29, అక్టోబర్ 2020, గురువారం

నానిలు 26 10 2020


 

నానిలు


ఆడపిల్ల పుడితే సిరి అన్నారు

రోజుకో సీత నిప్పుల్లో కాలుతోంది!!

 

నీతుల లేని కవితలు రీతులు కావు

జ్యోతులు వెలిగించి జవాబులు ఎతుక్కో...

 

వేదన చెందే గృహిణి భావుకత బావుటా 

ఎగరేసింది అని నా నమ్మకం

 

తన కొట్లో సిరా కలాలు అమ్ముడుపోక

కవితలు రాలాయి  ! గుండె పొంగింది

 

సన్మానమెందుకూ? నాకేమీ తెలుసనీ

లోకంవింత పోకడ చూసానంతే.!

 

వై. శ్రీదేవి

 

 

 

తెలుపు పసుపు మనువాడాయి

చిలుక గోరింకా గూటికి చేరాయి

 

రామాయణం న నీతిని విని భారతం న రీతిని కని

భాగవతం న గీతిని గీసి ఆరని జ్యోతి వెలిగించుము

 

కోవూరి

 

ఆకాశము తెల్లగా మారింది

నేలపై నున్న ముగ్గులు చూచి

 

ఇంటికి దీపం వంటిది ఇల్లాలు

ప్రమిదలో నూనె ఉన్నంత వరకు

 

సముద్రం ఉప్పొంగింది

ఒడ్డుపై పడున్న తిమింగిలాలకోసం.

 

హేమలత

 

నాడు అప్పులు చేయుట తప్పులు

నేడవి ఒప్పులు బహు గొప్పలు

 

ఫణికి తలలోన విషముండు

మనిషికి వళ్లంతా విషము నిండు

 

పాఠాలు నేర్పు సామాన్య గురువు

సంస్కారం నేర్పు నిజమైన గురువు

 

వివిధ కర్మములు ఏక కాలము చేయు

స్త్రీ యే అసలైన అవధాని కదా!  

 

పసిడివైనా, ఇనుపవైనా , సంకెళ్లు

మనిషిని కట్టి పడేయునవే

 

నిరాశా నిస్పృహలు అలిగి వెళ్లాయి

అక్షరాన్ని తోడు  తెచ్చుకున్నానని.

 

పక్కనే ఉన్నా పలకరించుకోము

అంతర్జాలంలో ఎలాగూ కలుస్తామని.

 

అధికారం సంపాదించుకున్నా

అక్షరం మీద కనుకనే కవినయ్యా!

 

సముద్రం చూపించమ్మా అన్నాను

ఇక్కడ పడేసింది సంసార సాగరంలో.

 

వలస కూలీలు పాడే పాటలివిగో

ఆకలిపేగుల ఆర్తనాదాలు.

 

ఇంకాసేపు పడుకోనివ్వడు

తూర్పు దిక్కున తెల్లారే ప్రత్యక్షం.

 

పచ్చకోక గారించుకుంది

పుడమితల్లి తన రైతుబిడ్డ కోసం.

 

మాటల గోదారి గట్లు తెగాయి

చిన్ననాటి నేస్తం పలకరించినవేళ

 

మానవారణ్యంలో వెదుకుతున్నా

మంచితనపు గంధపు చెట్టు కోసం.

 

నిర్భయ భారతమంట ఇదేనేమో..!

రోజూ నిర్భయ గాధలు వింటున్నాముగా!

 

నింగీ నేలా వాళ్లిద్దరూ

ఏకాభిప్రాయమెరుగని ఇద్దరు గొప్పవాళ్ళు.

 

చల్లా దేవిక.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...