16, అక్టోబర్ 2020, శుక్రవారం

చిత్రం పై పద్యం - 55

 చిత్రం పై పద్యం  - 55


 12.10.2020

నిదురను పోవు చుంటివిగ ,నేర ము చేయుచు నుంటివే భువిన్,

యెదురుగ నెన్ని యాపదలు‌ యేర్పడ బోవుచు నున్నవో గదా,

బెదరక నన్ని‌ జంతువులు స్వేచ్చగ కానలలో విహారమున్

ముదముగ సల్పు‌ చుండునుగ, మూర్ఖుడ మత్తునువీడి లెమ్ము, యా

పదలు కలుంగ వచ్చునని వానర మొక్కటి కర్ర‌తోడ నీ

నిదురను భంగముం పరచ నీవెనుకన్ నడయాడు చుండెగా

 

పూసపాటి

 

 

ఆత్మ స్థైర్యమొక్కటె నీదు యాయుధమ్ము

ఛాయ లాగవెంటాడిన చంప వచ్చు

వెరపు వీడికదులు నీవు బెదరకుండ

చిన్ని చీమల చేతిలో చిక్కి జచ్చె

సర్ప మొకటి.  నా తీరుగన్ జయము కల్గు

నీకుజాతి బేధము దల్చి నీర సించ

కుండ పోరాడి గెల్చుటే గొప్ప దనము

 

రమ, కంకిపాడు.

 

 

తేటగీతి

దుష్ట రావణు గర్వము ద్రుంచి నట్టి

వాలి పూనెనో యీ చిన్ని వానరమును

సింగమును నిద్ర లే పంగ సిద్ధ పడెను

సంగరము నకు పిలువంగ సాహసాన.

 

డి.రామ నాగేశ్వరరావు

 

తేటగీతి

ప్రతి యునికికొక్క బలిమిని ప్రకృతొసంగె

తెలివి జీవివి నీ శక్తి తెలిసి మసలు

అనవు గానిచోటధికుడి నన్న దకట!

ఆది జీవిది మనుజుల కైతె నేమి

కోతిబుద్ది! ప్రాకటమయ్యె కొంటె తనము

 

వాణిశ్రీ నైనాల

 

మొదటిసారి సింహాన్ని చూసిన తెలియని అమాయకత్వమో,

తెలిసినవాడే కదా నా స్నేహితుడే కదా అనే దగ్గరతనం వల్ల వచ్చిన ధైర్యమో

వానర జన్మమెత్తుట వలన వచ్చిన చిలిపి అల్లరి లక్షణమో

తాడో - పేడో  తేల్చుకుందాం రమ్మని యుద్ధానికి సిద్ధపడిన ధైర్యమో

సరాసరి సింహాన్ని ఎదుర్కొనలేక తనను పంపిన ప్రోద్బలమో

సింహమేమీ చేయలేని పరిస్థితులలో ఉన్నదన్న నమ్మకమో

విధి వైపరీత్యమో ఏమందునీ విచిత్ర చిత్రము

 

వారణాశి శ్రీలేఖ

శార్ధూలము 1️

కృత్యంబెయ్యది సవ్యమో తెలుపుచున్ క్రీడా వినోదంబులే 

నిత్యానిత్య వివేకయుక్తపధముల్ నిండారు వాంఛల్ సదా  

సత్యంబౌతలపుల్ విలాసమయమై  సమ్మోదమున్ వానరం   

ప్రత్యక్షానుభవమ్ములేక మదిలో పైత్యంబులే చిత్రముల్ !!!

 

కస్తూరి శివశంకర్

 

ఆటవెలది

కోతి చేష్టలనిన క్రొత్తగా నేముండు

ఇంత కన్న వేరు వింత గలద

చిలిపి పనుల నేల సింహము తోడుగా

ఆట లిటుల నాడె నాపె దెవరు

 

ఉత్పలమాల

తప్పును చేయుచుంటివిగ తన్నులు తిందువు వానరా నికన్

మెప్పును పొందగా దలచి మేల్కొలుపిచ్చుట తొందరే గదా

తిప్పలు తప్పవే నిజము ధీరత వల్లదు సింహమున్ నిలా

చెప్పిన దెవ్వరో తుదకు చేష్టలు తుంటరి మార్గమెంచెనే

 

కందము

కానద కంటికి సింగము

వానర నీకెందుకింత పరుగిడ లేవే

ఆనక నీ స్థితిని గనుచు

నేనిక నవ్వంగ లేను తెలియద నీకున్!!

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

గేయ రచన,

 

కోతి బుద్ధి

పడుకున్నది మృగరాజని,

దరి దాపుల్లో ఏ చెట్టు లేదు,

పారిపోయి చెట్టెక్కి కూర్చోటానికి,

అయినా కోతి తన కొంటెబుద్ధి మానదు...

 

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

 

వేళపాళ లేక పరిహసించ తగదు!

కొంటె బుద్ధితో ! కోరి తంటాలు తెచ్చు 

కొనఁగ నేల ? వేళా కోళ మాడ వచ్చు

నే!  బలవంతుని తట్టి లేపి!  కయ్యమైన

వియ్యమున కైన సరి సమవుజ్జి లే కదా!

 

లలిత దీక్షిత్

 

 

మామను పిల్లనడగ వచ్చుచుంటివా

పూలు దొరకక కఱ్ఱ తెచ్చుచుంటివా

సింహపు పిల్లపై వలపు కలుగ ధైర్యమేల వచ్చె

వరకట్నమడగని నిన్ను మెచ్చరెవరూ

వరపూజ ఆశ వలదు నీకు

బడితె పూజ కద్దు నీకు

 

విష్ణుప్రియ

 

 

ఒహటి:

మామను పిల్లనడగ వచ్చుచుంటివా

పూలు దొరకక కఱ్ఱ తెచ్చుచుంటివా

సింహపు పిల్లపై వలపు కలుగ ధైర్యమేల వచ్చె

వరకట్నమడగని నిన్ను మెచ్చరెవరూ

వరపూజ ఆశ వలదు వలదు బడితె పూజ తథ్యము తప్పదు నీకు 😉😉

 

 

ఇంకోటి :

 

రామ బంటువు నీవు

కాళి వాహనముతో ఆటలేల నీకు

పితలాటకపు పనులు మాని

చెలిమి చేసి చూడు మేలు జరుగు

రానున్నది దశ కంఠుని దహనము అసుర మర్ధనము

కలిసి సంబరాలు పంచుకొనుము...

 

 

మరోటి

 

రావణ దహనము యాదొచ్చెనా

కట్టెలు పేర్చుచుంటివి

మరణించలేదది మత్తులోనున్నది

నివాళులీయ తొందరేలా నీకు

పెను ముప్పు ముంచు నిన్ను

చేటు తప్పదు నీకు చెప్పుచుంటి

 

విష్ణుప్రియ

 

 

కోతి బుద్ధి అంటూ గేలి చేయుట   ఏల?

ఆకారం చూసి అంచనా వేయుట  ఏల?

రాజైన ఏమి మంచికి జాగృతి

చేయ నేరమా?అది ఏల?

ఆత్మస్తైర్యం తో అడుగేయగా

అధైర్యపరుచుట ఏల?

చిన్న జీవినైన నేమి జయముకై

ప్రోత్స హించ ఆలోచన అది ఏల?

 

ఉష

 

 

 

కోతి బుద్ధా లేక?

 

అలోచించి చేయువాడు చక్కనోడు

ఆవేశపడుతూ చేయువాడు తిక్కలోడు

విజ్ఞానంబు దొరకు విరివిగా ఎవరికైనను

విద్య , వినయములతో విజయమా ?

అజ్ఞానముతో అవమానములా ?

అని ఎవరికీ వారు ఆలోచించవలె !

 

జి మురళీ మోహన్

 

 

 

 


 

 

సై... సైరా భళి

 

స్వయముగా  హనుమయే , ప్రార్ధించిన వారికి

బుద్ధి , బలము , ధైర్యము ప్రసాదిస్తూ

కష్టతరమైన కార్య  సాధనలలోను,

క్లిష్టమైన సమస్యల పరిష్కారములకును

వాక్చాతుర్యంతో ఎవరితోనైనా  సంభాషించుటకును

తగినంత శక్తి , మంచి ఆలోచనలను కలిగిస్తూ

వారి విజయములలో తోడ్పడును !

 

జి మురళీ మోహన్

 

 

చిన్నారి పొన్నారి వానరమా

 

నీ తెగువకు కొండైనా తల దించవలే,

అయ్యది కిష్కింద రాజ్యమే ఐననేమి,

నీ తానమును సొంతం చేసుకొన్నదని,

పోలము రాజునే తరిమి వేయుదువే,

ఎవరు నేర్పిరి నీ కింత ఆత్మస్థైర్యము,

 

కాదుగా సాధారణ మర్కటము నీవు,

భయము నరము లేని వానరము నీవు,

కపివంశ తిలకుడు మారుతి అంశ నీవు,

నీ ధీర వీరత నాకునూ రవ్వంత ఇవ్వవే,

మా ప్రేరణ బోధలన్ నీ కథ చెప్పుదునే.

