12, డిసెంబర్ 2020, శనివారం

నానీలు 101 - 200 కె మల్లికార్జునరావు

 


నానీలు 2

1

సతి స్నేహమిస్తే సంతస మొస్తుంది

లేక సతి వేధిస్తే తత్త్వం వస్తుంది

2

అరాచకీయం నేటి రాజకీయం

వెన్నుతట్టు పోయే వెన్నుపోటు వచ్చే

3

కష్టాలు నీకు నేస్తాలే , నీలో

దాగిన శక్తులు వెలికి తీస్తాయి.

4

గర్వం తెచ్చు విజయం కన్నా

వినయము నిచ్చు తప్పిదమే మేలు

5

అంతా బిచ్చ గాళ్లే మనుషిని కొందరు

దేవున్ని కొందరు అడుక్కుంటారు

6

కలల బేహారు లెక్కువ ఇక్కడ

ఆశల పూల మాల లమ్ముతారు

 

7

వాదాలుండవు వివాదాలుండవు

తెలుగు తేనెలలో తీపి ప్రేమ తప్ప.

8

పదార్థము లేవీ అక్కర్లేదు , నీ

అహంకారం చాలు పరమాత్మకి.

9

సురుల అమృతం నాకెందుకు,చెలి

అధరామృతం గ్రోలు తుండగ

10

విరామము లేని ప్రేమ నాదైతే

వాడని అందమే నా ధీమా అంది భామ .

 

11

తెలియరో , లోకం దేవుడు

జీవులతో చేసే ప్రయోగశాల అని

12

స్నేహ నిధి నీ చెంత నుండ

సతము హర్షమే నీ మది నిండ

13

నాటి చదువులు సంస్కారమునకు

నేటి చదువులు  సంపాదనలకు

14

కంటిపాప రెప్పలను ప్రశ్నిస్తే

మనిషి దైవాన్ని ప్రశ్నిస్తున్నట్లు

15

పని కోసం దైవాన్ని దేవుని కై  పనినీ

ఉపేక్షించ వద్దు అదే సఫలత

16

విషయాలకు చిక్కావా! బద్దుడివి

విషయాలు నీకు చిక్కాయా! బుద్ధుడివి

17

ఒక కన్ను కాకి రెండు చూపులు

రెండు కళ్ళ మనిషి ఒకటే చూపు

18

మౌనమే నిత్య సంభాషణము

నిరంతర  భాషా ప్రవాహము

19

మనకు దేవుడికి ఎంత దూరం?

స్వల్ప దూరమే "అహం" అంత

20

తీపి నీటి నది ఉప్పునీటి జలధి

కలిసిపోతాయి అదే దాంపత్యం

 

21

ఆత్మ సమర్థన ఆత్మ దూషణ

రెండూ దోషాలే నిగ్రహం కావాలె

22

దుఃఖాల లోయలో వేల ఏళ్లయినా

ఎదురు చూస్తాను సఖీ నీ కోసము

23

సృష్టియే వైవిధ్యం మరి,మన మధ్య

భేదములెందుకు వాదములెందుకు

24

దేవుడా నాకు కోటి స్వరాలివ్వు

నీపై ఉన్న ప్రేమ తెలుపడానికి

25

మళ్లీ మళ్లీ చెప్పడం కాదు నా చాదస్తం

నీ మనసు దృఢం చేయుటే నా లక్ష్యం

26

నడి సంద్రంలో నేను చుట్టూ చీకటి,

ప్రభూ, నీ ప్రేమే చూపు వెలుగు దారి

27

భవిష్యత్తుపై వలదు కలత

నీ ప్రయత్నాలకు అది పెద్ద వ్యథ

28

నింగి నేల లది నిత్య విరహము

పవనుడే వార్తా వహుడు

29

అడిగి పొందునది ప్రేమ కాదు

కానుకగా వచ్చునది ప్రేమ

30

అడుగుతూ వెళ్ళు దారి తెలుస్తుంది

అడుగులేస్తూ వెళ్ళు గమ్యం వస్తుంది

31

బ్రహ్మ రాసెనా మన తలరాత?

మనం రాసుకున్న ఆత్మ కథ అది.

