29, అక్టోబర్ 2020, గురువారం

దత్తపది - 50, నీతి - రీతి - గీతి - జ్యోతి


 

దత్తపది -  50

 * నీతి - రీతి - గీతి - జ్యోతి* 

ఈ నాలుగు పదాలతో ఏదేని ఇతివృత్తం లో, రామాయణం/భారతం/కలియుగ భారతం గాని, మీ పద్యాలు/కవితలు 

************* 

పార్వతీ దేవి ప్రార్థన అన్యర్థం లో

తేటగీతి

ఈశ్వ(రీ!తి)మిరము దొలగించి మమ్ము

గాంచి నిలుపు భవా(నీ!తి)కమక వీడి

నిన్నుకొలుతుము పార్వతీ! నెమ్మి తోడ

కరుణ జూపు యో(గీ!తి)గకంటి యింతి!

దేవి! (జ్యోతి)ర్మయపు దివ్య దీప్తి తోడ

జీవితము లందు శోభిత సిద్ధి నిమ్ము

తిగకంటి= శివుడు

వెంకట్.సిహెచ్

 

 

భవ్యభారతమును బ్రతికించునదె నీతి

బాధ్యతగ నడుచుటే లోకరీతి

స్వధర్మరక్షణే ఆత్మగీతి

అదియె మనప్రగతిని వెలిగించు జ్యోతి!

 

రాంమోహన్,  నిజామాబాద్

 

 

అమ్ముడుపోయి,అం(గీ తి)న్నగ కట్టుటరానివానిన్,  

ప్రాగ్ (జ్యోతి)ష పుర నరక సముని

ఎన్నుకొ(నీ తి)న్నగ పాలించుట లేదటంచు

వగచు(రీ తి)మిరాంధుల నాదుకొమ్మంచు వేడుకొందుమమ్మ జగన్మాతా!

 

కె.ఎల్.కె. రావు

 

 

ఆటవెలది

నీతివంతుడెపుడు నిక్కంబు తెలుపుచూ 

రీతులన్ని తెలిసి కైతలల్లు !

సత్య వాక్సుధలవి జావళీగీతులై  

జ్యోతులవలె వెలుగు జూపవోలె 

 

కందము

నీతి మరచి దుర్జనుడు 

జ్యోతులు వెలిగించుట కడుచోద్యము కాదా ! 

జాతిని మేల్కొలుపు హృదయ      

గీతులరీతులు వెలయఁగ కేయూరములై !!     

 

కస్తూరి శివశంకర్

 

 

మంజులము సూక్ష్మము నందించిన శివగారికి ధన్యవాదములతో...

 

శివుడే మన కోసమనే

భవుడై తెలిపే గదరా

కవులే కదిలేరిలనే

కవితే నిజ మంజులమై.....

 

 

 ఆట వెలది

రాజ నీతి జూడ రాక్షసముగ మారె

రీతి లేక మదిని భీతి గలిగె

విప్లవాల గీతి విలువతో

నందించ

కావ్య జ్యోతి తోడ కదలి రండు.....

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

 

నీతి లేని వాడు కోతి కంటెను పాడు

రీతి దప్పి నడిచిన రాత మారి పోవు.

బ్రతుకు గీతి లోన శ్రుతులు దప్పకుండ

జతను కూడి యుండ జ్యోతి వెలుగు.

 

నీతి బోధ లొసఁగు నిర్మల బుద్ధియు

రీతి దప్ప వలదు లేమియైన

గీతి యాలపించు గేహ చింతలు వీడి

జ్యోతి కాంతి జగతి శోభ గూర్చు.

