26, ఆగస్టు 2020, బుధవారం

25.08.2020, చిత్రం, పై పద్యం - 41, అంశం : అమ్మ చేతి గోరుముద్దు



అమ్మ చేతి గోరుముద్దు

శుభోదయం 

తమ్ముడడుగంగ తమ్ముని ధ్వజము పైన

జేరి సాయమున్ ఘనముగా జేసె నాంజ

నేయుడు రణరంగమునందు నెమ్మి తోడ

భూతినిడు శుభోదయమనె పూసపాటి 





25 - 08 - 2020 ; ప్రణాళిక

శీర్షిక : చిత్రం పై పద్యం - 41

పై చిత్రానికి తగిన పద్యకవిత / వచనకవిత అందించగలరు

అంశం : అమ్మ చేతి గోరుముద్దు

 


అమ్మ చేతి  గోరుముద్ద

మధుర భావనల మధురాక్కర మాలిక లో ప్రయత్నము

మొలక స్థిరముగ నాటుఅమ్మ చేతి గోరు ముద్ద

 దేవుడైననూ చేయలేడు ఆయనకూ కావలయు

అమ్మ చేతి  గోరుముద్ద

 రాబోవు జీవన రణానికి మనల తయారు చేయుటకే

అమ్మ చేతి  గోరుముద్ద

 ఆ కమ్మన్నైన ముద్ద బుద్ధి యుక్తి శక్తి లకు

సాటి లేని  కొల బద్ద..

 మక్కువన తినుదము రండు అమ్మ వెచ్చని ఒడిలో నుండి

 సి.హెచ్. వెంకట్ 

 *****

తెలివిగల ఓ తెలుగోడా

ధర్మం జాడలలో నడుచుకొనుము.

బెజవాడ దుర్గమ్మ నిను దీవించును.

నిరతము ఆయమ తోడు నీకుండును.

సంకటాల నీడ నీకు దూర ముండును.

కె మల్లికార్జునరావు

*********************************************

 అమ్మ గోరుముద్దలు 

 అమృతానికి మారుపేరు 

అమ్మ చేతి గోరుముద్ద


పప్పన్నం నీకే అని

ఒక ముద్ద

ఇది నాన్న ముద్దని

ఒక ముద్ద

రుచి తెలియని నోటికి

ఒక ముద్ద

బోజ్జెడుస్తోందని 

ఒక ముద్ద

కథ చెప్పే ఆట తో

ఒక ముద్ద 

నెలవంక వంక తో

ఒక ముద్ద

బూచాడోస్తాడని 

ఒక ముద్ద

జేజిగారు చూస్తారమ్మోయని

ఒక ముద్ద

లాలి పాట పాడుతూ 

ఒకముద్ద

కాకికొకటి నీకొకటని

ఒక ముద్ద

తాతకి పెట్టేస్తా మరియని

ఒక ముద్ద

పెరుగన్నం చలవంటూ

మరోముద్ద

ఆఖరిముద్ద బలంరా అని

చివరి ముద్ద !!


ఇంకేముంది..అప్పోయింది....

ఇరుగు దిష్టి పొరుగు దిష్టి

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం

          

             విష్ణుప్రియ

 ****

 

 ఆట వెలది

అమ్మ చేతి గోరు ముద్ద...

సవిత కిరణ తేజ సమమైన యస్త్రము

లలిత రాగ మాల కలిత బలిమి

నిచ్చు విమలమైన నిజఘన శస్త్రము

నీరుఅమ్మ చేతి గోరు ముద్ద.....

నీరు - అమృతమను అర్ధములో

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పెథానేముంబయిమహారాష్ట్ర 

 ****

 అమ్మ చేతి గోరు ముద్ద

చందమామ చూపిస్తూ

అంతరిక్షం లో నక్షత్రాల లెక్కలు,

కొబ్బరాకు పై మెరిసిన వెన్నెల్లో "అనగనగా.." కథలూ,

చిట్టి చిలకమ్మ కబుర్లూ..

మెల్లగా  పోతన భాగవతం

వేమన శతకంఇంకా ఎన్నో ఎన్నెన్నో...

అన్నీ అమ్మ చేతి గోరుముద్ద లో "నంజు"   లే

అంతే కాదండోయ్...

అక్షరానికి మట్టి కస్తూరి అద్ది

జీవిత సమరం లో

అక్షర అస్త్రాలను ప్రయోగించే సాహితీ సైనికునిగా చేసిందీ,

కూడా అదే  అమ్మ చేతి కమ్మనైన గోరుముద్ద.

ఏమంటారు???

ఝాన్సీముంబై

***** 

 ముద్ద

బుజ్జి కన్నయా తినుమయ్య బుజ్జి ముద్ద

పప్పు అన్నముతో నిది పసిడి ముద్ద

నేతిలో ముంచితిని  నాదు నెమ్మి  ముద్ద

నవ్వు‌ తోడ తినవలెను నాన్న ముద్ద

రుచిని కూడిన నోటికి శుచిగ ముద్ద

బొజ్జ యేడ్పును బాపంగ బుజ్జి ముద్ద

కధను వినుచు తినవలయున్ కంచి ముద్ద

జాబిలిని కాంచి తినుమోయి చంటి ముద్ద

బూచి వాడడుగను నోట దాచు  ముద్ద

జేజి కనును వడిగ తినుము‌ చిన్న ముద్ద

జోల పాడెద తినినచో లాలి‌ ముద్ద

నీకొకటి నోట ముద్దయుకాకి కొకటి,

తాత కేలరా ఘనమైన జాతి ముద్ద

పిలిచి‌ చలువ నిడును గదా పెరుగు ముద్ద

చెలిమి తోడ బలము నిడు చివరి‌ ముద్ద

చిట్టి  నాతండ్రి తినెనుగా బెట్టి నట్టి

ముద్ద లన్ని ,యిరుగు దిష్టి పొరుగు దిష్టి

నరుని దిష్టి నెప్పుడు నీదు దరికి రాదు

 జీర్ణమగును గా వాతాపి జీర్ణ మగును

ననుచు బిడ్డకు తినిపించు జనని సతము

పూసపాటి

 ****

 కురిసే వెన్నెల్లో....చందమామ సాక్షిగా బాల్యం

విరిసిన వెన్నెల,

గోరుముద్ద తలచగా

బాల్యం - ఒదిగిన మన బలం,

గుర్రం ఆట తడుమగా

బాల్యం- మొదలైన మన లక్ష్యం,

అమ్మ ప్రేమ కురియగా

బాల్యం- చేజారిన మన స్వర్గం!

రాంమోహన్, నిజామాబాద్

 

చందమామ ని చూపి గోరు ముద్దలు పెట్టు తల్లుల తరము కనుమరుగైనదనే భావన తో

ఆటవెలది

చంద మామ రావె జాబిలీ రాయంచు

అమ్మ పెట్టునట్టి కమ్మ నైన

పాల బువ్వ కూడ వద్దని మారాము

సలిపె ముద్దు బాబు జాడ ఏది

రమకంకిపాడు.

 *****

 ఉత్పలమాల

అమ్మల గోరుముద్దలను లాలన జేయుచు ముద్దుముద్దుగా    

రమ్మని పిల్చి కౌముది విరాజిత కాంతులు జూపినంతనే 

కమ్మని జోలపాటలను గారము జేయుచు పాడుచుండగా  

కమ్మని కైతలన్ని నవకమ్రసరాగములన్ని పల్కినన్ !        

అమ్మలు జెప్పినట్టి కధ హాయిగ జాగృతిగల్గినట్లుగన్  

కస్తూరి శివశంకర్

 ****

 వెండి గిన్నె లో పాల బువ్వ పెట్టుకొని

ఇప్పుడొద్దని ఆడుకోవాలని 

మారాము చేసే బుజ్జాయిలకు 

అమ్మ లందరూ చెప్పే కథలొక్కటే

నాఅమ్మ పండు ఎక్కడుందమ్మా

నా బుజ్జి పండు ఎక్కడుందమ్మా 

నా ఆపిల్ పండు ఎక్కడుందమ్మా 

నా అరటిపండు ఎక్కడుందమ్మా 

వచ్చేయాలి త్వరగా...

వచ్చేయ్ వచ్చేయ్ త్వరగా వచ్చేయ్

గుడ్ మా అమ్మ బంగారు

మా బుజ్జి బంగారు

అంటూ చంక నెత్తుకుని

మా మంచి బుజ్జాయి అంటూ

ఇది నాన్న ముద్ద .....

ఇది తింటే నాన్న నీకు బోలెడు బెలూన్లు తెస్తాడు 

ఇది అక్క ముద్ద.. ....

ఇది తింటే అక్క నీకు బోలెడు చాక్లెట్లు ఇస్తుంది

ఇది అన్న ముద్ద.....

ఇది తింటే అన్న నీకు ఐస్ క్రీం కొనిస్తాడు

ఇది అమ్మమ్మ ముద్ద ...

ఇది తింటే అమ్మమ్మ నీకు

బోలెడునేతి మిఠాయిలు చేస్తుంది నీకోసం ఇది తాతయ్య ముద్ద .....

ఇది తింటే తాతయ్య నీకు బోలెడు కథలు చెప్తాడు

ఇది జాబిలమ్మ  ముద్ద....

ఇది తింటే పరిగెత్తుకుని నీతో

ఆడుకోవడానికి వస్తాడు

ఇదేమో నా ముద్ద ....

ఇది తింటే మంచి చదువు బోలెడుతెలివి తేటలు వచ్చి తొందరగా పెద్దవానివి అయిపోతావట 

ఇదేమో ఆఖరిముద్ద ..

ఇది తింటే ఎంత బలం ఉందంటే బోలెడంత 

అంటూ ఎన్నో కథలు చెప్పి 

బుజ్జాయి చిన్ని బొజ్జ కు

కడుపునిండా బువ్వ పెట్టి 

ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అంటూ

దిష్టి తీసి చిన్ని బొజ్జ కు శ్రీరామరక్ష అంటూ 

ఆశీర్వదించేది ప్రపంచంలోఅమ్మ ఒక్కతే. 

అమ్మకు అమ్మే సాటి

అమ్మకు లేరెవరు పోటీ

విజయ 

 *****

 అందమైన జాబిలి చెంత యమ్మ పెట్టెడి ముద్దయే

విందు వలె కమ్మగగుపించు వినువీధి నందు కను

విందు చేసెడి చల్లని విభుడిని దిగిరమ్మని

నందనముగ పిలిచెడి జనని జూడ యపురూపమే!

చందురుడి తోడ ముచ్చట్లు  జరిపెడి చంటిబిడ్డే

సందడి సలుపు చిన్ని  కృష్ణయ్యవలె ప్రతిగేహ

మందు సంతసమివ్వగ నది యతిశయము గాదె!

చిందు లేసెడి యల్లరి చిరుతతనము మనసు

నందు జ్ఞప్తికొచ్చి సతత మబ్బురము కలుగునే!

వెంకట్.సి హెచ్

 ****

 ఆటవెలది

చందమామ చూపె సక్కని మాయమ్మ

బువ్వ పెట్టి  తనను బుజ్జగించె

కమ్మనైన కథల కాంతుల వెలుగుల

కడుపు నింపి తాను కరిగి పోయె

 ****

 

బండి పైన యెక్కె బాలవెంట నడిచి

ముద్ద పెట్టి జనని మురిసి పోయె

కన్నతల్లి కన్న కమనీయ కావ్యము 

కాన రాదు యిలన కరుణ మూర్తి 

సి.హెచ్. రజిత

**** 

 

