29, అక్టోబర్ 2020, గురువారం

నానీలు 25 10 2020

 


నానీలు

 

ఉత్తారాన ఉరిమింది

దక్షిణాన కురిసింది

తూరుపు పడమర

ఏరు పొంగి పొర్లింది

 

ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పొందం

పెద్దలు కుదిర్చిన సంబంధం

అన్నీ కూరితే  కొనసాగింపు

లేకుంటే ఆ ఇద్దరి కధ కంచికి

 

తీరం

 

ఎదో నాలుగు అక్షరాలు రాయాలని

ఏదేదో గీతలు తెల్ల కాగితాల పై గీయాలని

తెలియని కవితా వస్తువుని శోధించా

తెలుసుకోవాల్సిన మర్మం ను పరిశోధించా!

నా వెంట నడిచే నీడ నడిగా వడి వడి గా

నాలోని మనసు నడిగా ఉరికే జలపాతపు సడిగా 

సంధించిన ప్రశ్నలు సంధి కోరితే

సమాధానం సుడిగుండాలుగా

మారితే నడిచే జీవన నావ

ఏ తీరం చేరునో కదా!

 

కోవూరి తెలుగు తేనియలు

 

 

ఓ పెళ్ళి జరిగింది

ఓ జంట కుదిరింది

ఓ కన్ను మెరిసింది

ఓ గుండె తడిసింది

ఇది నానీ నో కాదో...రాసింది విష్ణుప్రియ

 

విరహజ్వాల నానీలు.

కనులముందు ఆమెఅందంవెలిగింది

హృదయంలో విరహాగ్ని రగిలింది.

 

ఎక్కడినుండోపొగలు అనుకున్నా!!

ఎడబాటు భరించలేని నానుండే!!

        

ఇంతఅందం ఎవరిది??

ఆమెకట్టిన చీరదా? చీరకట్టిన ఆమెదా?

         

అమెకోసంతపస్సుచేసా! ప్రత్యక్షమైంది.

మాయం అయిపోయింది.

            

ఆమె ఒక అగ్గిదేవత!!

ముందున్నా లేకున్నా విరహం రగిలిస్తుంది!!

 

కళ్యాణ్ చక్రవర్తి తెలుగు తేనియలు

 

 

అమ్మకు,అక్షరానికి చిరునామా ఒకటే

నిస్వార్థం గా ఉంటారనేమో!

 

విజేతలుగా అవతరించారు

ఆశ ఆశయంగా మారితే అంతే మరి!

 

జీవన కావ్యం రసవంతమైంది

ఆలమగల భావాలు ఏకమైనందుకు.

 

 క్షమాగుణం వెన్నంటే ఉంది

మనసు నవనీతమవడమే కారణమేమో!

 

చైతన్యమే నా మార్గం ఇపుడు

సూర్యుణ్ణి రోజూ ఆరాధిస్తున్నానుగా!

 

ప్రతి మాటా అపార్ధమౌతుంది

మనను నిఘంటువును తెరవనందుకేనా!

 

ఇప్పుడందరికి మంచి దానినే

రాజీపడడం నేర్చుకున్నాకదా!

 

గెలుపెంత దూరమోతెలిసింది

ఓటమి పలుకరించినందుకు!

 

కాలంతోపాటు పరుగుతప్పదు

జీవనపోరాటంలో గెలవాలంటే!

 

దేవుడా కనిపించవా అని వేడుకుంటున్నా

అమ్మలూ అంటూ అమ్మ పిలుపు!

 

అభినందిద్దామని అడుగు ముందుకేశా

ఆభిజాత్యపు ముల్లు గుచ్చుకుంది.

 

చల్లా దేవిక తెలుగు తేనియలు

 

 

పుస్తకంలో చదివితే ఆనందం..

చరవాణిలో చదువులే దారుణం...

 

మంత్రి రాయకీయం చేస్తున్నాడట..

రాజకీయం చేయడానికే మంత్రి అయ్యాడు..

 

చదవమని తిడితే పుస్తకం తీశాడు..

చరవాణిలో అంటూ మళ్లీ తిట్టారు..

 

తిండి దొరకక ఏడుస్తున్నాడు..

ఆకలికి కాదు పెట్టేవాళ్ళు లేరని....

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి తెలుగు తేనియలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...