1, నవంబర్ 2020, ఆదివారం

పుస్తక సమీక్ష 01.11.2020

 *నవంబర్ 1*, ఈ రోజు ప్రముఖ తెలుగు కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి జయంతి.

భావకవిత్వం అంటే గుర్తొచ్చేది కృష్ణశాస్త్రి గారే... 

తెలుగు సాహితీ లోకంలోనే కాదు, కవిత్వం వినగానే మహత్తు, మత్తు, ఒక అందమైన మత్తు మాత్రం కృష్ణశాస్త్రి గారి నేర్పించినదే మన ఆధునిక తెలుఁగు కవులకు      

"జయజయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి"  అని జాతీయ ఔన్నత్యం ఏ మాహాకవికీ తీసిపోని విధంగా చెప్పినా, ఆకులో ఆకునై...అని భావ గీతాలతో అలరించినా, 

_*తారకాపూర్ణచంద్రమార్తాండ బింబమండితమ్ము మహాకాశ మంటపమ్ము*_ అని సమాస భూయిష్టంగా చెప్పినా అది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికే చెల్లు.

***********

నేడు దేవులపల్లి వారి జయంతి సందర్భంగా  దేవులపల్లి వారి అత్యద్భుతమైన భావనా తరంగం ....


_*నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు*_

అనే జాతీయం ఆధారంగా కురిసిన అమృతం.. 🙏


కల విహంగమ పక్షముల తేలియాడి 

తారకామణులలో తారనై మెరసి మాయమయ్యెదను 

నా మధుర గానమున నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు

మొయిలు దోనెలలోన పయనంబొనర్చి మిన్నెల్ల

విహరించి మెరపునై మెరసి పాడుతు చిన్కునై 

పడిపోదు నిలకు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు

తెలిమబ్బు తెరచాటు చెలి చందమామ 

తెలిమబ్బు జతగూడి దోబూచి సరసాలనాడి 

దిగిరాను దిగిరాను దివినుండి భువికి 

నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు


తెలిమబ్బు తెరచాటు చెలి చందమామ 

జతగూడి దోబూచి సరసాలనాడి దిగిరాను దిగిరాను 

దివినుండి భువికి నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ?

శీకరంబులతోడ చిరుమీలతోడ నవమౌక్తికములతో 

నాట్యమ్ములాడి జలధి గర్భమ్ము లోపల మున్గిపోదు 

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ?


పరువెత్తి పరువెత్తి పవనునితోడ తరుశాఖ 

దూరి పత్రములను జేరి ప్రణయ రహస్యాలు 

పల్కుచునుందు; నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ?

అలరుపడంతి జక్కిలిగింత వెట్టి విరిచేడె 

పులకింప సరసను బాడి మరియొక్క ననతోడ 

మంతనంబాడి వేరొక్క సుమకాంత వ్రీడ బోగొట్టి 

క్రొందేనె సోనల గ్రోలి సోలుటకు పూవు పూవునకును 

పోవుచునుందు; నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ?


పక్షినయ్యెద చిన్ని ఋక్షమయ్యెదను 

మధుపమయ్యెద చందమామనయ్యెదను 

మేఘమయ్యెద వింత మెరపునయ్యెదను 

అలరునయ్యెద చిగురాకునయ్యెదను 

పాటనయ్యెద కొండవాగునయ్యెదను 

పవనమయ్యెద వార్ధిభంగమయ్యెదను 


ఏలకో యెప్పుడో యెటులనో గాని 

మాయమయ్యెద నేను మారిపోయెదను. 

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ? 

నా యిచ్ఛయే గాక నా కేటి వెరపు ?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...