10, సెప్టెంబర్ 2020, గురువారం

 

ఆటవెలది

సద్గుణంబు లెల్ల సాకార మొందిన

దశరథాత్మజుండు ధరణిజ పతి

కొల్చినట్టి జనుల కొంగు బంగారమై

సర్వ శుభము లొసగు సమధికముగ!

 

చల్లా దేవిక.

 **************


తేటగీతి

పార్వతీ నందనా! పర్శుపాణి! బొజ్జ

దేవర! గణేశ! గణపతి! తీర్థ కరుడ!

విఘ్నములు నాపు జినుడా! విఘ్నరాజ!

బుద్ధినొసగి మమ్ము నిలుపు బుద్ధదేవ!

 

వెంకట్. సి.హెచ్ 

 ********************


ఆటవెలది

వంటకత్తె యలిగి వంటిల్లు నొదిలి తా

గిన్నె పక్క నెట్టి పెన్ను పట్టి

కవితలెల్ల వ్రాయ కర్మ యనుచు భర్త

వంటకాడు యయ్యె వంట జేసి!


 

వంట కాడయ్యిన ఉత్సాహము తో మరొక పూరణ

ఉత్సహము

మగడు కవిగ యింటి పరువు మంట కలుపు చుండగా

యెగవు కలిగి గిన్నె పక్కనెట్టి పెన్ను పట్టి నే

మగువ కవిత లన్ని వ్రాసి మగని పరువు నిలిపినే!

రగడ లేని జీవితమున రమణి సాయము ఘనమే.

 

వెంకట్.సిహెచ్

******************* 


అక్షరాలనారగించే భాషా ప్రియులకు

ఆకలి తీర్చ ఆ యింటి ఇంతి

సాహిత్యాన్ని శాకములుగ జేసి

తిలతైలాన్ని కలం ద్రవముగ జేసి

అక్షరాలన్నింటినీ అన్నంబుగ చేయ

గిన్ని పక్కపెట్టి పెన్ను పట్టె ఆ యింటి ఇంతి.

 

వ్యాకరణ పరిధి లోకి రాని వచన కవిత.

ఆర్.వి.రమణమూర్తి.

************************* 


పెన్ను పట్టే

వంట ఇంటి చేరి వంట చేయ చూడ,

పప్పులు,కూరలు,నూనెలు లేకుండే

గిన్నె పక్క నెట్టి ,పెన్ను పట్టి

 అమెజాన్ వారికి ఆ వివరంబులు రాసి ఎదురు చూడ సాగే

 

మురళి క్రిష్ణ

***************** 



ఆటవెలది

ఆంధ్ర వనితలార యక్షరాస్యతబెంచ /

గిన్నె పక్కనెట్టి పెన్ను పట్టి /

జాతి గౌరవమ్ము సాధించబూనరో /

వంట మగనికొదలి పట్టు విడక /

 

దుర్భ కృష్ణశాస్త్రి

 **********************


ఆటవెలది

భర్త లింటి నుండి పనియంచు కంటిముం

దుండ భార్య నేర్ప దొడగె వంట

పనులు ; మధ్యలోన బాసుగారు పిలువ

గిన్నె పక్క నెట్టి పెన్ను పట్టె.

 

రమ, కంకిపాడు.

********************* 


బుర్రలో  భావములు తన్నుకు  రాగా కిచెన్లో ,

సతీ మణి పోపు గిన్నె పక్కనెట్టి పెన్ను బట్టి ,

వ్రాత చేయ కూర మాడి పోయె ఆమె నగు ,

మోము  వాడి పోయె పతి కడుపు కాలిపోయె.

***********

సతి సేవకై వంటగది దూరిన పతి మదిలో,

భావ తరంగము పొంగ  గిన్నె పక్కనేట్టి పెన్ను,

 బట్టి కవిత వ్రాయ వేళకు కాఫీ  లేక సతీమణి,

కళ్ళు ఎర్ర నాయె  పతికి భయమై వణుకాయె.

 

CA కె మల్లికార్జునరావు

***************************

  

మొగుడు ఆకలితో నకనకలాడుచూ

వంట ఇంటి నందు వెదక

గిన్నె  పక్కనెట్టి పెన్ను పట్టి

కవిత రాయు చున్న సతిని చూచి

తెలుగు తేనియల సమూహము లో చేరి నన్ను పస్తు పెట్టు చుండే అని

తల పట్టుకునెన్

 

డి. నాగమణి

 *********************


విష్ణు మాయని పడి ఒడలు మరిచి..

సద్ది బువ్వ గిన్నె పక్కనెట్టి పెన్ను పట్టి

కాంతపై కవితలల్లెను 'హన్నా' మైకమందు ..

పాటికాదు అలుగు అన్నపూర్ణ  ,

ఆ లయకారుని మాయ ఇది మేలుకో సోదరా! దినకరా !!, జయకరా !!!

 

విష్ణుప్రియ

*********************** 


వంట గదిలోనే వచ్చే వనితకు

క్రొత్త కవితల ఆలోచనలు

గిన్నె పక్కనెట్టి పెన్ను పట్టి

ఒక్కటేనని వ్రాయుచుండ

ఒక్కటి కాస్తా ....వందయే ...

వంటలన్నీ ....బొగ్గాయే ...

అత్త గారితో రణమాయె .

 

రమ

*********** 


 హాస్య ప్రధానం

 

వంట జేయ గలదు వడి వడి గాయని

కోరి చేసికొంటి కోమలియని

విష్ణు మాయ జూడు విపరీత మాయెరా..

గిన్నె పక్కనెట్టి పెన్ను పట్టి

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి,

******************************************** 


తెలుగు తేనె లోన తేలియాడుచునేను

పొయ్యి మీద నున్న

పోపు మాడ్చి

వంట సగము లోన వదలి కైతలు రాస్తి

గిన్నె పక్కనెట్టి పెన్ను పట్టి"

 

రమ, కంకిపాడు.

 ****************************


గీంగెరలు పుట్టు వంటగదిలో న

గిన్నెలన్ని శుభ్రపరుచు వనిత చేత

బుడతలను బాగుచేయు ఉద్దేశంబు కలది

గిన్నె పక్కనెట్టి పెన్ను పట్టి

పెనుప్రమాదము పతికి తప్పదు

కూరలోన కారమొచ్చి నషాళానికి అంటగా

అంటలమంగళమవును పతి వీపు పైన

 

సూర్య

********************* 

 


తెలుగు తేనియలు చేరి తెలివైన  మహిళ,

ఒకింత గిన్నె పక్క నెట్టి పెన్ను బట్టి ఒకింత,

పెన్ను పక్కనెట్టి గిన్నె బట్టి వంటలు కవితలు,

ఏక కాలాన వండి వార్చగ సవ్యసాచి కాదే.

 

CA కె మల్లికార్జునరావు

 *****************************

 


భర్త పిలిచి నంత భయమెరుగని సతి

గిన్నె పక్క నెట్టి పెన్ను పట్టి

కవితలన్ని వ్రాసి ఘనత సాధించినె

మహిళ తలపు నందు మహిమ లుండు.

 

లలితారెడ్డి

*****************


గేయ రచన,

తెలుగు తేనియలు దత్త పది గుర్తురాగా,

ఇల్లాలి మదిలో నొక భావం తళుక్కు న మెఱయ,

వంటచేయుచున్న ఇంతి గిన్నె పక్క నెట్టి,

పెన్ను పట్టి అరచేతిలో వ్రాయసాగే...

 

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి,

***************************************** 


వ్రాయ బోవు చుంటివి గదా భారతమును

వ్యాసుడు పలుకు చుండును వదల కుండ,

వ్రాయ వలయుగా దానిని భంగ పడక,

తరగు చుండుగా నీ శక్తి ,తట్డు కొనగ

లేవు నీ వాకలికి నిట,లేఖనమ్ము

మధ్యలో  కొంత  తినుమోయి, మధుర మైన

పాయ సాన్నమని, జనని పార్వ తమ్మ

గిన్నె లోనిడ, గణపతి (గిన్నె పక్క

నెట్టి,  పెన్ను బట్టి) ,మొదలు బెట్టె వ్రాత,

వ్యాసుడు పలుకు చుండగా భారతమును

 

పూసపాటి

******************* 


పోపు మాడబెట్టి  పులుసు మాడ్చి..

అట్టు మాడ్చి జనుల పొట్ట మాడ్చి

గిన్నె పక్కన్నెట్టి పెన్ను పట్టి

పని-పాటలు మరియు పతిని మరచి!

కినుకు దాల్చెను తాను క్షుద్భాద తో

కిసుకు కవిత రాస్తి'నే నా భాషతో !!

 

విష్ణుప్రియ

 ********************* 


ఆటవెలది

పోపు మాడబెట్టి  పులుసుసైతము మాడ్చి  

యట్టుమాడ్చి జనుల పొట్ట మాడ్చి

పనుల మరచి నేడు పాటవంబు నెఱిఁగి

గిన్నె పక్కనెట్టి పెన్నుపట్టి

 

విష్ణుప్రియ / శివ శంకర్  కస్తూరి

 *************************************** 


రమణి  చూపె నన్ని రం గము లందును

ప్ర తిభ  , పట్టు పట్టి  పలువు రెదుట

సా టి లేని మేటి , సవ్య సాచి ననుచు

గిన్నె పక్క నెట్టి  పెన్ను  పట్టి

 

లలితా దీక్షిత్

************************ 

 


తేటగీతి

రమణి రత్నముల్ నేఁడన్ని రంగములను; 

పదుగురెదుటైన పదునైన ప్రతిభ జూప; 

సన్నుతించెను భారతీ; గిన్నె పక్క

నెట్టి పెన్ను పట్టితి నేను నీదు కరుణ ! 

 

డా. లలితా దీక్షిత్ / శివ శంకర్  కస్తూరి

 ************************************

 


కవితగా-----

 

గిన్నెపక్కనెట్టి,పెన్ను చేత పట్టే

అనుకొనుచు,

కవితా పిచ్చిపట్టి పస్తు పెట్టె

అనుకొనుచు,

శ్రీవారు వెళ్లిరి వంటగది కి

రుసరుస లాడుచు,

సిద్ధముగా ఉన్న వంట చూసి

వెనుతిరిగిరి నవ్వుచూ.

        

ఉషారాణి.

 ********************


ఆటవెలది -1

తెలుగు తేనియళ్ల తీయని ధారలు  

తెలుగు పదములందు చిలుకు సుధలు

పంచెవోలె నేను పరవశంబుగ నేడు  

గిన్నె పక్కనెట్టి పెన్నుపట్టి

 

ఆటవెలది -2

సిగను ముడిచి సొగసు సిరులని జూపించ

భావములని పంచె భవ్యరీతి    

మనసులో జనించు మధుసీమలని జూప   

గిన్నె పక్కనెట్టి పెన్నుపట్టి

 

 ఆటవెలది -3

మధుర మధురమాయె  మంజుల వదనము 

సొగసు జూడ పడతి సిగలుముడిచి   

మంజుమంజులంబు మాధుర్యము కురిసె

గిన్నె పక్కనెట్టి పెన్నుపట్టి

 

ఆటవెలది -4

ప్రణతి ప్రణతి యనుచు భారతిన్ వేడగా

కైతల వరమిచ్చె కల్పవల్లి

ముజ్జగంబులకును మూలము నీవంచు   

గిన్నె పక్కనెట్టి పెన్నుపట్టి

 

ఆటవెలది -5

తొలకరి పిలుపులవి; వలపుల వానలు  

మనసులోన భావ మంజుషంబు

పలుకుల సుమపల్లవంబులు తెల్పుగా

గిన్నె పక్కనెట్టి పెన్నుపట్టి

 

ఆటవెలది -6

"హాస్యరసము" పంచు హాయిగ' మందస 

భావబందురంబు పద్యమందు    

పంచువేళ పొంగె వాంఛితమగు కైత !     

గిన్నె పక్కనెట్టి పెన్ను పట్టి !

 

 ఆటవెలది -7 

మురిపములను పంచు ముదితల మానస  

మందు భావముల సుమంబు పూచె 

కవనవల్లరులవి కైతల సొబగులై  

గిన్నె పక్కనెట్టి పెన్నుపట్టి

 

ఆటవెలది -8

విమలమోహనములు వివిధరూపంబులై   

పలకరించు వేళ పాట్లు పడగ 

సవ్యసాచి వోలె సంధించె కవనముల్     

గిన్నె పక్కనెట్టి పెన్నుపట్టి

 

ఆటవెలది -9

పాకశాస్త్రమందు ప్రావీణ్యమది లేక    

సతమతంబు మనసు వెతలు జూప

కైతవాంఛ రేగి కౌముది పిలువంగ 

గిన్నె పక్కనెట్టి పెన్నుపట్టి

 

శివ శంకర్  కస్తూరి

****************************** 


ఆటవెలది

 

రమణి గీసి మురిసె రమణీయ చిత్రము

గిన్నె పక్క నెట్టి పెన్ను పట్టి

చిత్ర మందు యున్న చిన్నారి మోముపై

చెరిగి పోని నగవు విరులు బూసె

 

సి. హెచ్. రజిత, కరీంనగర్

*********************************** 


ఆటవెలది

వేదశాస్త్రములను విరివిగా తానేర్చి

వనిత నేడు జూపె విద్య లెన్నొ

టబయట గెలిచి  యింతులీ తీరుగ 

గిన్నె పక్క నెట్టి పెన్ను పట్టి !

 

మాదిరెడ్డి సురేశ్

******************************** 


ఆటవెలది

రుచికరంబులైన శుచి పాకములే కాదు

రమ్య కవిత లెల్ల వ్రాసెద మని

సవ్యసాచి తనము చక్క(జూప మగువ

గిన్నె పక్కనెట్టి పెన్ను పట్టె.

 

దొం తా భక్తుని రామ నాగేశ్వరరావు,భీమవరం

 ************************************************ 


ఆటవెలది

తెలుగు తేనియల్ల తీపి మరిగి విష్ణు

గిన్నె పక్కనెట్టి పెన్ను పట్టి

మగని చేత గరిట మగువ యాశనుదీర్చ

మధుర పాకము దిని మనసు నిండ

కవన లోతులన్ని కసితీర శోధించి

తెలుగు మీద బ్రీతి తెలియు రీతి

మధుర కైత పాడె నదురు బెదురులేక

యెంకి పెళ్లి... నానుడెవరి కెరుక!!

 

వాణిశ్రీ నైనాల

 ******************* 


ఆటవెలది పాదాన్ని తేటగీతిలో  

తేటగీతి

నీలిమేఘాల మాటున నిగవుజూపి

గంధమలదిన భృంగపు గాలిలోన  

వన్నెచిన్నెలని గనిన, గిన్నె పక్క

నెట్టి, పెన్ను పట్టితినోయి నీలవేణి !

 

వై శ్రీదేవి

************** 


ఆట వెలది

వనిత మేటి దిట్ట వంట యందు, చదువు

సంధ్య లందు వాణి సాటి యనెడి

మగని వంట చేయుమనితాన్ కవిత వ్రాయఁ

గిన్నె పక్క నెట్టె పెన్ను పట్టి

 

నేటి వనిత వంట నేర్వక హోటలు

తిండి తినుచు బ్రతుకు చుండు, యింటి

వారి కేమి పెట్ట వలె నార్డరీయగ

గిన్నె పక్క నెట్టి పెన్ను పట్టి

 

అవళూరు సీత

 *******************

 

తేటగీతి

కుప్ప లుగసమూ హాలన్ని కుంచెములుగ

కరము లందుకత్తివలెను కలము లన్ని

కవన రంగమం దుతరుణి కదము త్రొక్కి

గిన్నె పక్కన బెట్టియు పెన్ను బట్టి

 

గీతాశైలజ

 ************


ఆట వెలది

వంట ఇంట తాను నంట్లు తోమగ భళి

బాసు ఫోను జేసె పనులు యంటు

వీడియోన నిపుడు వీక్షించ గా నహో

గిన్నె పక్కనెట్టి పెన్ను పట్టె

 

ఆట వెలది

ఆడ పిల్ల కేల నంతంత చదువులు

ఇంటి బనిని నేర్వ నిదియు చాలు

నన్న మాట వీడి ఆత్మ స్థైర్యము తోడ

గిన్నె పక్కనెట్టి పెన్ను పట్టె

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

 ***************************************

 

తీపి తెలుగు నేర్వ తీరుగ రాయంగ

దలచ పద్యములను దార లముగ

సమయమంత వెచ్చి సరుసగతిన నేను

గిన్నె పక్కనెట్టి పెన్ను పట్టె

 

మనము యందు పద్య మాలలు మెదలగ

ఆట వెలది తలచ యంతుబడగ

గణము యతులు నాకు కలవర బెట్టగ

గిన్నె పక్కనెట్టి పెన్ను పట్టె

 

ఎం.పద్మలత

 *****************

 


ఆటవెలది

బాట వేసి , చూడ  బాగోగులను, తల్లి !

గిన్నె పక్క నెట్టి పెన్ను పట్టి

చదువు సంద్య చెప్పు చుండె నోరిమి తోడ

మలచె మంచి బుద్ధి మంతులనుచు!

 

లలితా దీక్షిత్

*********************

 


ఆటవెలది

వంటలక్కయనుచు పలుచన దలపకు

గిన్నె పక్కనెట్టి పెన్ను పట్టి

కవన రంగమందు కాంతులీనగలదు

ఇంతి ఘనత నెఱుఁగు సుంత యైన!

 

ఆటవెలది

రచనలన్నిజేసి రాణించు నయముగ

గిన్నె పక్క నెట్టి పెన్ను పట్టి;

పీచమణచి సతము పీడించు వారల

మెప్పు నొంద గలదు మెలత తాను!

 

చల్లా దేవిక.

**************** 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...