#దసరా #dasara
అంతా గుర్తు లేదు గాని కొన్ని లైన్లు గుర్తొచ్చాయి....మా టీచర్లు స్కూల్ పక్కన ఇళ్లన్నీ ,మా మామ్మ ఇరుగు పొరుగుల లోను మాతో పాటు తిరిగి ఈ పాట పాడించేవారు...గల్లా కట్టిన వెదురు బాణం..వెదురు ధనస్సు అందరి దగ్గరా ఉండేది...గల్లాలో పువ్వులు వేసి ఈ పద్యాలు పాడుతూ పెద్దవాళ్ల పైన చల్లే వాళ్లం...ప్రసాదమో...పప్పూ బెల్లమో చిల్లరో దొరికేవి....
ఏ దయా మీ దయా మా మీద లేదు,
ఇంత నిర్లక్ష్యమా ఇది మీకు తగదు,
అయ్య వారికి చాలు ఐదు వరహాలు
పిల్ల వారికి చాలు పప్పు బెల్లాలు
జయీభవా...దిగ్విజయీభవా
తేటగీతి
సర్వవిధ సిద్ధుల నొసంగి సాతమిచ్చు
సిద్ధిధాత్రి దుర్గాదేవి! సింహ వాహి
నిగ నభయమిచ్చు భగవతీ! నిష్ఠతోడ
కొలవ గమృతపదమొసంగు కొండచూలి!
మమ్ము గాంచి రక్షింపు సమధికముగను
తేటగీతి
దేవి అపరాజిత యనెడి దివ్య నామ
ధేయమున విజయంబిచ్చు ధిషణ! దుర్గ!
తల్లి రాజరాజేశ్వరీ! దండములివె
సర్వవిజయము లందించు సముచితముగ
ద శమి నాడువే డెద నిన్ను దయను జూపు
స కల విద్యల నొసగెడి శారదాంబ
రా జ రాజేశ్వరి , భవాని , లలిత సకల
శు భములనిడుము గాయత్రి !జోగులాంబ ,
భా ర్గవి మలయవాసిని , బ్రహ్మ విద్య
కాం తు లొలికెడి నయనాల కరుణ చింద
క్ష యములేని యశము నిచ్చి కవన కాంతు
లు వెలుగ తెలుగు వనము లోన నిలువు
ఆటవెలది:
విజయ దశమి "నేడు" వేడుకొందునుతల్లి
వచ్చె మహిషు మించు "వైరసి"పుడు
వేగ "టీక" నిచ్చు విజ్ఞానమందించు
విజయద! శమియించ విష విపత్తు.
దేవి! శుభముల దయచేయు దివ్యరూప/
ధారిణీ,యలసితిమి, మేధావులెల్ల/
నీకృపతేటగీతియెలేక లేశమనికితపాటు/
పడిరి, మహిషము దునిమిన పగిది క్లేశ/
ములను తొలగించి ప్రజలు ముదమునొంద/
నీ కరుణనొసగుము తల్లి నేర్పుతోడ!
శుభపరంపర వన్నియ అభయమిచ్చి
ఆయురారోగ్య భోగభాగ్యమ్ములిచ్చి
నిశ్చలంబైన ధార్మికనిరతి నిచ్చి
వెలయు గావుత మీ యింట విజయదశమి
ద నుజ సంహరణమ్మె మోదమ్మవగ ద
శ దిన పర్వదినమ్మాయె; శక్తి నహర
హ మ్ము దశ దినమ్ముల గొల్వ హర్షమొప్ప
ర మ్యముగ విరిసెను సంబరమ్ము లిలను!
తేటగీతి
అతుల శుభముల నొసగు దయామయీ! శ
రత్తు నందున కలుష హరణము జేసి
శివము గూర్చగ దుర్గవై శిశిర మనము
న యరుదెంచ ధన్యత నొందె నాదు భవము
ఏ దయా మీ దయా మా మీద లేదు,
ఇంత నిర్లక్ష్యమా ఇది మీకు తగదు,
దసరాకు వస్తిమనీ విసవిసలు పడక
చేతిలో లేదనక అప్పివ్వరనక
పావలా.. .అర్ధయితే ...పట్టేది లేదు,
ముప్పావలా అయితే ముట్టేది లేదు,
హెచ్చు రూపాయయితే పుచ్చుకుంటాము,
అయ్య వారికి చాలు ఐదు వరహాలు
పిల్ల వారికి చాలు పప్పు బెల్లాలు
జయీభవా...దిగ్విజయీభవా
శమి శమయతే పాపం
శమి శత్రు వినాశని
అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శని
హర రాజ సురరాజ
వనరాజ వనస్పతే
ఇష్టదర్శన మృష్టాన్నం
కష్టదారిద్ర్య నాశనం
అమ్మవారి ఒక విశిష్ట నామం:
నిజ సల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపీ
ఇది పదహారు అక్షరాల నామం.
నిజ = తన , సల్లాప = (సం + లాప ) = సంభాషణ , మాధుర్య = తియ్యదనం చేత, వినిర్భర్త్సిత = అధికముగా అదలింపబడిన , కచ్ఛపీ = కచ్ఛపీ అను పేరు కల వీణ గలది.
ఈ నామంతో అమ్మవారికి నమస్కారం :
"నిజ సల్లాప మాధుర్య
వినిర్భర్త్సిత కచ్చప్యై నమః "
అన్నపూర్ణేశ్వరి ప్రార్థన శ్లోకం
"నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాఖిలఘొరపాపనికరీ ప్రత్యక్షమాహేశ్వరీ!
ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ !"
అర్థం
శాశ్వతమైన ఆనందము ఇచ్చుదానవు, వరములను, అభయమును ప్రసాదించు దానవు, సౌందర్య సముద్రమైన దానవు, ఘొరమైన పాపములనన్నిటినీ కడిగి వేయుదానవు, ప్రత్యక్షముగా అందరికీ కనపడు మహేశ్వరుని పత్నివి,
హిమవంతుని వంశమును పవిత్రము చేయుదానవు, కాశీ పట్టణమునకు మహా రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అయిన నీవు మాకు బిక్షపెట్టుము.
శ్రీ లలితా త్రిపుర సుందరి
*కంచన కాంచీతిలకం
కరధృత కోదండ బాణ సృణిపాశం
కఠిన స్తనభర నమ్రం
కైవల్యానందకంద మవలంబే!!*
ఈ శ్లోకాన్ని ధ్యానం చేత అమ్మవారి అనుగ్రహం విశేషంగా కలుగుతుంది .
ఈ వర్ణన యథార్థమునకు లలితా త్రిపుర సుందరికి అన్వయం. ఆ లలితా త్రిపుర సుందరీ కి కామాక్షీ కి భేదం లేదు.
కంచన - ఒకే ఒక్కటి, తత్తుల్యం లేదు.
కాంచీ తిలకం - కాంచీ నగరమంతటికీ శ్రేష్ఠమైన దానిని ,
కర ధృత కోదండ బాణ సృణిపాశం - చేతులలో కోదండం,బాణములు, పాశము, అంకుశము కలిగిన దానిని,
కఠిన స్తన భర నమ్రం - ముందుకు కొంచెం వంగి ఉంటుంది. ఎందుకు? గట్టిగా ఉన్నటువంటి పూర్ణమైన స్తనములనే ఫలముల వలన వంగి ఉన్నదానిని,
కైవల్యానందకరం - కైవల్యానందము ఆనందం ఎక్కడినుంచి అంకురంగా పైకి వస్తుందో,
అవలంబే - దానిని నేను పట్టుకుంటున్నాను.
మహాలక్ష్మి వందనం
"నమోస్తు హేమాంబుజ పీఠికాయై
నమోస్తు భూమండల నాయికాయై
నమోస్తు దేవాది దయాపరాయై
నమోస్తు శార్గ్ఙయుధ వల్లభాయై"
సువర్ణ పద్మము ఆసనముగా గలిగిన, భూమండలమునకు నాయికయగిన, దేవతలలో దయమే ప్రధానముగా గలిగిన, విష్ణువుకు ప్రియురాలును యైన లక్ష్మీదేవికి నమస్కారము.
మహిషాసుర మర్దిని
*మహిషమస్తక నృత్తవినోదిని,
స్ఫుటరణన్మణి నూపుర మేఖలా,
జననరక్షణ మోక్షవిధాయినీ,
జయతి శుంభనిశుంభ నిషూదినీ*
అర్థం:
మహిషాసురుడనే రాక్షసుని సంహరించిన అమ్మను మహిషాసురమర్ధిని విరివిగా పూజిస్తే శత్రుభయం తొలగి పోయి విజయాలు కలుగుతాయి . ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితము లభిస్తుంది.
సరస్వతీ శ్లోకం
యా కుందేందు తుషార హార ధవళా యాశుభ్ర వసా్త్రన్వితా,
యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా,
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైస్సదా పూజితా,
సా మాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా’’
బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీదేవిని పురాణాలు వర్ణించాయి. శ్వేతపద్మాన్ని ఆసనంగా అధిష్టించి, వీణ, దండ, కమండలం, రుద్రాక్ష
మాల ధరించి, అభయముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను దూరం చేస్తుంది. త్రిశక్తి రూపాల్లో సరస్వతి మూడో శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి.
కందము
ప్రజలకు స్థిరమును గూర్చగ
రజనీకర వెలుగులిచ్చి రయమున గావన్
విజయము లీయగ వచ్చెను
విజయదశమి నేడు జగతి విభవమునొందన్
కందము
ధర్మమునిల గాపాడుచు
కర్మల దొలగంగజేయ కారుణ్యముతో
నిర్మల మానసమునొసగ
(అ)నర్మిలితోవెలుగు పంచెనవనిన దసరా!
కందము
సత్యమహింసయు జగతిన
నిత్యముగాపాడి జనులు నిష్ఠగ నుండన్
ముత్యమునై వెలుగొందగ
నృత్యంబొనరించ వచ్చె నిజముగ దసరా!
కందము
జనులకసూయను దొలచగ
వినయంబీయగ బిరబిర వేగమె నిలలో
(అ)ననయము ప్రేమను పంచగ
మనమును వెలుగొందజేసె మహిలో దసరా!
కందము
కలిసిమెలిసి యుండగనిల
వెలుగు లొసగి నీ కరోన వెతలను దొలచన్
గలగల సిరిజల్లు వలెను
ఫలములనిడి జనుల గావ వచ్చెను దసరా!
శ్రీ రాజ రాజేశ్వరి దేవీ వైభవం ......
పల్లవి...
అమ్మా రాజేశ్వరి,
శ్రీ రాజ రాజేశ్వరి,
అభయ మొసగి మమ్ము,
ఆదుకోవమ్మ........
చరణం 1
శివుని అర్ధాంగి వే,
శివానంద లహరివే,
శివుని అంకపీఠమలరించిన
శుభాలంకృత నేత్రివే,
ముజ్జగముల పాలించే,
మహిమాన్విత మూర్తివే...
చరణం 2
అసుర గణము ను
అంతమొందించిన,
ఆది పరాశక్తివే,
ఉగ్ర దుర్గ రూపమును
ఉపశమింపచేసి,
దశహర మహోత్సవమున
లోకకల్యాణ కారకివై
శాంతింపుము తల్లీ,
త్రిలోక మాతవై కావుము మమ్ము...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి