10, సెప్టెంబర్ 2020, గురువారం

కాళోజీ నారాయణరావు

 


కాళోజీ నారాయణరావు


రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ
(సెప్టెంబరు 91914 - నవంబరు 132002
)

 

"కాళోజీ నారాయణరావు లేదా కాళోజీ లేదా కాళన్న"గా సుపరిచితులు. అతను తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం యొక్క ప్రతిధ్వనిగా కొనియాడబడతాడు.


తెలంగాణ గుండె చప్పుడు

 

విద్యార్థి దశ నుండి బడుగు జీవుల కొరకు

అండగా నిల్చిన గుండె ఎవరు?

నిరంకుశ పాలకుడు నిజాం పాలనను

అంతమొందించు అక్షర శక్తియై నిల్చెనెవరు?

రాక్షస కృత్యాల రజాకర్ కీచకుల

తన్ని తరిమేయ నిల్చిన దన్ను ఎవరు?

ఆత్మాభిమానము స్వేచ్ఛా స్వతంత్ర్యము

ప్రతి మనిషి సొత్తుయని చాటెనెవరు?

తెలగాణ యాసనే శ్వాసగా భావించి

కన్ననేలనే మిన్నయని తెలిపెనెవరు?

 తన గొడవలో అందరి గొడవల్ని చూయించి

పాలకుల కళ్ళు తెరిపించె నెవరు?

సమస్త ప్రశ్నల సమాధానమతడు

సంఘ జీవుల కంత ప్రాణమతడు

వీరతెలగాణ ముద్దుల వీర శివాజీ

అమరవీరుల గుండె చప్పుడు మా కాళోజీ..!

 

భైరోజు రాజశేఖర్, అలంపురం

(రాజశేకర్ మిత్రుని అనుమతితో)

*****************************************
 
 

సెప్టెంబర్ 9 న కాళోజీ గారి జయంతి

 

ఆయన సాహిత్యం పూర్తిగా స్మరించకుండా, స్పృసించకుండా  కేవలం తెలంగాణా భాషా దినోత్సవం అని మాత్రమే నాయకులు చేసుకోవడం  కొద్దిగా ఇబ్బందిగా ఉంది

 

తెలంగాణ బిడ్డవు రోరి, తెలుగు మాట్లాడుటకు

సంకోచ పడెదవేల, సంగతేమిటరా?

అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదనుచు

సకలించు ఆంధ్రుడా, చావేటికిరా ????

 

కాళోజీ చిరస్మరణీయుడు

పట్టాడు కలం ప్రజా సమస్యల నెదిరించుటకై

ఎత్తాడు గళం అన్యాయాన్ని ధిక్కరించుటకై

తెలంగాణా యాస నొక్కి తొక్క బడినప్పుడు

భాషకందం మా యాసేనంటూ భాష్యం చెప్పిన

ఘనుడితడు

 

తారతమ్యములు లేక స్వాగతించాడు మంచి ఎక్కడున్నా

నిలదీసి నిగ్గుదేల్చాడు తప్పు ఎక్కడున్నా

తెలంగాణా తెలుగు భాషా వాడిని వేడిగా

ప్రపంచానికి చాటుతూ

నిత్యచైతన్య స్పూర్తియై నిలిచాడు కాళోజీ

ఆడంబరములు తెలియని నిరాడంబర జీవి

జీవతకాలమంతా తెలగాణమునకై అంకిత మిచ్చిన మహనీయుడు

కథలద్వారా కథంతొక్కి జాతిని జాగృత పరచిజనజీవన స్రవంతిలోనికి చొచ్చుకుపోయి

ఉద్యస్పూర్తిని కలిగించిన ధీరుడు

తెలుగు భాషయాసలో పలుకుబడులను పదములతో కలమును కరమున  కత్తిలా ఝుళిపించిన కవనవీరుడు కాళోజీ

 గీతాశైలజ

 ************

 

కాళోజీ

అన్నపు రాసులు ఒక చోట ఆకలి మంటలు ఒకచోట

హంసతూలికా లొక చోట అలసిన దేహాల్ ఒక చోట

సంపదలన్నీ  ఒకచోట గంపెడు బలగాల్ ఒకచోట

వాసన నూనియల్ ఒక చోట

మాసిన తల లింకొకచోట

అనుభవమంతా ఒక చోట అధికారం బది ఒకచోట

అని గళం విప్పి ఘనస్వామ్య గోడలపై అమర కవితా ఫిరంగుల మోత మ్రోగించిన ఘనుడు శ్రీ కాళోజీ!!!

నేను ప్రస్తుతాన్ని

గతానికి శిఖరాన్ని

వర్తమానాన్ని భావికి ఆధారాన్ని

నేను నేడు అనెడి దాన్ని

నిన్నటి స్వప్నాన్ని

రేపటి జ్ఞాపకాన్ని

నేను ప్రస్తుతాన్ని

ఇప్పటి క్షణాన్ని

 

కాళోజీ కవితా వస్తువులు ఇది అది అని ప్రత్యేకంగా ఎంచడానికి వీల్లేదు.

 

నైజాం నియంతృత్వం నుండి, స్వతంత్ర పోరాటం వరకు, నెహ్రూ పాలనలో ఆశల భ్రమల తెరలు చిరగడం నుంచి ఇందిరమ్మ ఎమర్జెన్సీ, యుద్ధాలు, ప్రత్యేక తెలంగాణ పోరాటం,

ఇవి కాక ప్రేమ,నమ్మకం, మూఢనమ్మకాల నుంచి వ్యంగ్యం, హాస్యం, అధిక్షేపం, బోధన, జీవితం ....

ఇంకా ఎన్నో ఎన్నెన్నో అన్నీ కాళోజీకి కవిత వస్తువులే.

అందుకే కాళోజీ ఒక రాజకీయ కవి.

అంతకుమించి ప్రజాకవి.

అన్నిటినీ మించి ప్రపంచ కవి.

ఎమర్జెన్సీ, 1973 లో దేశం లో శాంతిభద్రతలు విఘ్నం కావడం వల్ల వ్యంగ్యంగా వాడిన ధిక్కార స్వరానికి ప్రతీక ఈ పోతన భాగవత పద్యం.

 

లావొక్కింతయు లేదు ఆర్డరు విలోలంబయ్యే ప్రాణముల్ ఠావుల్ తప్పెను

మూర్ఛిల్లిన రాజ్యాంగము

రావే ధీ క్రోధ శ్రీ

సంరక్షించు పౌరత్మకా

 

తన  కవిత్వాన్ని జనచైతన్యం కోసం ఉపయోగించిన మహా మనీషి శ్రీ కాళోజి.

 1956లో విశాలాంధ్రను రెండు చేతులా ఆహ్వానించినాతెలంగాణకు అవమానాలను సహించలేని వ్యక్తిత్వం వారిది. మచ్చుకు ఇది చూడండి.

నీ బానిసను కాను నేనుతొత్తు కొడుకును అసలే గాను

నా ఇష్టం వచ్చినట్టు నా మనసుకు నచ్చినట్టు మాట్లాడతా రాస్తా ప్రకటిస్తా

నరుడ నేను నరుడ నేను మనిషి బ్రతుకు బ్రతుకు తాను

నా మతమును ప్రకటిస్తా

అది నా స్వతస్సిద్ధమైన హక్కు

జన్మహక్కు ఆ మాత్రం లేకుండా నేనిక బ్రతికి ఎందుకు ?

అంటూ ప్రశ్నిస్తాడు...

 

ప్రపంచవ్యాప్తంగా అనాధలకు శ్రీనాదులకు  జరిగే పోరాటాన్ని సమర్థిస్తూ మహాసంగ్రామం తప్పదని ప్రకటిస్తాడు. అందుకే ఆయన ప్రజల మనిషి.

 

సమాజం పట్ల తన అవగాహనను బాధ్యతను సరళంగా సులభంగా సందేశాత్మకంగా చెప్పడమే ధ్యేయంగా ఆయన వచన కవిత్వాన్ని ఎన్నుకున్నారు.

 

సజీవమైన ప్రాంతీయ భాషలో సుదీర్ఘ పదబంధాలు లేకుండా చక్కని నూతన పద కూర్పుఉత్సాహం అన్ని ఆయన కవిత్వం లో ఉంటాయి.

 

కావాలంటే ఇది చూడండి

అవనిపై జరుగు అవకతవకలు చూచి ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు

పరుల కష్టమును చూచి కరిగిపోవు ను గుండె మాయ మోసం సూచి మండిపోవును ఒళ్ళు

పతిత మానవుడూ చిట్టి పోవును మనసు ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు.

సమాజానికి  ఏదైనా చేయాలి అనే తెగువ, తపన ఈ మాటల తూటాలు లో కనిపిస్తోంది కదూ!!!

అటు రచనల్లోనే కాకుండా ఇటు వ్యక్తిగత  జీవనావేశం  లోనూ ప్రజల హృదయాలను చూరగొన్న కవి శ్రీ కాళోజి

నేను ప్రస్తుతాన్ని, గతానికి శిఖరాన్ని

వర్తమానాన్ని, భావికి ఆధారాన్ని

నేను నేడు అనేదాన్ని,

నిన్నటి స్వప్నాన్ని,

రేపటి జ్ఞాపకాన్ని ,

నేను ప్రస్తుతాన్ని, ఇప్పటి క్షణాన్ని.

ఇలాంటిదే కాళోజీ ఆత్మకథ "గొడవ" అంతా

 

ఝాన్సీ 

**************** 


కాళోజి గూర్చి కొన్ని మాటలు:

1)  ఆయన పేరు సినిమాటిక్ గా చెప్పాలంటే…

 

ఏ మహా కవి పేరు చెపితే ఎక్కువ మంది గుర్తుపట్టరో…ఎవ్వరి కాలాతీత రచనలు ఎక్కువ మందికి తెలియవో… అతనే మన “రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాస రామరాజ్ కాళోజి”, క్లుప్తంగా ‘కాళోజి నారాయణ రావు’ అలియాస్ ‘కాళన్న’.


2. ఆయన మానవతా వాది:


“జరిగిందంతా చూస్తూ

ఎరగనట్లు పడి ఉండగ

సాక్షీ భూతుణ్ణి గాను

సాక్షాత్తూ మానవుణ్ణి”


అన్న చిన్న కవితలో తనను తాను నిర్వచించుకున్నాడు కాళోజీ.


"మనిషి ఎంత మంచివాడు!

చనిపోయిన వాని చెడును

వెనువెంటనే మరుస్తాడు

కని మంచినే తలుస్తాడు"


"మనిషి ఎంత చెడ్డవాడు!

బ్రతికి ఉన్నవాని మంచి

గుర్తించడు కాని వాని

చెడును వెతికి కెలుకుతాడు”


మంచి చెడుల గురించి తీర్పులు ఇచ్చే మనిషి గురించిన చింత  కాళోజీది. అందులోనుండి వచ్చిన వేళాకోళం ఈ కవితను ప్రకాశవంతం  చేసింది.

 

3 . "ఒక్క సిరాచుక్క లక్షల మెదళ్లకు కదలిక"- కాళోజి నుడివిన లక్ష వరహాల మాట..


4. కాళోజీ ఛీత్కరం, నిరసన.


"తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు-సంకోచ పడియెదవు సంగతేమిటిరా? అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు-సకిలించు ఆంధ్రుడా! చావవేటికిరా"   


5 . ఆయన పై శ్రీశ్రీ స్పందన-


"కాళోజీ నిఖిలాంధ్ర కవి. అందులో ఎట్టి సందేహం లేదు. అతనుకు తెలంగాణా అంచులు గోడలుగా అడ్డునిలువజాలవు. అతను తన ఖండకావ్య సంపుటానికి 'నా గొడవ' అని పేరు పెట్టాడు. అదే కవి ప్రతిభ. అదే కవి చెప్పవలసిందీను. ఇది కవి గొడవగానే అనిపించినప్పటికీ చదివిన వారికి ఇది తమ గొడవగానే అర్థమవుతుంది. ఇది విశాల జగత్తు ప్రజలందరి గొడవ "


CA కె మల్లికార్జునరావు 

***************************** 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...