 

కె మల్లికార్జునరావు

 

తేటగీతి

 

ఆత్మ  స్థైర్యమా ?అదికాదె  యనువు  గాని

వేళ నలవి మాలిన పనుల్, పిన్న వయసు

చేయు కోతి  చేష్టలవియే చీకు  చింత

లేక, ఫలితమెరుగకనీ రీతి చేయు

పనులె ముప్పు తిప్పలు దెచ్చు వానరుండ

 

అవళూరు సీత

 

 

అలసి నిదుర బోవు యా  మృగ రాజుకు

చెలిమి తోడ తాను సేవ జేసె

కలిమి బలిమి చేత కర్తవ్య మరసిన

మెలకువలను దెచ్చె మేలు కోరి.  

 

శిరీష, గుడివాడ.

 

 

మధ్యాక్కర

 

కోతి చేష్టలవియే కోతి గుణము తెలిపెడి చిత్రమిది

వేతలు కొనితెచ్చుకొనెడి పిల్లచేష్టలవియే వెర్రి

ఖ్యాతి నొందెడి కృత్యముగ మృగపతిని కదిలింప, కోరి

కోతి ప్రాణము మీద తెచ్చుకొనెడి ప్రయత్నమిది గద!

 

 


 

తరువోజ

 

ఆకతాయి తనము కంతేమి యుంది!  అల్లరి చేష్టలు యంతమొందించు

చే కర్ర పూనిన చిలిపి వానరము  జేసెడి కార్యము చేటు తెచ్చు గద!

ఆ కేసరి దరిన యాట లాడంగ   అడవిగీముకు గల్గు హంతువు ప్రాప్తి

మేకము కాదది మృగరాజు యనెడి  స్మృతిలేని తిమ్మడు మృత్యువు నొందు

 

అడవిగీము, తిమ్మడు= కోతి

 

వెంకట్.సిహెచ్

 

 

 

లేపి తన్నించు కొనుటిదే లేకిబుద్ది

కోరి తగవు తెచ్చుకొనుట కోతిబుద్ది!

బలమెరిగి మెలగవలె చపలత నొదలి

కుప్పిగంతులు మీరిన    బొప్పిగట్టు!!

 

డా. నాగులపల్లి

 

 

 

శుభ సాయంత్రం మిత్రులకు

చిత్రానికి నావంతు పద్యాలు సమర్పణ

 

కందము

కర్రను చేతను బట్టుతు

బిర్రుగ నిలబడిన చిలిపి  పింగళి నీకై

సర్రున జేరును యాపద

వెర్రిపనులు చేయవలదు వేగిరమే పో

 

 

తేటగీతి

కపి నొనరదెచ్చి పట్టము కట్ట నిలను

కపులుచేరి కొలిచి నట్లు ఘనత తగ్గి

నీతి హీనుదరిని చేరు నీతి పరులు

 కేసరు లయిన గానిల గీడె జరుగు

 

 

పెద్దలను కష్టపెట్టు కొడలుగా భావనతో

 

తేటగీతి

కొడుకునకు ఈడు  జోడియు కోడలు యని

పెద్దలు తమ ముచ్చట దీర పెండ్లి జేయ

గౌరవము చూపి తనవారు గైకొనకయె

చేటు తెచ్చు కోడలె సరి జేయు టెట్లు

 

సతీష్

 

 

నీకు సాటి నీవె యనుచు నింగి పైకి లేపినా

మాకు రాజు నీవె యనుచు మాట జెప్పి పంపినా

నీకు నీవె శక్తి తెలిసి నిబ్బరముగ మసలుకో

జోకు కాదు చూడు! కేశి జోలి కేగ వలదొకో!

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి


 

ఓ జ్ఞానశీలి విజ్ఞానపు విహారి

నీ చేతిలో ఉన్నదే ఆయుధమని

నీ తెలివితేటలే తెగింపు అని

దుష్ట శిక్షణే దృఢ సంకల్పమని

క్రూరత్వానికి కాలం చెల్లిందని

కనులకు తెలిపే చిత్రమిది

సమయం తెలిపే సత్బోధయిది"

ఆత్మజ్ఞానమే ఆయుధమైతే

ఆత్మరక్షణే ప్రభోధమైతే

ఆత్మస్థైర్యమే ఆవహించితే

క్రూరత్వానికి చోటేది?

యుక్తి ముందు క్రూరశక్తే నశించేది

సమస్యలు సంకల్పం ముందు

తప్పక తలవంచి తీరాలి

పిరికి వదిలితే పుర రాజువని

భయమన్నది మది గది వదిలితే

నువ్వే రాజువని తెలిపే చిత్రము ఇది

 

వి. వి. శ్రీనివాస్షార్, శ్రీహరికోట

 

 

మత్త కోకిల

రామబంటుని నేను ధైర్యకలాపమౌ తరుణంబునన్   

కామితార్దము తోడ పిల్చెడు కారణంబును తెల్పుచూ 

మామపిల్లని పెండ్లి జేయుగమయ్య వానరవీరుడై ! 

ప్రేమ కేసరిపైన జూపఁగ; భీతి లేని ముహూర్తమున్

 

శివ శంకర్ కస్తూరి

 

వైరి యెంతటి వాడైనా వదల వద్దు

అయుధమౌను ఆత్మస్తైర్యము యెదురైన     

ఛాయ లాగవెంటాడిన చంప వచ్చు

వెరపు వీడికదులు నీవు బెదరకుండ

చిన్ని చీమల చేతిలో చిక్కి జచ్చె

సర్ప మొకటి నా తీరుగన్ జయము కల్గు

నీకు జాతిభేధముదల్చి నీర సించ

కుండ పోరాడి గెల్చుటే గొప్ప దనము

(తమ్ముడు శివ ఆత్మీయ సూచన మేరకు సవరణ)

 

రమ, కంకిపాడు

 

 

 

ఆటవెలది

 

కోతి కొంటెపనుల కోరిక తీరంగ

కాననమునసింహకాయముగనె

కనులుమూసి మత్తుగా నున్న సింహమున్

కొట్ట కర్ర తీసుకోని బోయె

 

డి. వి. హేమలత

 


 

తేటగీతి

 

జ్ఞాన సంపద లొసగెడి శారదాంబ!

సమధికముగ విద్యనొసగు చదువులమ్మ

బ్రహ్మకన్యక! సవినయ ప్రణతులివియె

నందనము గూర్చ వోయమ్మ నలువరాణి!

 

డా. నాగులపల్లి

 

 

తేటగీతి

 

పాలకుండ నేనని గర్వ పడుచు నిటను

ఒడలు మరచి దర్పంబున నొక మృగమ్ము

మొద్దు నిద్ర యందున తాను మునిగి పోవ

వానరమ్ము సైతమ్మును భయము విడె!

 

తేటగీతి

 

నిప్పుతోడ నాడుకొనగ ముప్పనంగ

నెఱుఁగనట్టి మర్కటమున కేమగునన

మృత్యువాత పడక కృత కృత్యుడౌను

కాని యెడ పరితప్తమై హాని నొందు!

 

 

తేటగీతి

 

ఎన్న పరిణమించునెపుడు నజ్ఞానమె

మొండితనముగాను; మూర్ఖము గను;

సాహసమ్ము వలదు సంకటమ్ముల యందు

స్ఫూర్తి యనగ కాదు చోద్యమెపుడు!

 

చల్లా దేవిక.

 

 

ఆటవెలది

 

వైద్య వృత్తి జేయు పతియొక దినమున

తాను వేగిరమున తప్పు జేసె

పురుడు బోయ దలచి ఉదరము చేబట్టి

"మొలనుఁ గత్తి దూసి పొడిచె సతిని"

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

 

 

 

 

 

 

సమస్య

 

మొలను‌ కత్తి దూసి పొడిచె సతిని

ఇచ్చిన పాదము ఆటవెలది  నా  పూరణ. తేట గీతిలో

పసువుల‌కు గడ్డి కోయుచు‌ పడతి నొక్క

పామును గని‌ బెదరి నేల‌ పడగ,  దాని

గాంచిన మగడు చెట్టుపై నుంచి‌ వడిగ

దూకుచు తన మొలను గత్తి‌ దూసి పొడిచె,

 

సతిని‌ కరువ బోయిన  పాము‌ చచ్చి పడెను

 

పూసపాటి

 

 

 

మతం యన్న నేమి? మాన వత్వమె కదా !

మతము హితవు జేయు మార్గదర్శి

మత భేద మిడిచి, మార్పు కొఱకు, తన

మతము మార్చు వాడె మంత్రి యగును.

 

శిరీషగుడివాడ.

 

 

 

 

 

శిక్షణల సిసలైన ఆతర్యం తెలుసుకోలేని వేదన 

 

శార్దూలము -  2️

 

లోకాలోకనమోహహేతువులతో లోపంబు జూడంగనే  

నాకా తోచదు నీవు చెప్పవనుకో నాకింక దిక్కేమిటో 

నా కోపమ్ములనేవి శాపములుగా  నాపైకి రాకుండగా 

సాకుల్ జూపక వాక్సుధామహిమ లో సత్యంబులే తోచకున్

సాకల్యంబులు తెల్పు శిక్షణల హృత్సంపూర్ణమౌ చింతలే       

 

శార్దూలము -  3

మాకింకెవ్వరు దిక్కు లేరు గురువా  మాబోంట్ల రక్షింపవే  ! 

నాకున్ కమ్మని పద్యముల్ మనసులో నర్తించెనీతీరునన్   

సాకారంబుగ సంచరించు తమరీచందంబు చైతన్యముల్ !

ప్రాకామ్యంబుల లీలలే మనసులో ప్రార్ధింపగా పద్యమై !

 

కస్తూరి శివశంకర్

 

 

 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...