23, సెప్టెంబర్ 2020, బుధవారం

ప్రశ్నల ప్రహేళిక, అంశం : ముళ్ళపూడి వారి సాహితీ సర్వస్వం, 20.09.2020

 

తెలుగు సాహిత్యం  ప్రశ్నావళి  - 20 - 08 - 2020

  
అంశం : ముళ్ళపూడి వారి సాహితీ సర్వస్వం


ప్రశ్న-1 

బుడుగు లాగానే, "సింగారం", "దీక్షితుల" చిన్ననాటి ముచ్చట్లు చెప్పే ముళ్ళపూడి వారి చక్కని కథ ఏమిటి ?


జవాబు  

ముళ్ళపూడి వారి లోకాభిరామాయణం లోని మొట్టమొదటి కథ కృతజ్ఞత ... కథలో సింగారం, దీక్షితులూ ముఖ్యమైన పాత్రలు.   

ఇద్దరివీ పూర్తిగా భిన్నమైన జీవిత విధానాలు. చిన్నప్పుడు పదేళ్ళ వయస్సులో గోలీకాయలాడుకుంటున్నప్పుడు మొదట పోట్లాడుకున్నా సింగారం దీక్షితులికి బెల్లపుజీళ్ళు ఇస్తాడు ... 

అప్పటినుంచి ఇద్దరూ  ఎంచక్కా స్నేహితులైపోయారు.అంతకంతకు వాళ్ళ స్నేహం బలపడింది. దీక్షితులు బీద వాడైనా నోరువిప్పి ఏనాడూ సింగారాన్ని కానీ అడగలేదు. సింగారం కూడా దీక్షితులి అవ సరాలు తెలుసుకుంటూ అడక్కుండానే డబ్బోదస్కమో, సంభారాలో పంపేవాడు ఇంటికి.

చిత్రమైన వీళ్ళ స్నేహం ఊళ్ళో వాళ్లకి  అనిపించిందనేది, ఏమి జరిగిందనేది కథ.


ప్రశ్న-2

సిద్ధార్దుడునీ, ఆర్కిమిడీస్ నీ ముడిపెట్టే చక్కని వైజ్ఞానిక కథ ఏమిటి ?

జవాబు  

ఈ కథ పేరు "విమానం కథ"..  బాల రమణీయం శీర్షికలోనిది 

ముళ్ళపూడి వారు వ్రాసిన మొట్టమొదటి వైజ్ఞానిక గాథ. ఆయన ఏమి చెప్పినా హృద్యంగా, మనసుకు హత్తుకునే విధంగా చెబుతారనేది తెలిసిన విషయమే కదా 

పిల్లల కోసం వ్రాసిన వైజ్ఞానిక గాధ ఈ విమానం కథ . 

గాలికంటే బరువైనది ఎలా అగరగల్గుతుందనేది చాలా చక్కగా ఒక సైన్సు పాఠంలాగా చెబుతూనే, ముళ్ళపూడి మార్కు హాస్యాన్ని పండిస్తారు 

సిద్హారధుడి నుండి ఆర్కిమిడీస్ వరకు, నీఊతనూ, జేమ్స్ వాట్.. ఇలా అందరి వివరాలు చక్కగా వర్ణిస్తారు  

ఈ కథని రమణ గారు దక్షిణామూర్తి అనే కలం పేరుతొ సరదాగా వ్రాశారు ... ఆయన సరదాగా చాలా కలం పేర్లు పెట్టుకున్నారు. ఇదొక్కటే దక్షిణామూర్తి పేరుతొ వ్రాసిన కథ


ప్రశ్న-3

బాపు, ముళ్లపూడి వారు స్థాపించిన వ్రాతపత్రిక పేరు ఏమిటి ?  

జవాబు 

ఈ పత్రిక పేరు ఉదయభాను ... మొట్టమొదట ఈ పత్రిక "వ్రాత" పత్రిక మాత్రమే. అచ్చులో లేని పత్రిక   

మిత్రులతో కలిసి ఒక ప్రదర్శన నిర్వహించి, వచ్చిన డబ్బులతో సైక్లోస్టైల్ మెషిన్ కొన్నారు బాపు రమణలు కలిసి   

అందులోనే "బాల శతకం" పద్యాలు కూడా అచ్చయ్యాయి. ఆ ఉత్సాహంతోనే "ఉదయభాను" అనే పత్రిక మొదలెట్టి తనే ఎడిటర్ అయిపోయారు రమణ గారు. బాపు గారు కూడా ఆ పత్రికకి బొమ్మలు వేసేవారు.


ప్రశ్న-4

తెలుగు, తమిళ, హిందీ  సినిమాలపై సెటైర్లతో వ్రాసిన వ్యాసాల సంపుటి పేరు తెలుపగలరు ?

జవాబు 

విక్రమార్కుని మార్కు సింహాసనం మరియు గిరీశం లెక్చర్లు 

సినీ మాయాలోక చిత్ర విచిత్రం అనే శీర్షికతో విక్రమార్కుని మార్కు సింహాసనం అందించారు. 

సినిమాలపై సిసలైన సెటైర్లు తో గిరీశం లెక్చర్లు అనే వ్యాసాల సంపుటి.


ప్రశ్న-5

ముళ్ళపూడి వారు ఏ ప్రఖ్యాత హాస్య నవలకు proof reading చేసే బాధ్యత తీసుకున్నారు ?

జవాబు

 మొక్కపాటి నరసింహశాస్త్రి గారి "బారిష్టర్ పార్వతీశం" నవల రెండవ భాగానికి ముళ్ళపూడి వారి ప్రూఫ్ రీడింగ్ బాధ్యత తీసుకున్నారు. 

ఎన్నో చోట్లు వీరి మార్కు మెరుగులు కూడా దిద్దారుట.. ఎక్కడా ఏది మొక్కపాటి వారి అక్షరమో, ఏది ముళ్ళపూడి వారి చమత్కారమో ఎవరికీ తెలియదు.


 

ప్రశ్న-6
రమణ గారి అచ్చయిన తొలి కథ ఏమిటి ?

జవాబు 

1945లో "బాల" పత్రికలో రమణ గారి  మొదటి కథ "అమ్మ మాట వినకపోతే"కానీ ఆయన వ్రాసిన మొదటి కథ మాత్రం వేరు 

ఆయన వ్రాసిన మొదటి కథ మాత్రం ఆకలీ ఆనందరావు. ఈ కథ మొట్టమొదటి సారి బాపు గారి బొమ్మలతో సహా ప్రచురింపబడింది ఆంద్ర ప్రభలో.


 

ప్రశ్న-7

ఆంధ్ర పత్రిక తోడ అమృతాంజనమిచ్చి... 

తలనెప్పి బాపెడు ధన్యుడెవరు 

అన్న ఆటవెలది పద్యం ఎవరి మీద సరదాగా చెప్పారు   

జవాబు 

ఆంధ్ర పత్రిక వారి సనాతనత్వాన్ని హేళన చేస్తూ ఆ పత్రిక ఎడిటర్ అయినా శ్రీ శివలెంక శంభుప్రసాద్ గారిని ఆక్షేపిస్తూ 

ఆంధ్ర రత్న శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు చెప్పిన ఆటవెలది.


 

ప్రశ్న-8

తిలక్ గారి అమృతం కురిసిన రాత్రి లో "వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు" చదవగానే ఆ కవితా ఉత్సాహంగా వ్రాసిన కథ ఏమిటి ?

జవాబు 

తిలక్ గారి పలుకుల్లో రూపుదిద్దుకున్న వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలై హృదయ పారావతాలై అమృతాన్ని కురిపించాయి 

ఆ కవితా ప్రేరణతో రాధా గోపాలం ప్రణయ గోదావరి నేపధ్యంగా "లహరి" కథ, కవితా ధారా అందించారు ముళ్ళపూడి వారు .


ప్రశ్న-9 
హాస్యమందు అరుణ, అందె వేసిన కరుణ, బుడుగు వెంకట రమణ అన్న ప్రఖ్యాత కవి ఎవరు ?

జవాబు

హాస్యమందు అరుణ

అందె వేసిన కరుణ

బుడుగు వెంకట రమణ

ఓ కూనలమ్మా! 

అని ఆరుద్ర రమణ గారిని  ఆయన కూనలమ్మ పదాల్లో  పేర్కొన్నారు.


ప్రశ్న-10

బాపు - ముళ్ళపూడి కలిసి అందించిన అద్భుత ఆధ్యాత్మిక దివ్య ప్రబంధం గా  ఏ కావ్యాన్ని / పుస్తకాన్ని భావిస్తారు ?  

జవాబు 

బాలల కోసం రామాయణాన్ని, భాగవతాన్ని వ్రాసినా 

ఆధ్యాత్మిక దివ్య ప్రబంధం గా భావించేది మాత్రం తిరుప్పావై దివ్య ప్రబంధం ఆధారంగా వ్రాసిన మేలుపలుకుల మేలుకొలుపులు 

అజరామరమైన ఈ కళాఖండాన్ని కళ్ళకద్దుకొని, గుండెలకు హత్తుకోవాలి .

ఏమేసి వాళ్ళు 250 రూపాయలకే ముళ్లపూడి వారి అత్యద్భుత గేయాల సంకలనం..  బాపు గారి బొమ్మలతో అందిస్తున్నారు. 


****** 

 

  

 

 

 

 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...