చిత్రానికి పద్యం
- 76
31-12-2020 గురువారం
క్యాలెండర్ సంవత్సర
ముగింపు
సందర్భంగా
పై చిత్రానికి
పద్యాలు/కవనములు
అందించగలరు...
నానీలు, మంజులము, ఉత్సుకము, తోటకము, భద్రకము, ముత్యాల సరాలు కూడా రాసినచో మిక్కిలి సంతోషము...
తేటగీతి......
పైరు పచ్చలు తెమ్మెర పరవశింప
బిడ్డ హాయిగా పవళించె గడ్డి పైన
కీడు దలపక తలగాచె గేదెనచట
స్వానుభవమున జెప్పగ స్వర్గమదియె ..
పి.ఎల్.నాగేశ్వరరావు
ఆ. వె
చీకు చింతలేని చిత్రంబు బాల్యమౌ
చిలిపి గాలికూగు సిగురులోలె !
కష్టనష్టములెరుగని పసిప్రాయంబు
కాలగర్భమందు కలగ మిగిలె!!
డా. నాగులపల్లి
మత్తేభము.
అహహా బాలుడ! కానగా ప్రకృతి యుయ్యాలందు నీవీస్థితిన్
మహిషా స్కందము నెక్కిభద్రతన తన్మాత్రానిలంబుల్ సదా
యిహలోకంబున హాయిగొల్పగను నిద్రేచ్ఛా ప్రమోదుండవై
మహిలోనెక్కడ సాటిరాని సుఖ సన్మానంబు నొందంగదే
ఆదిభట్ల సత్యనారాయణ
కం
రహినొందగ కలిమి యేలనొ?
మాహిషము వీపే మృదువగు మల్లెల పాన్పౌ
నహమును విడ మహరాజువు
మహిమ తెలియ తనివినొందు మార్గము దొరుకున్
వాణిశ్రీ నైనాల
ఆ వె
బడికి బోవకుండ బర్రెపై బడుకొని
పుస్తకములు వీడి మస్తి జేసె
అమ్మనాన్న వచ్చి కమ్మగా తగిలించ
పరుగు దీయునింక వడి వడిగను
కం||
కాపును గాయుచు గేదెను
వీపున తా బడుకొనుండి వేడుక జేయన్
కోపముతో మాత పితలు
జూపగ కన్నెర్ర జేసి సోకులు వీడున్!!
కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి
ఆ.వె - 1️
వ్యధలు లేని యోగి భాగ్యవంతుడితఁడు
స్వేచ్ఛకోరుకొనుగ విలసితముగ;
స్వేచ్ఛలేని నాడు వేదనల్ నిండేను;
శాంతి, సుఖము జూపు చంద్రుడితడు
ఆ.వె - 2️
స్వచ్ఛమైన మనసు, సంతసంబున్ పంచు
కల్మషములు లేక కాంతులీను
మనసు పులకరించె మందహాసములందు
సాంద్ర చంద్రికముల చంటి వాడు
తే 3️
మౌనరాగాల హాయిలో మంత్రమేసి
మేఘమాలికల సొబగు మీసరముల
స్వాదు గీతులందించెనీ పరవశమ్ము
నిష్కపటమార్గమున స్వేచ్ఛ నివ్వటిల్లు
కస్తూరి శివశంకర్
చిత్రముపై కవిత
పచ్చగడ్డి మేయ పశువు నిలచి యుండ
పానుపయ్యె వాడు పవ్వళింప
ముదముతోడ మదిని మురిసి నగవుచును
పరమ పావనముగ పరవ శించె.
హేమలత
నేనే మారాలి
గడిచి పోతోంది ఈ ఏడు
ఓ సారి శాంతంగా తిరగెయ్యి
చేసిన తప్పులు పెట్టిన కష్టాలు
పొందిన ఆనందం గురించి
ఆస్వాదించు వస్తున్నా అంటున్న
మరో సంవత్సరాన్ని
పంచు ఆనందాన్ని పది మందికీ
హమ్మయ్యా వీడుంటే చాలు అనేలా
ధృఢ సంకల్పం
ఆ బుడతలా ఈ రాత్రి శాంతంగా వుండాలి
ఆలోచించు కోవాలి క్షుణ్ణంగా
చేసిన తప్పులు పెట్టిన కష్టాలు
పొందిన ఆనందం గురించి
ఆస్వాదించాలి వస్తున్న ఇరవై ఇరవై ఒకటిని
పంచాలి ఆనందాన్ని పది మందికీ నవ్వుతూ నవ్విస్తూ వుండాలి .
నా మార్పు నేనే మెచ్చాలి
జి మురళీ మోహన్ రావు
చిరు గాలులకు వయ్యారి పైట లాగా
పచ్చని పైరు కదలాడు చుండ
మాత పొలం పనుల యందు మునిగి యుండ
ఆటపాటలతో అలసిసొలసి అమ్మ ఒడి అనుకొనుచు
గేదెపై హాయిగా పవళించే బుడతడు
దేవరశెట్టి నాగమణి
కందము
పచ్చని పైరుల నడుమన
మచ్చిక చేసిన మహిషపు మంచము పాన్పున్
ముచ్చట తీరగ నాడెడి
చిచ్చర పిడుగే గడువును చెలువపు బాటన్
రమ, కంకిపాడు
స్థిత ప్రజ్ఞుడు వీడే ....
ఎంత దర్పం ఎంత రాజసం ,
ఈ ప్రపంచం లో జరిగే బాధలతో నాకేం సంబంధం ,
ఈ కుటుంబం లో జరిగే చీకాకులు నాకు ఎం అవసరం ,
31స్ట్ డిసెంబర్ వేడుకలు చేసుకునే ప్రతి ఒక్కరు నన్ను చూడండి,
ప్రపంచంలో నేను ధనవంతుడు నన్ను చూడండి .....
కలుషితం ,కల్మషం లేని నా నిద్రను ,నా ఖర్చు లేని రాజసాన్ని చూడండి ఇప్పుడు చెప్పండి ఈ ప్రపంచంలో నా కన్నా ధనవంతుడు ఎవడో....
తరువోజ
స్వచ్ఛమైన మదితో వాహద్విషమునె పాన్పుటిల్లుగ జేసె సాహసికుండు
మచ్చిక గావించె మహిషమున్ రహిగ, మైమరచి పరుండె మహరాజు వోలె
పచ్చని పైరుల పరవశ మందు పవళింపు సేవలో పసివాని ఠీవి
లచ్చింపతికి దక్కు లక్షణంబు వలె ప్రభవించిన శిశువు లక్షాధికారె
వెంకట్.సి హెచ్
దృశ్యం కవిత
కష్టించి పనుల గావించి అలసి
పశువు వీపును జేరె సేద దీర
దలచి నదియె హంస తూలికా
తల్పమని నా ధీర కిశోరుడు
దిగులు లేని బతుకు గడుపగ,
కిరీటము లేని మహరాజతడు.
అశాంతి గెలిచిన వీరుడతడు.
ఆత్మతృప్తి లేక స్వర్ణ సౌధాన
బ్రతికినన్ ప్రశాంతత దొరకునే?
CA కె మల్లికార్జునరావు
రోనా వచ్చి కలకలం పుట్టెనేమి,
పాత సంవత్సరం వెళ్ళి కొత్తది వచ్చేనేమి,
ఏవివచ్చినా,ఏవిపోయినాలాభంమనకేమి,
నవ్విపోదురుగాక మనకేటి సిగ్గని,
మకుటంలేని మహారాజును నేనని,
నాబంటు నీవని,
పచ్చని చేలలో పయనిద్దామా నేస్తమా కిలకిలమని.....
ఉష.
మహిషము నధిరోహించగ రహినినేలు
రాజువలె,పశుపాలన రంజి తముగ
జేసి విశ్రాంతి గొన్నట్టి చిన్ని తండ్రి
గగనమే వాలెనోయి నీ కనుల ముందు.
ఓలేటి ఉమా సరస్వతి
ఈ నాటి చిత్రానికి నా ప్రయత్నం..
దొరికిన,ఉన్న జీవితంలోనే.. ప్రతీ చిన్న సంభవాన్నీ, ఆనందంగా ఆస్వాదించగల అదృష్టవంతుని, నిత్యసంతోషి, ఇంకా అల్పసంతోషి ఐన ఓ పసివాని ఆనంద యోగమిది....వాడికి ఎనుమే పట్టు పానుపు... మండుటెండే మరి పండు రేయెండ ( = పండు వెన్నెల)
పట్టపగలె చిఱుత పండు వెన్నెల నాని,
లెక్కలేని పగటి చుక్కలెన్నె !
అణువణువున బ్రతుకు నాస్వదింపగనెంచ,
నెనుమె పానుపయ్యె;-నెండె, జ్యోత్స్న !!
( నాని... పూర్తిగా జలకాలాడి, తడిసిపోయి అనే అర్థంలో)
వట్టెం వెంకట రమణ
కం ll
వెన్నెలలో నానిన పసి
వన్నెలవాడు సిరినగవు వాడు, హృదయమున్
యెన్నెన్నో భావాలై
చిన్నారికి పొంకమైన చిత్తరువులలో !
వ్యధలు లేని యోగి...
శాంతి సుఖము జూపు చంద్రుడు..
సాంద్ర చంద్రికముల చంటివాడు..
నిష్కపటమార్గాన జను స్వేచ్చాజీవి....
మీ బుడుత ఎంత భాగ్యవంతుడు !
చిఱుత ప్రాయపు యల్లరి చేష్ట లవియె
చీకు చింతలనెఱుగని చిలిపి వయసు
యాకు పచ్చని పచ్చిక హాయి నీయ
మచ్చికయినమహిషమది మంచె రూపు
దాల్చ సుఖమెరుగనినిద్ర దాపులందు
చొఱయె యెడలు తెలియకనె సొమ్మసిల్లె
అవళూరు సీత
తేటగీతి
మంద గమనముతో సాగె మహిషివోలె
వత్సరమది చరిత్రను వాసికెక్కె
కని, విని, యెరు గ లేనిది గాను; జనుల
కట్టి పడవేసె కష్టముల్ కడలి యందు.....
జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి
చం.
సరిగ సుఖంబనంగను విచారము జేయగ సత్యమౌనిదే;
తిరముగ కీర్తి సంపదలు , తీరగు విద్దెను బొందకున్ననూ,
గరువము తోడ రాజు వలె
గాన్పడు బాలకు జూడ; సంతసం
బిరవుగ నొందగా మహిష మింపగు శయ్యని బవ్వళించెనే!
చల్లా దేవిక
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి