4, డిసెంబర్ 2020, శుక్రవారం

 



ప్రహేళిక సంఖ్య - 34

29.11.2020


తెలుగు కవులు - రచనలు - బిరుదులు

****

1. కుమార భారతి అనే బిరుదు ఏ కవికి ఉన్నది? అతను రచించిన ఒక కావ్యం పేరు తెలుపండి?

జ:

వికటకవిగా, హాస్యకవిగా పేరొందిన తెనాలి రామకృష్ణుడుకు కుమార భారతి అని బిరుదు ఉంది. ఈ కవి రచించిన కావ్యాలు పాండురంగ మహాత్మ్యము,ఉద్భటారాధ్య చరిత్ర,ఘటికాచల మహాత్మ్యము హరవిలాసము అలభ్యం.


2. భారత, రామాయణ కథలకు భావాన్ని అన్వయించుకునెలా కావ్యం రచించిన కవి ఎవరు? ఆ కావ్యం పేరేమిటి?

జ:

పింగళి సూరన్న రాఘవపాండవీయము అనే ఒక అత్యధ్భుతమైన శ్లేష కావ్యాన్ని రచించాడు. ఈ కావ్యంలో ఉన్న ప్రతి ఒక పద్యాన్ని రామాయణంలోని కథకూ, భారత ఇతిహాసములోని కథకూ ఒకేసారి అన్వయించుకోవచ్చు.


3. శ్లేష కవితా చక్రవర్తి గా పేరు గాంచిన కవి ఎవరు? అతని రచన ఒకటి తెలుపండి?

జ:

అష్టదిగ్గజాలలో ఒకరైన రామరాజ భూషణుడు(భట్టుమూర్తి)కు శ్లేష కవితా చక్రవర్తి గా పేరు. ఇతని రచనలు , వసుచరిత్రము, హరిశ్చంద్ర నలోపాఖ్యానము, కావ్యాలంకారసంగ్రహము


4. దశకుమార చరిత్ర కు తెలుగు పద్యానువాదము చేసిన కవి ఎవరు? అతని బిరుదు ఏమి?

జ:

మూలఘటిక కేతన సంస్కృతంలో మహాకవి దండి వ్రాసిన వచన రచన "దశకుమార చరిత్ర"కు తెలుగు పద్యానువాదం చేశారు. ఇందులో పది మంది యువకుల సాహస, ప్రేమ గాధలను కవి చక్కనైన పద్యాలలో వర్ణించాడు.  ఇతని బిరుదు అభినవ దండి


5. యజ్ఞం చేసి సోమయాజి గా పేరొందిన కవి ఎవరు? అతని బిరుదు ఏమి?

జ: 

యజ్ఞం పూర్తి చేసిన తరువాత తిక్కన సోమయాజిగా మారి మహాభారత రచనకు ఉపక్రమించారు.

తిక్కన కున్న బిరుదులు కవి బ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు


6. కమలాసన బిరుదాంకితుడు ఎవరు? ఆయన రచించిన ప్రఖ్యాత శతకము పేరేమిటి?

జ:

కమలాసన, కవిబ్రహ్మ అని బిరుదులు కలిగిన బద్దెన సుమతీ శతకము రచించారు


7. శివకవి యుగానికి చెందిన ముగ్గురు కవుల పేర్లేంటి? వారిని ఏమని పిలుస్తారు?

జ:

నన్నెచోడుడు,పాల్కురికి సోమనాధుడు, మల్లికార్జున పండితారాధ్యుడు 

వీరిని  శివకవిత్రయం అంటారు.


8. మొదటి తెలుగు వాగ్గేయకారుని గా పేరొందిన కవి ఎవరు? అతని బిరుదు లేమిటి?

జ:

తెలుగు సాహితీ చరిత్రలో మొదటి వాగ్గేయ కారునిగా పేరొందినది తాళ్ళపాక అన్నమాచార్యులు. ఇతనికి పదకవితా పితామహుడు అని బిరుదు ఉంది.

  

9. అభినవ వాగనుశాసనుడు బిరుదును పొందిన కవి ఎవరు? అతను రచించిన ప్రఖ్యాత శతకము పేరేమిటి?

జ:

కూచిమంచి తిమ్మకవి కి అభినవ వాగనుశాసనుడు, కవి సార్వభౌమ అనే బిరుదులు ఉన్నాయి. ఇతను వ్రాసిన ప్రఖ్యాత శతకము సీస పద్య ఛందస్సు తో కూడిన కుక్కుటేశ్వర శతకము


గమనిక: గిడుగు వేంకట రామ్మూర్తి కు కూడా అభినవ వాగనుశాసనుడు బిరుదు ఉన్నప్పటికీ గిడుగు వారు ప్రఖ్యాత శతకము రచించలేదు.


10. సాహిత్య విద్యా విశారద బిరుదాంకితులైన కవయిత్రి ఎవరు? ఆమె 

రచించిన ప్రఖ్యాత ప్రబంధ కావ్యం పేరేమిటి?

జ: 

సాహిత్య విద్యా విశారద బిరుదు గల కవయిత్రి ముద్దు పళని

ముద్దుపళని రాసిన రాధికా సాంత్వనము ఒక గొప్ప శృంగార ప్రబంధ కావ్యము

గమనిక

 

10 వ ప్రశ్న సాహిత్య విద్యా విశారద అని ఇవ్వవలసినది కానీ టంకణ దోషముతో  సాహిత్య కవితా విశారద గా ఇచ్చాను..

కావున ఈ ప్రశ్నకు అందరికీ మార్కులు ఇవ్వడం జరిగింది

పొరపాటు కు క్షంతవ్యుడిని


వెంకట్.సి హెచ్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...