శృంగారరసం
తే.గీ
అగరు తావులు ధూపమ్ములలకలందు
కరము పారాణి వన్నియ పరుగునట్టి
రమ్యపల్లవ బింబాధరములు గనిన
తిండి మానఁగ నాకలి దీరి పోయె
కరుణరసం - భక్తి :
తే.గీ
రామమందిర భవ్య పరవశములవి
గాంచిన మనసులకు నేడు వాంఛితమ్ము
మనసు పరిమళించెను నేడు మధుర రీతి
తిండి మానఁగ నాకలి దీరి పోయె
భయానకం - భయం
3 - తే.గీ
భీకరంబగు అరిజూచి భీతి చెంది
వేదనలు రగిలెన్ మనోవీధిలోన
దిగులుచెందిన వైరులే వగచినంత
తిండి మానఁగ నాకలి దీరి పోయె
4 - తే.గీ
రోగబాధలు క్షీణించు వేగిరముగ
వట్టి మాటలు వీడుచూ, వ్యర్థపు చిరు
తిండి మానగ : నాకలి దీరి పోయె
నియతి జూపు ఫలించును నేర్పుతోడ
తే.గీ :
ప్రణయరాగాల మంజుల పరవశమున
వలపు భావాల తావుల తలపులపుడు
గంధములదిన సురిటీల గాలి చేత
"తిండి మానఁగ నాకలి దీరిపోయె"
కస్తూరి శివశంకర్
---------------------------------------------------------------------------------------------------------------
తే గీ 1
పూజ జేయగ తలచిన పుడమికిపుడు
పస్తులుండుట మంచిది పగలు నేడు
రాము డిచటకు వచ్చెడి రాజ్యమందు
తిండి మానగ నాకలి దీరిపోయె
తే గీ 2
కష్ట కాలము నందున కంటి కెదుట
తోడు లేకను నెవ్వరు గోడు వినక
నాకలనుచు వారలకు నన్న మిడుచు
తిండి మానగ నాకలి దీరిపోయె
కళ్యాణ్ చక్రవర్తి; ముంబాయి
------------------------------------------------------------------------------------------------------------------
విసిగి వేసారి, విఘ్నాల వెతలు దీరు
క్రతువు జేయగ, నుపవాస వ్రతము సల్పి
తిండి మానఁగ, నాకలి దీరిపోయె
శాంతి నిండిన మనము విశ్రాంతి నొంద
✍ తే. గీ. డా. నాగులపల్లి
-----------------------------------------------------------------------------------------------------------------
నేటి అయోధ్యా నగర వైభవం చూసి కళ్ళు చెమర్చాయి
మనసు నిండిపోయింది
తే. గీ
రామ భక్తినే హృదయపు ధామమందు
మనసు నిండగ దేవుని మైకమందు
గగనమంటిన మోక్షము, కడుపు నిండె
తిండి మానఁగ నాకలి దీరి పోయె
శ్రీదేవి
_____________________-----------------------------------------------------------------------
తిండి మానఁగ నాకలి దీరిపోయె"
సరదాగా నేటి ఉద్యోగస్తుల పై వ్రాసిన సీస పద్యము
(ఉద)యము బెడ్ కాఫి (ముద)ముగ త్రాగుచు
(దం)తావధానము (త)దుపరి మర
(ల) నొకమారున్ టీ ని (ల)క్షణముగ నేను
(సే)వించు చుంటిని, (చి)న్న సైజు
(పూ)రీ లొక పదిని (పొ)ట్ట లోనికి పంపి
(నా)ఫీసు కున్ వెళ్ళి (నా)డ నడక
(లే)క, మీటింగులన్ (లె)క్కకు మించి నే
(బి)స్కె ట్లు టీలను (బి)డియ పడక
(పం)పు వాడను పట్టు (బ)ట్టి, సతి యి
(చ్చి)న బాక్సు పనిమని(షి)కి నొసంగి
(బి)ర్యాని నేను తె(ప్పిం)చు కొని భుజించు
(వా)డను, గంటలు (మూ)డు జూప
(గ)డియారమున, లేచి (క)మ్మ నైనట్టి స
(మ్మో)సా లెనిమిదిని (తో)సి పొట్ట
(లో)నికి నే సీటు (లో)నికి జారెడి
(వా)డ, నాఫీసును (వ)దలి స్నేహి
(తులు) పిల్వ పిస్తాలు (సులు)వుగ రెండునే
(తి)నుచు నుండెడి వాడ (తి)రిగి తిరిగి
(యి ల్లు)ను జేరగ (నిల్లా)లు వండిన
(బ)జ్జీలు నాలుగు (భం)గ పడక
(నుద)రము లోనికి (పది)లముగా నేను
(నె ట్టు)వాడ, పదిని (గొట్ట)గ గడి
(యార)ము హోటలు (వారు) పంపిన జంకు
(ఫు)డ్డు నేను భుజించి (పొ)రలు చుండు
(వా)డను గా నిద్ర వచ్చు (వ)రకు నేను,
(లి)వరు చెడె, షుగరు (లె)వెలు పెరిగె
(గుం)డె నడక నాకు (కుం)టు బడెను, పొట్ట
(స)మ్మెతో నాకలి (చ)చ్చి పోయె
(యాం)టి బయాటిక్సు (హా)ని నిడగ నాంగ్ల
(వై)ద్యము వికటించె, (వాం)తు లందు
(ర)క్తము పడుచుండె, (ర)క్షించు ప్రకృతి
(వై)ద్యమని తెలుప (వ)దలి యాశ
(లన్ని) నాపై జేర్చె (నన్ని)చట, పలుర
(కము)ల కషాయముల్ (విము)ఖత నిడ
(వ)లదనె వలదనె నాలుక బల(వం)తముగ నాకు
(త్రా)గించ నెలలొన (త)గ్గి పోయె
(లి)వరు జబ్బు, ఫలము (లె)న్నియో తినుచుండ
(తరి)గెను దోషముల్, (పెరి)గె చెత్త
(తిం)డి మానంగ నాకలి, (దీ)రిపోయె
(బా)ధ లన్నియు ప్రకృతి (వై)ద్య విధిని
(మొ)దలు పెట్టగ నని పల్కె (ము)దము తోడ
(బం)ధువుల తో డ నొక్కడు (బా)ధ మరచి
పూసపాటి
-----------------------------------------------------------------------------------------------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి