14, నవంబర్ 2020, శనివారం

దత్తపది - 55 * దీప, పాప, తాప, శాప * 13.11.2020


 

దత్తపది -  55

*  దీప, పాప, తాప, శాప *

 

తాపక్షేపకమైనమోహములతో ధ్యానమ్ములన్ వీడగా

పాపంబైననుఁ, పుణ్యమైనను సదా ప్రారబ్ధమై చేరుగా

దీపమ్ముండగ చక్కబెట్టుకొనగా  "ధీవృత్తులన్" కర్మలన్

కోపావేశపుశాపముల్ హృదయమున్ కుడ్యంబులే శంకరా !

కస్తూరి శివశంకర్ | తెలుగు తేనియలు

 

దీప,పాప,తాప,శాప పదములతో అహల్యా శాప కథ

తే.గీ.తాప మోర్వని యింద్రుండు పాపభీతి

వదలి మునియింటి దీప మున్ వాంఛ జేయ

అభము శుభము లెరుగని యహల్య శాప కారణ ము గ శిల యాయె కాననమున.

డి.రామ నాగేశ్వరరావు

 

 

వచన కవిత

 

దీపములు వెలిగించెదము స్వామీ,

మా పాపములు తొలగించుము,

మాలో కోప తాప ములు అంత మొందించుము,

మాకు మరుజన్మ శాపము తొలగించుము దేవా !!!

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి తెలుగు తేనియలు

 

 

ఉత్సుకము

 

దీపము దెచ్చును వెల్గులే

పాపల నవ్వుల వెన్నెలే

తాపసు లందరు ధన్యులే

శాపము బాపును కీర్తనల్

 

మంజులము

 

ఘనదీపములై వెలుగుల్

కను పాపలు చూపునుగా

మన తాపసులందరు ఓం

యనిశాపము లిత్తురుగా

 

భద్రకము

 

దీపమై వెలుగు ఎప్పుడూ

పాపలా కలుపు మైత్రినే

తాపసై మెలగు నిత్యమూ

శాపమే తొలగు పూజతో

 

రమ, కంకిపాడు తెలుగు తేనియలు

 


 

భద్రకము

 

దీపమే యనగ కాంతులే

పాపలే మనకు దీప్తులే

తాపమే యనెడి చేతలే

శాపమై నిలుచు పాపమే

 

గురుభక్తి తత్పరుడు దీపకుని

వృత్తాంతం

 

దీపకుండు తన  భక్తితో

పాపమే తనకు ఇమ్మనన్

తాపశౌ గురుడు నవ్వుతూ

శాపముల్ తనకు లేవనే

 

సతీష్ తెలుగు తేనియలు

 


 

దీప పాప తాప శాప

నాని:

పాప శాపములు శమియుంచు

దీప  తాపమున  కాదు జ్ఞాన తేజమున

 

భద్ర కం:

 

దీపమున్ వెలయు కాంతులన్

పాపమున్ చొనుపు శాపముల్

తాపమున్ సలుపు మోహమున్

కోపమున్ అణచు శాంతమున్

 

CA కె మల్లికార్జునరావు తెలుగు తేనియలు

 


 

తేటగీతిలో

 

పాప నవ్వులే దీపపు భాసములుగ

వెలుగు పువ్వులన్ విరివిగ విరియ జేయ

మదినడగగట్టు తాపముల్ మాయ మవగ

శాపమై తోచిన బ్రతుకు రూపు మారి

సంతసము నిండిన మనసు శమము నొందె

 

అవళూరు సీత

వచన ప్రయత్నం

దీపావళి కి దీపాలక్ష్మి ని వేడుకొంటూ

 

దీపాలను కాంతివై ప్రసరించుమమ్మా...

తాపాలను కారుణ్యవై అణచివేయుమమ్మా...

శాపాలను కాలాగ్నివై కాల్చివేయుమమ్మా...

పాపాలను కాళికవై  పారద్రోలుమమ్మా...

 

ఉష తెలుగు తేనియలు

 


 

కందము

 

దీపని జూడగ వచ్చెను

పాపని దెలియంగ నేను పడిపడి నవ్వెన్

చూపించితి సంతాపము

శాపములను బెట్ట వచ్చె సహియింపకనే!!

 

కందము

 

దీపము వెలిగిన, దైవము

పాపములను నిలువనీదు వరముల నీయున్

తాపసి వై నిలచిన యే

శాపము నిను జేరలేదు శక్తియు మెండౌ!!

 

ఉత్పలమాల

 

దీపపు కాంతులన్ సతము దేవుని శక్తియె తోడు యుండ నే

పాపము చేరదే మనల పండుగ రోజులె యెల్ల వేళలన్

తాపసి వైన చాలు నిక దాస్యము జేయుచు దైవ సన్నిధిన్

శాపము పెట్టినా జనులు సౌఖ్యము నిండుగ నుండు నీకుయున్

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి తెలుగు తేనియలు

 

 

 

తేటగీతి

 

దీప కాంతితో శోభిల్లి దీరు జగతి

పాపమంతయు వెలుగుతొ పారద్రోలు

తాపమన్నది మరిపించు దాపునుంటె

శాపమింతయు దగులదు శరణు వేడ

 

హేమలత తెలుగు తేనియలు

 

 

 

దీపం జ్యోతి పరబ్రహ్మ

 

ప్రజల ఆరోగ్య రక్షణ అతి ముఖ్యము

బాణాసంచ కాల్చుట నిషిద్ధము

అంటూ వచ్చిన న్యాయస్థాన తీర్పుతో

టపాసులు కాల్చే వారికి  , అమ్మువారికి ,పాపము  ,

ఇదొక శాపము వలె ఎదురైంది .

 

దీపముల వెలుగుతో

ఆ వెలుగులో చిరునవ్వులు ,

నవ్వుల పువ్వులు కురిపించి

అసలైన దీపావళి జరపండి .

 

జి మురళీ మోహన్ రావు తెలుగు తేనియలు

 

 

 

దీపపు కాంతిలో సిరులు దివ్య మనోహర శోభఁ గూర్చగా

పాపలుఁ బెద్దలున్ మిగుల ప్రాభవ మందుచు తాప దూరులై

కోపము శాపముల్ విడిచి కోరిన కోర్కెలు దీరువారలై

పాప విహీనజీవులుగ భాగ్యము సౌఖ్యము లిచ్చి బ్రోవుమా

 

ఆదిభట్ల సత్యనారాయణ తెలుగు తేనియలు


 

మధురాక్కర

 

పాపములు తొలగించి ప్రాభవమిచ్చు పద్మిని సం

తాప వేదనల్ దీర్చి మోదము నొసగు మహాలక్ష్మి

శాపములు సమసి హరువు సమకూరు దేవిపూజ

దీప ధూపముల్ వెలిగించి దివ్యముగ సలుప, తా

రూపము మదినందు నిలిపి లోచవి ద్రావ మది

గోపురమయి దివ్యత నొంది గుణవంతు లగుదురోయి

 

లోచవి= జ్ఞానామృతము

 

వెంకట్.సి హెచ్  తెలుగు తేనియలు

 

 

 

ఆట వెలది లో...

 

దీపముల వరుసలు దీపావళి దినమున్

పాపకులను, వారి పాపములను

రూపు మాపి జ్ఞాన రుక్కులన్ వెలిగించి

తాపమెక్కి బాపు శాపములను

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి తెలుగు తేనియలు

 

 

 

కందము

తా పతి తోడ రణమ్మున

పాపాత్ము నరకుని సత్యభామ వధింపన్

శాపము దొలగన్ జగతికి

దీపపు కాంతుల వెలుగులతిశయించెనుగా!

 

తేటగీతి

దీప కాంతుల పర్వపు తిన్నదనము

పాపహరణమ్ము జేసి విభవము గూర్చు;

తాపమే యణగ మది నాంధ్యమ్ము దొలగి

శాపములవి బ్రతుకు నందు సమసి పోవు!

 

చల్లా దేవిక తెలుగు తేనియలు

 

 

 

 హే భృగువంశసంజాతా శ్రీవిష్ణుహృన్నివాసినీ

సంధ్యా దీప లక్ష్మి వై మాఇంట అడుగిడి

పాప ములనెడి వరుణ పాశములను బాపి

ఆశనిరా శా ప రమై డోలాయమానమైన మనసున

తాప త్రయములను బాపి మనోవాక్కర్మల నిను

నిండుగా నిలిపి మోక్షలక్ష్మీవై నీ కరుణాదృక్కులను నాపై నిలిపి

ఎపుడు నను కరుణింతువు మా అమ్మవై

 

వారణాశి శ్రీలేఖ తెలుగు తేనియలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...