4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

శీర్షిక : చిత్రం పై పద్యం - 44, గురువారము, 03 సెప్టెంబర్ 2020

  


నిన్ను నమ్ముకున్న నాడు
నీ మీద నమ్ముకున్న నాడు
నీ ఉనికి బంటు అయినా
నీ మనసుకి నువ్వు రాజువే
   
విష్ణుప్రియ
****
 
పోతన గారిని, ధూర్జటిని గట్టగా స్మరించుకుంటూ ఒక శార్దూలం.  
ఎందుకంటే వాళ్లకున్న Self Confidence బహుశా ఆ శతాబ్దంలో ఎవరికీ లేదు అని నేను నమ్ముతాను ..చాలా బలంగా
 
శార్దూలం
 
ఇంతింతౌ భయమంతయూ తొలగినన్ నీ "రూపు జూడంగనే"
చింతాక్రాంత విముక్తి మానసమునన్, చేతంబుఁ ధైర్యంబుతో          
భ్రాంతుల్ వీడి మనంబులో భువనముల్ పాలించు "హృద్యాంశువై" 
స్వాంతంబీయగ దీప్తివై వెలుగగా వాంఛించు కీర్తుల్ సదా !!!      
 
కస్తూరి కవనం
****

 

శంకరుని కవనంబులే శంక  దీర్చె
పరిమళము వెద జల్లగా పద్యములకు
సౌరభమ్ము లలదెగ కస్తూరి తోడ
అందుకొనుమయ్య వేడ్కతో వందనాలు
అవళూరు సీత
****
 

 

వచన కవిత
 
కావడి మోసే కూలీ నైజామ్
గంగలో దమికిన సామ్రాట్ హుమాయూన్కు
 ఊపిరి  నిలిపెన్ 
భూసరులనకిన్ ప్రాణంబు నిలుపున్ అమాత్యవరుల్
కొండంత చీకటి బ్రతుకున
గోరంత దీపంబిచ్చు చిగురంత ఆశ
తనను తాను
 నమ్ము ఆశాజీవికిన్
 
ఆర్.వి.రమణమూర్తి
****
 

 

"నిన్ను నీవు నమ్ముకో " అనెడి ప్రేరణా జ్వలిత వాక్యము నాధరంగా చేసుకొని శత్రువు  నెదురించుటకు కావలసిన గెలుపు కాంక్షను ప్రజ్వరిల్లింప చేయు.
 
మధురాక్కర 1
 
అల్పుడెవడు? యాలోచింప
               నధికుడెవడు గలడె?
అల్పుడవని వెనుకడు
               గేయక చేవ జూపవోయి!
వేల్పు నీయందు గలదనె
               విశ్వాసముంచి నీ సం
కల్పశక్తి తోడ జయించి
              ఘనత సాధించ వోయి!
 
మధురాక్కర 2
 
నిన్ను నీవు నమ్ముకొనియే
                నీ శక్తి జూపవోయి!
వెన్ను దన్ను నీవై యుండి
                భీమరము జరుపంగ;
మిన్ను కెత్తి నిన్ కొలుచునే!
                మేని పులకరింపగ
వెన్నెల వెలుగులన్నియు
                విజయచిహ్న మగునోయి!.
 
మధురాక్కర 3
 
సాగిపొమ్ము నీ పథములో
                 సాధించు విజయమునే,
ఆగకోయి యడుగు వేయ
                 గబ్బురము కలుగునే,
వేగ మెరిగి సాగిన యెడల
                 విజయంబు చేకూరునే.
తీగ వలె నీవు సాగంగ
                ధీరుడి వగుతువోయి!
 
మధురాక్కర 4
 
ఆత్మ విశ్వాసమే నీకు
                నాయుధమవగ, పర
మాత్మ నీయందు నుండగ
                నాకాంక్ష జ్వలియింప; ప్రే
తాత్మ వంటి శత్రువు పయి 
                 నగ్నియై పోరాడి, నీ
ఆత్మ కథ లిఖించి చరిత
                   నందు నిలబడవోయి!.
 
వెంకట్. సిహెచ్
****
 
 

 

అందరికీ  నమస్సులు
నా సమాధానం  తేటగీతి లో
 
ఆత్మ  విశ్వాసమొకటియే అంగ రక్ష
విజయమే నీకు వశమగు వింత గాదు
వమ్ము  కానీయకయ్య నీ నమ్మకమును
తోడు నిలిచి  దైవంబు నీ నీడ యగును
 
పదము పదమున నమ్మిక పథము  చూపు
అడ్డు లేవైన యున్న నీ కడ్డు  రావు
చేర గలవు నీ గమ్యమ్ము చివర కైన
పొందగలవు  చిర యశము పూన్క తోడ
 
అవళూరు సీత
****
 

 

భావ కవిత:
 
స్వశక్తి పై నమ్మకం ఉంచవలె,
కొండనైనా ఢీ కొట్టగల నన్న,
ఆత్మ విశ్వాసం మెండుగుండవలె,
అదియునుద్ధమున అర్ధవిజయం.
 
తల్లిదండ్రులపై  గురువులపై మరి,
పరమాత్ముపై భారముంచవలె,
కర్మ ఫలితం పై చింత లేకుండవలె,
అది యిచ్చును సంపూర్ణ విజయం.
 
తనపై తనకు నమ్మకమున్న,
అణువంత శక్తి అంబరమగును,
లేక, గరిమ లఘువు యగును,
ఎరుగరిది మందమతులిలలో.
 
 
తన బలమెంతో  తెలియకున్న,
హనుమయ్యకు వలె ప్రోత్సహించు,
స్నేహితులు దరి న  ఉండవలె,
అదియే సజ్జన సాంగత్యమిలలో.
 
అలుముకున్న గాఢాంధకారమే,
ఒక్క నిప్పు రవ్వకెగిరి పోవు,
భ్రమరము ఒక్క టైనను చాలు,
తీయటి తే నులు చేయు మెండు. 
 
మన ధైర్యమే మనకు తోడు ,
మన శక్తి యే మనకు రక్ష..
 
CA కె మల్లికార్జునరావు
****
 

 

ఆటవెలది
 
నిన్ను నీవు నమ్ము నీడలాగ విజయం
నిన్ను చేరుతుంది; నిన్న నేడు
రేపు, గెలుపు వెలుగు లీను చుండ కదులు
నీవు; కీర్తి వలచి నిన్ను చేరు
 
రమ, కంకిపాడు.
****
 

 

గేయ రచన,
ఆత్మ విశ్వాసం
ఆత్మ బలాన్ని, ఆత్మ గౌరవాన్ని పెంచుతుంది,
ఆత్మ న్యూనత,
ఆత్మ హత్యలకు పురికొల్పుతుంది...
 
గాంగేయ శాస్త్రి, రాజమండ్రి
 
 
రాజువైనా బంటువైనా
నీ ప్రపంచానికి
ప్రభువు నీవే...
ఓటమి ఓర్చుకో
మలుపు నుంచి నేర్చుకో
గెలుపుగా మార్చుకో...
 
ఓడినా గెలిచినా
పోరాటమే నీ కర్తవ్యం...
కఠినాత్ముడివై
కత్తిదుయ్య వలసింది నీవే
కరుణామయుడివై
కనికరించవలసిందీ నీవే!
 
శ్రామికుడివై
స్వేదం చిందించవలసింది నీవే
రాజువి నీవై
నీ జీవన రాజ్యమేలేదీ నీవే!
 
భక్తుడు నీవై
భవాంబుది దాటవలసింది నీవే
ఇభ్యుడు నీవై
ఈసుని చేరగలిగేది నీవే!!
 
వాణిశ్రీ నైనాల
****
 

 

వచన కవిత.

 

మనసున తలచి ఆగక ప్రయత్నం చేయాలి
నిరాశతో అలసటకు తలవంచక సాగాలినిన్నటి ప్రయత్నం నేడూ కొనసాగాలి
బంటును అంటూ మిగలక రాజై నిలవాలి
 
 
కందము
సగటు మనిషి యని తలచన్
వగరు పలుకులను విసవిస వాడగ నతడే
విగరుడు  అని తల వొంచక  
మొగిదలను  చకచక రాజ్యముకు దొరయయ్యే
 
డా.సతీష్
****
 
 
నీ నమ్మకమేగా జీవితం
నిన్ను నువ్వు నమ్మితే జీవితం
ఇతరులను నమ్మితే నువ్వే అమ్మకం
బలమే కదా జీవితం
ఆత్మ బలమే గదా జీవితం
నీ బలమే నీకు జీవితం
నటనా పరులే నీ పరివారం
నమ్మితే నీ జీవితమే పరిహాసం
నీవు అవసరమైతే మనవారే
నీకు అవసరమైతే పగవారే
సమస్యలకు పారిపోకు కలి గనుక
నీ నీడ నీ వెంటే ఉందిలే భయపడక
నీ నడకనే నమ్ము వస్తుంది నీ వెనుక
నీ ఆత్మ బలమే నిత్యం నీ కెరుక
 
వి.వి.శ్రీనివాస్
****
 
 
తేటగీతి
 
మనిషితనకుతానుయెపుడు
మదిలోన
యాత్మవిశ్వాసముకలిగి యాయుదముగ
మలిచిముందుకుసాగితేమారు మాట
లాడకవిజయమొచ్చురాలక్ష్మితోడ
 
లలితారెడ్డి
****
 
పాలనము నందున సమర కాలమందు
మీ యనుజ్ఞ పాటించెదన్ మిక్కుటముగ
మీదు నీడయే మాకిలన్ మేరువగును
విజయ బాటన నడచుచు వెలుగు వెంట
జీవన చదరంగమున నే చిన్న పావు
 
ఓలేటి
****
 

 

మంజరీ ద్విపద
కొండను దొలచి కలుగు సేయు నెలుక!
కరి, రాదుసరి  పిచ్చుక నెగురు చుండఁ!
చిన్న ప్రాణి ననుచు చింతించ కుండ
సమయము చూసి నీసత్తా తెలుపఁగ!
 
లలిత దీక్షిత్
****
 
 
 
చిత్రకవిత
 
ఎదురుచూపుల అంతానికి నిరీక్షణ..
గెలుపు పిలుపు కోసం అన్వేషణ..
ఫలితం కోసం పడే ఉబలాటం..
గెలుపు కోసం పడే ఆరాటం..!
మనసులో ఆందోళన
ఏమూలో ఒకింత..
గెలిచామని తెలిసినపుడే నిశ్చింత..!
గెలుపు కోసం ఎదురుచూస్తూ ఉత్కంఠ..
ఓటమి తలుపు తడుతుందేమోనన్న విహ్వలత..!
జయమెవరిదో  తెలియని
ఆటుపోట్ల ఆటలో
అడుగడుగునా అనిశ్చితి,
అనుమానం, ఆతృతలను అనుభవిస్తూ..
పరిపరివిధాల పరితపిస్తూ,
లేని బింకాన్ని నటిస్తూ,
కల్లోల కడలిని తలపించే అంతరంగాలు..!
అన్నీ కలిసి వస్తే
వరిస్తుంది అదృష్టం..
అనూహ్యంగా
అందలమెక్కిస్తుంది అమాంతం..!
విజయమా లేక పరాజయమా ..
అన్న విషయం మరచి..
సామర్థ్యం మేరకు శ్రమించి .
ఎదురైన ప్రతి అనుభవాన్ని
సాదరంగా ఆహ్వానించి..
గెలుపు మాత్రమే ఆనందం కాదని..
ప్రయత్నించడం లోనూ
మోదం ఉందని..
ఓటమి అంటే అనుభవసారమని,
ఓటమి నెరుగని మనిషే లేడని..
జయాపజయాలు దైవాధీనాలని,
పర్యవసానమే మనుషుల పాలని..
తాత్త్విక భావాలను తలపోస్తూ,
కర్మ సిద్ధాంతాన్ని నెమరువేస్తూ..
నిభాయించుకొని నిలకడగా
మనోధైర్యంతో మసలుకొంటూ,
విశ్వాసంతో భవిత వైపు
పయనిస్తూ..
ఉజ్జ్వల భవితా స్వాప్నికులై ,
నిరంతర శ్రామికులై..
నిర్విరామ కృషితో
మునుముందుకు సాగిపోయేవాడే
మహనీయుడు..!!
 
చల్లా దేవిక.
****
 

 

భావ కవిత-
అహం బ్రహ్మాస్మి
యజుర్వేదమన్నది ఆనాడు
 
ప్రజలే రాజులు
ప్రజాస్వామ్యమన్నది ఈనాడు
 
ప్రకృతి నీవే,
పంచభూతాలు నీవే
పిండాండము నీవే ,
బ్రహ్మాండము నీవే,
 
దృశ్యంగా నీవు
సామాన్య వ్యక్తివి
అదృశ్యంగా నీవు
అనంత శక్తివి
 
అసాధ్యమైనదేదీ లేదు నీకు
అపజయముండబోదు నీకు
 
సాహసమే ఊపిరై సాగాలి నీవు
ధర్మ యుద్ధమే సాగించాలి నీవు
 
 
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు
నీపై నీకు భరోసా ఉంటే విజేతవవుతావు
 
CA కె మల్లికార్జునరావు
****
 

 

ఆటవెలది....
 
నిన్ను మించి లేడు నేలపైన ఘనుడు
నీదు జీవితమున నీవె బంటు,
రాజువోలె వెతలు రారాజు లాదాటి
వీరుని వలె చాటు ధీర గుణము....
 
జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి, మహారాష్ట్ర
****
 
 
తేటగీతి
ఆత్మ  విశ్వాసమొకటియే అంగ రక్ష
విజయమే నీకు వశమగు వింత గాదు
వమ్ము  కానీయకయ్య నీ నమ్మకమును
తోడు నిలిచి  దైవంబు నీ నీడ యగును
 
పదము పదమున నమ్మిక పథము  చూపు
అడ్డు లేమైన కానీ,  నీ కడ్డు  రావు
చేర గలవు నీ గమ్యమ్ము చివర కైన
పొందగలవు  చిర యశము పూన్క తోడ
 
అవళూరు సీత
****
 
 
 
కవిత
రాజు అయినా,బంటు అయినా
ఆత్మస్థైర్యం ఉన్నవాడు
ఎక్కడైనా రాజే...
ధర్మం గా ఎవరి కర్తవ్యం వాడు
ఆత్మస్థైర్యం తో నిర్వహిస్తే
ఎక్కడైనా వాడు తిరుగులేనిరాజే..
 
ఉమా సరస్వతి 
 ****
 
 
వచన కవిత
పడ్డవాడు గాదు చెడ్డవాడు అంతటా
తప్పుకాదు జీవతమున  వెనుకబడుట
చేయాలి ప్రయత్నము ఎప్పుడూ వదలక
 పోరాడగ నేటి బంటు కావచ్చు రేపటి ఏలిక
 
యద్దమున చూడ కొండ చిన్నదై కానవచ్చు
గర్వపోతుకు యదుటి వాడు తక్కువై తోచు
నీకు మాత్రం నీవు బలిమై మదితోచ
కొండను ఢీకొట్టి పిండి గొట్టవచ్చు
 
డా.సతీష్
****
 

 

నిలువు నీడను సమకూర్చు రాజువైనా నీవే..
సాహసోపేత బలశాలి బంటువి నీవే...
ఆత్మస్థైర్యం ఉంటే రాజువు రారాజువు నీవే,
స్థైర్యం కోల్పోయి వెనకడుగు వేస్తే
మరొకరి ముందు బంటువి నీవే...
 
సూర్య తాడిపూడి.
****

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...