ఆయన మొదటిసారి ధవళేశ్వరం వెళ్ళినప్పుడు ఆయన గురించి
శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు చెప్పిన పద్యం.. పద్యం చుదువుతుంటేనే హాయిగా మొలక నవ్వులు వికసిస్తాయి.
ఈగవ్రాలిన గాని వేగు జారేడు నట్లు
మవ్వంపు కురులను దువ్వినాడు
వరలలాటమునండు తిరు చూర్ణ రేఖను
ముద్దుగారేడు భంగి దిద్దినాడు
అరుణ పల్లవమట్లు కరము రంజిల్లు,
చెంగావి వస్త్రంబును గట్టినాడు ....
చారలంగరు ఠీవి జక్కగా ధరియించి
వలె వాటు కండువా వైచినాడు
చెవుల సందున గిరజాలు చిందులాడ
మొగము మీదను చిరునవ్వు మొలకలెత్త
టంగుటూరి ప్రకాశము రంగు మెరయ
ధవళగిరి తీర్ధమునకును తరలివచ్చే!
శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారికి నివాళు లర్పిస్తూ
సీసము:
గుండె జూపి తుపాకిగుండు కెదురు నిల్చి శ్వేత జాతీయుల శిరములొంచి
తెలుగువారి చేవ తెలిపి ప్రకాశము "ఆంధ్ర కేసరి"యయ్యె నద్భుతముగ
సమరయోధుడితండు స్వాతంత్ర్యపోరులో స్థైర్యము జూపిన సాహసితడు
అనితరసాధ్యుడై యాంధ్ర రాష్ట్రపు ముఖ్య మంత్రియై వికసించె మాన్వితునిగ!
విద్యావిలువ గని విశ్వవిద్యాలయ స్థాపన జేసిన సచివుడితడు
నీటి ప్రాజెక్టులు నిర్మించి సేద్యపు దారులు పరచిన దార్శనికుడు
నిస్వార్థ సేవలు నెరపి తెలుగువార మానస వీధిలో మాధవుడయె!
తేటగీతి
ధీరులెందరో వెలసిన తెలుగు నాట
టంగుటూరి ప్రకాశము డంబురించి
తెలుగువారి శౌర్యము జూపె, దీప్తి నిచ్చి
శ్లాఘనీయుడై చరితన సత్తముడయె
వెంకట్. సిహెచ్


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి