తెలుగు తేనియల్ చిందించు మిత్రబృందానికి నా నమస్సులు.
మా చదువుల బడి
ఒక మమతల ఒడి
ఆ హాస్యపు "మడి" లో
మా నవ్వుల అలజడి "సాగుబడి"
ఈ సన్ డే..సందడే సందడి.
ఏంటీ..నవ్వుల జడి(వాన)
అంటున్నాడు.. వీడికి అంత కాన్ఫిడెన్సా అనుకుని నవ్వుకుంటున్నారు కదూ !
ఐతే..మీతో ఓ ఛాలెంజ్ అండీ... మీరు,నా ఈ ప్రేలాపన చదివి ముగించేలోపు, మిమ్మల్ని హీనపక్షం ఒక్కసారైనా నవ్విస్తానని నా ఛాలెంజ్ !
మరి రెడీయేనా మీరు.. పెదాలు బిగబట్టుకుని ?
ఒక ఉపోద్ఘాతం...
ఆది 1982-83... నేను, B.Sc (Ag).. బాపట్ల అగ్రికల్చరల్ కాలేజ్ లో చదువుకునే రోజులవి.ఆ టైమ్ లో మా సీనియర్ ఒకరు.. శ్రీపాద శ్రీనివాస్(శ్రీ శ్రీ) అని, మీ కాకినాడ ప్రోడక్టే ..సరదాగా మొదలు పెట్టారు మా కాలేజ్ లో, హాస్టళ్లలోనూ.. ఓ సరికొత్త జోకుల ప్రహసనం... బయట అప్పటికే కాస్తో కూస్తో ఉందేమో గానీ.. మాకు మాత్రం క్రొత్తే అనిపించేది మొదట్లో. ఆ తరువాతే తెలిసింది ఆ నవ్వుల జాడ్యం కొరోనా లాగా,ఒక ఫేద్ద అంటురోగంగా విశ్వరూపం దాల్చబోతోందని...
నేను,ఇక ఆ వైవిధ్యభరిత హాస్యరస విధానానికి, ఇతోధికంగా మెరుగులు దిద్దుతూ.. అదే పంధాలో రోజూ కొన్ని సరికొత్తవి సృష్టిస్తూ, మా సహాధ్యాయుల మీద, సీనియర్స్, జూనియర్స్ మీదా ప్రయోగిస్తూ.. నవ్విస్తుండేవాణ్ని.. వీరతాళ్ళు వేయించుకుంటూ ఉండేవాణ్ని.. నాకు, అందులో.. పిహెచ్ ఢీ పట్టం కూడా కట్టారు మావాళ్ళు. ప్చ్.. ఆ కాలేజీ.. హాస్టల్ రోజులే వేరు...
ఇక, నా ఆ హాస్యప్రక్రియకి,నేను పెట్టుకుని, రిజిస్టర్ చేయించుకున్న నామము... పదప్రతిక్షేపజనితహాస్యతరంగిణీసంవిధానం దానిని ముద్దుగా, సింపుల్ గా ఇంగ్లీష్ లో Word Substitution Jokology అని పిలుచుకునే వాణ్ణి.
ఇంతకీ, ఈ ప్రక్రియకి ముడిసరుకు, మరి కావలసిన నేర్పు ఇవే:
1)ఏ పదానికయినా.. కాస్త చుట్టరికం ఉన్న.. లేకపోతే పూర్తి వ్యతిరేకార్థం ఉన్న అదే భాష పదాలని వెదికి పట్టుకుని, రెడీగా పెట్టుకుని, SUBSTITUTE చేసి, instantaneous గా ఎదుటివాడి మీద సంధించగలగడం.
2)ఒక భాష పదాల స్థానంలో ..వేరే భాష పదాలని ప్రతిక్షేపించి ఒదలగలగడం.
3)పూర్తి phrase నే/వాక్యాన్నే /సామెతనే వేరే భాషలోకి as it is గా తర్జుమా చేసి, ప్రయోగించ గలగడం.
4)అలా substitute పదాలని ప్రయోగించి..ఎదుటివాడు, అర్థమవ్వక బుఱ్ఱ గోక్కున్నా, గోక్కోక పోయినా... వెనువేంఠనే "సారీ!" అనేసి, నాలుక కరుచుకున్నట్టు హావభావం ప్రకటించి, ఆ ఒరిజినల్ పదాన్ని పలికేయడం.. ప్రతివాది దూషణ భూషణతిరస్కారాలకి, బ్రూస్ లీ పొజిషన్ ఫోజ్ లోకొచ్చేసి, రెడీ అయిపోగలగడం.. అంతే.. సింపుల్.
"ఒరేయ్ ! నీ కుళ్ళు జోకులూ.. నువ్వూనూ.. దగ్గరికి వచ్చావంటే ఘాఠిఘా కొఠెస్థాం!" అనేవాళ్ళు గానీ నా ఫ్రెండ్స్ #...నా జోక్ వాళ్ళ కర్ణరంధ్రాలలోకి దూరీదూరగానే, వాళ్లలో కలిగే ఆ అసంకల్పిత ప్రతీకారచర్యలు.. పెదాలు అనే పదార్థాలు. ఇటునించటు.. అటునించిటూ.. ఆఆఆఆకర్ణాంతమూమూమూ సాగిపోవడం... ఒకచో నవ్వుదెబ్బకి వాళ్ళ కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లడం.. కొండొకచో (కడుపు) చెక్కలవ్వడంవల్ల వచ్చి, బహిర్గతమయ్యే కడుపునొప్పి... వాళ్ళ కళ్ళలో దోబూచులాడే ప్రశంస.. లాంటి వికారాలు చూసి,నిజెమ్ చెప్పొద్దూ... నాకు నేనే భుజం తట్టేసుకుని, బాసూ..సెబాసూ అనేసుకుని నవ్వేసుకునేవాణ్ని....
(ఆ మధ్య ఈ టైపు జోక్స్, శ్రీ లక్ష్మి, అల్లరి నరేష్, చిరంజీవుల కొన్ని వేరు వేరు సినిమాలలో వచ్చాయి కూడా... బస్సు మబ్బులు ;ఆకలికి కడుపులో కుక్కలు పరిగెడు తున్నాయి;in front, there is crocodile festival లాంటివి).
# నా స్నేహితులు... Victory Son, Victory Sun, Crownయి, Educational Ocean,Infinite Not Come, Happy Not Come,Jasmine Father, Small Father, Waiting Not Come, Good Line, Good Birth,Victory Wealth, Lotus Vine, Lotus Goఆ, Actor 'Princess', Mountain 'Princess', Truth Dearఅ, Service etc...
ఇంత చెప్పినా మీకు పూర్తి అవగాహన రాలేదనుకుంటా ! సరే...ఇక అసలు విషయంలోకి దిగుతాను మరి..
నా ఫ్రెండ్స్ నామధేయాలు అవి.. వరుసగా.....
విజయకుమార్, విజయభాస్కర్, కిరీటి,విద్యాసాగర్, అఖండ "రావు",ఆనంద రావు, మల్లి బాబు, బుల్లి బాబు, నిరీక్షణ రావు,సురేఖ, సుజాత, విజయలక్ష్మి, పద్మలత, పద్మ జా, నట రాజకుమారి, నగ రాజకుమారి, సత్య ప్రియ, సుష్రూష అన్నమాట.
ఇక అస్సలు అస్సలు విషయం....
తెలుగు పదాలు, ఇంగ్లీష్ పదాలు,phrases, ఇంకా లోకోక్తులని, సామెతలనీ .. వెరైటీ కోసం, ఏప్రిల్, ఏప్రిల్..సారీ... సారీ... మార్చి, మార్చి.. డైలాగ్ లుగా.. సిట్యువేషన్ లు లాగా... ...ఇలా..పంచుకుంటాను.
(Crispness పోతుందని... చాలా చోట్ల వివరించడం లేదు... గమనించ ప్రార్థన)
***********
నా స్నేహితుడు(ఇకపై..కిరీటి):
ఏరా...ఏంటీ...ఆ సీసాలని ఫాదరే శావ్ *?
నేను: ఏం లేదురా! వాటిని మదరే ద్దామనీ # !!
(వాడి * నానేశావ్ ? అనే కొశ్న కి ....నా సమాధానం..
# అమ్మేద్దాం..అనీ)😃
***********
మార్గశిర మాసం, ఇంకా పైగా ధనుర్మాసం కదా.. అని, మా కిరీటికి నా గీతోపదేశం:
"వత్సా ! Don' t beat medicine in this month.
It is Way Head Month ! పైగా Bow Month also !!"
కిరీటి : Your Face ! సారీ.. నీ మొహం.. Your Head ఏమ్ కాదూ
Seven చిచావు... సారీ.. ఏడిచి చావవోయ్ !
***********
కిరీటి :
ఏంటీ.. ఎప్పుడూ లేంది.. You are writing Oil to head ?
నేను:
ఏం లేదురా.. రాత్రి రెండో ఝాము వరకూ dog handle కొట్టి.. సారీ... కుక్క పిడి కొట్టీ,కొట్టీ...అబ్బా.. మోకాలు.. సారీ.. తల.. వేడెక్కి పోయిందిరా.. దాన్ని పెరుగు పరుద్దామని... సారీ... చల్ల పరుద్దామనీ.. నూనె writing. అంతే...
వీరబట్టీయాన్ని మా ఏజీ కాలేజ్ పరిభాషలో కుక్కపిడి అంటాం లెండి !!😃
***********
కిరీటి:
ఏంటీ ఈ విషాద ఛాయలు ?
నేను:
చెప్పాను గదరా... రాత్రంతా చదివేడ్చినా.. ఒక్కటీ పరీక్షలో రాలేదురా.. నా శ్రమంతా.. Ash లో పోసిన పWater అయ్యిందిరా.
***********
కిరీటి:
నాకు నీనించి ఒకటి కావాలి.. మరి. మరీ..
నేను:
నీ Face-Word-మ్ ఏడ్చినట్లే ఉంది.. Shoe-7వు...చెప్పరా సూటిగా...ఫరవాలేదు.
(అన్నాను నేను చెప్పు (shoe)చూపిస్తూ...
అప్పుడు కిరీటి.. చెప్పలేక..చెప్పలేక మొహమాటమ్ గా ఇలా రాసి చూబించాడు..
"6ద్ర 7పు అనే కవిత లున్న పుస్తకం కావాలిరా... ఈ రోజు 6ద్ర పుట్టిన రోజు కదా.. సాయంత్రం సాహిత్య సభ ఉంది..నేనూ ఒక వక్తని మరి ! కానీ.. ఏమి మాట్లాడాలో పెరుగు బోవడం లేదురా...సారీ.. అదే పాలు బోవడం లేదు రా. "
నేను:
ఓహ్.. shoeవే మరీ.. I will also buy milk in that evening meeting and give courage to you .. సారీ...నేనూ పాలు గొంటాను.. 😃
కిరీటి:
ఏంటిరా నీ ఉర్రాష్ట్రం.. సారీ.. ఉద్దేశం ?
నువ్వు పక్కన లేకపోతే నాకేం భయ్యమా ?
నేను:
అవున్లే.. నీకేం భయ్యం ! నువ్వు గేదెలిస్తే... సారీ అవులిస్తే... పేగులు లెక్కెట్టగల ఘనాపాటివని నాకు తెలియదా ఏం !!
***********
కాళీసమయం అని...మీ, మా,వీళ్ళ పని మనుషులందరూ వేణుగోపాలస్వామి గుడి దగ్గరున్న రావిచెట్టు కిందున్న అరుగు మీదకి చేరి... మన ఇళ్ళ గుఱించే shoe buying... సారీ అండీ... చెప్పుకొంటున్నారు.
"అమ్మ"గారూ"! అంట్లు తోమాలి!చింతపండేయ్!! అని భక్తితో కూడిన చనువుతో,
మిమ్మల్ని గౌరవంగా, ఆప్యాయంగా, అన్ని వచనాలూ కలిపేసి పిలిచే మీ Plates; మీ ఎదురింటి Big Brother-Boon అదే.. Cooked Rice-Boon;ఎదురు పక్కింటి Parrot Mother;
పక్క వాళ్ళ Golden Hill పెళ్ళాం.. పేరెంటీ.. గుర్తు రావడం లేదు... ఆమె;ఇంకొకళ్ళ Snake Gem;
ఆ పక్కవాళ్ళ Tamarind Money...అక్కడున్నారు..
అదేనండీ, మీ, మా పళ్ళాలు, అన్నారం,చిలకమ్మ ఏడు కొండలు పెళ్ళాం,నాగరత్నం,చింతామణీనూ
***********
ఇక డైవర్లు.... Bajraa Seven Hills; Goatల Broken Rice King; Golden Mother; Temple Steps Golden King.... బస్ స్టాండ్ దగ్గరుండే మర్రిచెట్టు చప్టా మీదకి జేరిపోయారు ఈ మధ్యాహ్నం వేళ.. మరి వాళ్ళకి జత, వత్తాసు Cloth-Head Father Father బాతాకూనీకి....
((సారీ అండీ.. అదే.. మన సజ్జా ఏడుకొండలు,మేకల నూకరాజు,పైడి తల్లి,గుడిమెట్ల బంగార్రాజు,.. ఇంకా బట్టతల బాపయ్య (బాపు +అయ్య) అన్నమాట)).
***********
ఇక కొన్ని సామెతల లాంటివి:
Whose madness.. his happiness
As if keeping baby in arm-pit,and searching whole town...
For Jaundice fellow.. Appearing everything yellow
Why speaking not ? Sitting as Jaggery Beaten Stone ?
If go for Face-Word-m,as if stomach coming
For his penetration, there is No Lane, but to neck, there is Drum
You seed does not father in her mounth.
(You నువ్వు Seed గింజ, Father... నాన)
Wedding or Vomiting will not stop
In front, there is crocodile festival
(Or)
In front, there is Old fellows' festival.
Crow kid is Crow kiss
Full pot.. will not spill
Drawing teacher's picture.. as if monkey kid came
For a head-kicking person, there is a palm tree-kicking person
No future.. No past
(న భూతో.... న )
Rameswaram went.. even.. Saneeswaram did not leave
Doctor -Narain-Harry
(వైద్యో.. నారాయణో...)
Reddy came... Play start again
Rain coming.. Life going.. Who knows
Student exceeding Teacher
(గురువుని మించిన...)
King wants... Beatings shortage ?
************
ఈ తరహా హాస్య ప్రహసనం, మనందఱికీ...చిన్నప్పటినించీ తెలిసిందే... Garden-To-Come (తోటకూర); Seven Hills (ఏడుకొండలు)... ఇలా చిరపరిచితమే కదా... దాన్ని వృద్ధి చేసి, వటవృక్షం చేశాను అంతే !
😃😃
నాకు తెలుసు మీ బుఱ్ఱ ఈ తరహా జోకులకి, ఈ పాటికే tune అయిపోయి.. , ఇలాంటివి కొత్త కొత్తవి కని పుంజు డానికి ... సారీ.. సారీ.. కొత్తవి కని పెట్ట డానికి ఆలోచిస్తోందని.
నా ఛాలెంజ్ result కోసం, ఇప్పడు... మీరెన్ని సార్లు లోలోపలే నవ్వుకున్నారు? ఎన్ని సార్లు బయటకే నవ్వేశారు ? అనే విషయం.. నాకు తేల్చి చెప్పాల్సిందే.........
అని అడగను లెండి. మీరే నిజాయితీగా లెక్కేసుకుని... నేను, నా ఛాలెంజ్ లో ఓడిపోయానా? లేక, మీరే నన్ను గెలిపించారా? అన్న ఒకే ఒక్క మాట మాత్రం చెప్పండి చాలు...
ఈ రకం Jokology లో రీసెర్చ్ చేసి, ఫలితం చూసుకోడం కోసం, ప్రయోగించుకోడానికి వందలకొద్దీ క్లాస్ మేట్స్ ని, జూనియర్స్ ని, సీనియర్స్ ని నాకిచ్చి, ఆ ఆరు వసంతాలను ఆనందంగా అందరితో గడపడానికి వేదికఅయిన, నాకు ఇంత jovial గా ఉన్నా కూడా, మంచి(ఇంగిత) జ్ఞానాన్నిచ్చి, డిగ్రీలో కాలేజ్ సెకండ్ ర్యాంక్ తో, PG లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ తో డబుల్ గోల్డ్ మెడలిస్ట్ గా నిలిపిన, నాకు నలుగురిలో హుందా అయిన జీవికను, అందమైన, ఆనందమైన జీవితాన్ని ప్రసాదించిన నా ప్రియమైన చదువుల బడికి, ఇప్పటికీ చిన్నపిల్లాణ్ణిగా నన్ను లాలిస్తున్నట్లు ప్రేమాను భూతినిచ్చే ఆమె మమతల ఒడికి కృతజ్ఞతతో నా ఈ రచన అంకితం.
39,40 ఏళ్ల తరువాత కూడా, తలచుకొగానే.. మస్తిష్కపు తల్లి పలక పొరలలో నించి ... సారీ అండీ... అలవాట్లో పొరపాటు... అదే..మస్తిష్కపు Mother Board నించి,ఠక్కుమని, చేదతో తోడుకుని తీసుకోగలిగిన ధారణని ఇంకా నిలిపిఉంచిన చదువుల తల్లి సరస్వతి కి నమస్సులతో...
వెంకట్ గారు ఎన్ని అడిషనల్ షీట్స్ ఇచ్చినా చాలవు కాబట్టి, ఈ ప్రహసనాన్ని ఇక్కడితో ఆపుతూ..
( వెంకట్ ! పేజీ కి 2 మార్కులన్నా Thousand !.. సారీ.. అదే..అదే...
2 మార్కులన్నా వెయ్యి!... నన్ను ఇందులో pass Hand ! అదే.. Pass చెయ్యి ప్లీజ్ ప్లీజ్ !!
సరే.. ఇక.... కోరుతూ ఇప్పటికి మీ నుండి Withdrawal ( విరమణ)...
ఉంటా... కొను.... కొను.. కొను అదేనండీ.. Bye.. బై.. బై....
ఇట్లు
ఎప్పటికీ మీ.....
Withdrawal ( వి...రమణ)
23, డిసెంబర్ 2020, బుధవారం
మా చదువుల బడి (సరదా - సరదా) 20.12.2020
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము
15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు దత్తపది : హిమము , సుమము , సమము , భ్రమ...

-
" ఆముక్తమాల్యద" ఈ పేరే ఎంతో అందంగా , హుందాగా ఆసక్తిగా వినిపించేది ఎప్పుడూ " ఆ .. ముక్త ... మాల్యద " అంట...
-
03 - 12 - 2020; గురువారము చిత్రానికి పద్యం - 70 శీర్షిక : ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలు రాయల వారి కీర్తిని , వైభవాన్ని వర్ణి...
-
అమ్మ చేతి గోరుముద్దు శుభోదయం తమ్ముడడుగంగ తమ్ముని ధ్వజము పైన జేరి సాయమున్ ఘనముగా జేసె నాంజ నేయుడు రణరంగమునందు నెమ్మి తోడ భూతినిడు శుభోదయ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి