8, నవంబర్ 2020, ఆదివారం

దత్తపది - 53 * రామ, భామ, ప్రేమ, ధీమ * 06.11.2020

 


దత్తపది -  53

*  రామభామ, ప్రేమ, ధీమ * 


కందము

రామాయను నామమదే  

ధీమా గలిగించి మనసుదీప్తిని బెంచున్

ప్రేమగ పిలిచిన పల్కు ప్ర 

భామయ తలపుల్ ! నిరతము ప్రాంజలిజేతున్

 

కందము

ప్రేమావేశపు లీలలు    

భామాసంగతము తోడు భాధ్యత మఱచెన్     

ధీమంతుల వాగ్విభవము ! 

రామచరిత గనిన రాగరంజితమాయెన్

 

మన ప్రబంధ కవుల వైభవం తెలిపే ప్రయత్నం 

 

ఉత్పలమాల

కైతలు గూర్చు ధీమతులు కమ్రపదంబుల జూచినంతనే 

నూతన కేతకీదళమ నోహరకాంక్షలు ప్రేమనింపగా 

శీతలచందనాదుల వశీకరణమ్ము విరామచిహ్నమై 

పూతమెఱుంగు పల్కులవి పొంపిరిభావమనోహరంబులౌ

భూతలమందు భామములు పొంకపు భావనలద్దినారుగా 

 

కస్తూరి శివశంకర్

 

భద్రకము

రామనామమను మంత్రమే

ప్రేమగా పలుక మోక్షమే

భామతో కలసి కానలో

ధీమతో గడిపె శ్రీహరే

 

రమ

 

భామనే, శ్రీ కృష్ణ ప్రియ సత్య భామనే,

నరకాసురు జంపిన ధీమంతురాలినే,

నాదు అభిరామ తనూ సౌరభముల్ ,

చుట్టి పట్టి కట్టి వేయగన్  ఆ త్రిభువన,

మోహనుడు నా ప్రేమను మీర జాలునే.

 

CA కె మల్లికార్జునరావు

 

పద , లోపలికి !

సత్య భామ ధైర్యసాహసాలు

రాధాకృష్ణుల ప్రేమ కలాపాలు గురించి

క్షుణ్ణంగా చదివి తెలుగు పరీక్షకు సిద్దమవమంటే

పుస్తకము వదలి ఆటలకు పరుగెడుదువా , ఏమి ఆ నీ ధీమ !

లోనికి రారా రామ , లేనిచో నీ పని రాం రాంరామే!

 

 

ప్రేమ తో ధీమ

 

ప్రేమగా , ఇష్టంగా పుస్తకాలు చదువుతూ

సమయం వృధా చేయక సత్యభామ

విశ్వ విద్యా లయంలో ప్రవేశం పొంది శ్రద్ధగా చదివి

ఉత్తమ శ్రేణితో సంపూర్ణ జ్ఞానం పొందుతూ

రామ నామ జప మహిమతో సాధించు మంచి కొలువు

దాని ద్వారా ప్రజలకి కలిగించు నిరంతర ధీమ!

 

జి మురళీ మోహన్ రావు

 

 

 

ఉత్సుకం

 

రాముడు ఇచ్చును వైభవం.

ధీమను ఇచ్చును నమ్మకం.

ప్రేమలు ఇచ్చును అమృతం.

భామలు ఇత్తురు వందనం.

 ఉష

 

 

కందము

ప్రేమలె సర్వమని సతము

భామల యాతనల జిక్క భవ బంధనముల్

రాముని ధ్యానంబొసగెడి

ధీమా సాటి గలదె నిల ధీరులకైనన్

 

వాణిశ్రీ నైనాల

 

విరామమెరుగక పరిశ్రమిస్తూ

సభా మర్యాద పాటించావా

విప్రే మధురవచన ప్రియః అని తెల్సుకున్నావా

స్నేహాంబుధీ మరిపించును గాయములెల్ల!

రాంమోహన్ నిజామాబాద్

 

నా పూరణ - అలిగిన సత్య భామను గని కృష్ణుడు పలికెడి పలుకుల్

ఏల యీ  గల(భా,మ)ది నేలు దాన

(ధీమ)తీ,చూపవే ( ప్రేమ) దివ్య మైన

(రామ),యిమ్ము  వి(రామ)ము రట్టడికిని,

వజ్రి యా(రామ)మున గల పారి జాత

ములను తెత్తును, వీడగ వలయు నలక

యని పలికె సత్య(భామ)ను కనుచు వృష్ణి

 

పూసపాటి కృష్ణ సూర్య కుమార్

రామ   =  స్త్రీ,  వజ్రి  =   ఇంద్రుడు   , ఆరామము = తోట,   వృష్టి  = కృష్ణుడు, రట్టడి  = కోపము

 

నేటి  నా పద్య భద్రకము   సమర్పణ

 

ప్రేముతో నిలువ యడ్డుగా

రామనే యనరు బెట్టుగా

దీమతుల్ సలుపు శ్రద్ధగా

భామతీ పనులు చక్కగా

 

దండం దశగుణం భవేత్ గుర్తొచ్చి - ప్రేము – బెత్తం,  భామతీ - ప్రసిద్ధ

 

సతీష్

 

భద్రకం.

 

రాముని స్మరణ తీరదే

భామనీ అలక అందమే

ధీమ తీ దిగులు ఏలనే

ప్రేమలో మునుగు బంధమే.

 

ఉష

 

 

 

తేటగీతి

భామలందున మోహపు భ్రమను వీడి

రామపథమున ధీమంతులై నడచిన

ప్రేమమయమీ జగతియంత; వెతల లోను

నిబ్బరంబున నిలుచు వారబ్బురముగ

 

డా. నాగులపల్లి

 

రామనామముశక్తితో రామబంటు

సీత జాడను గనుటకు సేతు జేరి

భామ ప్రేమను గెలిపించు ధీమ

గాను మాత నెతుకుటే మారుతి మార్గమయ్యె

 

హేమలత

 

 

 

దాశరథి వారి గాలీబ్ గీతాల భావనగా ( దాశరథి వారిని మన్నించి ఆశీసులు అందివ్వమని వేడుకుంటూ) ప్రియుడి ప్రేమను అంగీకరించకుండా ప్రవర్తించు ప్రియురాలు వైఖరి గురించి తరువోజ లో ప్రయత్నం..

 

తరువోజ

 

వల్లమాలిన ప్రేమ ప్రాభవమంత పగ జేసి వొయ్యారి భామ వేధించు

అల్లితెమ్మెర నిచ్చె డభిరామ రమణి యప గపు హృదితో డగ్ని జ్వలించు

వెల్లి విరియు ప్రేమ వెలది దాచుకొని ప్రియుడిని ధీమతి విలపింప జేయు

మల్లె లాంటి మనసు మగువ సొంతమనె మాట నెరుగకనె మాలిమి త్రెంచు

 

అల్లి తెమ్మెర= చల్లగాలి,  అపరాగము= ద్వేషము,  అభిరామ= మనోజ్ఞ

 

వెంకట్.సి హెచ్

 

తేటగీతి లో 

రామ కమది రామ పదము రమ్యముగను ;

భామ ము వలెను భారతావని వెలుగును 

పంచు; ప్రేమ కు పర్యాయ పదము రామ 

ధరణిజల జంట;కురిపించు సిరుల పంట;

ధీమ తులనిల రక్షించు క్షేమముగను.....

 

రామకము = సంతోష పరచునది,  భామము = సూర్య కిరణము,  ధీమతులు = బుద్ధిమంతులు

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

ఏకాకి

 

రాయాలని లేదు కలం కదపాలని లేదు

మనసు విప్పాలని లేదు అంతరంగమంతా శూన్యం

నాదంటూ లేని నిశీధి వీధి లో ఒంటరిని

నాకంటూ తోడు లేని నిశాచరిని

మాటల్లేవు చూసే చూపులు లేవు

వెంటాడే నీడలు లేవు

మోడువారిన ఆలోచనలే తప్ప

మబ్బుతునకలు లేని ఆకాశంలా

ఒయాసిసులు లేని ఎడారిలా

తీరం వెంబడి కబళించే కడలిలా

రాకాసి ఒంటరితనం కు జోల పాడనా

సాంత్వన చేకూర్చే మాటలకు స్వాగతం పలకనా

గమ్యం గూడు కోరుతుంది నడక విశ్రాంతి కోరుతుంది

నాదంటూ లేని ప్రపంచంలో ఏకాకి గా మిగలనా!

పాకే తీగకు పందిరి కావాలి ఎదిగే మొక్కకు ఆసరా కావాలి

నా ఆలోచనలకూ కార్యరంగం కావాలి

 

కోవూరి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...