28, ఆగస్టు 2020, శుక్రవారం

28 - 08 - 2020 - ప్రణాళిక, దత్తపది - 33, కవనము - లవణము - పవనము - భువనము

 


28 - 08 - 2020 - ప్రణాళిక
 
దత్తపది -  33
 
కవనము -  లవణము -  పవనము -  భువనము
 
(ఈ పదములతో, ఇతివృత్తం తెలియచేస్తూ పద్య కవిత / వచన కవిత అందించగలరు)

**************************************** 

 

కందము

 

కవనము కాదిది పద్యము

లవణము పై వ్రాయుచుండ రమ్యముగనునే

పవనము వచ్చెను నడుమన

భువనము నన్ లేక నిదియె పుట్టిన గిట్టున్!!

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

*********************************

 

జీవనవికాసాకి కవనము

శాకముల రుచికి లవణము

మనిషి బ్రతుకంగ పవనము

శాంతి విరిసిన భువనము

కావాలోయ్ .. కావాలోయ్

 

రామ్మోహన్ రావు  

******************

1.       

స్వాతంత్ర్యసమరాన " లవణము"

కవికుమారులకాయె  "కవనము" నకు

కధావస్తువువై దేశభక్తి "పవనము" లను

జనులందు పరివ్యాప్తంబు జేసి

అవని యందు భారతావనిని జేసే

సర్వస్వాతంత్ర్య"భువనము"గ

 2.       

స్వాతంత్ర్యసమరాన " లవణము"

మోహనదాసునకు ఆయెన్

స్వాతంత్ర్య సమర "పవనము" ను

భరత "భువనము"న వీయించి

విజయ "కవనము"ను రచియించి

జనులకు రమ్యమైన కానుకగా నీయగ

 

వ్యాకరణ పరిధి లోకి రాని వచన కవిత..

ఆర్.వి.రమణమూర్తి.

 ***********************

 

పదునగు కూర రుచి పుట్టదే !

లవణము నించుక నధికమైనన్ గాని!

 

నహ్లదకరము కాదే ! పవనము

నించుక వేగవంతమై వీచినన్ గాని!

 

పటుత్వంలేని కవనము రసవత్తరము కాదే !

పదాలు మెండుగ నున్న న్ గాని!

 

ననుభూతి పొందనిచో వృధా కాదే !

భువనము లో నెన్ని నందాలున్న న్ గాని!

 

లలిత దీక్షత్

*************** 

 

తరువోజ :

భువనమోహన పద్య పొంకముల్ తెలుగు

      పొదరింట తేనియల్ వొల్కిన రీతి           

లవణముతోడుండ రంజిల్లు రుచుల

       లాస్యముల్ నెత్తావిరసనమ్ము రీతి

పవనములెన్నియో పల్కరించి నవ

       వల్లరులన్నియు పంచిన రీతి     

కవనపు శోభల కైవడులెఱిగి 

     గంధముల్ పొంగారు కైతల రీతి         

కస్తూరి శివశంకర్

 ********************

చంపకమాల

కవిత్వం ఎలా ఉండాలంటే .... అన్న భావనలో

 

చంపకమాల

 పవనము వీచినన్ మధురవాక్కుల కైతలు పల్కినన్; మహా     

భువనములందు సాంద్రమగు పొంకపు భావనలెన్ని పూచినన్      

లవణముతోటి మామిడిఫలంబుల సంగ్రహ రుచ్యముల్వలెన్     

కవనములన్ని మాధురుల కాంతులు చిందవలెన్ మనోజ్ఞమై; 

 

కస్తూరి శివశంకర్

******************* 

 

కందము

1.       

భువనము మోహనమాయే  

కవనము కాంతులవి మేటి కైవడులవియే      

లవణమున వింత రుచులే         

పవనములై పరిమళముల వల్లరులవియే !

 

2.       

లవణము లేనొక పప్పుయు

కవనము సారంబు లేక కనుగొన దింపై!

పవనము వీచని వర్షము

భువనము లో మేఘమాల  యుండక దగునా?

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

******************************** 

 

కందము

ఉప్పూకారము జల్లుచు

చొప్పున మీరాస్వదించు చూతఫలముతో  

విప్పారిన రసనాడులు 

చెప్పవలెనులే కవనరుచిరముల హరువుల్ !!      

 

చూతఫలము = మామిడి పండు



లవణము లోపించిన శాక పాకములే

రీతి రుచియించు ? అది సున్నపు రాశి  కాని

అన్నరాశి కాదె !

భావ  సమృద్ధి,  జాతి హితము,పద పొంకము 

లేని  కవనము మది  నెట్లు రంజిల్ల చేయు ?

అది అక్షర కూర్పు కాని కవనమెట్లగు ?

మంద యానమున  వీచు  పవనము  హాయి

నొసంగు కాని, చలి గాడ్పు,  వడగాడ్పు,  సుడి

గాలు లేరీతి హాయి  గొలుపు !

స్పందన కల్గిన మనుజుడే, సృష్టి కర్త సృజనచేసిన

భువనము నందనోద్యానముగ భావించు  కాని

జంతు జాలము లెట్లు అనుభూతి చెందు జగతి అందాలను !