 

శిరీష

 

 

దత్త పది

నీతి,   రీతి,  గీతి  ,జ్యొతి,

అన్యార్ధములో  భారతములో  పూరణము

సైరంధ్రి తో   కీచకుని సంభాషణము

 

దివినుంచి వచ్చిన దేవ కన్యవు  గాదె కోమలాం( గీ , తి )కమకగొను

చుండె నా హృదయము, మండుచు నుండె ప్రకాశ నా( రీ ,  తి )ట్లు లేశ మంత

నైన తగలబోవు నాకు,  శుభాంగి( నీ, తి )య్య విలుతుడు స్వాధీన పరచు

కొనెను గా యీ దేహమును, ( జ్యోతి )షికుడు తెలిపెనుగ నేడు వెలపడతి సుఖము

 గలదని, ( నీతి ) మాటలు వీడ వలయును, సొగసులాడి చలువ ( జ్యోతి ) గగన

 

మందు నుదయించి  నంతనే పొందవలయు

నిన్ను నేడు,   ( రీతి )ని మార్చ  కున్న చరమ

( గీతి ) పాడ గలడుగ యీ కీచ కుండు

ననుచు బలికె సైరంధ్రితో కినుక బడసి

 

అర్ధములు:

ప్రకాశ నారీ   = వేశ్య ,వెల పడతి = వేశ్య , తియ్య విలుతుడు  = మధనుడు,  చలువ జ్యొతి = చంద్రుడు

 

పూసపాటి


 

జీవన జ్యోతి

కొందరు ప్రముఖల నీతిని క్షుణ్ణంగా చదివి

వాటి సారాంశాన్ని ఒక రీతిలో కుదించి

మా అబ్బాయికి వివరించి ఇచ్చాను .

అంతే , ప్రతి ఉదయం సూర్యనమస్కారాలతో , అయన

గీతికలు ఆలపిస్తూ  వాడి జ్ఞానజ్యోతి  కొందరికైనా

వెలుగులు పంచుతూ , పెంచేటట్లు చూసుకుంటున్నాడు ।

 

జి మురళీ మోహన్

 

 

రొక పూరణ

అవినీతి పరుల పాలనను ప్రజలు వ్యతిరేకించి నూతన రాజ్యమును స్థాపించ గలరనే భావనగా జైకరులు ఇచ్చిన ఉద్యమ స్ఫూర్తితో ఉత్సాహము గా ప్రయత్నం

 

ఉత్సాహము షడ్పది

 

నీతి పరులనెడి పలుకులు నేర్పుతోడ పలికి,యే

భీతి లేక పాలన జరిపెడి కుటిలపు రీతియే

ప్రీతి నొందక ప్రజకు వ్యతిరేకమై వగచుతురే

పాతప్రభుకుచరమగీతి పాడెడి జనులుండిరే

జాతి శ్రేయమే పలుకుగ జాతు లంత కలిసి, రే

జ్యోతిని వెలిగించి దేశ శోభ గూర్చు ధీరులై

 

వెంకట్.సి హెచ్

 

 

కందము

నీతిని గల్గిన నిక నే

రీతిని పాడంగనేమి లేదుగ తప్పే

గీతియె మనసులు తాకన్

జ్యోతులు వెలుగుట నిజముగ చోద్యం బేలా?

 

ఉత్పలమాల

నీతిని గల్గినన్ తగదు నిందలు మెండుగ పొందువారు నే

రీతిని జీవితం నడుపు, లేదుగ మెప్పను మాటలే సదా

గీతిగ చెప్పగన్ జనులు గీతను నెల్లరు నొప్పుకొందురే

జ్యోతిని చేతులందునను చూపగ నమ్మును పిచ్చిలోకులే

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

 

 

ఉత్పలమాల

నీతి కి నిల్చినన్ హితుల నెయ్యపు బల్కులు నెమ్మిగూర్చ, నీ

రీతి గ సాగినన్ గెలుతురే మను ధర్మము యొప్ప మాధురీ

గీతి క సాంద్రభావనల కీర్తిని యందిన మానసీలురౌ

జ్యోతి క దీధితుల్ వెలుగు యోగ్యపు జీవన రీతులందునన్

 

వాణిశ్రీ నైనాల

 

 

 

ఈ రోజు దత్తపది కి

ఉత్సుకము లో నా తొలి ప్రయత్నం

 

నేతలు జెప్పెడి నీతి నే

రీతిగ నమ్మెద మో మనం

గీతను మార్చెడి రాతలే

జ్యోతిగ మారెను వెల్గులై

 

రమ

 

 

రామ రాజ్యమందు వెలుగొందు నీతి,ని

తగు రీతి గా ప్రజలెల్ల అనుసరించి, వారి

జీవన గీతి లో స్వర్ణ కాంతులెల్ల కాంచించి

రామ నామ జ్యోతి ప్రజ్వలన గావించె ప్రజలెల్ల

 

వి. వి.శ్రీనివాస్

 

 

తేటగీతి

నేటి బాలలే రేపటి సాటిజనులు

స్వార్థ మనియెడి జ్యోతియె ప్రజ్వలించె!

నీతిగీతి లేని చదువు నేటిదయ్యె

భావిసంఘమేరీతి ప్రాభవమునొందు!!

డా. నాగులపల్లి

 

 

 

ఊర్వశి అర్జునుతో ఆడు మాటలు:

 

సరిలేని నరవరా కురువరా

వావి వరసల రీతి చెల్లును

మీ భూలోక నివాసులకును

లేదు మా దేవతలకు ఆ నీతి

సంశయబును వీడి వేగమున

పలుకు  నా జత ప్రణయ గీతి

దీపించు నీ ఎద మదన జ్యోతి

పొసగుదము స్త్రీ పురుషులుగ

 

CA కె మల్లికార్జునరావు

 

 

తోటకము లో సరదాగా దసరా ప్రయత్నం....

 

దసరా సుదినం బహుదా విజయం

బసురాధముడే విజయాతురుడై

కసిగా కదిలే వర కాముకుడై

విసుగే గలిగే పృథివీ పతికే

మసి చేసెనహో యధమాసురునే

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

 

రూపాల్లో చెబుతాయిఏదో ఒక నీతి..

తెలుగు తేనీయల గురించి పాడాలని ఉంది ఓ సు గీతి..

తెలుగు తేనీయల గూర్చి మాట్లాడానికే గాని పాడటానికి లేదు నా గళము రీతి...

తెలుగు తేనీయలు ఎప్పుడు వెలిగిస్తాయి ఆలోచనలతో జ్ఞాన జ్యోతి..

ఉష

 

 

తేట గీతిలో ఇతివృత్తం: గోపిక విరహం

నిన్ను చేరగ లోకపు నీతి మరచి

యమున సైకత తిన్నెల యామి వేళ

వేయి రీతుల మధుగీతి  వింత గొలుప

మనువు శారది జ్యోతుల మహిమ జూప

వేగ రమ్ము గిరిధరుడ వినతి వినగ

 

అవళూరు సీత

 

 

కందము 1

అర్మిలిగ నీతి బోధను

ధర్మవిదులె సేయ గాను ధార్మిక రీతిన్;

నర్మపు హృదయజ్యోతుల

నిర్మగ్నపు వెలుగు పాడు నిర్మల గీతిన్!

 

 

కందము 2

నీతి గల వారలె హృదయ

గీతిని తామాలపించి కెరలిన విధి; నా

రీతిగ నియతిని సతమును

జ్యోతిగ వెల్గింప హృదినె చేకురు శుభముల్!

 

చల్లా దేవిక.

 

 

తేటగీతి

రామ రామ గీతిక పాడ రమ్య రీతి

నీతి పలుకులబ్బెను మంచి నియతి తోడ

జ్ఞాన జ్యోతి వెలయు రామ నామ వినిన

రామ మంత్రము మించిన రక్ష లేదు

 

పద్మలత మున్నంగి

 


 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...