17, సెప్టెంబర్ 2020, గురువారం

భక్తి మార్గం

 

శుభోదయం - భక్తి మార్గం

 

తేటగీతి

పల్కుజవరాల! భారతీ! వందనంబు!!
విద్యలొసగి దీవెనలిమ్ము! వినయముగను
జ్యోత లివియె విద్యాతల్లి! శోభితముగ
జ్ఞాన మిచ్చి సంరక్షించు! శారదాంబ!!

 వెంకట్సిహెచ్      

*******************

 

తేటగీతి

ద్విదేహుడావందనంబు

పార్వతీనందనుడదేవవందనంబు

బొజ్జదేవరస్వామిసద్బుద్ధి నిమ్ము

విఘ్ననాయకుడనిలిపి  విద్యలిమ్ము

 వెంకట్సిహెచ్      

*******************

తేటగీతి

రామ నవమి పర్వదినము రమ్యముగను

జరుగుచుండగ కళ్యాణ సంబరమదె

కాంచు నట్టి భక్తజనుల కలయ జూచి

తన్మయమ్మున వ్యాఖ్యాత తాను పలికె;

సుందరుండు శ్రీరాముడె; సుదతి సీత

ముక్కుపుడక హృదయములో చిక్కుకొనగ

అమ్మ సీతమ్మ నోరగ నెమ్మి తోడ

జూచు చుండెనిదె గనుడి సుజనులార

యనగ పారవశ్యము గల్గె జనాళి కెల్ల!

 

చల్లా దేవిక.

*************** 

 

                                                           

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...