1, సెప్టెంబర్ 2020, మంగళవారం

దత్తపది - 34, చూపు - రూపు - రేపు - మాపు, 31, ఆగష్టు 2020, సోమవారము

 

31, ఆగష్టు 2020, సోమవారము

తెలుగు తేనియలు

దత్తపది -  34

చూపు -  రూపు - రేపు - మాపు 

 

(ఈ పదములతో, ఇతివృత్తం తెలియచేస్తూ పద్య కవిత / వచన కవిత అందించగలరు)

 

 

   తలపుకొచ్చెను నీ ఓర చూపు

బాపు గీసెనా నీ రూపు

మదిన నీ ధ్యానం నేడు రేపు

కనిపించవా ఓసారి మాపు

విష్ణుప్రియ

****

 

రూపు మాపెద

చిత్రము లోని

నీ రూపును , చూపును

రేపు మాపు చేసేద ,బహు సుందరముగా తీర్చి దిద్దెద

మరి...

నీ నవ్వుని, నడత ను

అతి రమ్యము గా మార్చు కొనుము

వాటికి పోటీగా కొత్తగా నీ చిత్రము గీసెద

 మురళి

****

 

గేయ రచన.

 మునిమాపు వేళల రాజవీధి లో,

అగుపించిన సుందరాకారుని రూపు,

పై పడింది ఇంతి చూపు,

అదియే జగత్ కల్యాణ కారకం కానున్నది రేపు.

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

**** 

 

నేటి దత్తపది తో తెలుగు సాహిత్య రంగముకు గొప్ప సేవ చేసిన స్వర్గీయ బాపు, ఆరుద్రల ఘనతను తెలిపెడి చిరు ప్రయత్నం

 

సీసము

తెలుగుదనము (రూపు)దిద్దుకొని పొదుపు

        గీతల గారడీ కేళి జూపి

(చూపు)లన్నియు తన వైపు తిప్పుకునెడి

        బాపు బొమ్మల్ వ్రాత వైభవంబె

కూనలమ్మ పదాల కులుకు తెలుప తర

       (మా! పు)లకించునె మనసు యంత.

అద్వితీయానంద మనుభవించితి(రే పు)

        డమి జనుల్ ఘటికుల డంబము గని

 

తేటగీతి

బాపు ఆరుద్ర లిరువురు వసుధలోని

ఆంధ్రసాహిత్యరంగమం దబ్బురముగ

పాటవము జూపి ప్రముఖులై పరిఢవిల్లి,

తెలుగు భాష కద్భుతముగ దీప్తి తెచ్చె

 

వెంకట్. సిహెచ్

**** 

 

మనిషికుండవలెను కరుణచూపు

అదియె మానవతారూపు

నిన్ను నిలబెట్టునది రేపు

కల్మశములను అది మాపు!..

రాంమోహన్ నిజామాబాద్

****

 

నీ నీలి నేత్రాల ఓర చూపు

రవివర్మ కే అందని నీ రూపు

నీ రూపము నా మదిన ఆశలు రేపు

నీ సౌందర్యపు మోము చూడాలి మాపు

వి.వి.శ్రీనివాస్

**** 

 

ఇతివృత్తు: కలలోని రూపం

తేటగీతి

కలల తోచిన రూపమే కాన రాదె

కనులు తెరచి చూడగ, చూపు కందక యెద

లోయల నలలై కదలిన రూపు నిలచి

రేపు మాపుల సందడి రేప గాఁ నె

మమతలు విరిసి వెదికెనే మాపు లందు

అవళూరు సీత

**** 

 

కందము

చూపుల కనబడకున్నది

రూపు దెలుప కష్టమాయె రూఢిగ నిలలో

రేపుచు గుండెల భయమును

మాపును మన యాసలన్ని మహిలో కరొనా!!

 

కందము

చూపుల కనబడకేమట

రూపు దెలియ నేమి జేయు రుగ్మత నదియే

రేపనునది లేకుండగ

మాపుదు వ్యాక్సిన్ను తోడ మహిలో కరొనా!!

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

**** 

 

స్వామీ! నీ ముగ్ధ మనోహర రూపమ్మును చూసి చూపు త్రిప్పుకొన లేక రేపును మాపును మరచి పూజలు చేతురే మోక్షము పొందుటకై...

అన్నపూర్ణ

****


గోపాలుని ముగ్ధ సుందర  రూపు కని,

లీలా మోహనుని చూపులు తగిలి,

మదిన  దివ్య ప్రణయము రేపు తుండ,

జన్మ జన్మల  బంధములు మాపుటకు ,

గోపికా రమణులు పరుగు పరుగున,

సర్వేశుని చేరి ప్రకృతి కాంత లైరిగ.

కె మల్లికార్జునరావు

****

 

చూపు తిప్పుకో లేనట్టి చుప్ప నాతి

రూపు రేఖలు తోడుగా రుజువు చేయు

రేపు తున్నట్టి గుబులురా రేయి పగలు

మాపు కోవాలి యంటెను మరుపు రాదు

లలితారెడ్డి

****


 

రాముని కంటి చూపు

సీతమ్మ గారి సొగసైన రూపు

రాబోయే అందమైన రేపు

కాకూడదు మాపు

మంజూష ఉప్పల

****

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...