అవళూరు సీత

**************** 

  

కవికి  యెన్నడూ యిష్టము కవన మేను

కూర లోనికి లవణము కూర్మి చేర

వాస నంతయు పవనము వలెను వచ్చు

భువన మునుచేరు వెంటనే  భుక్తి చేయు

 

లలితారెడ్డి, శ్రీకాకుళం

************************** 

 

 

గేయ రచన,

పవనము రాని గృహము,

కవనము లేని పండిత పరిషత్తు,

లవణము లేని విందు భోజనము,

భువనములో వీడిన సుఖము...

 

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

 ******************************

 

పవనం లేని జగతి

కవనం లేని కవి

లవణం లేని భోజనము

ఈభువనములోన కలదె.

 

డి నాగమణి

***************

 

 కవనము లవణము పవనము భువనము

కవనము యెరుగని జీవన గమనము

లవణము లేనియట్టి పాకంబు

పవనము  లు వీచని గేహము

భువనము న మన్నజాలవు రా జీవా

 

వి.వి.శ్రీనివాస్

 ****************

 

కవణము మెరుగన్ కవి భావజాలముల్ తెలుపగ

పవనము ల్ తోడ గేయముల్ రుచి

లవణ మేసిడి నలభీమపాకమువలెనన్న

భువనము న బ్రమనమైబాకు శ్రోతలకు ప్రీతిగాంచున్ సరి!

 

సూర్య తాడిపూడి

 *********************

 

నేటి దత్తపది తో కశ్యప, ధనువులకు జన్మించిన నముచి యనెడి రాక్షసుని గురించి తెలుపు ప్రయత్నము సీసములో..

 

సీసము

 

భీతి కలుగునె గంభీర మగునె కన్ను

    (కవ నము)చి యనెడి కఠినుడి గన

(భువనమం)దున తన భోగము పరికిం(ప

        వన మం)దు ఘోర తపస్సు సలిపి

తడి,పొడియగు నాయుధములతోమరణంబు

       రాని వరము పొందె రాక్షసుండు

దేవ యసుర మధ్య రావము నందు దే

      వేంద్రుడి నెదిరించె; యింద్రుడు తన

 

తేటగీతి

ఆయుధంబును (లవణము) నంటి యున్న

కడలి నురగ నందున యుంచి ఖండములుగ

నముచి నంతమొందించి తా నముచి సూద

నుడనె పేరుగాంచె మఘవంతుడు ఘనముగ.

 

కన్ను కవ= నేత్ర ద్వయము

కఠినుడు= రాక్షసుడు

వనము= అడవి

మఘవంతుడు= ఇంద్రుడు

 

వెంకట్. సిహెచ్

****************** 

 

 1.

త్రిభువనముల  తిలకుడు శ్రీరాముడు,

సీత జాడ లేక వెదుక సాగే,

వేదన పరుడై పవనము సుతుడు,

వేగిరముగ వెడలే,

లవణము జల్లిన అంబుధి లఘువుగ,

ఏకోద్ధతి లంఘించి,

లంకను చేరి అశోకవనమున సీతమ్మను,

కని సంతషించె.

 

2.

కవనమనిన కవిత యందురు

పవనము మరి మారుతము ఒకటే

లవణము మారు పదము సైంధవము

భువనమున భాష వేరైన తత్వమొకటే.

 

కె మల్లికార్జున రావు

********************* 


పవన ప్రభావం

నా కవనం పవనం వైపు పరుగులు తీస్తోంది.

కానీ ప్రతి నిమిషం మన పవనం వూరంతా తిరిగి 

మా భువనం లోని వంటల్లో 

లవణం సరిపాళ్ళ తో లేదేమో నని నను ఊగి లాడిస్తొంది. 

 

మురళి 

********


కవనము విదిత

పరచున్ సు కవుల మనము

లవణము సమకూర్చు సురుచిరమగు రుచిని

భువనము వెలుగు రవిశశి వున్న వేళ

పవనము చిలికించును విరి పరిమళములు

 

రమ, కంకిపాడు

***************


కందము 

పవనము వీచగ మదినిన్

కవనము రాయుచు గరిటను కలుపుచు బ్రమమున్

లవణము మిగులును వ్రేయగ

భువనము నంతట పరిచెను పులుసున తావిన్


ఎం.పద్మలత 

 ************

 

అశోకవనంలో త్రిజ ట అనే రాక్షస యువతి సీతమ్మకు కావలి గా ఉన్న సన్నివేశం ఆధారం గా...

(త్రి జ ట మంచి రాక్షసి)


ఆ యశోక వనము నందు త్రిజ.ట భలె

లవణమున వేగు శనగలు నములచుండ

నంతను యశో పవనములు తలచు చుండ

సంబరముగ తా త్రిభువనము నందు వెదికె


ఝాన్సీ

 ********

 

ఈ కాలపు ముంబై వర్షాలను చూసి చూసి..


ఏ కవనము రాసెదనీ సమయము

నీరు నీరాయే భరిణందు లవణము

హోరున పవనము ,భోరున వర్షము 

చిత్తడి చిత్తడాయే భువనము !!!


విష్ణుప్రియ 

 (భువనము అంటే భూమి అనుకొని) 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...