1, అక్టోబర్ 2020, గురువారం

దత్తపది - 42, వెలుగు - చీకటి - పగలు - రేయి 28.09.2020

 


దత్తపది -  42

 

వెలుగు - చీకటి  - పగలు  - రేయి

 

ఈ పదములతో మన పురాణేతిహాసాలు , భారత దేశచరిత్ర పై  పద్య కవిత / వచన కవిత  అందించగలరు

 

పద్యం : స్వేఛ్ఛా ఛందము

వచన కవిత :

నాలుగు పాదములు; ప్రతి పాదము 12 అక్షరాలు మించకుండా ఉండాలి

 

 

నీ లోపలె ఉంది వెలుగు  దానిలోనె దాగి చీకటి     

సౌజన్యమె వెలుగు  స్వార్థబుధ్ధె చీకటి!

సుఖమనగ కాదు పగలు  కష్టమనగ కాదు రేయి

పగలు వెంటె రేయి ఉండు  రెండిటితో జీవితం పండు!

 

రాంమోహన్, నిజామాబాద్___ తెలుగు తేనీయలు

 

 

రేయి పగలు సంపాదన ఎంత ఉన్నా,

రేపంటే తెలియని మనిషికి స్వార్థమే మిన్న,

జీవితం చీకటి వెలుగుల రంగేళి అయినా,

మనసున ప్రేమ లేని మనిషి దేమి జన్మ?

 

కె మల్లికార్జునరావు___ తెలుగు తేనీయలు

 



 
దృక్కోణం

 

తేటగీతి

 

రేయి పగలన కుండను వాయి కట్టి

సంప oతను కూడేసి సంచి లోన

దాచి వెలుగులో నికిరాని ధనము యెంత

 కూడ చీకటి మయమవ్వ కుప్ప కూలె

 

లలితా రెడ్డి___ తెలుగు తేనీయలు

 

 

గేయ రచన

 

పగలు విరిసిన పువ్వు,

రాత్రి కి వాడిపోవు ఇది జీవన సత్యం,

వెలుగులు చిమ్మిన సూర్యుడు,

కొండెక్కి చీకటిలోకి జారుకోను ఇది ప్రకృతి ధర్మం...

 

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి___ తెలుగు తేనీయలు

 

 

మనసా ఆనందం ఎక్కువైతే అవుతుంది నీకు రేయి పగలు గా....

మనసా బాధ కలిగినపుడు అవుతుంది నీకు పగలు రేయిగా...

మనసా సుఖదుఃఖాలు అవుతాయి చీకటి వెలుగులుగా....

మనసా అందుకే  ఊగిసలాడక

నిలకడగా ఉండాలి  ధీటుగా....

 

ఉషారాణి___ తెలుగు తేనీయలు

 

జీవిత బండి

 

రెండు చక్రాల బండి నా దైనందిన జీవితం .

పగలంతా వెలుగును నాలో ఆలోచనలు .

ఆలోచనలే నా వాహనపు ఇంధనములు .

వెలుగు - పగలుగా వున్న రెండు చక్రములు మార్చుకొని

రేయి - చీకటి చక్రములు తగిలించి నా ఆలోచనలకు జోల పాట

పాడుతూ చీకటిలో రేయి నిదురించెదను.

 

మురళి మోహన్___ తెలుగు తేనీయలు

 

 

శ్రీకృష్ణ రాయబారం

 

ధృతరాష్ట్ర మహారాజా! శాంతిదూతగా సంధికి వచ్చితిని,

మీ బాహ్య నేత్రములను చీకటి కమ్మిన కమ్మి ఉండి వచ్చును గాక,

మీ మనమును పుత్ర వ్యామోహమను రేయి ఆక్రమించవచ్చు గాక,

మనో నేత్రముల వెలుగు నందు మీ ఆత్మసాక్షి సమ్మతి నడుగుడు,

ధర్మ చరితులు పాండవులపై మీ పుత్రుల పగలు ఖండింపుడు,

వారికి న్యాయము  చేసి మీ పూర్వీకులకు సంతృప్తి నొసగుడు,

పాండవుల కూరిమితో ధర్మ రాజ్యపాలన ముదముగ చేయుడు,

అట్లుకాక , మీ అభీష్టము రణమే అయిన తప్పదు శోకము కడు.

 

కె మల్లికార్జునరావు___ తెలుగు తేనీయలు

 

 

 

వెలుగు తోనే చీకటి నెయ్యం

పగలు తోనే రేయికి వియ్యం

బొమ్మ బొరుసు నాణెం చందం

మంచి చెడు మనిషి తత్త్వం

నీ చేతుల్లో జీవితగమ్యం

మంచికో చెడుకో ఎటు నీ గమనం !!

 

విష్ణుప్రియ___ తెలుగు తేనీయలు

 

 

తేటగీతి

వెలుగు నిండిన హృదయం వెల్లు గను

వల్లె వేయును కవితలు అల్లి  పగలు

రేయి   జగతిన జనులకు హాయి గొలుపు

బ్రతుకు విధమున చీకటి అతుకు త్రోల !

 

మాదిరెడ్డి సురేశ్___ తెలుగు తేనీయలు

 

 

పున్నమినాటి (వెలుగు )

(రేయి )కి  అందము నిచ్చు

ఉదయభానుని కిరణాలు

(పగలు )ఆరోగ్యము నిచ్చు

(చీకటి )ఇంటిన చిరుదివ్వే

కడు కాంతినిచ్చు

 

డి. వి. హేమలత___ తెలుగు తేనీయలు

 

తెలుగు జాతి గర్వపడగ వెలుగు నింపి

కుళ్లు చీకటి గాధలు ఫెళ్ళు మనగ

సెగలు రేపెను జాషువా ప్రగతి జూపి

పగలు రేయి మానవులకై పాటు పడగ

విశ్వ మానవ ప్రగతికై వేల కొలది

యమృత సమమైన రచనలందజేసె.....

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, ముంబయి___ తెలుగు తేనీయలు

 

 

చిమ్మచీకటిల రేయి  కరిగిపోయి 

పగలు రవి కిరణాలు ఉదయిస్తున్న వేళ

ఒళ్ళు విరిచి ఆకాశం శ్వేత వర్ణపు కాంతి పరవగా

  వెలుగులో  నిదురపోతున్న జగతి  మేల్కొనెన్

 

డి. నాగమణి___ తెలుగు తేనీయలు

 

తేటగీతి

 

పండు వెన్నెల రేయిలో వన్నె లెన్నొ

తరుణి కన్నుల కాంతిలో ధరణి మెరిసె

పడతి తానవ్వినంతనే పగలు వెల్గు

చెలియ మోము జూడని రోజు చీకటౌను

 

రమ, కంకిపాడు___ తెలుగు తేనీయలు



 

వెలుగు వైపు చూస్తే చీకటి కనపడకుంది

చీకటిలో చూస్తే వెలుగు వెనకబడింది

పగలు రాత్రులు మన దృష్టి లో తారుమారు

సూర్యచంద్రులు మాత్రం ఒకరికొకరు ఎదురెదురు

ఇంద్రధనసులో తెలుపునలుపులు కనపడవుకదూ

మన దృక్కోణమే మనలను శాసిస్తున్నదిలెద్దూ

 

కన్నాజీరావు___ తెలుగు తేనీయలు

 

శివకస్తూరి గారి కలమున తెలుగు వెలుగు

ఉషోదయ పద్య రచన తో పారద్రోలు చీకటి

కవుల సమ్మేళనంలో లేనే లేవు పగలు

పఠించిన కల్గు అనుభూతి వెన్నెల  రేయి

 

వి.వి.శ్రీనివాస్___ తెలుగు తేనీయలు

 

 

ఇతివృత్తం: జీవన పథం, వచనం లో

 

కారు  చీకట్లు క్రమ్మినంత భీతి చెందక 

సాగించు బ్రతుకు పయనము ప్రీతి తోడ

 

చీకటి నతికి వుండు వెలుగు జిలుగులు

రేయి నంటి వుండు పగలు వెలుగులు

కష్టం వెనుకే సుఖం

సుఖం వెనుకే దుఃఖం

ఇదియే కదా జీవితం

తెలిసి మసలిన సర్వం  ఆనందమే

గీతాచార్యుడు చెప్పిన సత్యమిదియే

 

అవళూరు సీత___ తెలుగు తేనీయలు




స్వేచ్ఛా సమర్పణలు 


సమస్యవాసి కంటె మేలు రాసి గనగ

 

రాయ భారము‌ సమయములో  చక్రధారితో భీముడు

పలుకు‌ సందర్భము

 

ఇచ్చిన పాదము‌ ఆట వెలది‌,  

తేట గీతిలో  నా పూరణ

 

కలరు ద్రోణుడు,భీష్ముడు కర్ణ కృపులు

మాకనుచు కడు గర్వపు మత్తు లోన

తూల వలదు పార్ధు డొకడు  చాలు వారి

నెదురు కొనగ ఘనమగు సైనికులు కోట్ల

మంది గలరంచు మురియంగ  మట్టు బెట్ట

గలను గా వారలను ,వాసి కంటె  మేలు

రాసి గనగ నని మురిసి రణము చేయ

భంగ పడుదువు రారాజ ,భరణి లోన

ననుచు నాదు పలుకుల నో నల్లనయ్య

వారల కనుచు పలికెగా వలలు డపుడు !

 

పూసపాటి___తెలుగు తేనియలు


సమాప్తం  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...