23 - 12- 2020; ప్రణాళిక
సమస్యాపూరణ : "నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష"
తేటగీతి
హరహరా యెంత మాటిది హారముఁ గొన
మాయ జేసితినందువా? మాయమాట
లెన్ని లేవయ నీరాసలీలలందు ?
నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష !!
డా. నాగులపల్లి
తేటగీతి...
తరులశాఖలో పరమేష్టి మరులుజూపె
కుందములను వాసంతికా బృందమందు !
మంజులములై కనంబడు వంజులములు
మధుపముల్ దాచు మధురోహ మలయజమిది
నేత్ర నీలాబ్జములన కన్నీరు జార !
నీవు నేర్పిన పదముతో నినదమలరె !
నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష !!
మంజులములు = మనోహరమైన, అందమైన
వంజులము = అశోక వృక్షాలు
కుందములు = బొండు మల్లె పూవులు
వాసంతిక = వసంతములో కనిపించేది
నినదము = శబ్దము, ధ్వని
కస్తూరి శివశంకర్
తేటగీతి...
మన్మనోభీష్టమును దీర్చు మహిళవగుచు
సన్మతులు మెచ్చు పల్కులు సరణి నెఱిఁగి
పద్య విద్యల స్తవములు పలుకుతీరు
నీవు నేర్పిన విద్యయే నీరాజాక్ష !
వై శ్రీదేవి
హతవిధీ !
బహుశా ఇదియూ నీ బిడ్డకు
నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా
అనుచూ , ఏరి పారవేసి అన్ని
మత్తు పానీయములు ,
రమ్ము నీ కుమారునితో
మా కారాగార గదిలో కూర్చొందువు అని లాక్కెళ్లి రాతనిని రక్షక భటులు
మహత్వ సమస్య
నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా
అను పటుత్వ
సమస్యనుండి వచ్చు
భావనలు చిత్రములలో
తరచూ వాడుటచే ,
కథానాయకులకు కలిగించు
సహస్ర గజముల బలము,
కురిపించు కరతాళ ధ్వనులు ,
తెప్పించు లాభంబులు ,
ఇప్పించు పురస్కారంబులును!
జి మురళీ మోహన్ రావు
తేటగీతి...
పెద్ద లెప్పుడు నడువగ నద్దమల్లె
వీరి నడత లోన నెదుగు పిల్ల లెపుడు
ఆచరించి జూప, నవని నాదరించు
నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష......
పి.ఎల్.నాగేశ్వరరావు
తన అవ్వా తాతలను అమ్మానాన్నలు
అనాధ శరణాలయమునకు పంపుట,
గాంచి తానూ నొక శరణాలయమందున్
ముందస్తు రొక్కము జమ చేసి నొక గది
నిలుపు కొనియే మనవడు, ఎవరికొరకని
నాన్న అడుగ, మీకే నని జవాబు నిచ్చి,
నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష యని
గారవమున వినయముగ నుడివెనుగ.
CA కె మల్లికార్జునరావు
ఇంటి పాలు పెరుగులన్ పంటినిడము
కొంటెచూపుల బాణాలు కోరెదమ్ము
తుంటరౌ దారులపుడప్డు తొక్కుడనగ
నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష!
రాంమోహన్, నిజామాబాద్
తేటగీతి...
తాతనే పూడ్చ గోతిని తండ్రి త్రవ్వ
కొడుకు ప్రక్కనే త్రవ్వెడి గొయ్యి జూచి
" బాబు! ఎందు" కని యడుగ పలికె నవ్వి
" నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష!".
డి రామ నాగేశ్వరరావు
తేటగీతి
హంసకెవరు నేర్పిరిలను హంస నడక
కోకిలకెవరు నేర్పిరి కుహుకుహులను
నెమలికెవ్వరు నేర్పిరి రమణి నటన
నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష
జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి
నీవు చేసెడి పనులన్ని నిజముగాను
చేసి చూపించు కళ్ళకు స్థిరము గాను
భార్య భర్తల సరసాలు పదిలమౌను
నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష
ఆదిభట్ల సత్యనారాయణ
తేటగీతి
పాండవులు కురుక్షేత్రమున్ పాటవముగ
భీష్ము నెదిరించ లేమని భీతితో శి
ఖండిని నిలిపి భీష్ముని గావు పెట్టి
ధర్మ నీతి యిదని తెల్పె ధర్మ రాజు
నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష
వెంకట్.సి హెచ్
తేటగీతి
నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష/
యనుచు ధర్మజు ప్రశ్నించె యహిరిపువుని/
యుద్ధమందు గెలుపుకై యబద్ధమాడ/
వచ్చునా యంచు ధర్మరూపమని ఎరిగి
వారణాశి శ్రీలేఖ
వచనం,
నీవు చూపిన మార్గమే, రామా కడు ఉత్తమం,
నీవు చేసిన కార్యములే, పరంధామా అమోఘం,
నీవు పలికిన పలుకులే, జానకీ వల్లభా కడు రమ్యం,
నీవునేర్పిన విద్యయే, నీరజాక్ష సదాఅనుసరణీయం.
గాంగేయ శాస్త్రి, రాజమండ్రి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి