22, ఆగస్టు 2020, శనివారం

కోతి కొమ్మచ్చి రచయిత: శ్రీ ముళ్లపూడి వెంకటరమణ

పుస్తకం:     కోతి కొమ్మచ్చి

రచయిత: శ్రీ ముళ్లపూడి వెంకటరమణ

ఇది ముళ్ళపూడి వారి ఆత్మకథ.

కథనం:

 ఒక విషయం నుంచి ఇంకో విషయానికి వెళ్ళిపోతూ ఉంటారు.అందుకనే కోతి కొమ్మచ్చి అనే పేరు పెట్టాను అని చెబుతారు.

ఆత్మకధలో ఆత్మస్తుతి చేసుకోవాలని రాయవద్దు అనుకుంటే స్వాతి ఎడిటర్ బలరాం గారు  పట్టుబట్టడం వల్ల తప్పలేదు అంటారు.

కథ: ముళ్ళపూడి వారిది బ్రతికి చెడ్డ కుటుంబం.వాళ్ళ బంధుప్రీతి, అతిథి సత్కారాల వల్ల ఆస్తి హారతి కర్పూరం అయింది.తండ్రి గతించిన తర్వాత తల్లీ,అమ్మమ్మా తో చెన్నై చేరిన వారికి దుర్గా భాయ్ దేశుముఖ్ గారు ఆశ్రయం కల్పించారు.తల్లి చెప్పిన మాటలు "ఒకరికి డబ్బు ఇచ్చాక దాంతో వారేం చేసారో అడక్కూడదు" " జీవితం లో పైకి వచ్చిన తర్వాత వచ్చిన దారిని, సహాయం చేసిన వారిని ఎప్పుడూ మరచిపోకూడదు' అన్నమాటలు శిరోధార్యం అంటారాయన.


అన్ని విద్యలూ నేర్చుకొంటే ఏదో ఒక విద్యా కష్టకాలంలో ఆదుకుంటుంది.తల్లి నేర్పిన ఈ పాఠం జీవితంలో బ్రతుకు భయం లేకుండా చేసింది అంటారు.ఆ రోజుల్లో కొంత మంది గొప్పవారు వచ్చిన వారందరికీ ఆహార, వసతి సౌకర్యాలు కల్పించడం అభినందనీయం.

నేను చెన్నై లో ఉన్న రోజుల్లో ఎంతోమంది తల్లులు నన్ను ఆదరించారు అని చెప్పారు.తన కష్టాలను మనల్ని నవ్వించేలా చెపుతారు.ఆ చెప్పటంలో ఆ పద విన్యాసాలు చదివితేనే తెలుస్తుంది. ఉదాహరణకు తండ్రి మాట" నేను లాయర్ని.

నువ్వు లాయరు కావాలి- లా పాసవు. తరవాత నీ ఇష్టం". తండ్రి మాట జవదాటని బాపు ఆLLAWగే అని LAW పాసై మెడ్రాసు హైకోర్టులో ఎడ్వకేట్ గా రిజిస్టర్ అయ్యాడు.తరవాత బాంబే వెళ్దాం అనే వేళకి ముందే తండ్రి గతించారు.  

నీ ఇష్టం అన్నారుకాబట్టి అ-LAW రూటు వదిలి 'ఇలా'స్ట్రేటర్ రూటులో ముందుకు సాగాడు. బాపుతో తన స్నేహం,పత్రికా రంగంలోని జర్నలిస్ట్ ( నేర, రాజకీయ, సినీ)  అనుభవాలు... అందులో భాగంగా హేమమాలిని, జయలలితల స్క్రీన్ టెస్ట్ కమామీషు.కథలో జోకులు , జోకుల మధ్యలో కథ చెపుతారు.

స్నేహితుడు ఇంట్లో భోజనం చేస్తూ స్నేహితుడు అమ్మా ఉప్పు తక్కువ అయింది అంటే "ఎలా రమణా నువు చెప్పరా?" అంటే " లేదమ్మా పప్పు ఎక్కువ అయింది" "రమణ సరిగ్గా చెప్తాడు అన్న ఆమె, వాక్యంలో మెలిక అర్థం అయి నవ్వింది.ఇదే సూత్రం సినీ సమీక్షలు రాయడం లో అక్కర కొచ్చింది అంటారు.ఎందరో మహా మహులను పరిచయం చేస్తారు ఆయన.

అందరూ తప్పక చదవవలసిన పుస్తకం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...