22, సెప్టెంబర్ 2020, మంగళవారం

దత్తపది - 40 , కథ - సుధ - వ్యధ - సేద , 21.09.2020

దత్తపది -  40

కథ -  సుధ - వ్యధ - సేద 

***********************


సీసము

ఏకాంతవ్రచ్చునో కలికితురాయి నీకన్ త్రేచ్చునో

మధులిడబాడినా ఆకాంత నీకయ్ శ్రీకారముల్ చుట్టునో

సిగనందు పారిజాతముల్ పూయగా బృందావన

ఇదికథ సుధ మాలికల్ నీ వ్యధతీర్చగ సేదతీరుమా

సూర్య తాడిపూడి _________________


 

కందము

 

చెదలు దులిపె దుర్నీతుల

మధ మణచె కథల సుధలను మహికందించన్

వ్యధలను మాన్పగ వనితలు

సేదను దీరె గురజాడ క్షేమము నొసగన్

 

వాణిశ్రీ నైనాల _____________________

 

వ్యధల కథ

కథలు, కథలుగా రాస్తూనే వున్నా

సుధ పడుతున్న అంతులేని వ్యధల గురించి

తన అసహనం ,ఆవేదనలతో

సేద లేని జీవితం అందరికీ  ప్రశ్నే

 

కథల సుధలు

కొందరి పలుకులు కురిపించు సుధలు

మరి కొందరి పాటలు తొలగించు వ్యధలు

మనలను ఆనంద పరచు ఎన్నో మంచి కథలు

ఇవ్వి ధంబుల పొందవచ్చు పలుసార్లు మానసిక సేదలు

 

మురళి మోహన్ _______________________


రావణ తనయుడు రమణి సీత తలను నరికెననుచు మీరు నమ్మవద్దు

నతి(కథ) మిదియని నమ్మకముగ మీకు చెప్పుచు నుంటిని ,(సేద) తీరు

గవలయు నెల్లరుకపటనా టకమాడె నింద్రజిత్తు నిచట, నియమముగల

సాధ్విని తాకుట జరుగదె వ్వారికి నైన నివ్వ(సుధ)లో న నిజ మిదియె

రాముడు నిష(వ్య, ధ)ర్మప రాయు ణుండు తలచ నొక్క బాణము తోడ దశముఖు తల

ను రణమున కూల్చ గలడు గా, తరుణమందు జరుగు నని విభీషణుడ నె సరస గతిని

ఇంద్రజిత్తు సీత తలను పట్టి నరికి యుద్ధభూమిలో  జూపగ. రాముని తో సహా వానరులందరు వణికి పోతారు

అప్పుడు విభీషణుడు అందరిని ఓదార్చు సందర్భము

ఇషవ్య.  = గొప్ప విలుకాడు

అతికథము  నమ్మదగనిది

పూసపాటి ______________________

 

రాముని ఎడ బాసి శోకించు సీత దరికి హనుమంతుడు  చేరంగ

కనులకు గోచరించే సీతమ్మ రోదించు వ్యధాభరిత దృశ్యం

దరికి చేరి శ్రీరాముని అంగుళీయకం బివ్వంగా కనిన జానకి

హ్రుది  సేదదీరంగ మారుతిని ఆ అచ్యుతరామయ్య కుశలంబడగగా

పవనసుతుడు వినిపించే రామకథ సుధా మృతం..

 

దేవరశెట్టి నాగమణి __________________________

 

ఇవ్వి ధంబుల పొందవచ్చు పలుసార్లు మానసిక సేదలు

మానవాళికి మార్గ దర్శకం   శ్రీరాముని కథ.

శ్రీ రామ వనవాసం కలిగించును వ్యధ.

హనుమ స్నేహం తీర్చును రాముని సేద.

శ్రీరామ నామములు కురిపించు సదా సుధ.

ఉష _______________________

 

కథలను రీతిగ మనకును

సుధలను గురిపించెవారు సూక్తులు గానున్

వ్యధలనుబాపుపద్యములను

సేదను దీర్చగ జనులకు శేముషులుగనున్

గీతాశైలజ _____________________


 

 

వచన కవిత 1

 వినుడు వినుడు మనుజులార,

శ్రీభాగవత కథ భక్తి తోడ వినుడు,

 

నవనీత చోరు నవ్య దివ్య చరితం,

మురళీ నాద  మధుర సుధా భరితం,

భువనమోహను బృందావన లాస్యం,

భగవద్గీతామృతధారా సంసేవనం,

 

భవ భయ సాగరమును జయించగ

వ్యథ గొన్న  మనసులు సేద దీరగ

 

వచన కవిత 2

 

విస్తార సుమ రసంబుల సేకరించి,

పలు వ్యథలు సహించి పరిశ్రమించి ,

మనుజుల సేద తీర్చు సుధగ చేసిన,

భ్రమరము కథ స్వార్థరహిత సేవకు,

ప్రగతి దారులేర్చు పొదుపు గదుపు,

జీవన ఆదర్శమై భువిన నిలిచెనుగ.

CA కె మల్లికార్జునరావు_____________________

 

 

ఏకాంతవ్రచ్చునో కలికితురాయి నీకన్ త్రేచ్చునో

మధులిడబాడినా ఆకాంత నీకయ్ శ్రీకారముల్ చుట్టునో

సిగనందు పారిజాతముల్ పూయగా బృందావన

ఇదికథ సుధ మాలికల్ నీ వ్యధతీర్చగ సేదతీరుమా

సూర్య తాడిపూడి _____________________

 

వచనం లో నా ప్రయత్నం

రామ నామము తలచినంతనే

సేద తీరిన సీత హృది లో

కురియు ప్రేమ సుధ లు

రామ కధ లు వినినంతనే విదితమగును

ఎడబాటు వేళలందు వారనుభవించిన

వ్యధ లు

రమ, కంకిపాడు____________________

 

తేటగీతి

రామనామము తలవంగ రంజికముగ

సేద తీరి మనసు నందు చింత బోయి

సీత హృదినందు సుధ ధార చెంగలించు

రామ కథ వినినంతనె రమ్యమైన

సీత వ్యథలన్ని కనిపించు చిత్రముగను.

వెంకట్ సి.హెచ్ __________________________

 

నేటి దత్తపది తో  ముత్యాల సరాల హారాలతో తెలుగు భాష ను గగనమందు నిలిపిన స్వర్గీయ కవిశేఖరుడైన గురజాడ వారిని మనసు నందు వేవేల వందనములతో తలచుకొని సముద్రము గురించి ముత్యాల సరము లో వ్రాయు చిరు ప్రయత్నం..

 

సేద తీర్చునె కడలి ప్రాంతము

పేద ధనికుల వరంబిదియే

వేద నాపి పరవశముగ నా

హ్లాదము కూర్చు గదె!

 

మథనము సలుప సగరుడు మురిసి

సుధలు కురిపించె సురలు మెచ్చ

వ్యధలు తీర్చెడి సంద్రుని మీద

కథలు యెన్నో గద!

 

సూర్యుని కిరణ కాంతులు పడగ

ఆర్యులు నమస్కరింపగ కవి

వర్యుని కలము కవనము సలుపు

సూర్య తేజము వలె!

 

వెంకట్. సిహెచ్_______________________

 

కందము

చదువను మొదలిడు నవరస

సుధలను కూర్చి మనసులను చుట్టు పలువిధ

వ్యధలు మరచి సేదనిడువు

కధలను  మనకొసగినారు, ఘన గురజాడే

డా.సతీష్____________________

 

కథ సుధ వ్యధ సేద

సువర్ణ ఛాయా సొగసుల సౌoదర్య నిధి నా రాగ సుధ

సాయంసంధ్య వేళ అరుణ కాంతిలో తీరు సేద

ఆ సమయ భంగిమను కానలేని నాడు పొందు వ్యధ

నే ప్రేమపిపాసి నై లికించాలి మన ప్రణయ కథ

 

వి.వి.శ్రీనివాస్_____________________

 

తేటగీతి

వ్యధల నెన్నిటినో చెప్పెనలల మునుగ /

కథలనే పంచె తీయని కలల ముఱియ /

సుధల మాధురీ కురిసెనె సుఖము గలుగ /

సేద దీరగ సంతోష శిఖరమలరె /

తెలుగు తేనియ వెన్నెలై వెలుగులీడె /

 

దుర్భ కృష్ణశాస్త్రి _________________

 

జోలపాట వయసు దాటి బాబు

జాలి కథల వయసుకొచ్చె వాడు

సుధాంశువు నీడ వ్యధను మరిచి

నిదురపోయె సేదతీరా మత్తుగా ...

 

విష్ణుప్రియ __________________________

 

తేటగీతి

వేయి యుగములు గడిచె నీ పిలుపు వినక,

మనము వ్యధనొందె నీ గాన మాధురులను

వినక, సుధలు కురియ, మది విరియ మురళి

నూది, యలజడి వీడగా సేద  దీర

వేణు గానమై  మనకథ వెల్లడయ్యె

 

అవళూరు సీత ________________________



పదములతో గురజాడ వారు సామాజిక రుగ్మతలను వారి కథలతో చైతన్య పరిచారను భావనతో ఒక అంతరాక్కర ప్రయత్నం.....

 

మధురమైన సుందర సుమధుర కథ లు

సుధ లు కురిపించును మనసున మధువులు

కధల తోడ సామాజిక వ్యధ లను

వధము గావించెను విధవ సేద తీర.....

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి______

 

 

గేయ రచన,

రామాయణము జీవన సుధలు

ఒలికించు దివ్య కధ, చివరికి

సీతమ్మ వ్యధలన్నియు తీరి,

సేద తీరే శ్రీరాముని అక్కున.

 

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి__________________

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...