21, నవంబర్ 2020, శనివారం

చిత్రానికి పద్యం - 65 మంగళవారము 17 11 2020

 


చిత్రానికి పద్యం - 65 

మంగళవారము 17 11 2020


తేటగీతి

మాటయె హితమున్గూర్చెడు మంత్ర మౌను

మాట జేయు గాయమొకచో మానసముకు;

మాటకున్న శక్తి నెఱిఁగి మసలవలయు;

మాననీయుల మాటను మరువకెపుడు!

చల్లా దేవిక  | తెలుగు తేనియలు

 

 

నా యతనము.

 

వేయి విధములుం డునుగదా వెర్రి యనగ

నాడు   దెలియంగ   లేదుయీ నాడది నెరు

క పడె నెటులన నాగరికపు ముసుగున

ముందు వెనుకంగ నయ్యెను ముఖము నిపుడు.

సూరే వెంకటప్పయ్య | తెలుగు తేనియలు

 

 

ఆటవెలది

 

క్షురము జేయువాని కరకమలములందు   

భవ్యమైన తపన వాంఛితముగ

వింతలన్ని జూచినంత వక్కాణించు  

మేటి విద్య జూపు నీటు గాడు 

 

ఆటవెలది

 

కైశికముల సొబగు కైవడి ఘనమాయె    

నూత్నరీతుల సుమనోజ్ఞసరణి

వ్యత్యయములు తెల్పు వైవిధ్యమౌ ఠేవ  

పొంకములగు ఠీవి పోహళించె  

 

కస్తూరి శివశంకర్ | తెలుగు తేనియలు

 

కత్తెర పైననీకుగల కౌశల మున్ గణుతింప శక్యమే?

జుత్తుల పైననీదు కరచోదక వృత్తికి మెచ్చితిన్ కడున్,

విత్తులకోసమై యిటుల పేదలు వేషము వేయుచున్ సదా

క్షుత్తులుఁ దీర్చు కొందురిదుగో పరమేశ్వర! చూపుమా దయన్.

 

ఆదిభట్ల సత్యనారాయణ  | తెలుగు తేనియలు

 

కందము

 

పెరిగిన వెంట్రుకలన్నియు

గొరిగించగ నెంచి వీడు కొంటెగ తలపై

మరు మోమును దింపగ తా

దరిచేరగ నే కరోన తల దిరుగునుగా!!

 

 

కందము

ఏమైనది యీ మోముకు

నీమములేమియు తెలియద నీతియు లేదా

తా మస్తిష్కము బోయిన

దేమో యనునట్లు యిటుల తెగియించెనుగా!!

 

కందము

అల్లరి బనులా వీడివి

పిల్లలు జూడంగ చాలు భీతిల్లుదురే

మెల్లగ వీడిని దీసుకు

వెళ్లుము పిచ్చాసుపత్రి వేగిరముగనే!!

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి  | తెలుగు తేనియలు 

ఆటవెలది 1

 

తప్పు జేయు నాడు దండన మొనరించ

కొప్పు దీసి శిరసు కోత బెట్టు

గొప్ప విద్య నేడు క్షురక వృత్తి  ధరను

విప్పు ముందు వెనుక చిత్ర మహిమ.

 

ఆటవెలది 2

 

జుట్టు తీయు విద్య జోరు నందు కొనగ

గుట్టు తెలుసు కొనుట గొప్ప దనము

పట్టి చూడ క్షవర వైపరీత్య నిపుణ

లిట్టి వింత లన్ని యింపు  గాను.

 

శిరీష  | తెలుగు తేనియలు

 

 

వచన కవిత,

 

క్షురకుని పనికిని,

శిరము రెండవ ముఖమాయె,

కరోనా తో ఒక ముఖమే దాయలేకుంటే,

ఈరెండో ముఖమెలా దాయటం రామా !!!

 

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి  | తెలుగు తేనియలు

 


వాడవసరం .. 

 

పరిగెత్తుకొచ్చి చతికిలబడి

క్షవరం అన్నాడు

ఆరు నెలలకి ఈ ఒక్కడు

నా అదృష్టం గీకి, గీసి పెట్టా

నచ్చక పొతే గుండు , నచ్చితే

రెట్టింపు ధర తేల్చిచెప్పు అన్నా

గుండు గీయించుకొని

నచ్చలేదు నీకు పైసలు సున్నా

అని పారిపోయాడు వాడు

 

జి మురళీ మోహన్ రావు  | తెలుగు తేనియలు

 

 

కందము

 

జననీ జనకుల గాచుట

మన బాద్యతలన్ యెఱింగి మసలిన మేలున్

ధన మోహమాయ గల్గిన్

వనజాక్షి పరమున జేరి వదలకు విలువల్

వనజాక్షి = స్త్రీ

 

పద్మలత  ఏం  | తెలుగు తేనియలు

 

ఆటవెలది 

 

ముందు వైపు త్రిప్పి ముఖమద్దమున్ జూపి

ముచ్చటగను జూపె ముద్దు మోము

వెనుకవైపు నేమి వేషాలు వేసెనే 

గుండ్లు జేయ మనిన కండ్లు గీసె

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి  | తెలుగు తేనియలు

 

 

కందము

చలిలో భద్రాకరణము

తల చెక్కెను, మురిపెములవి తలచెను మదిలో,

చెలి కోరిక తీర్తుననుచు

కలి కాలమున వివిధములు గదరా డాబుల్!

 

దుర్భ కృష్ణశాస్త్రి  | తెలుగు తేనియలు

 

 

కందము

 

తిట్టెడి వారును లేకనె

జుట్టును తా నివ్విధముగ సొగసుగ గొరిగెన్

కొట్టిన యీ వింత బనిని

ఎట్టుల జేయగ దలచును ఎవడైననికన్!!

 

కందము

 

చూడగ జుట్టును దెలియును

వీడికి ముదిరింది పిచ్చి విపరీతముగన్

మోడై పోయిన బ్రతుకుగ

ఈడిట్టుల కత్తెరేసె నెవడో వీడున్!!

 

కందము

 

నెత్తిని జుట్టును మొత్తము

కత్తెరతో గొరగ కుండ కాచెను కొంతన్

చిత్తము నందున కోర్కెలు

చెత్తగ బెరుగంగ నిటుల జేసెను హయ్యో!!

 

కందము

 

తలపై వెంట్రుక మొలవగ

నిలలో తా గొప్పయనుచు నిదియేమిటిరా

కలలో కనబడవచ్చిన

విలవిల లాడుదుము మేము పెరుగగ భయముల్

 

కందము

 

వింతగ రూపము గల్గియు

కొంతైనను పోల్చ మేము  గుర్తుకు రాదే

పొంతన లేకయు జుట్టును

శాంతము నొక మోము వోలె సర్దెను తలపై!!

 

కందము

 

వీడిని జూడగ నెల్లరు

నీడను జూడంగ చాలు నిలబడ గలరా

తోడుగ నొకరిని యుంచుకు

నాడకు యీడకు వెడుదురు ఆశ్చర్యంబా!!

 

కందము

 

ముదిరెను పిచ్చిక యనుకొని

అదిరెనొ యేమో క్షురకుడు ఆశ్చర్యము తో

కదిలించుచు కత్తెర తా

నుదురును మోమును నిలిపెను నూతనముగనే!!

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి  | తెలుగు తేనియలు

 

 

 

ఆటవెలది 

 

తప్పు జేయు నాడు దండన మొనరించ

కొప్పు దీసి శిరసు కోత బెట్టు

గొప్ప విద్య నేడు క్షురక వృత్తి  ధరను

చెప్పు ముందు వెనుక చిత్ర మహిమ.

 

ఆటవెలది 

 

జుట్టు తీయు విద్య జోరు నందు కొనగ

గుట్టు తెలుసు కొనుట గొప్ప దనము

పట్టి చూడ క్షవర వైపరీత్య నిపుణ

లిట్టి వింత లన్ని యింపు  గాను.

 

శిరీష

 

మంజరీ ద్విపద లో  1

 

క్షౌరకుని ప్రతిభ ఘనతగ నుండి

ముగ్ధమోహనముగ ముదము కల్గించు

ధీరుని వలె వీడు దివ్యత నొంది

వీరుడై ప్రభవించు ప్రియసఖి ముందు

 

2️

కుర్రకారు విచిత్ర గుణములు తెలుప

కొదువ గాదె సతము క్రోధము బెంచు

వెర్రిగా నభిరుచి వెలయించు రీతి

విపరీతముగ నుండి విముఖత కలుగు

 

3️

వికృత చేష్టల తోడ వితతి నందుండు

ప్రాకాశ్యము నశించి ప్రభవము బోవు

చిత్ర పోకడ తోడ జిలుగు కోల్పోయి

సంస్కృతి కాట్పడి చాటుపడు గద

 

వెంకట్.సి హెచ్

 

తేటగీతి

పలు విధముల కొప్పులు గూర్చు పడతుల గని

పెలుచ జూపు పోరడి పలు విద్దెలివియె

మోము జిత్రించె శిరమున మోహనముగ

సృజన తోడైన నేర్పరి సృష్టి గనుమ

 

వాణిశ్రీ నైనాల  | తెలుగు తేనియలు

 

క్షవరాలయాన కలికాల అందం

పంచేంద్రియాలే మాడైన బంధం

ఏ రూపు ఏ ప్రక్కనుందో ఏకిలైన అందం

శిఖలోన చిత్రించె విచిత్ర భందం

ఈ రూపే ఆరవ ప్రాణం

అవనిలో అరుదైన రోగం

ఓషధమే లేనీ రోగం

కాలమే చెప్పాలి చిత్రం

కలి లోన వికటించె అందం

ఈ శిఖలో నాసిక చెక్కి

ఆ మెదడులో మూతిని ముంచి

నడి నెత్తిన నేత్రం నిలిపి

చూడగా చక్కగా విచిత్రమే విలువగా

క్షవరాలయాన కలిలోన అందం

 

వి. వి. శ్రీనివాస్  | తెలుగు తేనియలు

 

కందము

అందం బదియే యనుచున్

చిందులు వేయుచు క్షవరము చేసెను తానే

ముందు వెనుకలను తేడా

లందని చందము గొరిగెను రమణీయముగా

 

అవళూరు సీత  | తెలుగు తేనియలు

 

ఏమో గుర్రం ఎగరావచ్చు

పారే సెలయేరు కుంగావచ్చు

జారే జలపాతం మాయమవచ్చు

నింగినేల కలవవచ్చు

ద్విముఖము ఉండవచ్చు

కత్తెరకు సాన పడితే

ఎటులైన తిరగవచ్చు

కాదేది కత్తెర కళ కు అనర్హం

గిన్నీసు బుక్ కు ఇది అర్హం

క్షౌర విద్యా కళా విచిత్రము

 

కోవూరి  | తెలుగు తేనియలు


 

కందము

పుర్రె కొక బుద్ధి యనదగు

అర్రులు జాచ సతతమ్ము నాధునికతకై;

కుర్రను బోలెడు రీతిగ

వెర్రిగ క్షౌరమును జేయ వింతగ దోచెన్!

 

చల్లా దేవిక  | తెలుగు తేనియలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...