20, జనవరి 2021, బుధవారం

16.01.2021, శనివారము, పుస్తక సమీక్ష

 


16. 01. 2021,  శనివారము

 *రిటైర్మెంట్‌ గురించి మిత్రుడు వ్రాసిన కవిత..*

 

ఎన్నేళ్ళుగానో క్రమం తప్పకుండా తిరిగిన గడియారం ఒక్కసారిగా ఆగిపోతుంది .కదిలే ముళ్ళతో కదలికల్ని నిర్దేశిస్తూ అది సాగించిన నిరంకుశపాలన ఆఖరికి అంతమైపోతుంది. నలుచదరపుచట్రంలో అంతవరకూ బందీయైున కాలం ,విశాలమైన పచ్చికబయలు లాగా 

కళ్ళముందుపరుచుకుంటుంది. 

పనిదినాల పంజరంలో గువ్వలా చిక్కిన విరామం,మబ్బులు చూసిన నెమలిలా పురివిప్పుకుంటుంది. 

ఎన్నో చేయాలనిపిస్తుంది ,అన్నివైపులకీ ఒకేసారి పరుగులుతీయాలనిపిస్తుంది. 

పదవులు, బాధ్యతలు, పోటీలు, వైషమ్యాలు మచ్చలు మచ్చలుగా తేలిన పాత కుబుసం విడిచాక

తొడిగిన కొత్త చర్మం నునుపుగా, మెత్తగా కొత్త ఆశల్ని రేకెత్తిస్తుంది. 

మిగిలివున్న గడువు చిన్నదో, పెద్దదో ఎవరికి తెలుసు?పొద్దు క్రుంకేలోగా తెల్ల వెలుగులో దాగిన ఒకటిరెండు అపరిచిత వర్ణాల్ని కొద్దిగానైనా తెలుసుకోవాలని ఉంటుంది. 

ఒలికిన పాలను ఎలాగూ గిన్నెకెత్తుకోలేం, రాలిన ముత్యాలలో కొన్నిటినైనా తిరిగి ఏరుకోకచ్చుననే ఊహ తలెత్తిన తెల్ల వెండ్రుకలా తళుక్కున మెరుస్తుంది.

పి.ఎల్.నాగేశ్వరరావు

 

శార్దూలము

సంతోషమ్మున వేచియుంటిమికదా  సంక్రాంతి! నీ రాకకై

కాంతుల్ నింపుచు జీవన క్రమములో గమ్యంబు చేకూర్చుమా

భ్రాంతుల్ వీడగ నవ్యచేతన క్రియా వాల్లభ్య సర్వోన్నతిన్

శాంతిన్ సౌఖ్యము దివ్యమౌ ప్రగతి తోషంబుల్ ప్రసాదింపుమా

ఆదిభట్ల సత్యనారాయణ

 

 

వేమన శతకములోని పద్యరత్నం

ఆటవెలది..

పట్టు పట్ట రాదు, పట్టి విడువ రాదు

పట్టెనేని బిగియ బట్టవలయు

బట్టివిడచుకన్న  బరగ జచ్చుటమేలు

విశ్వదాభిరామ వినురవేమ.......

తాత్పర్యం..... ..

పట్టుదలయే వహింపరాదు, వహించినచో  ఆ పట్టు వదలరాదు. పట్టినపట్టు నడిమిలోనే విడచుట కంటె మరణము మేలు.....

యింతకంటే  పెద్ద పెద్ద ఉపన్యాసాలు,  మనోవికాస తరగతులు

అవసరమా......ఆలోచించండి మిత్రులారా....

Arise, awake, work hard, stop not till your goal is achieved...

పి.ఎల్.నాగేశ్వరరావు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...