5, డిసెంబర్ 2020, శనివారం

స్వర్గీయ శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 98వ జయంతి, 04.12.2020


 

 

04 - 12 - 2020 - ప్రత్యేక ప్రణాళిక

రోజు ప్రముఖ నేపథ్య గాయకులు, సంగీత విద్వాంసులు

 శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 98 జయంతి సందర్భముగా

తెలుగు తేనియలు వేదికలో మరొక పద్యతోరణానికి

 అందరికీ ఆహ్వానము.

 

స్వర్గీయ శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 98 జయంతి సందర్భముగ

 

1

తెలుగు పాటలందు తేనియల్ గ్రోలగన్

ఘంటసాల గాను ఘనత నొంది

గాన కోకి లగను ఘన కీర్తి నొందిన

అమర గాయకునికి యంజలిడుదు

 

2.

విజయ నగరి నందు విద్యసాధన జేసి

ఘంటసాల గాను ఘనత నొంది

గీతగాయకునిగ గీతభో దించిన

అమర గాయకునికి యంజలిడుదు

 

వెంకటప్పయ్య సూరే

 

 

వె

గొప్ప గాయకుండు చెప్పనలవి కాదు

వేల పాటలిలను వేదమాయె

ఘంటసాల గొంతు ఘనముగా వెలిగెను

అమర గాయకునికి అంజలిడుదు

 

 

ఆ వె

యుగళ గీత మైన నూపిరి పోసెతా

భక్తి గీతమైన శక్తి నిచ్చు

దైవ లోకమందు దేవుళ్ళు మెచ్చు నా

అమర గాయకునికి అంజలిడుదు

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

 

 

అతడు ఘంటసాల....

 

అతడు  ఘంటసాల.. సుస్వరాల పర్ణశాల

వినినంతనే గేయాలు.. పొంగిపోవు  హృదయాలు ..

 

పుట్టింది చౌ టపల్లి, తల్లి తండ్రి బీదవారు

వారాలబ్బాయి గా విద్య నేర్చింది విజయనగరం

చేరింది చెన్నపట్నం మారుమ్రోగింది సుస్వరం

నాయకులకు గాయకుడు, గాయకులకు నాయకుడు.

 

హే కృష్ణా  అన్నా, హే పార్ధా అనినా

మాణిక్య వీణ మీటినా, శివశంకరీ యని స్తుతించినా. తెలుగు వీర లేవరా అని ఎలుగెత్తి పాడినా, పాడిన ప్రతి  గేయానికి అందించె తన అమృతగళం. 

స్వర్గలోకాన గాన గంధర్వులు తగ్గగా

కబురు అందె పై నుంచి అనారోగ్య రూపాన

నడి వయస్సు లోనే కడతేరే బ్రతుకు

గీతామృతాన్ని మనకు పంచి, వినిపించి,

అమరగాయకుడై అందరి మది నిలిచె ఘంటసాల...

 

చెరుకుపల్లి గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

 

 

సీ.

అమర గానముతోడ నానంద జలధిలో

ముంచుచు తేల్చిన మోహనుండు

పద్య పఠనమున పట్టు తేనియ జాలు

వారగ జేసిన పావనుండు

భక్తి శృంగార బీభత్సాది నవ రసా

లలవోక పలికించు అందగాడు

" గుండమ్మ" " లవకుశ" గురుతైన చిత్రాలు

ధ్వనియింప సంగీత దర్శకుం డు

 

ఆ. వె.

పామరులకు కూడ భగవాను గీతను

వినగ చదువ కోర్కె పెంచువాడు

స్వర మధురిమ కు నిల చిరునా యాతడే

అమరగాయకునికి నంజలిడుదు.      

 

సీ.

తిరుపతి దేవుని తిరమైన భక్తితో

వెంకటేశ్వ రు పేర వెలుగు వాడు

తెల్లని మనసుతో తెల్లని వస్త్రాల

తెలుగుతన పు ఠీవి నిలుచువాడు

శాస్త్రీయ ము, లలిత సంగీత జానప

దము నేదియైన సిద్దమను వాడు

పాటల మధురిమ( బాపలు నిద్రింప

బ్రతుకు తీపిని పెంచ బ్రహ్మ వాడు

 

ఆ. వె.

మనదు తెలుగు జాతి మాణిక్య మాతడే

చలన చిత్ర గీత సద్గురుండు

ఘంటసాల వంశ గాయక రత్న మౌ

అమర గాయకునికి నంజలిడుదు.

 

డి.రామ నాగేశ్వరరావు

 

 

 

లాహిరిలో

నా శ్రవణములు ఆలకించుచున్నవి

ఘంటసాల వారి గానములు .

నా  నయనములు చూపించుచున్నవి

పాటలకు ఎన్ ర్ , ఎన్ టి ఆర్ అభినయనములు

అవ్విధముగా నా మనసు హాయిగా , మధురముగా

లాహిరి లాహిరి లాడుచున్నది .

 

జి  మురళీ మోహన్ రావు

 

 

ఆటవెలదిలో

1)

యుగళగీతములచెయువకులమదిదోచు

మధుర రసము గూర్చి మలచు తీరు 

ఘంటసాల గారిగళముకు వరమైన

అమరగాయకునికిఅంజలిడుదు.

2)

జానపదులు, లలిత, సాంఘిక పాటలు

కంచువోలెమ్రోగు కంఠమందు

గానసభలనందుఘనతను బొందిన

అమరగాయకునికిఅంజలిడుదు.

 

హేమలత



 

ఘంటసాలా! తెలుగు పాటల పర్ణశాలా!

 ర్ణాటక శాస్త్రీయ సంగీత  దిట్టగ

హిందుస్థానీ సంగీత  ప్రేమికుడిగ

తెలుగు తేనెల సుమధుర గాన

సుధా సెలయేరులన్ గళమున

హొయలొలికించి వినసొంపుగ

నాట్యమాడించు గంధర్వుడిగ

గీత  సంగీతముల సవ్యసాచివై

నవ్య రీతులకున్ బాటలు పరిచి

లలిత ఛాయలన్ మెరుగులద్దగ

పద్యానికి నూత్న స్వర రూపమున్

సృష్టించి విరుపుల అందాల తేల్చగ

జంధ్యాల పాపయ్య కవిత లందున్

ప్రాణంబులు పోసి కరుణలు పెంచగ

దివ్య గానము నిల నాలపించిన

ఘంటసాలా! తెలుగు పాటల పర్ణశాలా!

తిరిగి రమ్ము తిరిగి రమ్ము మరొక్క సారి!

 

CA కె మల్లికార్జునరావు

 

 

 

1

ఘంటశాల యనిన ఘనమైన గాత్రంబు

కంచు కంఠమందు గానము విని

ముగ్ధులైరి నిజము ముక్కోటి దేవుళ్ళు

అమర గాయకునికి అంజలిడుదు

2

భక్తి పాట విన్న భగవంతుడే వచ్చు

యుక్తి తోడ పాడు యుగళ గీతి

విలువ బెంచి పాడె వీనుల విందుగా

అమర గాయకునికి అంజలిడుదు

3

పులకరించి పాడె పుష్ప విలాపము

కరుణ తోడ పాడె కాళిదాసు

తనివితీర పాడె తారకమంత్రమ్ము

అమర గాయకునికి అంజలిడుదు

4

వేడి కాలమందు వెన్నెల పూయించి

మంచు లోన చలి మంట కాచి

మదిని మాయ జేసి మధువుల నొలికించు

అమర గాయకునికి అంజలిడుదు

5

వెల్గులు వెలయంగ విప్లవ గీతాలు

దేశ భక్తి తోడ దేశమూగె

పాటలేవియైన పరిమళములు పంచె

అమర గాయకునికి అంజలిడుదు

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

 

 

1. ఆటవెలది

శారదాంబ వీణ శాశ్వతం బైయుండె

విజయ నగర మన్న విశ్వ కీర్తి

ఘంటసాల స్వరము ఘనమైన పెన్నిది

అందు కొమ్ము నాదు అంజలివియె...

 

2. ఆటవెలది

తెలుగు వారి సొత్తు తేటతెల్ల మనగ

తెలుగు కీర్తి వెలిగె దేశమంత

గాయకుండు నట్టి గానంబు లేదుగా

ఘంటసాల స్వరము 'గని' యె మనకు...

 

3. ఆటవెలది

ఘంటసాల వంటి గాయకు లరుదుగ

జన్మ జన్మ లకును జాడ లేదు

గీత సార మంత గిన్నెలో వొలికించి

జీవితమ్ము నొదిలె సేద దీర...

 

పి.ఎల్.నాగేశ్వరరావు

 

 

 

(ఘంటసాల మాష్టారి జయంతి సందర్భంగా ఆటవెలదుల తోరణం)

.వె 1️

తేనెచినుకులన్ని తీయనై కురియగ

స్వాదు సుధల జిల్కు జావళీలు

పాటలందు చిలుకు పారవశ్యములువి

అమర గాయకునకు అంజలిడుదు !

 

ఆ.వె 2️

పోహళింపు పాట పుష్పవిలాపమున్ 

కమ్రగళమునందు కటకగాన

రవముచే హృదయ సలాపముల్ భవ్యమౌ

అమర గాయకునకు అంజలిడుదు

 

ఆ.వె 3️

లలితగీతమందు లాలిత్యమును పంచి

భక్తియోగమందు భవహరమ్ము

విరహవేదనలను పీయూషముల పొంగు 

అమర గాయకునకు అంజలిడుదు

 

ఆ.వె 4️

శ్రుతివిపంచిక కృతి వితతుల విలసిల్లు

స్ఫారసురతమైన జావళీలు

యుగళ గీతులందు సొగసులు పొంగారు

అమర గాయకునకు అంజలిడుదు

 

ఆ.వె 5️

స్వచ్ఛమైన పాట వాంఛించు తరుణము

శారదేందు స్వనము జల్లగాను

మనసు పులకరించి మాధుర్యమందీయు

అమర గాయకునకు అంజలిడుదు

 

ఆ.వె 6️

తమ్మి సిరులు జిల్కు తారాడు మోహముల్

గంధములను పంచు గాత్రమందు

మంజులంబగు సుమ శింజితములు తావి

అమర గాయకునకు అంజలిడుదు

 

ఆ.వె 7️

ఘంటసాల పాట గారాబు గాత్రమున్

పద్యములవి పొంగు పరవశముగ

మోహనపు మధువులు మోదమై పచరించు

అమర గాయకునకు అంజలిడుదు !

 

కస్తూరి శివశంకర్

 

 

అమర గాయకులు ఘంటసాల గారి జయంతి సందర్భంగా నా అక్షరాంజలి.

1️

ఘంటసాల వారి గళములో నమృతపు

ధారకురియ, జనులు ధన్యులాయె

పాట యతని బ్రతుకు పల్లవై పోయెగా

అమర గాయకునకు అంజలిడిదు

 

2️

యింటి పేరు కిచ్చె ఎనలేని కీర్తిని

భక్తి పాట పాడె పరవశించి

యిష్ట దైవములను నిష్ట తోడ గొలువ

అమర గాయకునకు అంజలిడిదు

 

3️

పూని తాను పాడి పుష్పవిలాపము

పూల బాల ఘోష బోధ పరిచె

గీత తాను పాడి గెలుపువైపు నడిపె

అమర గాయకునకు అంజలిడిదు

 

రమ, కంకిపాడు.

 

 

సీస మాలిక:

దేవలోకమునుండి దిగివచ్చి నట్లుగా భూలోకమునఁ బుట్టెఁ బుణ్య మూర్తి

గంధర్వ గానంబు ఘనముగాఁ జూపించి ఘంటసాలనుపేరఁ ఖ్యాతి గాంచె

భక్తిగీతమ్ములఁ భావించి పాడగా భారత మాతయే పరవశించె

ప్రణయగీతమ్ములఁ బ్రస్తుతి జేయగా యువలోక మంతయు నూగు లాడె

ఆగాన మాధుర్య మాసాహి తీజ్ఞాన మాభావ విన్యాస మాలకించి

మానసి కోల్లాస మంజుల హేలలో పులకరింపగఁజేసె పుడమి జనుల

 

తేట గీతి

చలన చిత్రాల గీతాల సౌరభముల

పంచి యిచ్చిన గంధర్వ భవ్య చరిత!!

నీదు సారస్వ తమునెంచ నెవరి తరము?

ఘనుడవోయి పరమపూజ్య! ఘంటసాల!

 

ఆదిభట్ల సత్యనారాయణ

 


 

ఘంటసాల మధుర గాత్రమే వినినంత

పులకరింత్రు జనులు ముదముతోడ

సుధనుగూర్చెనేమొ విధుడాతని గళము

నమరగాయకునకు అంజలిడుదు

 

కీర్తి పెంచెనతని‌ గీతాపఠనమది

భాషభేదమనక ప్రాంతమనక

విశ్వజనులు మెచ్చు విమలగాత్రుడతడె

యమర గాయకునకు అంజలిడుదు

ఆత్రేయ

 

1

నారదునిగ బుట్టె భారతావని నందు

ఘంటసాల వారు, గరిమతోడ

సాధన సలుపంగ సంప్రతీతి గడించె

అమర గాయకునికి అంజలిడుదు

2️

రామణీయమైన రవళి విన్పించునె

ఘంటసాల వారి కంఠమందు

కోకిలమ్మ పాట గుణమె తా పాడంగ

అమర గాయకునికి అంజలిడుదు

3️

మధుర గాయకుడయి మహిని వెలుగు నింపి

స్వర్గ లోక మేగె స్వర మధురిమ

గరిమ తెలుపు కొరకు ఘంటసాల ఘనుండు

అమర గాయకునికి అంజలిడుదు

4️

భక్తి పాటలన్ని పాడంగ పారవ

శ్యంబు కలిగి మనసు సంతసించి

దైవ దర్శనమయి తన్మయత్వం బొందు

అమర గాయకునికి అంజలిడుదు

5️

శిశువు పద్యములను శ్రేష్ఠ ముగను పాడి

ఘంటసాల వారు ఘనత నొంది

తెలుగు వారి కీర్తి దేశమందు నిలిపె

అమర గాయకునికి అంజలిడుదు

6️

పువ్వుల వెత తెల్పు పుష్ప విలాపము

పాడగ విరులన్ని ప్రణతి తెల్పె

ఘంటసాల పాట ఘనత చెప్ప తరమా

అమర గాయకునికి అంజలిడుదు

7️

కఠిన శిలలు కరుగు ఘంటసాల కరుణ

గీత మాలపింప, కేళికాడు

సర్పజాతి నీదు సంగీతము వినగ

అమర గాయకునికి అంజలిడుదు

8️

అమృత ధార కురియు నలరించు గానము

జనులు వినగ సర్వ జగతి మబ్బు

తేరు లెక్కి వెడలు దివ్య లోకమునకు

అమర గాయకునికి అంజలిడుదు

9️

రాగమెంత మధుర రంజకమో ఘంట

సాల నీదు పాట క్షౌణి నందు

దైవ గానమయ్యి జీవులన్ తరియించు

అమర గాయకునికి అంజలిడుదు

10

భ్రమపడినటుల సరి గమలన్ని తన చెంత

జేరి మురిసి పోయి జిలుగు జూపి

పాట వోలె వెలికి వచ్చి తేలించినో

అమర గాయకునికి అంజలిడుదు

 

వెంకట్.సి హెచ్

 

 

1️

ఘంటసాల  వారి గంభీర గాత్రము

సుధలు చిలికి పలికె మధుర గీతి

యలల వోలె తాక హరుసమందుతు నేను

అమర గాయకునికి అంజలిడిదు

2️

గాన మేది యైన గళములో నొదుగుచుఁ

మధుర భావమొలుక మైమరపుల

మోహమావరించి మురిసిపోవుచు నేను

అమర గాయకునికి అంజలిడిదు

 

అవళూరు సీత

 

 

ఆటవెలది పద్యము

 

ఘంట సాల గారి వెంటవ చ్చెనుపాట

పాట తోనె జనులు పరవ శించె

గాన మందు మత్తు గమ్మత్తు గానుండు

అమర గాయ కునుకు అంజ లిడుదు

 

లలితారెడ్డి

ఘంటసాల వారి పాట వినంగ నే

నతిశయంబు నొందు హరువు నిచ్చు

పాటలవియె సతము పావనముగ వెల్గు

నమర గాయకునికి అంజలిడుదు

 

అమర గాయకుడు ఘంటసాల

గానమాధుర్యంబు నందు

ఓలలాడె అందరి హృదయాలు

తనివి తీరగ మది పరవశించే

ఉయ్యాల డోలికలు

 

దేవరశెట్టి నాగమణి

 

 

ఆ వె

గానమే బలుకును మధురమ్ముగా తాను

భక్తితోడ నిలుపు భావమతడు

భానుడై నిలిచెను పాటల పృధ్విలో

అమర గాయకునికి అంజలిడుదు

 

అన్నపూర్ణ, ముంబాయి

 

ఆ వె 1

భక్తి గానమందు పరవశమొందించి 

భవహరమును సేసి బాపు నకము

వినెడివారి కెల్ల వేద్యమౌ విధము, నా

యమర గాయకునికి నంజలిడుదు


ఆ వె 2

యుగళ గీతి పాడి నుర్రూత లూగించి

యువత హృదిని దోచ నవతరించె 

నమల బ్రేమ ధరణి నచలంబు సేయగ

యమర గాయకునికి నంజలిడుదు


ఆ వె 3

స్ఫూర్తి, శ్రద్ధ నింపు సుమధుర గానంబు

నాలకించ మదిన హద్దెరుగని

దేశభక్తి పొంగి దేహంబు పులకించ

యమర గాయకునికి నంజలిడుదు


ఆ వె 4

గాత్ర మూతమిచ్చి కావ్య సంపదనంత

పామరునికి గూడ బంచిపెట్ట

పసిడి పద్యములను వసుధ నిల్పినయట్టి

యమర గాయకునికి నంజలిడుదు


ఆ వె 5

గిరులు ఝరులు బొంగు గీత నాలాపించ

సూక్ష్మ మందు జనులు మోక్ష మరయు

దేవదూత తాను ధిషణి నవతరించ

యమర గాయకునికి నంజలిడుదు


వాణిశ్రీ నైనాల 


**********


 

స్వర్గీయ ఘంటసాల వేంకటేశ్వర రావు గారి గురించి వివిధ మాద్యమాల ద్వారా ఆయనకు నివాళులు అర్పించిన రచనలు.

ఇవి పూర్తిగా వివిధామాధ్యమాల ద్వారా సేకరణ  

 

స్వర్గీయ ఘంటసాల వేంకటేశ్వర రావు గారి గురించి వివిధ మాద్యమాల ద్వారా ఆయనకు నివాళులు అర్పించిన రచనలు.

ఇవి పూర్తిగా వివిధామాధ్యమాల ద్వారా సేకరణ  

 

నవరసాల  గాన గంధర్వుడు  ఘంటసాలజయంతి నేడు  4 డిశంబర్ 1922.

ఒక కళాసృష్టి వలన మనలోకి మొదట ఒకభావం అంకురించి స్థితినందుకోవాలితదుపరి ఆభావం స్థాయీపరంగాపెరగాలిపెరిగిపెరిగి తుట్టతుదకు ఆభావం అంతిమస్థాయి నందుకొన్నప్పుడు ఆనందస్వరూపమైన బ్రహ్మానందాన్నీమనం అనుభవిస్తాముఅప్పుడాభావం రసం అయ్యింది తొలి భావం స్థితినందుకొని స్థాయీపరంగా పెరిగిందవటంచేత దీన్ని స్థాయీభావం అన్నారు

 

కళాసృష్టి యందలి  స్థాయీభావోదయకారక అంశము విభావముఅని 

అంటారుభావకారణం విభావంఈవిభావ కారణంగానే స్థాయీభవ అంకురం

అది వృద్ధి పొందడంకూడాతదనుసారంగానేరసోత్పత్తికి అవకాశంఅందుచేత ద్వివిధాలుగా మన వక్తలు నిర్వచించారు.1. ఆలంబన 2. ఉద్దీపనస్థాయీభావోదయానికి ముఖ్య కారణమైన అంశమును ఆలంబన విభావమనబడింది స్థాయీభావాన్నిపెంపొందించడానికి గల కారణాంశము ఉద్దీపన విభావముఎందుకనగా నిలిచియున్న ష్తాయీభావాన్ని ఇదిఉద్దీపిస్తుంది.

 

మానవ హృదయ నైజం బాగా శోధించిన మన పూర్వపు  ఋషులు  భావాలు 

ఎనిమిదని చెపారుకాని కొంతకాలమైనతరువాత క్రీ..  5  లేక 6 శతాబ్దములో

మరొక రసాన్ని నిర్వచించి శాంత రసాన్ని చేర్చినవ రసాలుగా నిర్ణయించారు.

 నవరసాలను శ్రోతల హృదయాలకు నేరుగా స్పందించి పాడగలిగే వారిలో  మన ఘంటసాల గారు ఒకరు.

 

1 శృంగారం - భావం:

రతి...నేడు చాలామంది శృంగారం కామం  ఒకటే అనుకుంటారురెండు శరీరాలతో చేసే రతికామంరెండు శరీరాలు రెండు మనసులు కలిసి చెసే  రతి 

శృంగారం.

తరం తరం నిరంతరం-పాండురంగ మహాత్యం-సముద్రాల జూనియర్-

టి.  విరాజు ఘంటసాల  గారు  పాటలో శృంగారాన్ని ఎంత  మృదువుగా  

వినండి.  సుఖించి తరించరా  అన్నప్పుడుపదాల విరుపును గమనించండి.

 

2 వీరం - భావం:

ఆవేశం ....ఆవేశం ప్రకటించే పాటలు సాధారణంగా సాహిత్యం ద్విత్వాక్షరాలతోమహా ప్రానాలతోనూసంగీతం పై స్థాయి స్వరాల తోనూ ఉంటాయి.

వాటిని ఘంటసాల గారు అలవోకగా  ఎలా పాడారో  క్రింది పద్యాలలో   వినండిఆ పద్యాలు  వింటుంటే  మనం కూడాఆవేశానికి  గురైతాము.

పాండవ వనవాసం లోని మహాభారత పద్యాలు  ఎంత ఆవేశంగా  పాడారో  

ఘంటసాల గారు.

 

3 కరుణ - భావం:

దు:ఖం... పాటలు పాడాలంటే  గొంతులో ఒకా విధమైన జీరను (గద్గద

పలికించగలగాలి.

చిరంజీవులు  సినిమా లోని  పాటను  వినండివిషాదం ఘంటసాల గారి 

గొంతులో ఎంత బాగా  పలికిందో...

 

4 అద్భుతం - భావం:

ఆశ్చర్యం..ఘంటసాల గారు పాడిన  శ్లోకం వింటే  మనం ఆశ్చర్య పోవాల్సిందేసాహిత్యంసంస్కృతంస్థాయి పై స్వరాలుచాలా సార్లు టెక్  తీసుకుని చివరికి ఒకే టెక్ లో అద్భుతంగా పాడారు మాష్టారు గారు.

 

5 హాస్యం - భావం:

నవ్వు....అన్ని రసాలలోకి  హాస్య రసం  పలికించడం కష్టం అంటారు.  తెలుగు 

సినిమాల్లో ఘంటసాలగారు అనేక  హాస్య గీతాలు పాడారుఅన్నింట్లోకి నాకు 

నచ్చిన పాటమాయాబజార్ లో రేలంగి గారికి పాడిన సుందరినీవంటి.....

 

భయానకం

 భావం:భయం...భయానకం  కు పారాకాష్ట  ఘంటసాల గారు సీతారామ కల్యాణం  సినిమా లో పాడినకానరార కైలాస నివాస....పాట.

 

7  బీభత్సం

భావం:జుగుప్స...మానవుడు టాను అనుకున్నది కానప్పుడుఅనుకోనిది ఎదురైనపుడు , మనఃశాంతికరువైనపుడు భీభత్సంగా ప్రవర్తిస్తాడు.

అల్లాంటిదే గుడిగంటలు లోని  పాట....

 

8 రౌద్రం

భావం:కోపం.. తన జాతి బానిసత్వం పోవడానికి  వారిని ఉత్తేజపరచడానికి పాడిన పాటతెలుగు వీర లేవరాపాట.......నేటి నుండి రద్దురా అన్నప్పుడు  ను  ఎంత బాగా పలికారో మాస్టారు గారుఅలాగే ఎవడు వాడు ఎచటివాడు  అన్నప్పుడు 

వారి గొంతులో పలికిన  రౌద్రం మనసులను కదిలిస్తుంది.

 

9  శాంతం

భావం:ఓర్పు....శాంత రసం లో   ఘంటసాల గారు  పాట పాడినా  ఆడి శ్రోతల మనసు లో లో పొరల లోకిచొచ్చుకు పోతుంది.  పండంటి కాపురం లోని ...బాబూ వినరా అనే పాట ఉమ్మడి కుటుంబం లోని విలువలను ఎంతోహృద్యంగా పాడి మన హృదయాలను గెలుచుకున్నారు ఘంటసాల గారు.

 

******   Courtesy: Kodati Sambaiah

 

ఆయనతో వున్న కేవలం 50ఏళ్ల పరిచయంతో... ఆయన వెళ్లిపోయాడని 

వెయ్యేళ్ళ వయసుగల పద్యంకూడాచిన్నబుచ్చుకొని ముఖం చాటేసింది.. 

 

 స్వ      ము  ద్రు డు 

డిశంబర్ 4 . ఘంటసాల గారి 94  జయంతి )

 

ఎవరున్నారు  స్వరవాహిని లో

మునిగి మురిసిపోని తెలుగువాడు !

నాటికీ నేటికీ ఏనాటికీ అతడే

సినీసంగీతసామ్రాజ్యానికి మకుటంలేనిమహారేడు !!

 

 గానగంధర్వుని గాత్రఘమకమేలేకుంటే

"సాలూరి"వారి స్వరవీణకు సొంపెక్కడిది !

"పెండ్యాల"వారిమృదంగానికిమాధుర్యమెక్కడిది !!

"ఆదినారాయణుడి" ...

అపురూపబాణీలకు అలంకారమొచ్చేనా !

"సుసర్ల"వారి స్వరఝరులకు సొగసులొచ్చేనా !!

"లీలమ్మ"వాణి వలపువయ్యారంగా వినిపించినా !

"సుశీలమ్మ"స్వరంసన్నాయిలా అనిపించేనా !!

మధురగాయనీ మకుటం "జిక్కీ"కి చిక్కేనా !

గానకోకిల ప్రశంస"జానకీ"కి దక్కేనా !!

 

మహాకవి శ్రీశ్రీ , సినారెల "సాకీ'లకుసోకులొచ్చేనా !

మన"సుకవి"ఆత్రేయుని

అద్వితీయ"పల్లవులకుప్రాణమొచ్చేనా !!

కవిరుద్రుడు ఆరుద్రుని"చరణాలు"

అజరామరమయ్యేనా !

"దేవులపల్లి"వారి నీలాలమేఘమాల

ఆకాశవీధిలో హాయిగాఎగిరేనా !!

"సముద్రాల"వారి 

సాహితీసౌధానికి సౌందర్యముండేనా !

విజయ , వాహినీ , వినోదా వార్ల వదనాల్లో

దిగ్విజయ దరహాసం నిండేనా !!

 

బి యన్  (వాట్సాప్ నుండి.... )

 

 

 

సినీ సంగీత ప్రపంచాన్ని  మలుపుతిప్పిన సంగీత స్వరసార్వభౌముడు ఘంటసాల

అమర గాయకులు శ్రీ ఘంటసాల వారి జయంతి డిసెంబర్4 ఆసందర్భంగా ఆమహనీయునికి నివాళులుఅర్పిస్తూ......... 

జయంతి  4 డిసెంబరు1922

వర్థంతి 11 ఫిబ్రవరి 1974

 

సినీ సంగీతంలో వారిదొక తేనె సంతకం 

అమర గాయకుడనే పదానికి అసలైన నిర్వచనం.. 

స్వర మాంత్రికుడు ఘంటసాలఆయన పాట సినీ కళామ తల్లి కి స్వరనీరాజనాలను అందించింది.  

 

సంగీత సామ్రాజ్య రారాజు,   సంగీతాన్ని అత్యంత మధురంగా రాగాలాపన చేసే సంగీత సామ్రాట్ ఘంటసాల గారురాగభావంశబ్దోచ్చారణలోని స్పష్టతరాగాల గురించిన నిర్దుష్టమైన అవగాహన ఇలా ఎన్నో ఉత్తమలక్షణాలు  ఆయనపాటలను తీర్చి దిద్దాయిఆయనొక సంగీత నిధి.. తవ్వేకొద్ది అద్భుతమైన సంగీత స్వరం రంజింపచేస్తూ వస్తూనే ఉండేది

 

ఈనాటికి ఆయన పాట నిత్య నూతనంఎక్కడో ఒక చోట  క్షణం ఆయన పాట వినపడని తెలుగు నేల లేదేమోగాత్రంలోనే సంగీత ఝరి ప్రవహించే ఘంటసాలే కదా తెలుగు పాటకు సంగీత స్వరంఅచ్చ తెలుగు ఆంధ్రావని కృష్ణాజిల్లా లో పుట్టింది  స్వర సంచలనంఎంతో మందిని సినీ కళామ తల్లికి పరిచయించిన కృష్ణమ్మ  స్వర నిధినిఅంకితం చేసిందిపాటలు పాడడమే కాదు ఎన్నో పాటలకు బాణీల అందించిన ఘంటసాల గారు  అద్భుతం.

 

తెలుగు సినీసంగీత ప్రపంచాన్ని రెండు విధాలుగా చెప్పుకోవచ్చుమొదటిది ఘంటసాలకు ముందు.. రెండు ఘంటసాలతర్వాతఅంతవరకూ శాస్త్రీయ సంగీతం ప్రధానంగా రాగభరితంగా వచ్చిన పాటలు.. ఘంటసాల గారి సంగీతంలోప్రత్యేకత మాధుర్యం.రాగంతోబాటు భావప్రకటనస్వచ్ఛతసంపూర్ణత్వంఒక్కసారి విన్న పాటను మరిచిపోలేరుఆమాధుర్యంలోని 'విలక్షణత పాటలకు పూర్ణాయుష్షుని ప్రసాదించాయిఘంటసాల పాటల్లోని మాధురీ పరిమళాలుబాగా నచ్చాయి పాటలు అజరామరం!

 

ఘంటసాల వెంకటేశ్వరరావు ( డిసెంబర్ 4, 1922 - ఫిబ్రవరి 11, 1974) 

 

ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడుమరియు నేపథ్య గాయకుడు

ఘంటసాల జన్మతః వచ్చిన గంభీరమైన స్వరముతోపట్రాయని సీతారామశాస్త్రి (సాలూరుచిన్న గురువువద్ద క్షుణ్ణమైన శాస్త్రీయ సంగీత శిక్షణతోతెలుగు సినీ సంగీతము ఒక విభిన్నమైన వ్యక్తిత్వాన్నిసంతరించుకోవడానికి దోహదపడ్డాడు

 

ఘంటసాల తెలుగు సినిమా తొలితరము నేపథ్యగాయకులలో ప్రముఖుడువ్యాఖ్యానంతో సహా ఆయన ఆలపించిన భగవద్గీత తెలుగు వారిలో అత్యంత ప్రజాదరణపొందినది.

 

బాల్యం :-

ఘంటసాల 1922 డిసెంబర్ 4  గుడివాడ సమీపములోని చౌటపల్లి గ్రామములో ఘంటసాల సూర్యనారాయణరత్నమ్మదంపతులకు జన్మించాడు

సూర్యనారాయణ మృదంగం వాయిస్తూభజనలు చేసేవారుఆయన ఘంటసాలను భుజంపైన కూర్చోబెట్టుకొని పాటలు పాడుతూ సంగీత సభాస్థలికి తీసుకెళ్ళేవారు

ఘంటసాల అక్కడ జరుగుతున్న భజనలువింటూ పాటలు పాడుతూ నాట్యం చేసేవాడుఘంటసాల నాట్యానికి ముగ్ధులయి ఆయనను 'బాల భరతుడు ' అనిపిలిచేవారుఘంటసాల 11 ఏట సూర్యనారాయణ మరణించారు

చివరి రోజుల్లో ఆయన సంగీతం గొప్పదనాన్నిఘంటసాలకు వివరించి ఘంటసాలను గొప్ప సంగీత విద్వాంసుడిని అవమని కోరారు

ఆయన మరణంతో ఘంటసాలకుటుంబ పరిరక్షణను రత్తమ్మగారి తమ్ముడు ర్యాలీ పిచ్చయ్య చూసుకోవడం మొదలుపెట్టారు.

 

సంగీత సాధన:-

తండ్రి ఆశయం నెరవేర్చడానికి ఘంటసాల సంగీత గురుకులాలలో చేరినా

 కట్టుబాట్లు తట్టుకోలేక వెనక్కు వచ్చేశాడుఒకసారి సమీప గ్రామంలో జరిగిన సంగీత కచేరీలో విద్వాంసులతో పోటీపడి ఓడిపోయి నవ్వులపాలయాడు

అప్పటినుండి ఆయనలో పట్టుదల పెరిగిందితనకు తెలిసిన కొందరు సంగీత విద్వాంసుల ఇళ్ళల్లో పనిచేస్తూ సంగీతం అభ్యసించడానికి  

నిశ్చయించుకున్నాడు

రెండేళ్ళ కాలంలో ఒకఇంట్లో బట్టలు ఉతకడంమరొక ఇంట్లో వంట చేయడంనేర్చుకొనవలసి వచ్చింది

ఆలస్యమైనా తనతప్పు తెలుసుకొన్న ఘంటసాల తనదగ్గరున్న నలభై రూపాయల విలువగలఉంగరాన్ని ఎనిమిది రూపాయలకు అమ్మి ఆంధ్రరాష్ట్రంలో ఏకైక సంగీత కళాశాల ఉన్న విజయనగరం చేరుకొన్నాడు.

 

విజయనగరం చేరినప్పటికి వేసవి సెలవుల కారణంగా కళాశాల మూసి ఉంది కళాశాల ప్రిన్సిపాల్ దగ్గరకువెళ్ళిఅభ్యర్థించగా ఆయన కళాశాల ఆవరణలో బసచేయడానికి అనుమతి ఇచ్చాడు.

ఘంటసాల అక్కడ ఉంటూ రోజుకొకఇంట్లో భోజనం చేస్తూ ఉండేవాడుఇలా ఉండగా తోటివిద్యార్థులు చేసినతప్పుకు ఘంటసాలను కళాశాల నుండిబహిష్కరించారుఅది తెలిసి వారాలు పెట్టే కుటుంబాలవారు తమ ఇళ్ళకు రావద్దన్నారుగత్యంతరంలేక  వూరిఎల్లమ్మ గుడికి వెళ్ళి తలదాచుకున్నాడు

అప్పుడు  గుడికి వచ్చిన పట్రాయని సీతారామశాస్త్రి ఘంటసాల గురించితెలుసుకొని తన ఇంట ఉచితంగా సంగీతశిక్షణ ఇవ్వడానికి అంగీకరించారు

ఘంటసాల తన జీవితంలో ఎన్నోసార్లుగురువంటే ఆయనే అనిచెప్పేవాడు.

 

శాస్త్రి చాలా పేదవాడు కావడంతో ఘంటసాలకు భోజన సదుపాయాలు కల్పించలేకపోయాడుఆకలితో ఉన్నఘంటసాలకు ఒక సాధువు జోలెకట్టి మాధుకరం 

(ఇంటింటా అడుక్కోవడంచేయడం నేర్పించాడు

భుజాన జోలెకట్టుకొనివీధివీధి తిరిగి రెండుపూటలకు సరిపడే అన్నం తెచ్చుకొనేవాడుమిగిలిన అన్నాన్ని ఒకగుడ్డలో పెడితే చీమలుపడుతుండేవిగిన్నె కొనుక్కోవడానికి డబ్బులేక మేనమామకు ఉత్తరం వ్రాయగా ఆయన పంపిన డబ్బుతో ఒకడబ్బాకొనుక్కొని అందులో అన్నం భద్రపరచేవాడు.

 

వేసవి సెలవులు పూర్తైన తర్వాత ఘంటసాల కళాశాలలో చేరాడుశాస్త్రి శిక్షణలో నాలుగుసంవత్సరాల కోర్సును రెండుసంవత్సరాలలో పూర్తిచేసాడుతర్వాత 

కొన్నాళ్ళు విజయనగరంలో సంగీత కచేరీలు చేసి మంచిపేరు తెచ్చుకొని తనసొంతవూరు అయిన చౌటపల్లెకుచేరి అక్కడ ఉత్సవాలలోవివాహ మహోత్సవాలలో పాటలు పాడుతూ సంగీత పాఠాలుచెప్పేవాడు.

 

1942లో స్వాతంత్ర్య సమరయోధునిగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని రెండుసంవత్సరాలు అలీపూర్జైల్లో నిర్బంధంలో ఉన్నాడు.

 

సినీ ప్రస్థానం:-

1944 మార్చి 4 ఘంటసాల తన మేనకోడలైన సావిత్రిని పెళ్ళిచేసుకున్నాడుఆరోజు సాయంత్రం తనపెళ్ళికి తానేకచేరీచేసి అందరినీ ఆశ్చర్యానందాలలో ముంచెత్తాడుకొన్నాళ్ళకు దగ్గరివూరికి సముద్రాల రాఘవాచార్యులు వచ్చినపుడుఆయనను కలిసాడుఘంటసాల సామర్థ్యం గ్రహించిన సముద్రాల 

ఘంటసాలను మద్రాసుకు వచ్చి కలుసుకోమన్నాడు

ఘంటసాల రెండునెలలు కష్టపడి కచేరీలుచేసికొంత అప్పుచేసి మద్రాసు 

వెళ్ళాడుసముద్రాల ఘంటసాలను రేణుకాఫిలింస్ కు తీసుకెళ్ళి చిత్తూరు 

నాగయ్యబి.ఎన్.రెడ్డిల ముందు పాటకచేరీ చేయించాడువారిరువురు ఘంటసాలపాటవిని అవకాశాలు ఉన్నపుడు ఇస్తామన్నారు.

 

సముద్రాలవారి ఇల్లు చాలాచిన్నది కావడంతో ఆయనకు ఇబ్బంది కలిగించడం ఇష్టంలేక ఘంటసాల తనమకాంనుపానగల్ పార్కు వాచ్‌మన్‌కు నెలకు రెండురూపాయలు చెల్లించే పద్ధతిపై అక్కడకు మార్చాడుపగలంతాఅవకాశాలకోసం వెతికి రాత్రికి పార్కులో నిద్రించేవాడుచివరికి సముద్రాల అప్పటి మద్రాసు 

రేడియో కేంద్రంలోలలితగీతాల గాయకుడి అవకాశాన్ని ఇప్పించాడు

 

ఇలాపాటలు పాడుతూ మరోవైపు సినిమాల్లో చిన్నచిన్న వేషాలువేసేవాడుమరోవైపు బృందగానాలు చేస్తూ నెమ్మదిగా సినీరంగ ప్రముఖుల గుర్తింపుపొందాడుఘంటసాలచేత తరచుపాటలు పాడించుకొని ఆస్వాదించే చిత్తూరు నాగయ్య

బి.ఎన్.రెడ్డిలు తమ సినిమా అయిన స్వర్గసీమలో మొదటిసారినేపథ్యగాయకుడి అవకాశాన్ని ఇచ్చారు

భానుమతి పక్కన భయపడుతూ ఘంటసాల పాడుతుంటే భానుమతినాగయ్యలు ధైర్యం చెప్పేవారుఆపాటకు ఆయనకు 116 రూపాయల పారితోషికం లభించింది.

 

తర్వాత భానుమతిరామకృష్ణలు తీసిన రత్నమాల చిత్రానికి సహాయ సంగీతదర్శకునిగా చేసే అవకాశం వచ్చిందితర్వాత బాలరాజుమనదేశం వంటి హిట్ చిత్రాలకు కూడా సంగీత దర్శకత్వం వహించాడు.

 

విజయ విహారం:-

1951లో పాతాళభైరవి విజయంతో ఘంటసాల పేరు ఆంధ్రదేశమంతా మారుమ్రోగిందిఅప్పుడే మద్రాసులో ఇల్లుకొనుక్కొని తన కుటుంబాన్ని తీసుకువచ్చారుతరువాత విడుదలైన మల్లీశ్వరి చిత్రంలోని పాటలు అత్యంత ప్రజాదరణపొందడానికి సాలూరి రాజేశ్వరరావుసంగీతానికి ఘంటసాల గాత్రం తోడవడమే!

 

1953లో వచ్చిన దేవదాసు ఘంటసాలసినీజీవితంలో కలికితురాయిగా నిలిచిపోయిందిఆచిత్రంలో తన నటనకంటే ఘంటసాల గాత్రమే తనకు ఇష్టమనిఅక్కినేని నాగేశ్వరరావు చెపుతుంటారు.

 

1955లో విడుదలైన అనార్కలి చిత్రం మరింత గొప్పపేరు తెచ్చింది. 1957లోవిడుదలైన మాయాబజార్ సినిమా పాటలు తెలుగు సినీచరిత్రలో అగ్రతాంబూలం అందుకున్నాయి.

 

1960లో విడుదలైనశ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమాలోని 'శేషశైలావాస శ్రీ వేంకటేశ ' పాటను తెరపైనకూడా ఘంటసాల పాడగాచిత్రీకరించారుఎటువంటి 

పాటైనా ఘంటసాల మాత్రమే పాడగలడు అన్నఖ్యాతి తెచ్చుకొన్నాడు. 1970 వరకు దాదాపుప్రతిపాట ఘంటసాల పాడినదేఏనోట విన్నా ఆయన పాడిన పాటలే.

 

చివరిదశ

1969 నుండి ఘంటసాల తరచు అనారోగ్యానికి గురయ్యేవాడు. .1970లో ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది. 1971లోఐరోపాలోఅమెరికాలో ప్రదర్శనలు ఇచ్చి సంగీతప్రియులను రంజింపచేసాడు.1972లో రవీంద్రభారతిలో ప్రదర్శనఇస్తున్నపుడు గుండెనొప్పి అనిపించడంతో హాస్పిటల్లో చేరాడుఅప్పటికే చక్కెర వ్యాధితో బాధపడుతూ ఉన్నాడుచాలారోజులు చికిత్స అనంతరం హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయ్యాడు.

 

అప్పుడే ఆయనకు భగవద్గీత పాడాలన్న కోరికకలిగిందిభగవద్గీత పూర్తిచేసిన తర్వాత సినిమా పాటలు పాడకూడదుఅనుకున్నాడు. 1973లో భక్త తుకారాంజీవన తరంగాలుదేవుడు చేసిన మనుషులు మొదలైన హిట్ చిత్రాలకు పాటలుపాడాడు.

 1974 నాటికి ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందిచివరికి 1974 ఫిబ్రవరి 11 ఆస్పత్రిలో కన్నుమూసాడుయావదాంధ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.

 

వ్యక్తిత్వం:-

ఘంటసాల ఎంత గొప్పస్థితికి చేరుకొన్నా తనను ఆదరించిన వారిని మరువలేదుఆయన ఎన్నడూ మరొకరినినొప్పించేవాడుకాదుకోరినవారికి కాదనక సహాయంచేసేవాడు.

 

"నాడు ఏతల్లి మొదటి కబళం నా జోలెలో వేసిందో ఆమె ఆవాత్సల్యపూరితమైన భిక్ష నాకు అష్టైశ్వర్యాలతో కూడినభవిష్యత్తును ప్రసాదించిందిఅని ఎన్నోసార్లు చెప్పేవాడు.

 

మద్రాసులో ఇల్లుకొన్నపుడు గురువుగారైన సీతారామశాస్త్రిగారికి గృహప్రవేశానికి రావడానికై టికెట్లుకొని గృహప్రవేశం రోజువెయ్యిన్నూటపదహార్లుపట్టుబట్టలు వెండిపళ్ళెంలో సమర్పించి సాష్టాంగ నమస్కారంచేసి ఆయనపట్ల తన గౌరవాన్నిచాటుకున్నాడుసీతారామశాస్త్రిగారి కూమారుడు పట్రాయని సంగీతరావు ఘంటసాల వద్ద సంగీత స్వరసహచరుడిగాఘంటసాల చివరి శ్వాస వరకు తోడుగాఆప్తమిత్రుడుగా ఉన్నారు.

 

పానగల్ పార్కులో కష్టాల్లో ఉన్నపుడు కూడా తోటివారికి ఆకలిగా ఉన్నపుడు భోజనాలు కల్పించేవాడు.

 

సంగీతాభ్యాసం చేస్తున్నరోజుల్లో తనను 'అన్నాఅని పిలిచే స్నేహితుడు పాపారావుకు తాను గొప్పవాడినైతే వాచీకొనిస్తానని చెప్పాడుకొన్నేళ్ళకు పాపారావు 'అన్నా గొప్పవాడివయ్యావు కదా నా వాచీ ఏదీఅని ఉత్తరం రాయగా నూరురూపాయలు పంపించాడుకానీ అప్పటికే పాపారావు టైఫాయిడ్ వచ్చి మరణించాడుతరువాత పాపారావు కుమారుడు నరసింగరావును తనఇంట పెంచి తనకుమారుడిగా 

చూసేవాడు.

 

 సినీ సంగీత ప్రపంచాన్ని  మలుపుతిప్పిన స్వరసార్వభౌముడు ఘంటసాలసంగీత ప్రపంచమంతటినీ తన స్వంతకుటుంబసభ్యుల్లా చూసుకునేవారు 

ఘంటసాలఎవరికే ఆపద వచ్చినా తనే ముందుడేవారు.

 

'తానెంతో జగమంతఅనేమనస్తత్త్వం గల వ్యక్తి ఘంటసాలఅందుకే అందర్నీ తనతో సమానంగా చూసుకునేవారుభారతజాతికి ఘంటసాలమాస్టారు అందించిన గానామృతం తరగని సంపదఘంటసాల వారు జాతిసంపద!

సూర్యచంద్రులున్నంతకాలం వారి గాత్రాన్ని నిత్యం వింటూనే ఉంటాము.

 

*****

 

 

ఘంటసాల గారికి ఆత్మీయ నివాళి..

 

సంగీతం అంటే భావోద్రేకాన్ని వ్యక్తపరిచే భాష.. ప్రజల హృదయాలను 

స్పందింపచేసే శక్తి గల గాత్ర మాధుర్యాన్నిదైవదత్తంగా పొందిన దివ్యశక్తి మన 

ఘంటసాలగారు.. 

ఆయన తన మనసును మరో వైపు పోనీయకుండాసంగీతసారాన్ని సాధించాలని కృషి చేసారు.. అందులో ఉన్నత శిఖరాలను అధిరోహించారు.. 

 

ఘంటసాల మన తెలుగు వారి ముద్దుబిడ్డ కావటం మన అదృష్టం.. ఈనాటికీ 

ప్రజలు ఆయన పాటలు ఆస్వాదిస్తూ మానసిక ఒత్తిడి నుండి విముక్తి     

పొందుతున్నారు..

తనకు లభించిన గాత్ర సంపదకు తన ఊహా శక్తినికల్పనా చమత్కృతినీ జోడించి ఒక నూతన శకాన్నివినూత్నసాంప్రదాయాన్ని కనిపెట్టిన సృష్టి కర్త మన ఘంటసాలగారు..

 

ఘంటసాల గారి భగవద్గీత తరువాతనే ఎవరు పాడినా.. ఎంతో మంది భగవద్గీత 

మనకు అందించారు..   ఘంటసాలగారిలా పాడలేనని లతామంగేష్కర్ లాంటి 

గొప్ప గాయనిస్వయంగా ఒప్పుకున్నారు.. ఘంటసాల గారి భగవద్గీతలోని

శ్లోకాలను యథాతదంగా అలాగే ఉంచి వచనం వారి భాషలో చదివి ఒక దేశంలో విడుదల  చేసారట (క్షమించాలిదేశంపేరు గుర్తుకు రావటం లేదు).. ఖండాంతరాలలో కూడా ఆయన ప్రతిభ అలా వినుతికెక్కింది..

 

మధురగాయకుని స్వరంపై రిసెర్చ్ కూడా చేసి ఇలాంటి గళం ఎవరికీ ఉండదు అని తీర్మానించారు.. దైవాంశసంభూతులకే ఇలాంటి గళం లభ్యమవుతుందని నిర్ణయించారు.. ఆయన మన తెలుగు వారు కావటం మన అదృష్టం..

 

ఆయన ఒక శక్తి.. "ఇది సంధ్యా సమయంపాట పాడుతూ ఆయన తన పాటలు అందరూ పాడాలని కోరుకున్నారు.. ఈనాడు ఆయన పాట లేని సంగీత కార్యక్రమం ఉండదు.. 

అలా ఆయన కోరిక నెరవేరింది..  

 

పాటైనాపద్యమైనాఅనగానే మన కనులముందు ముందుగా ప్రత్యక్షమయ్యేది ఘంటసాల గారే.. వారు  స్థాయిలోపాడినా వారి గాత్రం గంభీరంగా ఉంటుంది..

 

కవి మనసులో ఏమనుకుని గీత రచన చేస్తాడో అదే భావాన్ని చక్కటి ఉచ్చారణతో శబ్ద సౌందర్యాన్నిలలిత భావాన్నిపలికించగలిగిన స్వరబ్రహ్మ..  భావనలో ఆయన తాదాత్మ్యం చెందుతారు..  పాటకు ఎక్కడ ఎటువంటి భావాన్నిపలికించాలో ఆయనకు తెలిసినట్లుగా మరి ఎవరికీ తెలియదు..

 

పాత రోజుల్లో నాటకాలలో నట గాయకులు రాగయుక్తంగా పాడేవారు..  అయితే 

పద్యాలు పాడటంలో  ఒక క్రొత్త ఒరవడినిసృష్టించారు ఘంటసాల గారు.. నాటి 

పౌరాణిక చిత్రాల పద్యాలలో సజీవ భావాలకు జీవం పోసి నాటి అగ్ర నటుల

నటనకు ఊపిరి పోసారు.. వారిని నేటికీ మన మనసుల్లో చిరస్థాయిగా నిలిపారు.. 

 

నేటి పాటల పోటీలలో చిన్న పిల్లలతో సహా అన్ని వయస్సులవారు ఆయన 

పాటలు పాడుతున్నారంటే ఆపాటలమహత్యం ఎంతటిదో మనకు తెలుస్తున్నది

 

 ఒక త్యాగరాయ కీర్తనలాఅన్నమాచార్య కీర్తనలా  ఘంటసాల గారి పాటలు రాబోయే తరం కూడా పాడు కోవాలి.. పాడుకుంటారు కూడా.. అంతటి మహత్తుఆకర్షణ శక్తి వున్నాయి వారి పాటలలో.. 

 

అంతటి మహనీయులుగాన గంధర్వులు ఘంటసాల గారి జయంతి సందర్భంగా వారికివే మా అభిమానపూర్వకనివాళులు..  

 

*****

 

గీత.. అంటే భగవద్గీత అనే అనుకుంటారు సాధారణంగాకానీ గీతలో చాలా 

రకాలున్నాయిగురుగీతఅష్టావక్రగీతహంస గీతఅనుగీతవశిష్టగీత ఇలా 

చాలా ఉన్నాయికానీ వాటిలో మానవాళికి జీవితంలో ఎదురయ్యే రకరకాలపరిస్థితులను ఎదుర్కొనడానికి సమాయత్తం చేసే విజ్ఞానాన్నిజీవన విధానాన్ని 

అందించిన వాటిలో అగ్రతాంబూలంసాక్షాత్తు శ్రీకృష్ణుడే బోధించిన గీత అయిన ‘భగవద్గీతకే దక్కుతుంది

దాదాపుగా  గీతలన్నీ ఏదో ఒక సందర్భంలో అయోమయంలో పడిపోయిన 

శిష్యులకు గురువులు మార్గదర్శనం కావించినవే.. అయితే ఆధునిక కాలంలో ఆవిర్భవించిన మరో గీత కూడా ఉందిఅది.. అదే..‘ఘంటసాల భగవద్గీత’.

 

కొన్ని సంవత్సరాల క్రితం హాయత్‌నగర్‌ దగ్గర కుంట్లూరు లో వేగ్నేశ  సంస్థ 

వంశీరామరాజు ఆధ్వర్యంలో శ్రీవిద్యానృసింహభారతీచేత  గుడి ప్రారంభించబడినది గుడిలోని దేవుడు...‘ఘంటసాల వెంకటేశ్వరరావు’.  గాయకుడికి 

ఇంకాపశ్చిమగోదావరి జిల్లా అనంతపల్లిలోనూశ్రీకాకుళంలోనూ కూడా గుళ్లు 

నిర్మాణమయ్యామని తెలుస్తోందిమరిశ్రీకృష్ణులవారు ఎక్కడో ఎప్పుడో బోధించిన గీతను మన డ్రాయింగ్‌ రూంలో వినబడేలా చేస్తూ ‘ఘంటసాల భగవద్గీతగా

వెలయింప చేసిన వ్యక్తికి  మాత్రం గౌరవం చూపడం అవరమే కదా!

 

ఘంటసాల బాల్యం..

 

‘‘లేని బాట వెతుకుతున్న పేదవానికి...

రాని పాట పాడుతున్న పిచ్చివానికి...

బ్రతుకూ పూలబాట కాదు...

 

అది పరవశించి పాడుకునే పాటకాదు’’ అంటూ పాడిన ఘంటసాల జీవితం... ముఖ్యంగా బాల్యం పూలబాట కాదుసరికదా..

 

ముళ్లకంపఆయన 1922 డిసెంబర్‌ 4కృష్ణా జిల్లా చౌటపల్లిలో  బీద 

బ్రహ్మణ కుటుంబంలో జన్మించారుఊరూరా తిరుగుతూ గుళ్లల్లోనూఉత్సవాలలోనూ పాటలు పాడుతూ పొట్ట పోసుకునే తండ్రి వెంట తిరగుతూ తండ్రిపాటలకు నృత్యం చేసేవారుచిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినా తండ్రి కోరిక మేర సంగీతం నేర్చుకోవడానికివిజయనగరం పారిపోయిసరైన ఆశ్రయం దొరక్క 

బిక్షాటన చేసి కడుపునింపుకొటూ అనేక కష్టాలను అనుభవించిఅంచెలంచెలుగా ఎదిగి గానగంధర్వుడిగా మిగిలిపోయిన ఘంటసాల జీవితాన్ని ఉన్నత 

పాఠశాల విద్యార్థులకు ఓబోధానాంశంగా చేర్చవలసిన అవసరం ఎంతైనా ఉన్నదిగుడికట్టడం కన్నా ఇటువంటివి చేయడం స్ఫూర్తిదాయకంఅప్పట్లో ఏకైక సంగీత కళాశాల విజయనగరంలోనే ఉందిఅక్కడ సీటుకోసంసీటు దొరికాక 

పూటగడవటం కోసం ఎన్నోకష్టాలు పడ్డారుఇళ్లలో ఊడిగం చేసారు... జోలె 

పట్టారువారాలబ్బాయిగా పొట్టపోసుకున్నారుసత్రంలోపార్కులోపడుకొన్నారుఎన్ని కష్టాలు పడినా సాధనని మానలేదుసంగీత కళాశాల నుంచి పట్టాపుచ్చుకొని తిరిగొచ్చారుపట్టావచ్చింది కానీ ఉపాధి దొరకలేదుతనకు అలవాటైన పనే చేసారుపండుగలలో పబ్బాలలో పాటలు పాడుతూపాటగాడుగా గుర్తింపు పొందారునాటకాలు కూడా ఆడారు క్రమంలో వారికి ఇంచుమించుగా అదే పరిస్థితిలో ఉన్నమరో అబ్బాయితో పరిచయం కలిగిందిఅతను నాటకాలలో స్త్రీ పాత్రలు వేసే వాడుఅయితే అప్పుడు వారిద్దరూసినిమాలలోకి వెడతారని కానీఅతడో గొప్ప నటుడవుతాడు కానీఅతడి విజయాలకి తన గాత్రం ప్రధాన కారణం అవుతుందని కానీ అనుకోలేదు అబ్బాయే  తర్వాత నటసామ్రాట్‌ అయిన అక్కినేని నాశ్వరరావు.

 

చిత్రరంగ ప్రవేశం...

 

అవి స్వాతంత్రోద్యమ రోజులుదేశభక్తిని ప్రబోధించే పాటలతో ప్రజలలో చైతన్యాన్ని రగిలిస్తున్న ఘంటసాలను అరెస్టుచేశారు.

 

18 నెలలు కారాగారం తరువాత విడుదల అయి బయటకి వచ్చారుపరిస్థితి షరా మామూలేఅయినాఘంటసాల కుదరుగా ఉండాలని బంధువుల అమ్మాయి సావిత్రితో వివాహం జరిపించారు ఆయన తల్లిగారుదానితోపరిస్థితి మరింత 

దుర్భరమైనదిఅదృష్టవశాత్తు అదే సమయంలో దూరపు బంధువు సముద్రాలతో పరిచయం కలిగిందిఘంటసాలలోని గంధర్వుని అందరి కన్నా ముందుగా పసిగట్టింది సముద్రాలవారేఆయన అప్పటికే సినిమాలలోపనిచేస్తున్నారు

ఆయన సలహా మీద ఘంటసాల మద్రాసు చేరారుసముద్రాలఘంటసాలని అప్పటి స్టార్‌ నాగయ్యకిబి.ఎన్‌.రెడ్డికి పరిచయం చేసారువారి ‘స్వర్గసీమలో 

భానుమతితో కలిసి పాడే అవకాశం ఇచ్చారుఅప్పట్లో ఎవరి పాటలువారే పాడుకునేవారునటుడు నారాయణరావుకి గాత్రదానం చేశారుకానీ అవకాశాలు 

అయితే ఎక్కువగా రాలేదుచిన్నాచితకా వేషాలు కూడా వేసారుఘంటసాలను గుర్తించిన భానుమతి తన సినిమాలకి సహాయ సంగీత దర్శకుడిగాతీసుకొన్నారుహెచ్‌.ఎం.వి గ్రామఫోన్‌ కంపెనీ వారైతే ఘంటసాలను పాటలకు పనికి 

రావనేసారుఅయితే ఘంటసాలనుగుర్తించిన మరొక వ్యక్తి నటుడు పేకేటి 

కంపెనీలో చేరాక ఘంటసాలను పిలిపించి ప్రైవేట్‌ ఆల్బమ్‌ చేయించారు

ఈలోగాలిపెంచల నరసింహారావుసి.ఆర్‌.సుబ్బరామన్‌ సహాయకుడిగా చేసిన 

ఘంటసాలకే ‘కీలుగుర్రం’, ‘బాలరాజు’ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించే 

అవకాశం వచ్చింది రెండు విజయవంతమవ్వడంతో ‘మనదేశం’, ‘లక్ష్మమ్మ’ చిత్రాలకు పనిచేశారుఒక విధంగా మొదట్లో ఆయన గాయకుడిగా 

కన్నా సంగీత దర్శకుడిగానే తన స్థానాన్నిసుస్థిరపరచుకొన్నారువిజయావారి ‘పాతాళభైరవితో అటు సంగీత దర్శకుడిగాఇటు గాయకుడిగా విజయకేతనం

ఎగురవేశారుపైగా నటసామ్రాట్నటరత్నలకు ఆయనే నేపథ్యగాయకుడు 

కాడడంతో ఇంక ఘంటసాల వెనుదిరిగిచూడలేదుఒక విధంగా వారిద్దరూ 

తెలుగు సినిమాకి రెండు ‘కళ్లైతే’ ఘంటసాల కంఠమయ్యారువారికి ‘దేవదాసు’, ‘మల్లీశ్వరిలు చలనచిత్ర సామ్రాజ్యాన్ని పంచి ఇస్తే  రెండు సామ్రాజ్యాలలోనూ ఘంటసాలదే కీలకపాత్ర అవడం విశేషం.

 

అద్వితీయం...

 

చిత్రరంగంలో పోల్చిచూడటం మామూలేఘంటసాలని అసలు పోల్చాలంటే 

రఫీ స్థాయి గాయకుడే ఉండాలనుకోవాలికానీ పోల్చాలంటే సమానమైన 

అంశాలుండాలిఘంటసాల కర్నాటక సంగీతంలోనూరఫీ హిందుస్థానీ 

సంగీతంలోనూ ఉద్దండులే అయినా రఫీ సంగీత దర్శకుడు కాదుకానీ 

ఘంటసాలసుబ్బరామన్పెండ్యాలరాజేశ్వరరావుసుసర్లకే.వి.మహదేవన్‌ వంటి సంగీత దర్శకులు ఏలుతున్నప్పుడు వారిలో ఒకరిగా గుర్తింపు పొందారుఆయన సంగీతదర్శకత్వం వహించిన ‘పాతాళభైరవి’, ‘మాయాబజార్‌’, ‘గుండమ్మకథ’ పెళ్లిచేసిచూడు’ వంటి ఎన్నో చిత్రాలు కేవలంసంగీత 

 దర్శకుడిగా తిరుగులేని స్థానం సంపాదించిపెట్టాయిఇంక ‘లవకుశలో విశ్వరూపం చూపారు.

 

రహస్యం’ సంగీతశ్రేష్టుల మన్ననలందుకొన్నదికాబట్టి అటు గాయకుడిగా ఇటు సంగీత దర్శకుడిగా అగ్రస్థానాన మూడు దశాబ్దాల పాటువీరవిహారం చేసిన వారితో మాత్రమే పోల్చాలిఅలాంటివారు మరొకరు లేరువందకుపైగా చిత్రాలకు సంగీత దర్శకత్వంవహించి పదివేల పాటలకు పైగా పాడిన మరొక వ్యక్తి లేరు.

 

మూడు దశాబ్దాల పారవశ్యం...

 

ఆయన రచయిత కూడానిర్మాత కూడామిగిలిన అంశాల కన్నా ఎక్కువగా 

ప్రేక్షకులు ఆయనను గాయకుడిగానేఆరాధించారునేపథ్య సంగీతం జనరంజకమయినది ఆయనతోనేవిషాదంహాస్యంసరసంకరుణవైరాగ్యంభావమేదైనాసందర్భమేదైనా సరే ఆయన పాట లేకుండా చిత్రపరిశ్రమలో మూడు దశాబ్దాలు గడవలేదుఆయనఉన్నప్పుడే ఎంతోమంది గాయకులు ఉన్నారుఅగ్ర హీరోల సినిమాలకి సరేసరిసాదాసీదా సినిమాలలోనూ ఆయనతో ఒకపాటైనా 

పాడించుకొనేవారుఆయనలో లోపమేదైనా ఉన్నదంటే అది ఆయన అనారోగ్యం మాత్రమేమూడు పదులవయసులోనే చక్కెర వ్యాధి రావడంతో చాలా 

ఇబ్బంది పడ్డారు.

 

1974 ఫిబ్రవరి 11 కన్నుమూయడానికి అయిదుసంవత్సరాల ముందు నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించసాగిందికంఠం బరువుగా (ఎగ ఊపిరి కూడావినవచ్చేదిఅయితే అది విషాద గీతాలకు బాగానే సరిపోయేదిలలితమైన పాటలకు ఆయన సరిపోరనే కొంతమందిఅభిప్రాయానికి కారణం ఆయన అనారోగ్యం కానీ 

ఆయన కాదుఆయనది కంచుకంఠం.. గాంభీర్యం ఎక్కువే అయినాతగ్గించుకొని మృదువైన పాటలు ఎన్నో పాడారుకానీ చివరలో ఆరోగ్యం సహకరించలేదు.

 

కొన్ని మధురాలు...

 నీలి మేఘాలలో గాలి కెరటాలలో’ ఆయన పాట వినిపిస్తూనే ఉంటుంది. ‘మేఘమధనం’ అంటారే.. వర్షంకురిపించడానికి  పక్రియకరువు ప్రాంతాలలో  సాంకేతికతను ఉపయేగించే ప్రయత్నాలు జరుగుతున్నాయివాటితోబాటూ ‘భక్త జయదేవలోని ‘నీ మధుమురళీ గానలీలా’ వినిపిస్తే ఘేఘాలు పరవశించిపోవూగనుల తవ్వకాలలోనూ బండరాళ్లను పేల్చడానికి డైనమేట్లని 

వాడుతుంటారు.

 

జగదేకవీరునికథలోని ‘శివరంజనీ’ ప్రయోగిస్తే ‘స్టోన్‌ క్రషింగ్‌’ సులభ తరమవుతుందిభూకంపాలను కొలవడానికి రిక్టర్‌ స్కేల్‌ను ఉపయోగిస్తారు స్కేల్‌లో ఒక పాయింట్‌కి రెండోపాయింట్‌కి తేడా పదిరెట్లుంటుంది. ‘జయభేరిలో ‘నందుని చరితము వినుమా’ పాటలో ఆఖరి నాలుగు చరణాలువినండి.

 

‘‘పరుగున బోయెను చిదంబరానికి నందుడు ఆత్రమున...

చిదంబరంలో శివుని దర్శనం చేయగ రాదనే పూజారి...

ఆశాభంగము పొందిన నందుడు ఆగుడి ముందే మూర్చిల్లే...

అంతట శివుడే అతడిని బ్రోచి పరంజ్యోతిగా వెలయించే’’

 

పై చరణాలలో ఆయన ఆస్థాయి ఒక్కోక్క చరణానికి పదిరెట్లుగా పెరిగి 

తారాస్థాయికి చేరుకొని ఆయనకే జీరవచ్చేసిందీఅంటే అర్థం చేసుకోండి జీర ఆయన పాటతో ఎంతగా మమేకమయ్యారో చెబుతుంది. ‘పయననించే  చిలుకా’ (కులదైవంమనసుని ద్రవింపచేస్తుంది.

 

జయభేరిలో ‘రసికరాజ తుగువారము కాదా’ పాటని ఎత్తుకోవడాన్నిఆలకించండిఅద్భుత రసానికి ఇది ఉదాహరణ.

 

టేక్‌ ఆఫ్‌’ అంటారేవిమానం రన్‌వే మీద చాలా దూరం పరుగెట్టి పైకిలేస్తుందిహెలికాప్టర్‌ ఉన్న చోట నుంచే పైకి లేస్తుందది పాటలో హెలికాప్టర్‌ టేకాఫ్‌ని వినవచ్చు. ‘మూగనోము’ సినిమాలో ‘ఊరుమారినా ఉనికి మారునా’ పాటని పి.బి.శ్రీనివాస్‌ 

పాడినా ఘంటసాల చేత కూడా అదే పాటనుపాడించారు ‘గాఢత’ కోసం. ‘కంచుకోటలో ‘ఎచటనో గల స్వర్గంబునిచట దించిని వినండిఆత్మార్పణం అంటే అది. ‘మర్మయోగిలో ‘నవ్వులనదిలో’ పాటలో ఘంటసాల నవ్వడం వినండి రాజసం తొణికిసలాడుతుంది. ‘జయభేరిలో ‘నీదానన్నదిరా’ మరొక ఆత్మార్పణం పాటలన్నీ ఒక ఎత్తు 

అయితే ఆయన పద్య పఠనం ఒక్కటే ఆయనను శిఖారాగ్రానకూర్చోబెడుతుందిఆయనలా పద్యపఠనం చేసిన సినీగాయకులేరీరంగస్థలం మీది లాగుడు 

విధానానికి స్వస్థి చెబుతూఆయన చేసిన పద్య పఠనం  అద్భుతమే. ‘కురువృద్ధుల్‌’ అంటూ ‘పాండవవనవాసంలో రాబోయో కురుక్షేత్ర యుద్దాన్ని

సభలోకి తీసుకొస్తారు. ‘ఇది మన ఆశ్రమంబు...’ అంటూ ‘లవకుశలో సీతకి వాల్మీకిగా విశ్వాసాన్ని 

కలిగిస్తారుఅసలుతెలుగు పరిశ్రమ గర్వపడేది పౌరాణికాలతోనేఘంటసాలలేని పౌరాణికాన్ని ఊహించుకొనలేంరికార్డింగ్‌ రూంలోఆయనకు జగన్మాత

ఆంజనేయుడు సాక్షాత్కరించారు కాబట్టే...‘‘మాణికవీణా’’ (కాళిదాసు), ‘‘ఆంజనేయమహానుభావా’’ (పాండవవనవాసంవంటివి శరీరాన్ని 

జలదరింపజేస్తాయి.

 

వ్యక్తిత్వం...

 

ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆయన ప్రత్యేకతఅందరిని ‘‘బాబూ’’, ‘‘నాన్న’’ అని పలకరిస్తారువిజయనగరంలోనితనకి ముద్దపెట్టిన తల్లినీఆదరించిన గురువుని తలచుకోని రోజులేదు గురువు కుమారుడిని తన దగ్గరేసహాయకుడిగా పెట్టుకొన్నారునా తొలిరోజులలో నాతో  చిన్న పాట పాడించడానికి 

కాకితో కబురుంపితే సరిపోయేదానికిఆయన స్వయంగా నా గదికి వచ్చి పిలుచు

కొని వెళ్లారని... ఆయన చేత తన వారసుడిగా ప్రకటించుకోబడ్డబాలసు

బ్రహ్మణ్యం చెబుతారుచిత్ర విజయాలలో తన పాత్ర గణనీయమైనదే అయినా ఎప్పుడైనా ఇంత ఇస్తేనేపాడతాను అనలేదునిర్మాతలే చూసి ఇచ్చే వాళ్లు

ఆయనకి కావల్సినవి సమకూర్చేవాళ్లుఇల్లు కట్టుకుంటేకాంపౌండ్‌వాల్‌ 

చక్రపాణి కట్టించారుతొలికారుని భానుమతి బుక్‌ చేశారుభక్తితత్పరతకు 

ఆయన గానం మారుపేరు.

 

నమో వేంకటేశా’ ప్రైవేట్‌ సాంగ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువేఅసలు 

తిరుమలలో శ్రీవారి సన్నిధానంలో కచేరి చేసిందిఅలనాడు అన్నమయ్య 

అయితేతరువాత ఘంటసాల వెంకయ్యే చేసారుతెలుగులో పాడవలసి వస్తే 

రఫీ తొలుతగాఘంటసాలను సంప్రదిస్తే సాదరంగా ఆహ్వానించారుతను చేసిన భగవద్గీత ఆల్బమ్‌ ఆవిష్కరణకు లతామంగేష్కర్‌ఘంటసాలను పిలిచినప్పుడు ఆయనలో భగవద్గీత చెయ్యాలనే సంకల్పం కలిగిందిఅప్పటికే ఆరోగ్యం చెడిపోయిందిగీత పాడటం పూర్తయ్యాక ఇంక సినిమా పాటలు పాడకూడదనుకొని కాషాయ వస్త్రాలు ధరిస్తూ అతి కష్టం మీదభగవద్గీత రికార్డింగ్‌ పూర్తి చేసారుకానీ రికార్డు విడుదల నాటికి ఆయన భౌతికంగా లేరుకానీ భగవద్గీత ఎప్పటికీఉంటుందిగీత ఉన్నంత కాలం ఘంటసాల భగవద్గీత ఉంటుంది.

 

పొన్నాడ సత్యప్రకాశరావు

 

*****

 

*మన ఘంటసాల గారు*

తెలుగు వాడికి తెల్లవారితే 'దినకరా శుభకరా' ;

మధ్యాహ్నం బాధ కలిగితే ఓదార్చే 'భగవద్గీత' ;

సాయంత్రం వేడుకైతే 'పడమట సంధ్యా రాగంకుడి ఎడమల కుసుమ పరాగం' ;

రాత్రి 'కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతదిఅలా కానప్పుడు

 'నడిరేయి  జాములో'' ... 'నిద్దురపోరా తమ్ముడా' ....'కల ఇదనీ నిజమిదనీ తెలియదులే' ,

అంతలోనే తెల్ల వారితే 'నిన్న లేని అందమేదో నిదుర లేచెనెందుకోఅన్న సందేహంలో సంతృప్తి - ఇవన్నీ ఆయనప్రసాదించిన వరాలే.

తెలుగు విద్యార్ధికి 'ప్రేమ తమాషా వింటేనే కులాసా' కానీ 'పది మందిలో పాట పాడితే అది అంకితమెవరో ఒకరికేఅన్నసుతి మెత్తని బెత్తం దెబ్బాతొందర పాటు నిర్ణయాలకు పోతుంటే 'కల కానిది విలువైనది 

బ్రతుకుకన్నీటి ధారలలోనే బలిచేయకుఅన్న అక్షర లక్షల 'థెరపీ', ఆవేశం వస్తే 'ఆవేశం రావాలికానీ 'ఆవేదన కావాలిఅన్న మందలింపూఆందోళనకు

దిగితే 'తెలుగు వీర లేవరాఅన్న అదిలింపూఎవరికి వారయి విడిపోతుంటే

'ఎవ్వరి కోసం ఎవరున్నారు పొండిరా పొండిఅన్న విదిలింపూఇవన్నీ ఆయన అందించిన వివరాలే.

 

తెలుగు తల్లికి 'ఆలయాన వెలసిన  దేవుని రీతినువ్వున్నావమ్మా అనగానే 

ఎంత సంబరం!

తెలుగు పడుచుకి 'దివి నుండి భువికి దిగి వచ్చే పారిజాతమే నీవే నీవేఅనగానేఎంతటి గర్వం!

'తెలుగు వారి ఆడ పడుచు ఎంకిలాఎంతటి సిగ్గూఇదంతా ఆయన గొంతు 

మహత్మ్యమే.

'పాపాయి నవ్వులే మల్లె పూలు' , ' ముద్దబంతి పూవులో మూగ కళ్ళ ఊసులో ఎనక జనమ బాసలు ఎందరికి 

తెలుసులేఅన్నప్పుడు ఎన్ని మల్లెలు పాపాయిలుగా పుట్ట్టా లను కున్నాయోఎన్ని బంతి పూలు ఆది శంకరుని తలచు కున్నాయో! 'బలే బలే పావురమా' , 'జగమే మారినది మధురముగా -- పావురములు పలుక' , 'గోరోంక గూటిలో చేరావు చిలక' , 'నాపాట నీ నోట పలకాల సిలకఅన్నప్పుడు ఎన్ని పక్షులు తెలుగు నేర్చుకున్నాయో!' శివ శంకరీ శివానంద లహరీ--మనసుకరుగదాఅనగానే ఎన్ని మృదంగాలు నాట్యమాడ లేదూ! 'మది శారదా దేవి మందిరమేఅనగానే ఎన్ని గంటలు మ్రోగలేదూ!

ప్రతి సంక్రాంతి 'అసలైన పండుగ

కష్టజీవులకు అది ఎంతో కన్నుల పండుగగా వాసి కెక్కిందంటే అది  గళం

అందించిన బలమే.ప్రతి ఉగాది 'భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజుగా చెలామణి అయ్యిందంటేఅది  కంఠం ప్రోద్బలమేఇన్నిటికీఇందరికీఅన్నిటికీఅందరికీ 'తెలుగు వారి ఇలవేల్పుగా వెంకటేశ్వరుడుంటే"తెలుగు వారి గళ వేల్పుఘంటసాల !”

ఆరుద్రగారు అన్నట్టు మాస్టారూ, 'నీలి మేఘాలలో గాలి కెరటాలలో మీరు (నీవు)

 

పాడే పాట వినిపించునే వేళా'!

అతడు కోట్ల తెలుగుల ఎద

అంచుల ఊగిన ఉయాల

తీయని గాంధర్వ హేల

గాయకమణి ఘంటసాల - సి.నారాయణరెడ్డి

 

ఘంటసాలవారి కమనీయ కంఠాన

పలుకనట్టి రాగభావమేది!

ఘంటసాలవారి గాన ధారలలోన

తడియనట్టి తెలుగు టెడద యేది! - దాశరథి

 

అతడు ప్రసన్న మధుర భావార్ద్రమూర్తి

సరస సంగీత సామ్రాజ్య చక్రవర్తి

లలిత గాంధర్వ దేవత కొలువుదీరు

కలికి ముత్యాలశాల మా ఘంటసాల - కరుణశ్రీ

 

ఘంటసాల”  పేరు వింటేనే తెలుగు వాడి గుండెల ఘంటలు గుడి ఘంటలు మొగినత శ్రావ్యమ్గా మోగుతాయి.

ఘంటసాల”  పేరు తెలియని తెలుగువాడు ఉండరని ఘంటా పతంగా చెప్పవచ్చు.

 

Courtesy: WhatsApp

 

*****


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...