25, ఆగస్టు 2020, మంగళవారం

 

అమరావతి కధలు

రచయిత సత్యం శంకరమంచి

కధ : అరుగరుగో సుబ్బయ్య మాష్టారు

 తెలుగు తేనియాలు సాహితీ మిత్రులకు నమస్సులు. ఈవారం శంకరమంచి సత్యం

గారి అమరావతి కధల్లోని  అరుగరుగో సుబ్బయ్య మాష్టారు కధని మీకు పరిచయం చేస్తున్నందుకు చాలా సంతోషం గా కూడా ఉండి. గురు శిష్యులా మధ్య పెనవేసుకేనే సున్నితమైన అనుబంధం ఈ కధ లోని ప్రతి అక్షరం లోనూ తొంగిచూస్తుంది.

మా నాన్న  గారు కూడా  ఉపాద్యాయులే కావడం వలన నేను వాస్తవం లో కూడా దగ్గరగా చూశాను. పిల్లలలికి గురువు పైనే ఉండే మమకారాన్ని .

మా నాన్నగారికి బదిలీ అయినప్పుడు పిల్లలు ఏడుస్తూ గ్రామ పెద్దల దగ్గరకు వెళ్ళి మాకు ఈ మాష్టారే కావాలి అని అమాయకంగా అడగటం మాకు గుర్తే. బహుశా పాఠశాలతో పిల్లలితో ఉన్న

ఆ అనుబంధం వలనే ఏమో పదవీ విరమణ అయిన సంవత్సరనికే

హార్ట్ ఎటాక్ తో చనిపోయారు. అప్పటికి ఈ అమరావతి కధలు నేను చదవలేదు.

ఈ కధ చదివిన

ప్రతి సారి నా కంటి లో కదిలే కన్నీటి బీదువుల మధ్య సుబ్బయ మాష్టారి లాంటి ఉపాద్యాయులు కదలాడుతూ ఉంటారు    

అరుగో సుబ్బయ్య మాష్టారోస్తున్నారు. అంటే సుబ్బయ్య మాష్టారు రావటం లేదు. ఒక గేదె,

ఓ దూడ స్కూలు ఆవరణలోకి అడుగుపెడుతున్నాయి. వాటి వెనకాల ఇద్దరు కర్రలుపుచ్చుకుని వాటిని తోలుకుంటూ వస్తున్నారు. అవి సుబ్బయ్య మాష్టారి పశువులు , వాళ్ళిద్దరూ సుబ్బయ్య మాష్టారి  శిశువులు. ఆవరణలో గునపాలు పాతి ఆ గేదెని దూడని కట్టేశాక ఎవరి క్లాస్ కి వాళ్ళు వెళ్ళిపోయారు పిల్లలు. ఆ వెనుక సుబ్బయ్య మేష్టారు వచ్చారు  ఇంకో సంవత్సరం లో రెటైరు కావాలి. వాలిపోతున్న కళ్ళజోడు సర్దుకుంటూ నేల చూస్తూ సర్దుకుంటున్నారు.

మేష్టారిని చూడగానే గేదె మొరేత్తి అరిచింది. మేష్టారు దగ్గరకెళ్ళి  మూపు నిమిరి నాలుగు గడ్డి పరకలు నోటికందించి క్లాస్ కి టైమ్ అయ్యింది మళ్ళీ వస్తా అంటూ    

గంట కొడుతూ ఉండగా క్లాసులో అడుగుపెట్టారు. వస్తూనేహోమ్ వర్క్ తీయమన్నారు. అందరూ చేశారు కానీ సుబ్బరాజు చేయలేదు. మేష్టారుకి చెడ్డ కోపం వచ్చింది. “స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్” అన్నారు. అంతలో జ్నాపకం వచ్చి ఒరేయ్ ఇది రెండోసారి కదూ  హోమ్ వర్క్ చేయకపోవడం. అది కదూ నీకు శిక్ష వెళ్ళు ! కాస్త గడ్డి కోసి ఆ గేదె కి దూడకి వేసిరా ! అని పంపించారు.

ఓ ఐదు నిమిషాలకి సుబ్బరాజు తిరిగొచ్చాడు. వాణ్ణి ఆప్యాంగా నిమిరాడు. ఓరి వెధవ ! ఆ గేదె వుంది చూశావా! దానికి గడ్డి వేస్తే పాలిస్తుంది. మీ నాన్న నీకు అన్నం పెట్టి గుడ్డలిచ్చి ప్రేమగా చూసుకుంటున్నాడు నువ్వాయనకు పాలు ఇవ్వనవసరం లేదు  మీగడ పెట్టక్కర్లేదు నీ చదువు నువ్వు చదువుకోకపోతే నువ్వు గేదె కంటే హీనమే కదా ! అంటూ చెబుతుంటే సుబ్బరాజు కళ్ళనీళ్లయిపోయాడు. అంతే ! ఆరోజు నుండి వాడు హోమ్ వర్క్ మానలేదు.

స్కూలు వదిలిపెట్టాక ఆ దృశ్యం చూడవలిసిందే ! ఈ మారు సుబ్బయ్య మేష్టారే పలుపు పుచ్చుకుని గేదెని దూడని ముందుకు నడిపించుకు వెళ్తుంటే  ఓ పాతిక మంది పిల్లలు ఎవరికి తోచిన గడ్డి వాళ్ళు కోసి వెనుక నడుస్తుండే వాళ్ళు. అలా ఇంటి దాకా వెళ్ళి గడ్డి వరండాలో పడేసి ఎవరి దోవన వాళ్ళు వెళ్ళి పోయారు.

పిల్లలకి మేష్టారంటే ఎంత భక్తో మేష్టార్లందరికి తెలుసు. ఆయనకి కోపం వచ్చినా ఎంత సున్నితంగా మనసుకు పట్టేట్లు లెక్కలు చెబుతారో పిల్లలు ఇళ్ళల్లో చెప్పుకునే వారు. కొదరికి కళ్లలోకి చూస్తూ చెప్పేవారు. కొదరికి వీపు నిమురుతూ చెప్పేవారు ఎవరైనా భయస్తుడైన మందమతి ఉంటే వాణ్ణి ఒళ్ళో కూర్చోపెట్టుకుని చెప్పేవారు.

అలా ఆయన పాఠం పిల్లలకీ గొప్ప సరదా.

లెక్క కి లెక్కకి మద్య ఆయన చెప్పే పిట్టకధ లను పిల్లలు రోజుల తరబడి చెప్పుకునేవారు,

సుబ్బయ్య మాష్టారు రిటైర్ అయిపోయారు.

ఆ రోజు మేష్టారి పిల్లలిద్దరే స్కూల్ కి వచ్చారు.గేదె దూడ రాలేదు.  

అవెనుక

జారు తున్న కళ్ళజోడు సర్దుకుంటూ సుబ్బయ్య మాష్టారు రాలేదు. ఆవరణ బోసిగా ఉంది.

పిల్లలకి చదువెక్కలేదు. పచ్చగడ్డి దిగులు దిగులు గా ఉంది. రీసెస్ లో గేదెని దూడని పలకరించే పిల్లలకి టిఫిన్ సయించ లేదు. స్కూల్ గడియారం ఆగిపోయినట్టు స్కూల్ బెల్లు విరిగిపోయినట్టు అనిపించింది.

అందరి ముఖాల్లో దిగులు. సాయంత్రం వందమంది పిల్లలు రెండు చేతులా గడ్డి కోసుకుని సుబ్బయ్య మాష్టారి ఇంటికెళ్లారు. ముందు

ఖాళీ స్థలంలో

గేదె ముందు దిగులుగా

 కూర్చున్న

మేష్టారి కనిపించారు. ఎవరూ ఏమీ మాట్లాడలేదు. తెచ్చిన గడ్డి గుట్టగా గేదె ముందు వేశారు. గేదె సంబరం గా తింటోంది . సుబ్బయ్య మాష్టారు కదలిపోయారు

ఒరే అయ్యలూ నాకోసం ఇంతదూరం వచ్చారా పొద్దుటి నుండి కాళ్ళూ చేతులూ ఆడటం లేదురా ! అన్నం సయించడం లేదురా !

నాకు ఒక్క సాయం చేయండ్రా  ఇంటికి వెళ్లిపోతూ పోతూ  నా చేత ఒక్క లెక్క చెప్పించుకు వెల్లండ్రా ! చాలు అన్నారు. తప్పకుండా అన్నారు పిల్లలు.

గేదె వైపు తిరిగి అన్నారు మేష్టారు

 నీకు చక్కటి గడ్డి తింటే ఆకలి తీరుతుంది .

నాకు పిల్లలికి ఒక పాఠం చెబితే కడుపు నిండుతుంది అని. 

జీవనయానం లొ పాఠాలు నేర్పిన, నేర్పే గురువులందరికీ

హృదయపూర్వక నమస్సులు.

రమ, కంకిపాడు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...