6, డిసెంబర్ 2020, ఆదివారం

రాయలసీమ మాండలికాలు

 


🌺రాయలసీమ మాండలికాలు...


అగ్గవ/ అగ్గువ - చవక (ధర తక్కువ)

పిరం / పిరెం - costly

సీల  - మేకు

మచ్చులు - చాలా

పంకీయడం - పట్టించుకోవడం, ఆలనా, పాలనా చూడటం

లయ్య - వగలు ?

తువ్వ - సన్నని ఇసుక ?

జీవాలు - గొఱ్ఱెలు / మేకలు

ఆం - అహం, మొండితనం

దేవర - గ్రామ దేవతల / అమ్మవారి  జాతర

లగు - somersault

చింత పిచ్చలు - చింత పిక్కలు

చెండు - బంతి

చెండు మల్లె / చెండు మల్లి - ముద్దబంతి పువ్వు? 

బెట్ట - అలసట

రేవుకు వెళ్లడం - భర్త చనిపోయిన స్త్రీ ని వితంతువును చేసే ప్రక్రియ

కాంచర కాయలు (కాసర కాయలు) - చిన్న కాకరకాయలు

జమ్మం - Attitude / జోరు / హుషారు ?

ఈపులు - పేను గుడ్లు ?

నడ్జులు - చిన్న పేనులు / పేను పిల్లలు 

సల్లిడ్సడం  - పట్టు విడవడం, lineant గా ఉండటం

వ్యాఖ్య: కరోనా ఉండాదని ఎవర్నీ ఊర్లోకి రానీడం ల్యా.. ఇప్పుడు సల్లిడిచ్చే మళ్లా తెప్పరిల్లుకోలేం

పురుగు మూజ్జూడ్డం- పురుగు కుట్టడం

వ్యాఖ్య: శీను గాడు మడవ కట్టనీకి సేనికి పోతే, ఆడ పురుగు మూజ్జూసినాదంట

తొక్కులాడటం - తొందరపడటం

ఎగుళ్లాడ్డం - ఆడుకోవడం?

పళ్లెం వేసుకోవడం -పర్వదినాల రోజు పిండివంటలు చేసి దేవునికి నైవేద్యంగా పెట్టడం

దుబ్బగా -లావుగా

సల్లాడాం -నిక్కరు?

కటాంజనం -లోహకడ్డీలతో చేసే రక్షణ వాకిలి

దరుమ్ కాడు -పనికిరాడు

గబ్బునూనె -కిరసనాయిలు

సొయ్యం -  పొగరు 

కలకండ - పటిక బెల్లం

బంగపోవడం - బ్రతిమాలడం

అప్పసం - ఎప్పుడూ / ఎల్లవేళలా

పదప్రయోగం : తాళ్ళపాక చిన తిరుమలచార్యులు రాసిన ఈ కీర్తన చూడండి 👇

అప్పని వరప్రసాది అన్నమయ్యా

'అప్పసము' మాకె కలఁ డన్నమయ్యా

బర్ర - బెత్తం

(వాడుక - ఎక్కాలు సెప్పలేదని సారు బర్ర తీస్కొని సావగొట్టాడు)

ఆబువ్వ - వరి అన్నం(ఇప్పుడు దాదాపు వాడుకలో లేదు) 

దబరా - పెద్ద గిన్నె

డేక్షా / డేక్సా - వెడల్పైన పాత్ర

కురాకు - కూర

సైర్పొద్దు - సాయంత్ర్రం / చీకటిపడే వేళ

బేసిమెంక - మూలుగు బొక్క (తెలంగాణలో)

కడ్డీ సియ్యలు - కబాబ్స్ వంటివి

పీర్ల పండగ - మొహర్రం

మచ్చుబండ - అటక

నెత్తురు పొడి - ఒక మాంసాహార వంట(రక్తంతో చేస్తారు)

చేబదులు / బదులు - వడ్డీకి కాకుండా అప్పుగా ఇవ్వడం /స్వల్ప కాలానికి  అరువు

మజ్జు - బద్దకం

నవ్వ - దురద

సరడు - బంగారు పుస్తెల తాడు?

పాలమాల్ - అనారోగ్యం

బరుకు - గోకు, గీరు

పంగు - పని (negative connotation)

శలాకు - అట్లకాడ

గంటే - గరిట

లిక్కి-వ్యవసాయ పనిముట్టు, చిన్న కొడవలి వంటిది-కలుపు, పాదులు తీయడానికి వాడతారు

గడారు- గడ్డపాఱ (వాడుక-గాలికి గడార్లు పోతాంటే ఏకులు నా గతేంగాను అన్నాయంట(ఏకు=దూది ఉండ)

ముగియ్యడం - ముగించడం

(వా. మేము పొయ్యాలకే మట్టసంగా ముగి చ్చినాడు)

పాముకోవడం-తినడం.... 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...