అమ్మ చేతి గోరుముద్ద అమ్మే గా సృష్ఠి కి మూలం 

అమ్మ చేతి గోరు ముద్ద బలం 

తన రక్త మాంసములె ప్రసాదంగా ప్రసవించి 

ఆ నెత్తుటి గడ్డనే తన బిడ్డగ స్వీకరించి 

పొత్తిళ్ళలో ఒత్తిళ్లలో తను పెంచే క్రమము 

జగత్తులో సరిలేదు మరే కమ్మదనము 

చిట్టి పాత్రలో నెయ్యి పప్పన్నము 

మురిపాలతొ కలిపే ఆ క్రమము 

ముద్దు మురిపాలతోటి తన ప్రేమను రంగరించి 

నోటికందించే ముద్ద ముద్దు మురిపాల ముద్ద 

చప్పరిస్తే ముద్ద సప్తరుచుల సంగమము 

వి.వి.శ్రీనివాస్

**** 

 జాబిలిని పిలచి జవరాండ్రు తినిపించె  గోరుముద్దలపుడు కొసరి కొసరి 

జాబిలిని మరచి   జాబుయే ముఖ్యమని  తలచు చుండిరి నెలత లిపుడు

అమ్మ  ముద్దని పల్క నమ్మ యెవరనుచు   నచ్చెరువుగ నేడు నడుగు చుండు

నౌకర్ల నిప్పుడువాకిలి విడవ రాదని చెప్ప బిడ్డకు కనబడదుగ

నింగిలో జాబిలిభంగము కలుగుగా తాత పేరును దెల్పరోత పలుకు 

వలదని కలకంఠి వారించ తాత బామ్మల ముద్ద కరువాయె ఖలము లోన,

 నేయి కొలస్ట్ఱాలు నెప్పుడు పెంచుగా  ననుచు నేటి లలనల్ కొనని యెడల 

నే రీతి తినెదరు నేతిముద్దలిపుడుకలవర పడునుగా తలచి నంత 

బూచి వాని ననుచు పూర్తిగా మరచిరి వాని ముద్దల నన్ని వనిత లిచట,

ఆరు  రోజులపాటు  ఆయాయె తినిపించ ఆదివారము నాడు ఆగడమును 

చేయుచు నుండెడి  చిన్నారి  బాలుని కసిరి పస్తుల నుంచు ఘనత తోడ

పెద్దలున్నయెడల వద్దు పెండ్లియనుచు తలచెడి దినములన్  తల్లి ముద్ద

లెప్పుడు తినిపించు నిప్పురమున జాబు ముఖ్యమై జాబిలి మూగ బోవ

సెల్లు ఫోనులో జూపించి తల్లి మురియు 

రోజు లన్ గోరుముద్దలు బూజు పట్టె

నేతి ముద్దలీ దినమున రోత నిడును

నిక్కమిదియె తెలుసుకొమ్ము నేటి యువత 

పూసపాటి

 ****

 గోరుముద్దలు గురుతులు 

గతంలోకి   జారిపోయినా 

అందరికీ కలిపి  పెట్టే  అమ్మ

ముద్దలు  గుర్తు వున్నాయి 

అక్కా చెల్లెళ్ళు,  అన్నదమ్ములు 

అంతా కలిసి  కూర్చుని  సరదా

కబుర్లు,   చిన్న  చిన్న పేచీలు 

చిట్టిపొట్టి  అలకల  మధ్య 

ఎంత తినేవారమో  తెలిసేది  కాదు 

పాపం,  అమ్మా  నాన్న  మళ్ళీ  

వండుకోవాల్సి వచ్చేది. 

ఓపిక లేకపోతే  పస్తులే. 

కానీ  మాకేం,  మా  బొజ్జలు నిందేవిగా. 

అమ్మ  పెట్టిన  ముద్ద  అపురూపం 

నాన్న పెట్టిన ముద్ద  అద్వితీయం 

వీధిలోని పిల్లలంతాసందడి  చేస్తూ 

ఆటల మధ్య  ఏ ఇంట్లో  దూరితే 

వాళ్ళు  మళ్ళీ  వండుకోవాల్సిందే 

వినాయక చవితి పేరుతొ  ప్రసాదాల 

పంపిణీలు శివరాత్రి  ఉపోషం  పేరుతొ 

ఫలహారాలుఇంక కలిసి  చదువుకోవడం 

మాట వస్తే,  గదిలోనికే  అన్ని  సప్లైస్ 

మరీ  మేము  కస్టపడి  చదువుకుంటున్న 

మహారాణులం కదా 

పెరిగిన  ధరలు,  తీరని కోరికల సమన్వయానికి 

సమాధానం నాలుగు  చేతుల పని,  రెండు జీతాలు 

పని ముగించు కొని  కార్యాలయానికి  వేళకు 

చేరాలనే తాపత్రయపు తన్నులాటలో 

పిల్లలకు గోరు ముద్దలెక్కడ ? జాబిలి  కబుర్లు

ఉండేవేమో.సాయంకాలం ఇంటికి  త్వరగా  వస్తే 

ఈ కాలం పిల్లలకు  జాబిలిని  నక్షత్రాలని కూడా 

చరవాణిలోనే  చూపించాల్సి  వస్తుంది. 

ఎలా  అయితేనేం వాడి  బొజ్జ  నిండాలనే తపన 

తరాలు  మారినా  అమ్మతనం  మారలేదుగా

అవళూరు  సీత

 ****

 

మాతృ గర్భములో పిండము గా రూపు దిద్దుకొనె

నవమాసాలు నిండిన వెంటనే మొగ్గ లాగా విచ్చుకొని బయటపడెన్

దినదిన ప్రవర్ధమానంగా తల్లిపాలతో చిన్ని కృష్ణుడి లాగా పెరిగెన్

చిన్ని తండ్రి నా కన్నతండ్రి నా బుజ్జి తండ్రి తిను నాన్న 

అంటూ అమ్మ బ్రతిమాలుతూ ఉండగా దోబూచులాడెన్

అమ్మ చుట్టూ తిరుగుతూ  తింటే అమ్మ ఎక్కడ వెళ్లిపోతుందో అని ఆ బాలకృష్ణుడు మారాము చేసెన్

అంత ఆమాతృమూర్తి ఆ నెల రాజును చూపుతూ

చందమామ రావే జాబిల్లి రావే  మా చిన్ని కృష్ణుని చూచి పోవే

అంటూ గానము చేసెన్

ముద్దుగా నాన్న ముద్ద 

అమ్మ ముద్దఅందరి ముద్దలు అంటూ గోరుముద్దలు తినిపించెన్

అందరి దృష్టి తగులునని చివరగా మాతృ ప్రేమ తో

తన చీర కొంగుతో దృష్టి తీసెన్

డి నాగమణి

 ****


కడుపులోన మోసి

జీవమును  పోసి

కనులలోన దాచి

పాలామృతము నిచ్చి

నవ"రసాలు"కలిపి 

జిహ్వ త్రుల్లి పడుగ చేయు

అమ్మ చేతి గోరుముద్ద

మధురమగు బాల్యాన్ని

మరింత మధురం చేసేదే

అమ్మ చేతి గోరుముద్ద

జన్మ ఉన్నంత వరకు

తీపి స్మృతి అయ్యేదే

అమ్మ చేతి గోరుముద్ద

రాముడు కూడా 

అమ్మ చేతి గోరు ముద్ద తిని

జగదభిరాముడయ్యాడు

కృష్ణుడు కూడా

అమ్మ చేతి వెన్న ముద్ద తిని

కృష్ణభగవానుడయ్యాడు

నేటితరం తల్లులూ

గ్రహించండి గ్రహించండి

అమ్మ  ముద్ద మహిమను.

కె మల్లికార్జునరావు

 ****

 చెరుకు గడల కన్నా తీపి

అమ్మచేతి  గోరు ముద్ద


అన్నంలో అమ్మ ప్రేమను

కలిపి చేసిన ముద్ద

అమ్మ చేతి గోరు ముద్ద


గోముగా ముద్దాడి

నోటి కందించు ముద్ద

అమ్మ చేతి గోరు ముద్ద


చందమామ కథలు చెప్తూ

ఊరించి ముచ్చటలాడి

నవ్వించి మచ్చికచేసి

కొసరి కొసరి తినిపించేదే

అమ్మ చేతి గోరు ముద్ద


పిల్లల భవితకు గెలుపు

మొలక స్థిరముగ నాటు

అమ్మ చేతి గోరు ముద్ద


దేవుడైననూ చేయలేడు

ఆయనకూ కావలయు

అమ్మ చేతి  గోరుముద్ద


రాబోవు జీవన రణానికి

మనల తయారు చేయుటకే

అమ్మ చేతి  గోరుముద్ద


ఆ కమ్మన్నైన ముద్ద

బుద్ధి యుక్తి శక్తి లకు

సాటి లేని  కొల బద్ద..


మక్కువన తినుదము రండు

అమ్మ వెచ్చని ఒడిలో నుండి

కె మల్లికార్జునరావు

**** 

గోపికల పలుకులు:-

ఇదేనండి ఇదేనండి మాకు విభూది

రేపల్లె వాడలో గోపాలుడి  అడుగుల

జాడల నున్న ధూళియే మా విభూది

ఈ విభూది రేణువు లంద గుపించు

మా ప్రియతమ  దేవుడు శ్రీకృష్ణుడు

దీని  దివ్య పరిమళం మాకు పవిత్రం

ఈ విభూది తనువుకు రాసుకొన్నచో

కన్నయ్య తోడున్నదని మా విశ్వాసం

ఆ విభు నీడన ఉంటిమని ఆనందం..

కె మల్లికార్జున రావు

**** 

 అదిగదిగో చందమామ.

గోరుముద్దతో ఈ అమ్మ....

నా చిన్ని కన్నా. 

అమ్మ చేతిముద్ద...

అమృతము కన్న మిన్నగా,

కలిపాను ప్రేమతో వెండిగిన్నెలో...

అమ్మ చేతి ముద్ద,

కడుపార తినగా దిష్టి తీస్తాను మనసారా...

అలుపెరుగని ఆటపాటలతో,

అలసిపోతావురా నా నాన్న...

ఈ ఒక్క ముద్ద తిని,  

అమ్మ వడిలో సేదతీరి

హాయిగా నిదురపో...

సూర్యతాడిపూడి.

 ****

 

గేయ కవిత

అమ్మ చూపు చల్లదనం

అమ్మ ఒడి వెచ్చదనం

అమ్మ పలుకు తీయదనం

అమ్మ చేతి గోరుముద్ద

మరి ఎక్కడా దుర్లభం. 

గాంగేయ శాస్త్రిరాజమండ్రి

 ****

 

నిండు జాబిలి 

విరగ కాసెనే వెన్నెల 

ముద్దు తనయుడు 

బుజ్జి పొట్టకి గోరుముద్దలు 

రామచిలుక చిట్టి పలుకులు

అమ్మ మోములోన 

ఆనందపు హరివిల్లు

అందరి మదిలోన 

వెల్లివిరిసెను ఇంద్రధనస్సు రంగులు 

చిట్టి పాపాయి లేలేత నవ్వులు

వింజామరులుగా 

వీచెను కొబ్బరిఆకులు

అరవిచ్చెను తారకలు 

వినువీధిన హారంలా

అమ్మ నవ్వు రక్షగా 

నేల పై ఆకుపచ్చ సాక్షిగా

ముద్దుల పాపడు అడుకుంటున్నాడు

మనందరికీ ఆనందం పంచాడు

కోవూరి

****

 

తేటగీతి

చందమామను జూపుచు నందనముగ

గోరుముద్దలు దినిపించ కొసరి కొసరి

ఆడి పాడుచు బుజియించె (ఆ)నాదమరచి

అమ్మ ప్రేమయె జగతిన అమరపథము

మహేశ్ ముత్యాల

**** 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...