14, డిసెంబర్ 2020, సోమవారం

దత్తపది - 62 “ ఆశ - ఈశ - కాశి – క్లేశ “ 14.12.2020, సోమవారము

 


14.12.2020, సోమవారము

దత్తపది : ఆశ - ఈశ - కాశి  క్లేశ

 

కాశి వాస నీ దరిజేర కలదు యాశ.

లోక యాత్రల క్లేశంబు లోన మునిగి.

మరచితిని నీ స్మరణమును మంద మతిని

ఈశ దిశచూపి కాపాడు యిందు మౌళి

సూరే వెంకటప్పయ్య

 

 

వచన కవిత,

క్లే ము లవలేశము ఉంచక,

ఆశల  ఊబిలో కురుకుపోక,

ఈశ యని నిరతము తలచిన,

కాశీ ఇక ఏల పోవలె, గంగనేల మునగవలె ...

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

 

 

ఉత్పలమాల...1

కాశినడుంగిడన్ శుభము గంగనుతానములాచరింపగన్

ఈశుడు నమ్మలన్ ముదము ఋక్కుల పూజలు భక్తిభావమున్

క్లేశము పాపముల్ విడువ నీశ్వరు భక్తిగ జేయు యఙ్ఞముల్

కాశిన  విశ్వనాథునికి, గౌరికి మొక్కెద  పుణ్య కార్యమై.....

 

ఉత్పలమాల...2

ఆశలెన్నొ యుండి కాశికి పోవగా

ఈశ్వరుండు  దీర్చు  క్లేశమంత

విశ్వనాథ మహిమ విశ్వమంతయుగాచు

కాశి నొక్క సారి జూసి రమ్ము...

 

పి.ఎల్.నాగేశ్వరరావు

 

 

ఆశ గలదు మది లోన నాకు

ఈశా! నీదరి చేర వలెనని

క్లేశములను బాపి నీవున్న

కాశీకి నాకు మార్గము సులువు చేయ వయ్య

జూష నిజామాబాద్

 

 

శా ll

ఆశాపాశ వినాశమున్ గలుఁగు క్లేశాపూర్ణ మోహమ్ములన్

నాశమ్మున్ కలుగంగ జేయ ఘనమౌ నానాత్వ చైతన్యమున్

కాశీక్షేత్రము దివ్యమై మహిమతో  కాలుష్యమున్ బాపఁగన్ 

సౌశీల్యాది ప్రమోదమాన సిరులే సౌహార్దమౌ శంకరా !

కస్తూరి శివశంకర్

 

 

గాలి మేడలు

కాశి నాధుని మనసారా పూజింపక

ఈశ నిండుగా ఉండవలెనని

ఆశలు మెండుగా పెంచుకొని

క్లేశములతో సతమత మగుదురు

పెక్కురు హర హరా !

 

తల బొప్పి

కసి కి కాశీ కి తేడా తెలీక

తికమక పడుతూ నేర్చుకోడు

పాఠం చదవరా అంటే

చదివి బాగానే పేరు తెస్తాలే

నీకే క్లేశములు వలదు

ఈశ పై బాగా ఆశలు పెంచుకో

చదువుకొని బాగానే సంపాదిస్తాలే అంటూ

రోజులు గడుపుతున్నాడు నా బిడ్డ .

 

జి మురళీ మోహన్ రావు

 

 

 

తే. గీ.

ఈశలందుననంతమౌ యాశలుండి

క్లేశరహితమదికయి లోకేశుఁ గోరి

కాశి కన్యాకుమారిలఁ గలియ తిరుగ

లేశమయిన దీరదయ దురాశ నీది

డా. నాగులపల్లి

ఆశ దీపశిఖలనర్పించు భక్తితో

హిమగిరీశ పద మహిమనుదల్చి

కాశివిశ్వనాథు కరుణమ్ము లభియించ

క్లేశపథము కూలి కీర్తిగల్గు!

రాంమోహన్ నిజామాబాద్

 

 

 

ఆశతీర అభిషేకింతు ఈశుని కాశీ గంగతో

కృపకలుగు నృపుని సన్నుతించ భక్తితో

భోలేనాథుని కైమోడ్చి వేడినన్ ముదముతో

క్లేశము హరించి మోక్షమిచ్చు గౌరీ సఖునితో

విష్ణుప్రియ

 

 

 

తేటగీతి

కాశి యాత్రకు బోవఁగ కాంక్ష గుండి

హరుని గాంచుట యనునది ఆశ గున్న

గాను / భవబంధ క్లేశము గలిగి యుండి

ఈశ నామము మదిలోనె ఎంచుకొంటి.

హేమలత

 

ఉత్సుకము

ఆశలు పెంచును మోహముల్ !!

ఈశుని మార్గము వీడితే

కాశియె మోక్షము నిచ్చునా ?

క్లేశము పెంచును దుఃఖముల్

రమ, కంకిపాడు

 

 

 

రేతిరంత మిత్రుని కొరకున్ ఆశం సనముగ

ఎదురు చూసి ఎదురు చూసి మనమున

క్లేశ ము ననుభవించ, కమల కుసుమముల్

ఈశా న దిశ కాశి ఉదయంచంగ ముదము

వదనమున బాసిల్ల వికసించె సంతృప్తిగన్.

కాశి = సూర్యుడు

CA కె మల్లికార్జునరావు

 

 

 

ఉ.మా

కాశిక పట్టణాన నిను గాంచగ  కేవల లింగరూపమున్

ఆశయు పాశముల్నణచి యార్తిగ బిల్చిన బల్కువా శివా!

క్లేశములేల నీ కరుణ లేశము జాలును భోళశంకరా!

ఈశను కోరకన్ నిరతమించుక తత్వ మెరుంగ భాగ్యమౌ

వాణిశ్రీ నైనాల

 

కందము

ఆశలు వీడంగ తగదు

నీశా యని పిలిచినంత నిహమున మనకున్

కాశీ నాథుడు తోడై

క్లేసములిలనేవి మనకు లేవని బల్కున్!!

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

 

 

 

కందము

ఆశకు హద్దులు లేవని

ఈశ! తెలియగల విధంబులిహ లోకమునన్

కాశికి పోవు సమయమున్

క్లేశము తలబెట్టి జనుల కెరిగించెదవే!

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి




సీసము

ఈసునసూయలే యినుమడించగ నీశ! పెంపగు క్లేశముల్ పీచమడచు

యాశలు మెండై దురాశ,నిరాశల నడుమనూగకనెమ్మి పొడము తెంచ

కాశికా వాసుడా కైవల్యపదముపొందగ. నీకడకుజేరి దయనుచూప

గానిను ప్రార్థింతు కామారి!ముక్కంటి! వెలుగుదారుల జూపు విశ్వనాథ!

 

 నిన్ను చూడ నాశ విరిసె నీలకంఠ!

క్లేశములు నాశమొనరింపు గిబ్బరౌతు!

కాశికాపుర వాసుడా! కల్మషమ్ము

తొలగ జేయుము ఈశాన!తోలు దాల్పు!

అవళూరు సీత 


 

తే.గీ.

గంపెడంతయాశ మదిని గంగపొంగు/

బోలి నిండగ గౌరీశ బ్రోవుమనుచు/

కాశికాపురి నా క్లేశ నాశిని యను/

చు కడు సంతసమున నేగ శుభము గల్గె/

వారణాశి శ్రీలేఖ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...