29, అక్టోబర్ 2020, గురువారం

నానీలు - CA మల్లికార్జున రావు


 

నానీలు - CA మల్లికార్జున రావు 

1

నీ కలము రాసిన కావ్య మాధురి

హలము దున్నిన పొలము మాదిరి 

2

ఆస్తిపాస్తులు శుద్ధ దండుగ

ఆత్మశాంతియే పెద్ద పండుగ.

3

మామిడి తీయన, నిమ్మ పుల్లన,

మిరప కటువు, ఎవరికి వారే గొప్ప.

4

దేవుడా ఎక్కడ నీవని అరిచా!

ఇక్కడని నాలోని వాడు పిలిచే.

5

క్లాక్ లో పెండులం యం ఐ జి జీవితం

ఆశల ఉయలలో నిత్య ఊగిసలాట.

6

తెరమీది బొమ్మ మనిషి కల్పన

మనిషి జన్మ దేవుని కల్పన.

7

నిద్రలో మనం కనేది చిన్న కల

మెలకువ జీవితం ఒక పెద్ద కల.

8

భక్తుడు లేక దేవుని ఉనికి లేదు.

దేవుడు లేక భక్తుని రక్షణ లేదు.

9

మతమనగ పదుగురి సమ్మతం

దుర్మతులకు చిక్కి అయ్యేను ఖతం

10

గతమొక శవం ప్రస్తుతం శి గువం

భవిష్యత్ అగమ్యం నమ్ముము  క్షణం

11

కాలము మారే, ఇంటి పని వచ్చునా!

అబ్బాయి నడిగె డేటింగ్ లో అమ్మాయి.

12

నవ్వితే భోగం నవ్వకున్న రోగం

నవ్వించుట యోగం అతి నవ్వు శోకం

13

సీతకు  రాముడు ప్రాణంకానల కంపినా

వీడలేదు సీత రాము ధ్యానం.

14

పుట్టింటి కెళ్తా అప్పటి బెదిరింపు

పుట్టింటి కెళ్ళ ఇప్పటి బెదిరింపు.

15

నలుపు విష్ణువు మెచ్చుతెలుపు

లక్ష్మి మెచ్చు, మెప్పులేని రంగేది?.

16

దయ గల చిత్తం భగవన్నిలయం,

దయ లేక వలదు హృ"దయ"ము

17

"మమఅనుట ఇహ బంధం

"నమమఅంటే ముక్తికి మార్గం

18

"నేనుపోతే దేవుడు వచ్చు

"ఖుద్ మిటే తో ఖుదా మిలేగా"

19

"ఇట్లే ఉండదు" అన్న మంత్రం

సుఖదుఃఖాలను చేయును  సమం

20

ఇంద్రుడి నైనా జయించవచ్చు

ఇంద్రియాలను జయించలేము

21

పాణి- వాణి ఉదరం - ఉపస్థ

లను నిగ్రహిస్తే నారాయణుడే

22

తెలివి లేని వారెవరు ?

తెలివిగల వార మనుకొనువారు!

23

కృష్ణు డుండగ త్రుష్ణ ఉండదు

రాము డుండగ కాము డుండడు

24

సత్యం చేయును మనసును శుద్ధి

జ్ఞానం చేయును బుద్ధిని శుద్ది

25

నాడు, ఉపకారికి ప్రత్యుపకారం

నేడు, ఉపకారికి ప్రత్యపకారం.

26

అంతా మంచికే ఐతే జయ మంగళం

కాకున్నచో శుభ మంగళం

27

కోరికలు కోరితే భక్తుడు కాదు

ఓడిపోతే వీరుడు కాదు.

28

సుఖ దుఃఖాలు కలిసే ఉంటాయి

గమనించినచో ఇదే రహస్యం.

 29

ఉన్న వాడికి అరగని జబ్బు

లేని వాడికి ఆకలి జబ్బు

30 

ఆకాశవాణి పోయి దూరవాణి వచ్చె

దూరవాణి వెళ్లి చరవాణి తెచ్చె

31

మొక్కలు ప్రకృతి ఒడిలో పెరుగు,

పిల్లలు అమ్మ నాన్న నీడలో ఎదుగు.

32 

ఏమి ఈ వింత? కంప్యూటర్ వైరస్ను

చంపుతారుమనసు వైరస్ను ఉంచుతారు.

33 

అవినీతులా కావు కావు

కలియుగంలో అవి   నీతులే.

34 

అమ్మానాన్న నాదరించవలె

అదే నిజమగు దైవ భక్తి.

35 

పెంచిన ప్రేమ ఒకచో నిలుచు

పంచెడి ప్రేమ విశ్వము వ్యాపించు.

36 

అమృతం గరళం అక్క చెల్లెళ్ళు

ఎవరిని వరిస్తువో నీవే తేల్చుకో

37

మొక్కలు ప్రకృతి ఒడిలో పెరుగు,
పిల్లలు అమ్మ నాన్న నీడలో ఎదుగు.

38

ఏమి  వింత? కంప్యూటర్ వైరస్ను
చంపుతారుమనసు వైరస్ను ఉంచుతారు.

39

అవినీతులా కావు కావు
కలియుగంలో అవి  నీతులే.

40
అమ్మానాన్న నాదరించవలె
అదే నిజమగు దైవ భక్తి.

41

పెంచిన ప్రేమ ఒకచో నిలుచు
పంచెడి ప్రేమ విశ్వము వ్యాపించు.

42

అమృతం గరళం అక్క చెల్లెళ్ళు
ఎవరిని వరిస్తువో నీవే తేల్చుకో

 43

వారధి కట్టె రావణు  కొట్టె
రాము సీతను తెచ్చె అయోధ్య వచ్చె

 44

పరీక్ష ఫీజు కట్టె కాపి బాగా కొట్టె
మార్కులు తెచ్చె సర్టిఫికెట్ వచ్చె

45

దెబ్బలు తిని పండ్లిచ్చె చెట్టు

మేలు గొని విషం చిమ్మె మనిషి

 46

అడవారంటే అడు వారు కాదు

అడించువారు గడగడ లాడించువారు.

47 

అంగన అబల అనుటనసత్యము

దురాసురుల జంపు అమ్మయే ఆమె

48 

జిహ్వ వలెనంది కడుపు వలదంది

రాజీ కుదిరితే ఆరోగ్యమస్తు

 49

అప్పుకు ముందు పుచ్చుకున్నోడి

చెప్పులరిగే,పిదపఇచ్చినోడరిగె.

  

51.

కనుడీ వింత క్షయుడు చందురుడు,

అయినా పంచు వెన్నెల సుధలు.

52

చుట్టూ సమస్యలు, శివుడు శాంతుడాయే

ధ్యానమున మునిగి, మనమే పాటి?

53

మెడలో పడిన మూడు ముళ్లు

కారాదు మహిళకు మరో ముళ్ళు.

54

మోసం గ్రాసమైన కలి జనులకు

వీసమెత్తూ లేదు విశ్వాసము

55

నిజ బంధులా రాబందులా

ఎరుగుట క్లిష్టము ఈ మాయ లోకాన

56

భయం ఎక్కువ నమ్మిక తక్కువ

దేవుని పైన నేటి మనుజులకు

57.

కల్లు తాగిన తిక్క కోతిరా చిత్తము

తెలియక నీవు చిత్తు చిత్తయ్యేవు .

58

ఇష్టం కష్టం ప్రారబ్దమున వచ్చు

సుఖం దుఃఖం అజ్ఞానమున వచ్చు

59

సృష్టి అందాలు కోరెదరందరు

సృష్టి కర్తను మరిచేదరంతా

60.

గట్టిగా నవ్వండి పెదవులే కాదు

హృదయమూ తెరుచుకుంటుంది

61

మూసిన ప్రతి కన్నూ నిద్దుర కాదు

తెరచిన ప్రతి కన్నూ చూచుట కాదు

62

విశ్రాంతి కావాలా? బాధలన్నిటిని

జ్ఞాన సంద్రంలో ముంచి వేయాలి.

63

కష్టాలే గురువు కష్టాలు లేక

పెరుగునవి కలుపు మొక్కలు

64

హార్థిక బంధాలు కను మరుగాయే

ఆర్థిక బంధాలు బహు మెరుగాయే

65

పతి వెనక సతి విజయలక్ష్మి

పతి ముందు సతి విజయ సారథి

66

దేవుని పేర హింస చేయుదురు

దయామయుడు అతడని మరచి

67

మతమంటూ కొట్టుకొనెదరు

జనులు , మమతలు కట్టు కొనరు.

68

విశ్వమున్ కప్పిన విష్ణు కాలు కన్నా

ఆ కాలు దాచిన భక్తుని మది మిన్న

69

గ్రహాలు గెలిచాడు మనిషి, కానీ

ఆగ్రహాలు గెలవ లేకున్నాడు.

70.

లోకాలు శోధిస్తు పోతున్నారు

కానీ సొంత మనసు చూడ కున్నారు

71

బురదలో పుట్టిన పంకజం బురద

నంటించు కోదు ఇదియే తత్వం.

72

చీకటి పోవునొక్క నిప్పు కణమున

అవిద్య నశించు ఈశు వీక్షణమున

73

నాది నాదంటే పడును సంకెళ్ళు

నాది కాదంటే వీడును సంకెళ్ళు

74

వేదన నుండి పుట్టును వేదం

శోకం నుండే పుట్టె వాల్మీకి రామ శ్లోకం

75

విత్తు విలువ చెట్టుకు తెల్వదు

అమ్మ నాన్న విలువ పిల్లలకు తెల్వదు

76

మహాభారతంలో ఒకే శకుని

నేడు అడుగడుక్కీ ఒక శకుని

77

అహము లేక ప్రేమ అమర మౌను

అహమున్న ప్రేమ విషమౌను

78

నిత్య విరహము శాశ్వత ప్రేమ

ఏకమైనచో అంతమౌ ప్రేమ

79

జ్ఞానము కణమైన చాలు, కొండంత

అయిననేమి భోగ భాగ్యాలు.

80.

నల్లని బొగ్గు మెరిసే వజ్రము

మధ్యన ఉన్నది శ్రద్ధ తోడ కృషి

81

అప్పు చేస్తే తప్పవు ఈ.ఏం. ఐలు

పాపం చేస్తే తప్పవు కష్టాలు 

82

రామ రామ అనవే మనసా

విరామము దొరుకు నీకు  మనసా

83

చేసిన పుణ్యం బ్యాంకు డిపాజిట్

నిత్యం  పెరుగును వడ్డీ  జత కూడి

84

బాధలో ఉంటే వర్షంలో నడువు

నీ కన్నీళ్లు ఎవరూ చూడరు

85

గురువు లేక గురి ఎరుగము

గురి లేక దారి తెలియదు

86

విత్తమందు లేడు శివుడు

చిత్త మందే కలడు హరుడు

87

వెన్న చేత బూని నేతికై ఉరుకు

లోని దైవానికై ఊరల్లా  వెతుకు

88

కలిమియే ఇలలో బలిమి

కలిమి లేక లేదు చెలిమి

89

మంధర లేక రామ కథ లేదు

చెడు చేయు మంచి అనగ నిదియే.

90.

విభీషణు భ్రాత్రు ద్రోహం కన్నా

ధర్మానికి చేసిన న్యాయం మిన్న

91.

మౌన మన్ని వేళల పాడి  కాదు

నాటి భీష్ము మౌనం తెచ్చె కదా అనర్థం.  

92.

నవ్వు అన్ని వేళల హితవు కాదు

నాడు ద్రౌపది నవ్వు తెచ్చెను ముప్పు

93.

కణముల్ బిందువై బిందువు తనువాయే

కనుడీ జీవులు కణాల ప్రోవులే

94.

రక్తం,గర్భం,ప్రేమ బడులూ,గుడులూ

అన్నీ వ్యాపారం ఇదే నేటి లక్షణం.

95

మందుల వైద్యం మానగవలె

కావ్యంతో చికిత్స ప్రయత్నించవలె.

96

అణువణువు తెరచి చూడు

కనిపించు నీవు వెతుకు దైవం

97

చింతను కాల్చాలి చింతన పెంచాలి

ఇదియే ముక్తికి ప్రథమ సోపానం

98

జీవన రణంలో పార్థుడై పోరాడు

మరణమైననూ వీర స్వర్గమే.

99

అద్దమంటే నాకతి ఇష్టము

నేను ఏడిస్తే అది నవ్వదు

100

నాన్న ప్రేమ  మింటి కన్న ఎత్తు

అమ్మ ప్రేమ కడలి కన్న లోతు

101

ఒక చిన్న చుక్క  వాక్యం ముగింపు

ఇంకొక చుక్క కొనసాగింపు. 


నానీలు - CA మల్లికార్జున రావు 

 

 


 


 


  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...