8, జనవరి 2021, శుక్రవారం

ప్రశ్నల ప్రహేళిక 03.01.2020

 


ప్రహేళిక సంఖ్య - 40

అంశము: తెలుగు సామెతలు

జవాబులు

 

1. సంసార కష్టాలు గురించి తెలిపే సామెత

జవాబు: సముద్రమైనా ఈదవచ్చు గానీ సంసారం ఈదలేరు

 

2. తగని పనులు చేయవద్దని తెలిపే సామెత

జవాబు: దారిన పోయే తద్దినాన్ని పిలిచి నెత్తి కెక్కించుకున్నట్లు 

 

3. మంచి వారేవరంటే ఎవరు లేరు అన్నట్లు తెలిపే సామెత

జవాబు: ఇద్దరే సత్పురుషులు, ఒకడు పుట్టని వాడు  ఇంకొకడు గిట్టినవాడు

 

4. ఉన్నదానికి, లేనిదానికి అతిశయం గా పొగిడే వారిని గురించిన సామెత

జవాబు: గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్య పోతే, ఒంటె అందానికి గాడిద మూర్చబోయిందని

 

5. నడమంత్రపు సిరితో మిడిసి పడే వారి గురించి తెలిపే సామెత

జవాబు: చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే, వంకర టింకరవి యేమి కాయలని అడిగిందట

 

6. మనిషి మనసు లో ఏమీ ఉందో తెలుసుకోలేము అని తెలియజేసే సామెత

జవాబు : మనిషి మర్మము, మాను చేవ బైటికి తెలియవు

 

7. తెలియని పనులు చేసి తల మీదకు తెచ్చుకోకుండా ఉండాలని తెలియజేసే సామెత

జవాబు : ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడిగుండంత సుఖం లేదు

 

8.  అవసరం తీరే వరకు గౌరవంగా ఉంటూ తీరిన తర్వాత హేళన చేయడం

జవాబు : ఓడ దాటే వరకు ఓడ మల్లయ్య, ఏరు దాటాక బోడి మల్లయ్య

 

9. కుటిలమైన మనసు కలిగిన వారి గురించి తెలిపే సామెత

జవాబు: కింద పెట్టిన పంటలుండవు  *పైన పెట్టిన వానలుండవు

 

10. స్నేహంగా ఉన్నప్పుడు తప్పులు ఏమి కనిపించవు అనే అర్థంలో సామెత

జవాబు : కూరిమిగల దినములలో నేరము లెన్నడును తోచవు

వెంకట్.సి హెచ్


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...