి
ప్రశ్నికుడు:- రైలు పట్టాలకూ, కాలి పట్టాలకూ అనుబంధం ఏమిటి?
అవధాని:- రైలు పట్టాల మీద వుంటుంది, కాలి మీద పట్టాలుంటాయి.
ప్రాశ్నికుడు:- కనలేని స్త్రీమూర్తి ఎవరు?
అవధాని:- న్యాయస్థానములో వున్న న్యాయదేవత. కళ్ళకు గంతలు కట్టి వుంటారు కదా!
ప్రాశ్నికుడు:- సోమవారాన్ని 'మండే' అనెందుకంటారు?
అవధాని:- ఆదివారం హాయిగా భోంచేసి పడుకుంటాము కదా సోమవారం పొద్దున్నే
పనికెళ్లాలంటే ఒళ్ళు మండుతుంది కదా! అందుకని 'మండే' అంటారు.
ప్రాశ్నికుడు:- ఒక పిల్లవాడు ఇంటినుండి పారిపోతే కనిపించుటలేదు అని ప్రకటిస్తారు కదా! దానికి పిల్లాడి స్పందన ఏమిటి?
అవధాని:- కని-పెంచుట లేదు .
ప్రాశ్నికుడు:- ఈ రోజుల్లో పిల్లలు తల్లిని Head Cook గా చూస్తున్నారు .
మరి తండ్రిని ఎలాచూస్తున్నారు?
అవధాని:- ATM లాగా చూస్తున్నారు.
ప్రాశ్నికుడు:- సభలో ఎవరైనా ఆవులిస్తే మీరేమి చేస్తారు?
అవధాని:- పాలిచ్చేవైతే అవధానం అయ్యాక యింటికి తోలుకెళ్తా .
ప్రాశ్నికుడు:- మనిషికి ఆనందాన్నిచ్చే సిటీ ఏది?
అవధాని:- 'పబ్లిసిటీ '
ప్రాశ్నికుడు:- తుద+ తుద = తుట్టతుద, కడ + కడ = కట్టకడ అవుతుంది కదా!
అరటి + అరటి ఏమవుతువుంది?
అవధాని:- అర టీ + అర టీ ఫుల్ టీ అవుతుంది.
ప్రాశ్నికుడు:- క్రికెట్ ప్లేయరుకీ, అవధానికీ సామ్యం ఉందా?
అవధాని:- వాళ్ళు world play కి వెళ్తారు , మేము words play కి వెళ్తాము.
ప్రాశ్నికుడు:- 10 . 'పురుషులందు పుణ్యపురుషులు వేరయా' అన్నాడు వేమన, ఇప్పుడు మీరేమంటారు?
అవధాని:- "పురుషులందు పుణ్యపురుషులు ఏరయా? అంటాను.
ప్రాశ్నికుడు:- 11 . దేవుని గుడికి తాళం వెయ్యాలా?
అవధాని:- భజన జరిగే చోట తాళం తప్పనిసరి.
ప్రాశ్నికుడు:- 12 . అద్దం ముందున్న ఆడువారికీ, మైకు ముందున్న అమాత్యులకీ తేడా ఏమిటి?
అవధాని:- ఇద్దరికీ సమయం తెలియదు!
******
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి