శరదృతచంద్రిక ప్రియునికి సంకటము గదా
28.10.2020
********
తేటగీతి
దైవమెపుడు గాపాడి మోదమ్ము గూర్చ
వేడవలదు కోర్కెల తోడ వేల్పులనిల;
వందనమిడు మొసగిన సంపదల కెల్ల
మాననీయుల మాటను మరువకెపుడు!
కందము 1
తరుణిని గాంచగ వలచెన్
సరసు డొకండబ్బురపడి చంద్రిక వేళన్
సరసము విరసంబవ్వగ
శరదృతచంద్రిక ప్రియునికి సంకటము గదా
కందము 2
విరహంబిదియే చెలియ రు
సరుసలు చిందిస్తు వెడల సఖుడు వెత పడెన్
విరజాజుల నెత్తావుల
శరదృతచంద్రిక ప్రియునికి సంకటము గదా
కందము 3
సరసం బెరుగని సతితో
పురుషుని ప్రణయ పయనంబు పొక్కడ హెచ్చున్
తరగని మోహము తోడన్
శరదృతచంద్రిక ప్రియునికి సంకటము గదా
కందము 4
గిరినందిని తపము సలుప
హరుడు విరహ వేదనుడిగ నలజడి నొందెన్
మరుడు విరుల శరము విడువ
శరదృతచంద్రిక ప్రియునికి సంకటము గదా
కందము 5
విరులన్ని ముడిచి నల్లని
కురులం దొసగి సొగసుగను గుబ్బెత వలచెన్
మరలుకొని రచ్చ జేయగ
శరదృతచంద్రిక ప్రియునికి సంకటము గదా
వెంకట్. సిహెచ్ తెలుగు తేనియలు
వెన్నెలంటే ఎవరికి ఉండదు చెప్పండి ఈ పరవశం...
ప్రతి చోట వెన్నెల వెతుక్కోవడమే మరి
ఆటవెలది
వెలుగునీడలందు వెన్నెల వీక్షణం !
భ్రాంతిమతులు పోవు పరవశమ్ము
వరములన్ని గురిసి ప్రతిరేయి జాబిల్లి
మరులుగొలిపి కలము మత్తుజల్లి
కందము
విరజాజుల పరిమళములు
కురిసే వేళల వలచిన కోమలి పలుకే
మరచి కినుకతో యలిగిన
శరదృతచంద్రిక ప్రియునికి సంకటము గదా
ఉత్సుకము
వెన్నెల సోనలు వెల్లువై
కన్నుల పండుగ చేయగా
అన్నుల మిన్నలు ఆడుతూ
చిన్నెలు బోయిన సందడే
రమ తెలుగు తేనియలు
కందము 1
కరొనా కౌగిట నలుగన్
నిరసన సెగ నీరుగార్చ నెచ్చెలి గసరన్
సరసము విరసము లాయెను
శరదృతచంద్రిక ప్రియునికి సంకటము గదా !
కందము 2
మురిపమున పిలిచె ప్రియసఖి
విరజాజి నగవులు రువ్వి వేడుక చేయన్
కరిగెను కలయే పాపము
శరదృతచంద్రిక ప్రియునికి సంకటము గదా !
కందము 3
సరసకు రాదే! ప్రియసఖి
మురియుచునిక చంద మామ మోహపు చింతల్
కరుగును కౌముది కౌగిట
శరదృతచంద్రిక ప్రియునికి సంకటము గదా !
వాణిశ్రీ నైనాల తెలుగు తేనియలు
జగమే ఊయల
పగలే వెన్నెలలు , ఊరంతా సంబరాలు
ప్రియురాలు పండుగల వేడుకలతో , రాబోవు పరీక్షల ప్రణాళికతో
కనురెప్పలెత్తి కలయజూడ తలచలేదుగాన ఈ
శరదృతచంద్రిక ప్రియునికి సంకటము గదా
జి మురళీ మోహన్ తెలుగు తేనియలు
పరువపు సొగసై ప్రియ సఖి
సరసపు సంభాషణాడ చంచల మదనా
విరిశర ధారలు కురియగ
శరదృతచంద్రిక ప్రియునికి సంకటము గదా
శిరీష తెలుగు తేనియలు
ఎదురు చూసి ఎదురు చూసి
కన్నులు కాయలు కాయగా
ప్రేయసి అడుగుల సవ్వడులు వినపడక
విరహము తో తాపము పెరిగిన వేళ
ఈ చల్లటి సాయంత్రము
శరదృతచంద్రిక ప్రియునికి సంకటము గదా
దేవరశెట్టి నాగమణి తెలుగు తేనియలు
తేటగీతి
రామణీయ వెన్నెల రేయి రమ్య గీతి
నాలపించ మది మరియు నబ్బురముగ
శరదృతువు నందు మెండైన చంద్ర శాల
కని కదలని నరుడెవడు గలడె భువిన!
కలువల సుగంధము మోయు
చలి గాలి వీచికలలో,
కర్పూరపు పొడి బోలు కౌముది కాంతులలో,
పూల పరాగపు వెలుగుల్లో చుక్కల
దాచిన నింగి నీడలలో,
ప్రేయసికై వీక్షించి ,వేచి,విసిగి,వేసారి,
విరహాన వేగంగ,
శరదృతచంద్రిక ప్రియునికి సంకటము గదా
CA కె మల్లికార్జునరావు తెలుగు తేనియలు
పడతి వెన్నెలలోన వన్నెలు ఆరబోయగా
ప్రియుని నేత్ర వలయంలో శ్రుంగార భంగిమే,
కలి కరోనా కాలమున సఖి నిర్భంధమైతే
శరదృతచంద్రిక ప్రియునికి సంకటము గదా
వి. వి. శ్రీనివాస్ తెలుగు తేనియలు
సరస భావం తో సఖి
విరహ వేదన తో సఖుడు
ఊహల జగతిని ఉయ్యాలలూగి
కలువ కళ్ళ తో సయ్యాట లాడి
వెన్నెల చల్లదనం లో
మనసు తనువున
మరియు వేళ
ప్రణయ బంధాన కౌగిలివిడివడి
పరిణయాన్ని అడ్డుకోలుగా
చూపి అవరోధాల ముడులు
వేసిన ప్రణయ సామ్రాజ్ఞి
మోమును గాంచిన సఖుడు
శరదృతు వెన్నెల ప్రియునికి
సంకటము కాదా అని తలచె
రాజ రాజేశ్వరి తెలుగు తేనియలు
కుముద బాంధవునిపై కవితలల్లబోయి
కనుచీకటి వేళ కాచుకుని చూస్తున్నా ..
మబ్బులు పరదామాటున దోబూచులాడ వచ్చి
మెరిసే చంద్రుని చూసి మురిసి మూగబోయే నావంటి
శరదృతచంద్రిక ప్రియునికి సంకటము గదా
విష్ణుప్రియ తెలుగు తేనియలు
కందము
సరసన తానే నిలిచిన
తరుణము నందొక తరుణిని తన పతి చూ డన్
ఉరగము వలె సతి యలిగిన
శరదృతచంద్రిక ప్రియునికి సంకటము గదా
డి.రామ నాగేశ్వర రావు తెలుగు తేనియలు
చిరుబురు లాడెడి భామను
మరువక తన జన్మదినము మానసమందే
మురిపాలు పంచని యెడల
శరదృతచంద్రిక ప్రియునికి సంకటము గదా
జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి తెలుగు తేనియలు
సమస్య. : శరదృతు వెన్నెల ప్రియునికి సంకటము కదా
ఇచ్చిన పాదము కందము
నా పూరణము సీసములో
రాముడు సీతా వియోగము తో బాధ పడు సందర్భము
చెట్టుపై నున్నట్టి చిలుకల జంటలు గూళ్ళకు చేరెగా కువకువలను
సలుపకన్,వర్షంపు జలముతో జలపాతపు లలన భూమిని ముద్దు పెట్డ
దలచి దుముకు చుండె జలజలా ఖలము పైకిన్, కపోతంపు యుగళము లన్ని
గురుగురు మనుచుండె కొమ్మలనడుమన, చటకములు కిచకిచమని రవము
లేమియు చేయక కామిత ములుతీర్చు కొనుచుండె, నాకసమ్మున చిరు జల
దములైన లేకుండ తారకా విటుడు ప్రకాశించెడి ధవళ కాంతుల నులి
వెచ్చని శరదృతచంద్రిక ప్రియునికి సంకటము గదా, యిషణము నాప
కష్టమగుచుండె ,సీతలేక మనుటెంత
దుర్భ రంబునో గద, పత్ని తోడు లేని
జీవితంబు వ్యర్ధముగదా,చెప్పు చుంటి
వినుము లక్ష్మణా యని రాము డనెను వనిన
ఖలము = నేల, చటకము = ఊర పిచ్చుక, జలదము = మేఘము
తారకా విటుడు = చంద్రుడు
పూసపాటి తెలుగు తేనియలు
కందము 1
సిరిమల్లెలమాలికలే
తరుణి సిగకు సొగసులనిడ తాపము మెండై
విరహపు బాధల వేగిన
శరదృతచంద్రిక ప్రియునికి సంకటము గదా
కందము 2
మురిపెము తీరక రాధిక
విరహపు చింతనల మునిగి వీడని కినుకన్
గిరిధరు నొల్లక యుండగ
శరదృతచంద్రిక ప్రియునికి సంకటము గదా
కందము 3
కురియగ వెన్నెల సోనలు
విరిసిన విరి పరిమళాలు వెలయఁగ సరసన్
హరుసము నిడు సతి గానక
శరదృతచంద్రిక ప్రియునికి సంకటము గదా
అవళూరు సీత తెలుగు తేనియలు
కందము 1
మరువని చెలి చూపులతో
తరియించెడి మనసుయున్న తప్పెటులౌనే?
విరహములో నుండగ మరి
శరదృతచంద్రిక ప్రియునికి సంకటము గదా !
కందము 2
చిరు నవ్వులు నవ్వుచు చెలి
కురులను తా నారబోసి గోముగ జూడన్
అరెరే, వింతేమిటియట
శరదృతచంద్రిక ప్రియునికి సంకటము గదా
కందము 3
సరసము లాడుచు నెచ్చెలి
మరువగ నొప్పని మధురపు మల్లెల మాటల్
విరబూయగ సబబే యా
శరదృతచంద్రిక ప్రియునికి సంకటము గదా
కందము 4
పరువములో నుండిన యా
తరుణీ మణి మనసునందు తాండవ మాడన్
మరచుట తరమా? నకటా
శరదృతచంద్రిక ప్రియునికి సంకటము గదా
కందము 5
చుర కత్తుల చూపులతో
సరసము లాడక గడసరి సాయము రాకన్
పరువములో నుండగ నిక
శరదృతచంద్రిక ప్రియునికి సంకటము గదా
కందము 6
వరమౌ నెచ్చెలి యలకలు
తరమౌనే యాపుట మరి తరుణులు గెలువన్
పరువములో నుండిన సరి
శరదృతచంద్రిక ప్రియునికి సంకటము గదా !
కందము 7
కరగని మనసున నుండిన
తరుణములో తపసు జేసి తపియించగ నా
విరహములో చెలి కానక
శరదృతచంద్రిక ప్రియునికి సంకటము గదా !
కందము 8
పొరబాటున గొడవ బడగ,
సరిజేయగ వీలులేక, సైయ్యను చెలితో
సరసాలే కరువవ్వగ
శరదృతచంద్రిక ప్రియునికి సంకటము గదా !
కందము 9
బరువౌ మాటలు బలుకగ
కరువౌ నెచ్చెలియ తోడు కఠినము గాదా
సరి తూగెడి జోడి విడువ
శరదృతచంద్రిక ప్రియునికి సంకటము గదా !
కందము 10
విరజాలుల వాసనతో
మరుమల్లెలు తోడు జేరి మనసే బరువై
సరసన నెచ్చెలి లేకనె
శరదృతచంద్రిక ప్రియునికి సంకటము గదా !
కందము 11
శరదృతు వెన్నెల యిలలో
వరమే యని బల్కును గద పదుగురు కవులే
పొరబాటిది, తగదిటులన
శరదృతచంద్రిక ప్రియునికి సంకటము గదా !
కందము 12
మరుమల్లెల చెట్ల నడుమ
చిరుజల్లులు పడెడి వేళ చెలి చేరగ, తా
సరసానికి దూరమనినయిలలో
శరదృతచంద్రిక ప్రియునికి సంకటము గదా !
కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి తెలుగు తేనియలు
కందము 1
మురిపించెడు చెలి లేకను
పరవశమును గూర్చు ప్రకృతి పర్యంకమునూ,
విరిసిన సుమ సౌరభములు,
శరదృతచంద్రిక ప్రియునికి సంకటము గదా !
కందము 2
సరిగంచు చీర తెమ్మన
మురిపెము తోడ పతి నొక్క ముదితయె; వలద
న్న; రసాభాసం బవగా;
శరదృతచంద్రిక ప్రియునికి సంకటము గదా !
కందము 3
మరగి పిలువకు కలువభా
మ; రయము నొక జంట వలపు మచ్చిక చేయన్
కురిపించెడు వేళను తా
శరదృతచంద్రిక ప్రియునికి సంకటము గదా !
కందము 4
అరయ ప్రణయ కలహమ్మున
సురచాపము బోలెడు సఖి చూడ్కులు తననే
సురియగను మారి గుచ్చగ
శరదృతచంద్రిక ప్రియునికి సంకటము గదా !
చల్లా దేవిక తెలుగు తేనియలు
కందము 1
పరదా మాటున కలువల
దొర దాగి మెరిసి మనంబు దోచి మురియగన్
మరపుగ మది మూగదయే
శరదృతచంద్రిక ప్రియునికి సంకటము గదా !
కందము 2
విరహపు బాధను తాళక
సరసను చేరమని పిలుచు సకియను చేరన్
వరసతి జనకుడు చూడగ
శరదృతచంద్రిక ప్రియునికి సంకటము గదా !
సతీష్ తెలుగు తేనియలు
వచన కవిత,
ప్రేమించి పెండ్లాడిన కొత్త పెళ్లికూతురు,
నవరాత్రి వ్రతమునకై పుట్టింటి కేగె,
తిరిగి రాదాయె, పున్నమి గడిచి పోయె,కట కటా
శరదృతచంద్రిక ప్రియునికి సంకటము గదా !
గాంగేయ శాస్త్రి, రాజమండ్రి తెలుగు తేనియలు
ప్రియమారగ తన సఖి మోముపై తారాడు
ముంగురులను సవరించగ
ఆత్రముతో ఎదురుచూచు చెలుని చెంతకు
చేరగరాని ప్రియురాలిని గురుతు సేయు
శరదృతచంద్రిక ప్రియునికి సంకటము గదా !
సుకన్య వేదం, కర్నూలు తెలుగు తేనియలు
కందము 1
సరసపు నెచ్చలి స్మృతులన్
విరహపు వేదన మిగిలెను విలసిత గతులన్
పరువము ద్రవించి బోవగ
శరదృతచంద్రిక ప్రియునికి సంకటము గదా !
కందము 2
అరవిరిసిన చెలి మోమున్
సురుచిర దరహాసము గని సుదలందు కొనన్
కరిగెను స్వప్నము అరెరే!
శరదృతచంద్రిక ప్రియునికి సంకటము గదా !
పద్మలత మున్నంగి తెలుగు తేనియలు
విశ్వవిద్యాలయాల్లో
పురాణ కవిత్వంలాగా
శ్రవణ యంత్రశాలల్లో
శాస్త్రీయ సంగీతం లాగా
ఇలా వచ్చావేం వెన్నెలా ?
ఎలా వర్ణించను నిన్ను ?
మహా కవులు లోగడ చెప్పిందే
మళ్లీ మళ్లీ చెప్పాలా ?
ఏది రాసినా ఏం లాభం ?
ఇదివర కెవడో అనే వుంటాడు
బహుశా ఆ అన్నదేదో నాకన్నా
బాగానే అని ఉండచ్చు.
అంచేత నీ గురించి
అనవసరావేశాలు పెంచి
అన్యాపదేశంగానో లేదా
అర్ధన్తరాన్యాసంగానో
సొంత కోపాలేవో పెట్టుకొని
పంతాలు పట్టింపులూ పట్టుకొని
ఎవరిని ఈ వ్యవహారంలో
ఇరికించ దలచుకోను నేను !
ఇంతకీ ఆవేశాలకేముంది ?
ఎవడి బ్రతుకు వాడు బతుకుతున్నాడు
ఎంతగా ఎడం ఎడంగా ఉన్నా
ఎంతగా పై పై భేదాలున్నా
ఎంతగా స్వాతిశయం పెరిగినా
అంతరంగం అట్టడుగున మాత్రం
అంతమందిమీ మానవులమే
అందుచేత ఓ చందమామా !
అందమైన ఓ పూర్ణ సోమా !
సముద్రం మీదా అరణ్యం మీదా
సమానంగా ప్రకాశించే సౌందర్యాభిరామా !
Hi
రిప్లయితొలగించండి