దత్తపది - 32 తోడు - నీడ - వాడ - జాడ
తోడు కూడ లేక తోలుకు పోతారు
నీడ కూడ రాదు నీదు వెంట
వాడ వాడ తిరిగి వ్యాధిని పొందకు
జాడ కూడ లేక జారి పోవు.....
జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి, మహారాష్ట్ర
****
దత్తపది - 32 తోడు - నీడ - వాడ - జాడ
సహనమే నీకున్న తోడు
శాంతమె నీ మనసునీడ
అదియే మానవతావాడ
అక్కడే మనిషి అడుగుజాడ! .రాం మోహన్...నిజామాబాద్
డి. నాగమణి
****
దత్తపది - 32 తోడు - నీడ - వాడ - జాడ
కలువ పువ్వు కు వెన్నెల తోడు
మనిషికి నీడ తోడు
వాడలోని జనాలు ఒకరికొకరు తోడు
ఏ జాడ లేనివారికి ఆశ్రమాలు తోడు.
తోడు గ నెవ్వరు రారే
నీడ యు జనలేదు తుదకు నీతో శివుడా
వాడ ను తిరుగుట మానుము
జాడ యు మిగలదు జగతిని జాలియు లేకన్.....
జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి, మహారాష్ట్ర
దత్తపది - 32 తోడు - నీడ - వాడ - జాడ
తోడు నీవని తెలియగ తూగె మనము
వాడ వాడల వెదికితి జాడ గనక
అలసి పొన్నల నీడల నాగి చూడ
మాటున మసలే కృష్ణుడే మరలి వచ్చె
అవళూరు సీత
****
దత్తపది - 32 తోడు - నీడ - వాడ - జాడ
నా వాడ వు నీవు నీ దానను నేను
అనుచు శ్రీరాముని అడుగు జాడ లోన
అడవికి నడచిన సీతమ్మ కి
కారడవి సైతం నందనవనముముగ
తోచె అరమరికలు లేక
ఆలుమగలు ఒకరికొకరు
తోడు నీడగా కలసి నడచిన నాడు
చింత జాడ లేక జీవింతురు శ్రీకరముగ
రమ, కంకిపాడు.
****
దత్తపది - 32 తోడు - నీడ - వాడ - జాడ
నీ స్మరణే తోడు గ నిలపె నిరతము , నట్టి. భక్తకోటికిన్ !
నీ అడుగు జాడ లే జీవన సన్మార్గ మై మెదిలిన యోగిపుంగవులకున్
నీ తలపుల నీడ లో తనువు సేద తీర్చకొన్న భక్త శిఖామణులకున్
నీ కై తపించి గానమాలాపించుచూ వాడ వాడలా తిరిగిన సంగీత సామ్రాటులకున్
ఇదే నా మనసా శిరసా పాదాభివందనం
లలితా దీక్షిత్
దత్తపది - 32 తోడు - నీడ - వాడ - జాడ
గొల్ల వాడ లోని గోపకన్నెలు,
గోవిందుడు తమకు తోడు గా,
నీడ గా తమ వెన్నంటే వుంటాడనుకుంటే,
మధుర వెళ్లిన కృష్ణుని జాడ తిరిగి గానరయ్యే!
గాంగేయ శాస్త్రి, రాజమండ్రి
****
దత్తపది - 32 తోడు - నీడ - వాడ - జాడ
ఆటవెలది
తోడు మనిషి యుండ తోవ నందు కదులు
నీడ గాను మనసు నిలిచె నంట
వాడ లందు వచ్చె గొడవలెన్నో బాప
జాడ రాడు మనిషి జాలి చూప!
సి.హెచ్. రజిత, కరీంనగర్
****
దత్తపది - 32 తోడు - నీడ - వాడ - జాడ
ఆటవెలది
తోడు నీవు వుండ తోయజాక్ష భయము
వీడి నీదు వలపు నీడ లోన
సేదతీరి మురిసె సీత రాముడు తన
వాడ ను కొని చింత జాడ మరచి
రమ, కంకిపాడు
****
దత్తపది - 32 తోడు - నీడ - వాడ - జాడ
భావ కవిత
1.
వాడవాడలా వెలసేను
ఒక నాడు నీ పందిల్లు
వాటి జాడ లేదు నేడు
కోపించకుము గణేశ దేవా
మనమ్ముల ప్రతిష్టించితిమి
తోడుగా ఉండి కాపాడుము
నీ నీడలో మము నిలుపుము
2.
నీలాపనిందలు బాపుకొనగ
శమంతకమణి పొందుటకు
వాడ లెల్లా వెతికినన్ గానక
కడకు కానలకేగె శ్రీకృష్ణుడు
సింహము పాద జాడల వెంట
చని గుహ యందు మణి జూచె
కపి రాజు జాంబవంతుడుగ్రుడై
మురారి తో రణమొనర్చి ఓడి
శ్రీకృష్ణుని శ్రీరామునిగా ఎరిగి
అపరాధము క్షమించమని వేడి
దివ్య శమంతకమణి సమర్పించె
పుత్రి జాంబవతిని పరిణయమాడి
దయతో తోడు నీడ నొసంగుమనె
తనకు ముక్తి ప్రసాదించమని కోరె.
కె మల్లికార్జునరావు.
దత్తపది - 32 తోడు - నీడ - వాడ - జాడ
భావ కవిత
1. వాడవాడలా వెలసేను ఒక నాడు నీ పందిల్లు
వాటి జాడ లేదు నేడు కోపించకుము గణేశ దేవా
మనమ్ముల ప్రతిష్టించితిమి తోడుగా ఉండి కాపాడుము
నీ నీడలో మము నిలుపుము
2. నీలాపనిందలు బాపుకొనగ శమంతకమణి పొందుటకు
వాడ లెల్లా వెతికినన్ గానక కడకు కానలకేగె శ్రీకృష్ణుడు
సింహము పాద జాడల వెంట చని గుహ యందు మణి జూచె
కపి రాజు జాంబవంతుడుగ్రుడై మురారి తో రణమొనర్చి ఓడి
శ్రీకృష్ణుని శ్రీరామునిగా ఎరిగి అపరాధము క్షమించమని వేడి
దివ్య శమంతకమణి సమర్పించె
పుత్రి జాంబవతిని పరిణయమాడి
దయతో తోడు నీడ నొసంగుమనె
తనకు ముక్తి ప్రసాదించమని కోరె.
కె మల్లికార్జునరావు.
****
దత్తపది - 32 తోడు - నీడ - వాడ - జాడ
శ్రీరాముని తోడు నీడ సీతమ్మ
రావణుని చెరలో బంధింప
బలపరాక్రమశాలి హనుమంతుడు
లంక లోని వాడ వాడ వెతికి
జానకి మాత జాడ కనుగొనే.
డి.నాగమణి.
****
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి