సమస్యా పూరణం
*******
చదువు నేర్చుకొనగ చవటలాయె
********
ఆ.వె.
ఆధునికత కొరకు నంగలార్చి సతము
విలువ నెరుగనట్టి వెడగు తోడ
తరతరాల సంప్రదాయములన్విడి
చదువు నేర్చుకొనగ చవటలాయె!
ఆ.వె.
చేవ తోడ సల్ప జీవన సమరమ్ము
సహకరింపనట్టి చదువు నేర్వ
వెక్కిరించి సతము వేవురనునుగద
చదువు నేర్చుకొనగ చవటలాయె!
********
చల్లా దేవిక.
---------------------------------------------------------------------------------------------------
ఆ వె 🌹
చెప్పెనపుడు నిటుల చెవిలోన వినుడని
చదువు నేర్చు కొనక చవటలాయె
వాడు వినక వెడలి పలికెనివ్విధముగ
చదువు నేర్చుకొనగ చవటలాయె
ఆ వె
వేలు వేలు పెట్టు పెద్ద చదువులిల
కొనిన చాలు నవియె కొంప ముంచు
బుద్ది బలము లేక వృద్ది శూన్యమగు నా
చదువు నేర్చు కొనగ చవటలాయె
కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి
--------------------------------------------------------------------------------------------------------
ఈ రోజు ప్రణాళికలో భాగంగా ఇచ్చిన సమస్యకు ఆటవెలది లో నా తొలి ప్రయత్నం
****
విద్య ఒసగు వినయ విజ్ఞతల్ అన్న నా
నుడి మరచి బడులను నడిపెడి ఘను
లు విలువలను మరచి వివరములేలేని
చదువు నేర్చుకొనగ చవటలాయె
✍️రమ, కంకిపాడు.
----------------------------------------------------------------------------------------------------
నా పూరణ తరువోజలో
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
తరువోజ
విదుషి యని తలచి వెలయాల్ని జేర
వెలుగులన్నియు బోయి వేదన మిగులు
మధువు జిందించెడి మంజికన్ జేర
మహిమలన్నియు బోయి మైకము కలుగు
ముదిత చెలిమి తోడ మోహము కలుగ
మొదట నేర్చిన విద్య మొక్కపోయె గద!
చదువులయ్య గణిక సజ్జకన్ జేర
చదువు నేర్చుకొనగ చవటలాయె గద!
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
విదుషి= విద్వాంసురాలు
వెలయాలి, మంజిక, గణిక = వేశ్య
చదువులయ్య= ఉపాధ్యాయుడు
సజ్జక= పడకిల్లు
వెంకట్. సిహెచ్
_---------------------------------------------------------------------------------------------------------------
సమస్య : చదువు నేర్చుకొనగ చవటలాయె !
సమస్యా పాదం ఆటవెలది లో.. ఇదే పంక్తితో భావంలో పద్య / వచన కవిత నాలుగు నుండి ఆరు పాదాలలో మీ పూరణ పంపించగలరు
గురువులకు, మిత్రులందరికీ నా నమస్సులు.
నా పూరణ
ఆ. వె
విత్తమిచ్చి కొన్న విద్య నొసఁగునె వి
నయము? యెటుల నేర్చు నరుడు నేర్పు ?
సత్తు లేని విద్య చంపదే మనుజులన్ ?
చదువు నేర్చుకొనగ చవటలాయె.
అవళూర్ సీత
------------------------------------------------------------------------------------------------------------------------
తెలుగు తేనియలు
తేది 19.08.2020
సమస్యా పూరణ
సమస్య చదువు
నేర్చుకొనగ చవటలాయె
లలితారెడ్డి
వచన కవిత
కరోనా వచ్చింది
బడులను మూసింది
విద్యార్థులoతా చదువు నేర్చుకోక చవటలాయే
ఆన్ లైన్ చదువులతో
ఆగమాగమవుతుంది
చదువoతా చట్టు బండలయ్యింది
భవిష్యత్తు ఏమిటో అర్ధము కానున్నది
లలితా రెడ్డి
________________________________________________________________________
వేదములుఅభ్యసించిరి,
వ్యాకరణం ఆసాంతమూ నేర్చెరి,
కానీ ఈ ఆధునిక కాలంలో, అక్కరకురాని
చదువు నేర్చుకొనగ చవటలాయె !!
గేయ రచన,
గాంగేయ శాస్త్రి, రాజమండ్రి,
-------------------------------------------------------------------------------------------------------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి