25, ఆగస్టు 2020, మంగళవారం

కవితలు

 

కవిత

నువ్వెళ్ళి  పోయాక..

*******

ఒకటి కాదు ..రెండు కాదు ఇరవై రెండేళ్ల  బంధం మనది!

రెండు దశాబ్దాల పాటు చెక్కు చెదరని స్నేహం మనది..!

చెదలు పట్టని  మైత్రి మనది!

నువ్వు మా ఇంట కాలిడినది మొదలు శుభాలు ఎన్నో  కురిపించావు..!

సంతోషాలు మరెన్నో పంచావు..!

 

ఊరూరా మావెంట తిరిగావు..  మా కష్ట సుఖాలు కళ్ళ చూసావు..

నిరంతరంగా నిరాటంకంగా నిజాయతీగా  ఇన్నేళ్లు అలుపెరగని సేవ చేసిన నీవు

మా నుండి ఇంతైనా ఏమీ కోరలేదు..!

ఏనాడూ మారం చేయలేదు..! ఏరోజూ మోసం చేయలేదు..!

" చల్లని తల్లివై " నిత్యం చల్లదనాన్ని పంచుతూ..

మా ఆరోగ్యాన్ని చక్కగా కాచావు..!

నీవిచ్చిన చల్లదనాన్ని మనసు కెక్కించుకోలేక

వేడి సెగలతోనే బుస కొడుతున్న మేము మనుషులం.కదా!.

మార్పును కాంక్షించేవాళ్ళం.కదా ..  కొత్తను కోరుకునే వాళ్ళం కదా..

అందుకే  మానవత్వాన్ని విడిచి..  ఇన్నేళ్ల నీ సేవలు మరిచి..

కొత్తను స్వాగతించి..  నీ స్థానంలో మరో దానిని ప్రతిష్టించి..

నిన్ను ప్రాణముండగానే కబేళా కు తరలిస్తున్నాం!

" వసుధ "


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...