32

శారీరక ప్రేమ జిత్తుల మారి

రూపాల శ్మశానంలో పుడుతుంది

33

సఖీ ఒక్క క్షణం నీ సౌఖ్యం కోసం

నేను నరకంలో ఉండేందుకు సిద్ధం

34

పరమాత్మ నాకిచ్చే ప్రేమకు

లక్షల మార్లు గుండె ఝల్లుమంటుంది

35

దేహమోహం వద్దు విద్యుదయస్కాంత

ప్రవాహాల ఒక చిన్న ముద్ద ఇది

36

తెలుపు నలుపు లనగ నేమి?

వేరు వేరు రెండు ఆలోచనలు

37

"నేను మారలేను నేనింతే" అన్న

వాడే అసలైన ముసలివాడ

38

చేతులు శానిటైజ్ చేస్తే చాలదు

బుద్ధిని శానిటైజ్ చేసి ఉంచాలి

39

నీవు చూసే కళ్ళు నిన్ను చూసే కళ్ళు

మోహాల లోయలు తీసుకో జాగ్రత్తలు

40

మీ సంకల్పం కాంక్షలకు కాదు

దైవం పాదాలకు సమర్పించాలి

41

"అసాధ్యా" లకు పెట్టండి వాత

పెరుగుతుంది మీ సాధన సత్తా

42

సత్సాంగత్యం నీ లక్ష్యానికి

అందించు ఇంధనం పొందించు మార్గం

43

హృదయమొక అద్దుడు కాగితం

అలవాట్లను పీల్చుకుంటుంది

44

డబ్బు బహు రూపి పేదకు జీవనం

లోభికి శాపం దానపరుడికి వరం

45

ఆత్మానందాన్ని అక్షరాలుగ మార్చు

నదే సత్యమైన కవితా సృష్టి

46

పేర్చిన సొత్తు మనిషి దోచు, ఐనా

 బుద్ధి మారదు  భ్రమరమునకు

47

తీక్షణమున చూడకు ప్రియా,

క్షణం నీ శీతల వీక్షణము చాలు

48

అధరాలపై ఆధారపడకు

ఆధార చక్రము నాశ్రయించుము

49

పూల గుండెల నర్థం చేసుకున్న,

పరమార్థము దొరుకు నన్న

50

ప్రేమ బంగరు బేడీలైతే, పగ

ఇనుప బేడీలు, రెండూ పాశాలే

51

అద్దమెన్నడు ముడత పడదు

జ్ఞానమెన్నడు పాత పడదు

52

గృహస్తులనగ గుప్త యోగులు

సన్యాసులనగ వ్యక్త యోగులు

53

సౌందర్య స్త్రీ ఇచ్చు ఆనందం

ఆకలి ముందు అతి కనిష్ఠం

54

శేషతల్పంపై దీర్ఘ నిద్ర నున్నావు

మాకై ఎన్నిమార్లు అవతరించి నావో

55

ఆస్తి ఉంటే కాడు ధనికుడు

ఆశ లేకుంటే వాడు ధనికుడు

56

దైవ సన్నిధి కోరి వికసించే పూలు

నేల రాలి ఏడ్చు అమ్మ ఒడి చేరి

57

శివుని కరుణ అవధి లేనిది

మన కోర్కెయే మిత మైనది

58

అన్నీ పట్టుకునే కెమెరాలా ఉండకు

దేన్నీ పట్టుకోని అద్దంలా ఉండు

59

తీర్థ యాత్ర లేల ముక్కంటి కొరకు

మదిలోని శివుని చూడరెందుకు?

60

కాసులకుపదేశ కాలమాయే

శివ తత్వంబు ఏమి చెప్పనాయే.

61

విషం మింగు వాడు నిర్దయుడు కాడు

నిజ భక్తిన వేడ వరాలిచ్చు వాడు

62

విత్తు చేత చెట్టు వెలసిన రీతి

కర్మ చేత కల్గు పరి పరి జన్మ

63

దాసోహం అన్నా శివోహం అన్నా

దారులేమొ రెండు గమ్యము ఒకటే

 

64

గుడిలో విగ్రహం చెప్పున  దేమని?

తన వలె నిగ్రహం తనరించుమని

65

నేల రాయి ఐనామెల్లగ నడువరో

ఎవరో అహల్య వుండదా మరి

66

దుఃఖం సుఖమౌ విషమమృతమౌ

ఆ భగవానుడు దయ జూపిన

67

నేల,నీరు,నిప్పు, గాలుల నమ్మితివి!

తోటి వారి నేల నమ్మ వైతివి?

68

గుట్టుగా చిక్కులు, బయలుగ దారులు,

కల్పించు వాడు, నేటి నాయకుడు.

69

కాకి నందురు నీచ పక్షి అని

శ్రాద్ధమున దానికే మర్యాద నిత్తురు

 

70

శ్వాసపై ఉంచుము ధృఢ విశ్వాసం,

విశ్వంతో అదే నీ అనుసంధానం

71

మంత్రాలకు రాలవు చింతకాయలు

కానీ, లంచాలకు రాలు ఉద్యోగాలు

73

విష్ణుమూర్తి ఎత్తు అవతారాలు పెక్కు

ప్రియ భూదేవి బాధ మాపుటకు

74

అచంచలుడా! చంచల యని

లక్ష్మిని వక్షాన ఖైదు చేసితివా?

75

జీవిత సత్యం తెలియగ సూక్ష్మం

బోధకు వలయు అక్షర కదంబం

76

మట్టిని గట్టిగ తొక్కకు మిత్రమా

పుణ్యాత్ములిట కలిసి పోయిరి సుమా

77

చావు పుట్టుకలు మన మెరుగము

మేలు బ్రతుకే ఇట కర్తవ్యము

78

చెలీ, ఏ స్వర్గమూ వలదు నాకు

నీ కౌగిలి నందు స్వాంతన చాలు

79

కోరికలే నీ అభిసారికలు

వలచితివా శోకపు తుఫానులు

80

చెలీ, నవ్వుటకొక నిముషమాగుము

ముత్యా లేరుటకు చేలము తెత్తును

81

కోరి పుణ్యము, సాయం చేసిన,

దయ కాదది వ్యవహారము

82

చచ్చిన వారికై శోకించుట వమ్ము

బతికే వారిని ప్రేమించుట నమ్ము

83

కాలం బహు వేగం ఆయుష్షతి స్వల్పం

చూపుము వివేకం ఆస్వాదించు జీవితం

84

గంజాయి విత్తితే ఆ మొక్కే పెరుగు

తులసి మొక్క ఎలా ఎదుగు?

85

ప్రతి బాధ ఒక పాఠం చెప్తుంది

ప్రతి పాఠమొక మార్పు తెస్తుంది

86

నేర్చుకోవడం మనం ఆపద్దు

మనకు నేర్పటం జీవిత మ్మాపదు

87

బతుకు నేర్పును విద్యను వింతగ,

పరీక్షలు తొలుత పాఠాలు పిదప

88

హరిహరులకు ప్రియము కార్తీకము

మాసములందిది అతి పవిత్రము

89

చేతుల శుద్ది తో రాదు కరోనా

మనసు శుద్ధి తో రాదు ఏ "రోనా"

90

బద్ధకం వద్దు ఆరాటం వద్దు

రేపటి కై కలత లేకున్న ముద్దు

91

ఈ లోకము తుది లేని రైలు బండి,

జీవు లెల్ల భిన్న గమ్య యాత్రికులు

92

ఈ లోక మొక రంగస్థలము

మనమందలి నటీ నటులము

93

మాయ లో బ్రతుకు

మనిషి , దేవుని కొక రూపమిచ్చి ,

తనూ మాయ జేసె

94.

ప్రియమైనది ఎలుగెత్తి చెప్పు

అప్రియమైనది గుట్టుగా చెప్పు

95

బాహ్య నేత్రాలకు వెలుగునీడ లుండు

అంతర్ నేత్రాలకు సదా వెలుగుండు

96

ప్రతి ఒక్కరం ఒక ప్రత్యేకం

పోల్చి చూడడం మిక్కిలి వ్యర్థం

97

అన్ని శరములకు మిన్నగ నెగడు

అనంగు ఆరో అస్త్రం స్త్రీ క్రీగంటి చూపు

98

పంచ భూతాలు పంచ పాండవులు

ఓర్పు కింకో పేరు, కోపిస్తే ప్రళయాలు

99

గాయమొనర్చుకు కావలె బలిమి

మది గెలుచుకు చాలును చెలిమి

100

శివుడే ఇస్తే వర్షంలా పోస్తాడు

నీటి బొట్లు అడిగి మూర్ఖు కాబోకు

 

CA కె మల్లికార్జునరావు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...