ప్రహేళిక సంఖ్య -37 సమాధానాలు
ది.13.12.2020 ఆదివారం
తెలుగు కవులు - రచనలు - బిరుదులు
***********
1. కరుణ రస ప్రధానంగా రచనలు చేసి అదే అతని పేరుగా కలిగిన కవి పూర్తి పేరు ఏమిటి? అతని ప్రసిద్ధ ఖండ కావ్యం ఏమిటి?
జ:
జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, అతని రచించిన ప్రసిద్ధ ఖండ కావ్యం పుష్ప విలాపం,...ఉదయశ్రీ, విజయశ్రీ, , కరుణా శ్రీ , ఇతర రచనలు*
2. మహాత్మాగాంధీ తారావళీ ని రచించిన కవి ఎవరు? అతని బిరుదు ఏమిటి?
జ:
తుమ్మల సీతారామ మూర్తి అతని బిరుదు అభినవ తిక్కన, తెలుగు లెంక
3.పిల్లవాడిని కావ్య నాయకుడిగా చేసుకొని అనేక రచనలు చేసిన కవి, స్వాతంత్ర్య సమర యోధుడు ఎవరు? అతని బిరుదు ఏమిటి?
జ:
నాళం కృష్ణారావు గారు పిల్లవాడిని కావ్య నాయకుడిగా చేసుకొని రచనలు చేశారు.
అతని బిరుదులు బాల సాహిత్య బ్రహ్మ, మధురకవి
4. తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన కవి శేఖర బిరుదాంకితుడు ఎవరు? ఆయన వ్రాసిన ప్రఖ్యాత వ్యాసాలు ఏమిటి?
జ:
పానుగంటి లక్ష్మీనరసింహారావు
సాక్షి వ్యాసాలతో ప్రసిద్ధి పొందారు
5. 1956 సంవత్సరంలో రిపబ్లిక్ దినోత్సవం నాడు జరిగిన జాతీయ కవి సమ్మేళానికి ఆహ్వానింపబడి సన్మానం పొందిన తెలుగు కవి ఎవరు? అతని బిరుదు ఏమిటి?
జ:
పువ్వాడ శేషగిరిరావు గారు
అతని బిరుదు కవి పాదుషా
6.ఆంధ్ర పురాణము, ఆంధ్ర రచయితలు రచన లు చేసిన అచ్చ తెలుగు కవి ఎవరు? అతని బిరుదు లేమి?
జ.
మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి
ఇతని బిరుదులు ఆంధ్ర కల్హణ, సాహిత్య సమ్రాట్, కళా ప్రపూర్ణ
7. కుటుంబ జీవితంలోని కష్టసుఖాలు, దాంపత్య జీవితంలోని సౌందర్యం కూర్చి తన హాస్య కథలు వ్రాసిన హాస్యవిష్ణు బిరుదాంకితుడు ఎవరు? ఆ కథల సంపుటి పేరు ఏమిటి?
జ:
ముని మాణిక్యం నరసింహారావు గారు
కాంతం కథలు
8.విద్వత్కవయిత్రి
ఆంధ్ర విదుషీకుమారి బిరుదాంకితు లైన కవయిత్రి ఎవరు? ఆమె రచించిన కథా సంకలనం పేరేమిటి?
జ:
ఊటుకూరి లక్ష్మికాంతమ్మ
కథా మందారం
9. వచన రామాయణము, వచన భారతం, వచన భాగవతం వ్రాసిన కవయిత్రి ఎవరు? ఈవిడ ఎవరి కుమార్తె?
జ:
కల్లూరి విశాలక్ష్మమ్మ
శ్రీపాద కృష్ణమూర్తి గారి జ్యేష్ట పుత్రిక
10. "ముత్యాలు నీళ్ళిసుకుంది", "మాయని పున్నమి" కథల సంపుటి లను రచించిన సోదరీమణులు ఎవరు? వారి ప్రత్యేకత ఏమిటి?
జ:
సత్యవాడ సోదరీమణులు, సత్యవాడ రఘునాతమ్మ, సత్యవాడ సూర్యకుమారి. జమీందారి కుటుంబంలో పుట్టి బహుముఖ ప్రజ్ఞావంతులైన వీరు అంధులు. స్కూల్ చదువులు చదవక పోయిన, బ్రైయిలీ లిపి తెలియకపోయిన, వారు, రేడియోవినడం ద్వారా, సంగీత సాహిత్యాలలో ప్రజ్ఞ సంపాదించారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి